ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ఎస్ఎస్ రాజమౌళి | SS Rajamouli Waiting For The Upcoming Famous Event In Hyderabad | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: ఎస్ఎస్ రాజమౌళి

Published Sat, Mar 1 2025 3:51 PM | Last Updated on Sat, Mar 1 2025 3:59 PM

SS Rajamouli Waiting For The Upcoming Famous Event In Hyderabad

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి(SS Rajamouli) తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ క్షణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మార్చి 22వ తేదీ జరిగే అద్భుతమైన ప్రదర్శన కోసం వెయిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకీ ఆ వివరాలేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

మార్చి 22వ తేదీన హైదరాబాద్‌ వేదికగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ కన్సర్ట్‌ నిర్వహిస్తున్నారని రాజమౌళి వెల్లడించారు. ఆ సంగీత ప్రదర్శన చూసేందుకు తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. నా  సినిమాలోని పాటలతో పాటు ఆయన చేసిన సాంగ్స్‌ కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. కేవలం పాటలు మాత్రమే కాకుండా.. ఓఎస్‌టీలు(ఒరిజినల్ సౌండ్‌ ట్రాక్) కూడా ప్రదర్శించాలని ఎంఎం కీరవాణి డిమాండ్ చేస్తున్నట‍్లు ట్విటర్‌ వేదికగా వీడియోను రిలీజ్ చేశారు.

కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కూడా ఫిక్స్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement