Hitex
-
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
హైటెక్స్ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్!
క్రాఫ్టాన్ (KRAFTON) ఇండియా సమర్పించు బ్యాటిల్ రాయల్ ఎస్పోర్ట్స్ ఈవెంట్ 2024 ఫినాలే (BGIS) హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా ఈనెల (జూన్) 28, 29, 30 తేదీల్లో జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్లలో ఒకటైన BGISలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జట్లు రిజిస్టర్ చేసుకున్నాయి. పలు దఫాల పోటీల అనంతరం టాప్ 16 జట్లు తుది పోటీలకు అర్హత సాధించాయి. ఈ ఈవెంట్లో పోటీ పడే జట్లు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీని షేర్ చేసుకుంటాయి.KRAFTON సంస్థ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని కేటాయించడం భారత్‌లో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం. BGIS 2024 Finaleతో హైదరాబాద్ నగరం గేమింగ్ గమ్యస్థానంగా తమ ప్రతిష్ట మరింత పెంచుకోనుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోగా.. ప్రీమియం సీటింగ్, భోజన సదుపాయం కల ఎలైట్ పాస్‌లు (పెయిడ్ టికెట్లు) అందుబాటులో ఉన్నాయి.ఎలైట్ పాస్‌ల ధర రూ. 5000గా నిర్ణయించారు. ఎలైట్ పాస్‌ల విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని సంప్రదాయ క్రీడలకు మద్దతుగా అభినవ్ బింద్రా ఫౌండేషన్‌కు అందిస్తారు. గేమింగ్ ఔత్సాహికులు, అభిమానులు ఈ ఈవెంట్‌ను KRAFTON India Esports YouTube ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగిన KRAFTON, Inc. ఆకర్షణీయమైన ఆటలను కనుగొనే ఆన్లైన్ గేమింగ్ సంస్థ. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెవలపర్లకు నిలయంగా ఉంది. ఇందులో PUBG స్టూడియోస్, స్ట్రైకింగ్ డిస్టెన్స్ స్టూడియోస్, వెక్టర్ నార్త్, నియాన్ జెయింట్, క్రాఫ్టాన్ మాంట్రియల్ స్టూడియో, బ్లూహోల్ స్టూడియో, రైజింగ్ వింగ్స్, 5మిన్ల్యాబ్స్, డ్రీమోషన్, రెలుగేమ్స్, ఫ్లైవేగేమ్స్ వంటి స్టూడియోలు ఉన్నాయి.ప్రతి స్టూడియో నిరంతరం కొత్త సవాళ్లను స్వీకరించడానికి, వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలను విస్తృతం చేయడం ద్వారా మరింత మంది అభిమానులను గెలుచుకోవడం KRAFTON లక్ష్యం. -
14, 15 తేదీల్లో హైటెక్స్‌లో వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం
సనత్‌నగర్ (హైదరాబాద్): జాతీయ, అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ టూరిజం, తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ 3వ ఎడిషన్, 3వ టీసీఈఐ ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 బియాండ్ ఇమాజినేషన్, 7వ టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 వేడుకలు జరగనున్నాయి.ఈ మేరకు ఆదివారం బేగంపేట పర్యాటక భవన్‌లోని ది ప్లాజా హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ, భారతీయ వివాహ పరిశ్రమలోని నిపుణులను ఇది ఒకచోట చేర్చుతుందని, ఈ ఈవెంట్ ద్వారా వివాహాలకు దక్షిణాది నుంచి ముఖ్యమైన సహకారం, పరిజ్ఞానం, ప్రత్యేక వేదికను అందించడమే లక్ష్యమన్నారు. భారతీయ వివాహ వ్యవస్థలోని వివిధ అంశాలపై జ్ఞానయుక్తమైన సెషన్లు ఉంటాయని, జాతీయ, అంతర్జాతీయ వక్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారని తెలిపారు. ఈ కన్వెన్షన్ కోసం దేశవిదేశాల్లో ఉన్న 20కి పైగా వెడ్డింగ్ ప్లానర్లు, వెడ్డింగ్ డిజైనర్లు, వెడ్డింగ్ స్టైలిస్టులు, డెకరేటర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఈవెంట్ ఇండస్ట్రీలోని ఇతర క్రాప్ట్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయన్నారు.ఈవెంట్‌కు సిడ్నీ నుంచి వెండీ ఈఎల్ ఖౌరీ సహా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిపుణులు హాజరవుతారన్నారు. టెడ్డీ ఇమాన్యుయేల్ (ఫిలిప్పీన్స్), మైఖేల్ రూయిజ్ (ఫిలిప్పీన్స్), బ్రయాన్ టాచీ–మెన్సన్ (ఘనా) తదితరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవిదేశాల నుంచి 700 మందికి పైగా ప్రతినిధులకు స్వాగతం పలుకుతోందన్నారు. ‘ఈవెంట్ బజార్’గా పిలవబడే ఎక్స్‌పోలో 60కి పైగా స్టాల్స్‌లో గ్రాండ్ డిస్ప్లే ఉంటుందన్నారు. ఈవెంట్ పరిశ్రమలో ఉన్న విభిన్న ఉత్పత్తులు, సేవలు, అత్యాధునిక ట్రెండ్లను ప్రదర్శిస్తుందని చెప్పారు.ప్యానెల్ చర్చలు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్ సేప్టీ, టెక్నాలజీ పాత్ర తదితర కీలక అంశాలపై సమాంతర సెషన్లు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ డైరెక్టర్ రమేశ్‌నాయుడు, హైటెక్స్ హెడ్ టీజీ శ్రీకాంత్, టీసీఈఐ అధ్యక్షుడు ఆళ్ల బలరాంబాబు, ప్ర«ధాన కార్యదర్శి రవిబురా, కోశాధికారి ఎండీ తౌఫిక్ ఖాన్, ఎస్ఐడబ్ల్యూయుపీసీ గ్లోబల్ 2024 కన్వీనర్ సాయి శ్రవణ్ మాదిరాజు, టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2024 కన్వీనర్ రామ్ ముప్పన, కో–కన్వీనర్లు హిరీష్రెడ్డి, కుమార్‌రాజా, సుధాకర్ యారబడి, డాక్టర్ సౌరభ్ సురేఖ తదితరులు పాల్గొన్నారు. -
‘మూసీ’ని మార్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని పునరుజ్జీవింపచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) 31వ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బీఏఐ సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ త్వరలోనే మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను ఆహ్వానిస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన మూసీనది వెంట కనెక్టింగ్ కారిడార్లు, మెట్రో, ఆట, వినోద కేంద్రాలు, హోటళ్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. మూసీ అభివృద్ధికి లండన్‌లోని థేమ్స్ నది నుంచి గుజరాత్‌లోని సబర్మతి నది వరకు నదీపరీవాహక ప్రాంత రాష్ట్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనేదిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కాంట్రాక్టర్లు, బిల్డర్లు భాగస్వాములేనని, రాష్ట్రంలోని మౌలిక వసతులే ఆ రాష్ట్ర అభివృద్ధికి కొలమానమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంట్రాక్టర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేశారని గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వాములేనని, వారి సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో 20 ఏళ్లుగా ఉన్న ఈపీసీ కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి క్లస్టర్ వద్ద పాఠశాల లు, ఆస్పత్రులు, సౌరవిద్యుత్ ప్లాంట్లు, సైకిల్ ట్రాక్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని, అందుకు తగ్గ ప్రణాళిక ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
టీఎస్ఐపాస్ ద్వారా 24000 కంపెనీల ప్రతిపాదనలకు ఆమోదం
మాదాపూర్: టీఎస్ ఐపాస్ ద్వారా గత 8.5 ఏళ్లలో 24000 పరిశ్రమ ప్రతిపాదనలను ఆమోదించినట్లు టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్లాస్టిక్ ఎక్స్పో, హిప్లెక్స్ 2023 ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి ప్లాస్టిక్ పార్క్ పూర్తిగా అమ్ముడు పోయిందని, రెండోదాని ఏర్పాటుకు టీఎస్ఐఐసీ స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ లకు వసతి కల్పించేందుకు వీలుగా టీఏపీఎంసీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంఎస్ఎంఈ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్లాస్టిక్ పరిశ్రమకు హబ్‌గా ఉందన్నారు. ఎక్స్‌పోలో పాల్గొనేందుకు ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ 60 ఎంఎస్ఎంఈలకు ఆర్ధికసాయాన్ని అందించిందన్నారు. హెచ్‌కె గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్( మార్కెటింగ్ పెట్రోకెమికల్స్) శ్రీ వాస్తవ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమకు తాప్మా మార్గనిర్దేశం చేస్తుందన్నారు. నేడు యూఎస్ఏ, చైనా తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ప్లాస్టిక్ వినియోగదారుగా ఉందన్నారు. 6 శాతం నుండి 7శాతం సీఎజీఆర్ వద్ద నిరంతరం వృద్ధి చెందుతుందన్నారు. గెయిల్ అమ్మకాల్లో దక్షిణ ప్రాంతం 18శాతం వాటాను అందిస్తుందన్నారు. చైనా జనాభా పెరిగినప్పటికీ మన తలసరి ప్లాస్టిక్ వినియోగం చైనాకంటే చాలా తక్కువ అన్నారు. 11 కేటీల వద్ద చైనా తలసరి వినియోగం, 46కేజీ, యూఎస్ఏ 170 కేజీ, ప్రపంచ సగటు 28 కేజీలు వాటి కంటే మనం వెనుకబడి ఉన్నామన్నారు. ప్లాస్టిక్‌పై విధించిన 18శాతం జీఎస్టీని తగ్గించాలని ఆప్మా, తాప్స్ తరఫున ఆయన కోరారు. ఆహార ప్యాకేజింగ్ పరిశ్రమతో పాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్‌లపై విధించిన జీఎస్టీని తగ్గించాలన్నారు. తెలంగాణ, ఆంధ్రా ప్లాస్టిక్స్ తయారీదారుల సంఘం(టాప్మా)నాలుగురోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు తాప్మా అద్యభుడు విమలేష్గుప్త తెలిపారు. దశాబ్దం క్రితం 9 మిలియన్ టన్నుల నుంచి ఇప్పుడు 18 మిలియన్ టన్నుల వినియోగం స్ఠాయికి చేరుకున్నామని ఇండియన్ ప్లాస్టిక్స్ ఇనిస్టిట్యూట్ జాతీయ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి వెన్నం తెలిపారు. పర్యావరణ సంక్షోభానికి కేవలం ప్లాస్టిక్ పరిశ్రమనే నిందించలేమని సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ అవసరమన్నారు. భారతదేశంలో 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తిలో కేవలం 30శాతం మాత్రమే రీసైకిల్ చేయబడుతుందన్నారు. కీలకమైన వృద్ధి రంగంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వానికి ప్రాతినిథ్యాలను అందించాలని కోరారు. ఈ ప్రదర్శనలో ప్రపంచ వ్యాప్తంగా 400 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. స్పెషాలిటీ కెమికల్స్, మాస్టర్బ్యాచ్లు, ప్రాసెస్ మిషనరీ, ప్రింటింగ్, ప్యాకేజింగ్, రామెటీరియల్స్, మోల్డ్స్, డై, పోస్ట్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, క్వాలిటి టెస్టింగ్ ఎక్విప్మెంట్, ఫినిస్ట్ ప్రొడెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో హెచ్ఎంఈఎల్ ఎండి ప్రభుదాస్,ఆలిండియా ఇండియా ప్లాస్టిక్ మానుప్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీలా జయదేవ్ పాల్గొన్నారు. -
హైటెక్స్‌లో జరిగిన స్వస్త్య ఎక్స్పో గ్లోబల్ ఆయుష్ – వెల్నెస్ ఎక్స్పో ఫోటోలు...
-
KISAN Agri Show: న్యూ హాలండ్ రెండు కొత్త ట్రాక్టర్లు
హైదరాబాద్: న్యూ హాలండ్ అగ్రికల్చర్ (సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్) రెండు నూతన ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన కిసాన్ అగ్రి షోలో భాగంగా ‘బ్లూ సిరీస్ సింబా 30’, ‘5620 పవర్ కింగ్’ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ వ్యవసాయ సదస్సులో ఆరు ట్రాక్టర్లు, మూడు సాగు ఎకిŠవ్ప్మెంట్లను ప్రదర్శించింది. ఇందులో సింబా 30 అనేది స్ప్రేయింగ్, రోటావేషన్, కల్టివేషన్, అంతర్గత కల్టివేషన్ పనులకు అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అధిక పవర్‌తో, ఇంధనం ఆధా సామర్థ్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఇక 5620 పవర్ కింగ్ అనేది రవాణాకు, సాగుకు సంబంధించి పనులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. -
హైటెక్స్‌లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
Telangana: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగే ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కేసీఆర్ అన్నారు. మహాత్ముడి దేశంగానే భారత్ ఉంటుందని చెప్పారు. కొంతమంది గాంధీని కించపరచాలని చిల్లర ప్రయత్నాలు చేస్తున్నపటికీ అవి ఫలించవన్నారు. అలాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడే అని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దేశ భక్తి ఉట్టిపడేలా, అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని చాటేలా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవంలో 75 మంది వీణ కళాకారులతో వాయిద్య ప్రదర్శన చేశారు. హైదరాబాద్‌లోని అన్ని జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. చదవండి: యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్డోజర్ -
హైదరాబాద్‌లో మోదీ పర్యటన ఇలా.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ ఆ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే.. ► శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయలుదేరి 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ► బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 3.20 గంటలకు హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. ► 3.30 గంటలకు హెచ్ఐసీసీకి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు రిజర్వ్ సమయంగా ఉంచారు. ► సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు. ► ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు. ► సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు వెళతారు. ► సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు. ► రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కుగానీ, హోటల్కుగానీ చేరుకుని బస చేస్తారు. ► సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. ► ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
Hyderabad: హైటెక్స్‌లో రేపు 40 వేల మందికి టీకాలు
సాక్షి, హైదరాబాద్( రాయదుర్గం) : దేశంలోకెల్లా అతి పెద్ద టీకా కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఒకేరోజు ఏకంగా 40 వేల మందికి టీకాలు వేసేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూ రిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ)తో కలసి మెడికవర్ ఆస్పత్రి ఈ మెగా డ్రైవ్‌ను చేపడుతోంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరాటంకంగా టీకాల కార్యక్రమం జరుగుతుందని, ఇందుకోసం 500 కౌంటర్లను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. టీకాలకు అర్హులైన (18 ఏళ్లు నిండిన) వారు http://medicoveronline.com/vaccination వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని, కోవాగ్జిన్ టీకా వేస్తామని పేర్కొన్నారు. టీకా ధరను అన్ని చార్జీలతో కలిపి రూ.1,400గా నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు 040–6833 4455 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. చదవండి: టిప్పన్ నక్ష.. రాష్ట్రంలో భూముల సర్వేకు ఈ పేరుకు సంబంధం ఏంటి? -
హై ఫ్యాషన్
-
కండల వీరులొస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: కండలు తిరిగిన బాడీ బిల్డర్లు, విదేశాలకు చెందిన అంతర్జాతీయ బాడీ బిల్డర్లు హైటెక్స్ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంతో పాటు ఫిట్నెస్ అండ్ మెడికల్ సర్వీసెస్ సైతం ప్రారంభం కానుంది. ఇటీవల ఏర్పడిన సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్ (సీపీటీఏ) ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్పో’ పేరుతో ఈ పోటీలను నిర్వహించనున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన క్రాంతికిరణ్‌రావు నగరంలోని పలు ప్రాంతాల్లో ‘క్రాన్ ఫిట్నెస్’ను ఏర్పాటు చేశారు. ఆయన ‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ)కు వర్కింగ్ ప్రెసిడెంట్. ట్రెయినర్‌గా ఎందరికో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 23, 24, 25వ తేదీల్లో హైటెక్స్‌లో ‘స్పోర్ట్స్ ఎక్స్పో’ను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ‘సీపీటీఏ’ ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్’ను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తారు. పోటీలకు బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాలతో పాటు విదేశాలకు చెందిన కండల వీరులు సైతం సందడి చేయనున్నారు. 24న బాడీ బిల్డింగ్‌తో పాటు ఫిట్నెస్ అండ్ మెడికల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌ను సైతం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకుడు క్రాంతికిరణ్‌రావు తెలిపారు. ఫిట్‌నెస్‌పై అవగాహనకల్పిస్తారు.. ‘సర్టిఫైడ్ పర్సనల్ ట్రెయినర్స్ అసోసియేషన్’ (సీపీటీఏ) ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్’ పోటీలు నిర్వహిస్తున్నాం. సర్టిఫికెట్ ట్రెయిన్డ్ ట్రెయినర్స్గా ఈ పోటీలను తొలిసారిగా చేపట్టాం. ఫిట్నెస్, హెల్త్‌పై ఇన్స్ట్రక్టర్స్ అవగాహన కల్పిస్తారు. – క్రాంతికిరణ్‌రావు, క్రాన్ఫిట్నెస్అధినేత, సీపీటీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవీ కేటగిరీలు.. బాడీ బిల్డింగ్ పోటీల్లో ‘బాడీ బిల్డింగ్, క్లాసిక్ బాడీబిల్డింగ్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మెన్స్ ఫిట్నెస్ మోడల్, ఫిజికల్లీ చాలెంజ్డ్, ఉమెన్ ఫిట్నెస్ మోడల్’ వంటి కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. పాల్గొనదల్చినవారు నేరుగా అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
మేకర్ ఫెయిర్
-
26న హైదరాబాద్ హైటెక్స్‌లో డా. ఖాదర్ సదస్సులు
అటవీ కృషి, సిరిధాన్యాల సాగు– సిరిధాన్యాల ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై అటవీ కృషి, ఆరోగ్య, ఆహార నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 26న అనేక సదస్సుల్లో ప్రసంగించనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘సేంద్రియ ఉత్పత్తులు–చిరుధాన్యాలు– సంప్రదాయ వైద్య రీతులు’ పేరిట ఏర్పాటయ్యే మూడు రోజుల ఎగ్జిబిషన్లో భాగంగా ఈనెల 26 (ఆదివారం)న ఉ. 10 గం.–మ.12, మ.1 గం.–4 గం. మధ్య జరిగే సదస్సుల్లో డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తారని నిర్వాహకురాలు మాధవి తెలిపారు. రైతులు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈ ఉచిత సదస్సులకు అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 89782 45673, 81066 44699. ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ ఆంగ్ల పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. 28న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో డా. ఖాదర్ సదస్సు హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కొత్తపేట బాబూ జగ్జీవన్‌రాం భవన్లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం. నుంచి రా. 7 గం. వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలీ ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979 -
హైదరాబాద్‌లో 6వ క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభం
-
హైటెక్స్‌లో ‘5కే ఫన్ రన్’
-
హైటెక్స్‌లో ‘5కే ఫన్ రన్’
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్‌లో శనివారం ఉదయం నిర్వహించిన ‘5కే ఫన్ రన్’ ఔత్సాహికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం పీపుల్స్ ప్లాజా వద్ద జరగనున్న ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్-2017 కార్యక్రమానికి సన్నాహకంగా నిర్వహించిన ఈ ఫన్ రన్‌ను ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. హైటెక్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ఈ రన్లో సుమారు 6 వేల మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఆదివారం ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ ఆధ్వర్యంలో వరుసగా ఏడోసారి ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్లు నిర్వహంచనున్నారు. ఆరోగ్యం-పరుగు ప్రాముఖ్యతను చాటుతూ సాగే ఈ మారథాన్‌లో నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు వెల్లడించారు. -
ట్రావెల్ టూరిజం ఫేర్‌ను ప్రారంభించిన చందులాల్
మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం 25 శాతం అభివృద్ధి చెందిందని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ట్రావెల్ టూరిజం ఫేర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్మీరా చందులాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కట్టడాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సందర్శకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ టూరిజం ఫేరులో 182 ఎగ్జిబిటర్లతో స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఫేర్‌లో బుక్ చేసుకున్న వారికి అకామిడేషన్‌లో 20 శాతం, ట్రాన్స్‌పోర్టులో 10 శాతంలతో పాటు వివిధ విభాగాల్లో ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
హైటెక్స్ తరహాలో మరో కన్వెన్షన్ సెంటర్
హైదరాబాద్: హైదరాబాద్‌లో హైటెక్స్ తరహా మరో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. రోడ్డు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సోమవారం సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సీఎం, స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్‌లకు అధునాతన నివాసాలు నిర్మించడంతో పాటు ఏడాదిలోగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాలని ఆదేశించారు. ఈ నిర్ణయాలను ఖరారు చేసేందుకు ఆయన సీఎస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించారు. అన్ని స్ధాయిల్లో రోడ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతాంశాల్లో ఒకటని కేసీఆర్ చెప్పారు. నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేసే కాంట్రాక్టు సంస్థలకు 1.5 శాతం ఇన్సెంటివ్ ఇస్తామని తెలిపారు. -
'అనవసర ఔషధాలకు చెక్ పెట్టండి'
సాక్షి, హైదరాబాద్: పిల్లల ఆరోగ్యానికి చేటు తెచ్చే అనవసర మందులకు అడ్డుకట్ట వేయాలని పెడికాన్-2016 పిలుపునిచ్చింది. పిల్లల వైద్య సంరక్షణే లక్ష్యంగా 15వ ఆసియా-పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్, 53వ పెడికాన్ 2016, 5వ ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ నర్సింగ్ల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ సదస్సు హైటెక్స్‌లో ఆదివారం ముగిసింది. ఈ వివరాలను నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అనవసర మందులకు అడ్డుకట్ట వేయడానికి పాలకులు చేయూతనివ్వాలని సదస్సు విజ్ఞప్తి చేసింది. శిశుమరణాలు అంతకంతకూ పెరిగిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసింది. పిల్లలకు జరిగే హానికర చికిత్స ప్రపంచానికి చేటు అని పేర్కొంది. పిల్లల వైద్య నిపుణులు తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోకపోతే.. భావి పౌరులైన బాలలు అభివృద్ధికి ఆటంకంగా మారగలరని పేర్కొంది. దీన్ని సామాజిక కోణంలో పరిగణించి పాలకులు అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని సదస్సు అభిప్రాయపడింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకొని పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందని సదస్సు అభిప్రాయపడింది. కేవలం పిల్లల వైద్యులతోపాటు తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలమని పేర్కొంది. ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్లను తప్పనిసరిగా తీసుకోవాలని సదస్సు కోరింది. ఆలస్యంగానైనా వాటిని తీసుకోవడం మరువొద్దని సూచించింది. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ అంశాల మీద 700 మంది వైద్యులు తమ అనుభవాలను వెల్లడించారు. నాలుగు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకావడంతో చర్చ ఫలప్రదమైందని సదస్సు స్పష్టంచేసింది. 30 దేశాలకు చెందిన ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. పిల్లల వైద్య సంరక్షణ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆసియా పసిఫిక్ పీడియాట్రిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జుల్కిఫ్లీ ఇస్మాయిల్, ఇండియా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) అధ్యక్షుడు ప్రమోద్ జోగ్, పెడికాన్ నిర్వాహకులు డాక్టర్ రంగయ్య, డాక్టర్ అజయ్‌కుమార్, డాక్టర్ నిర్మల, డాక్టర్ హిమబిందు సింగ్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రవికుమార్, జగదీశ్చంద్ర, డాక్టర్ రమేష్ ధంపూరి తదితరులు పాల్గొన్నారు. -
హైటెక్స్‌లో మెడికల్ ఎక్స్పో ప్రారంభం
మాదాపూర్ : మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం 5వ ఇండియా మెడికల్ ఎక్స్పో-2015 అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య రంగంలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ల్యాబ్స్, హాస్పిటల్స్‌లలో ఉపయోగించే అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 250 కంపెనీలకు చెందిన 5000 మెడికల్, సర్జికల్, మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువు దీరాయి. తైవాన్, మలేషియా, కొరియా, చైనా, హాంగ్‌కాంగ్ కు చెందిన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శన ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. -
సాక్షి'లివ్ వెల్ ఎక్స్పో'ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్: అందరికీ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించేందుకు సాక్షి 'లివ్ వెల్ ఎక్స్పో' కార్యక్రమాన్ని చేపట్టింది. రెండురోజులపాటూ కొనసాగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి శనివారం హైటెక్స్‌లో ప్రారంభించారు. ప్రపంచాన్ని ఇప్పుడు జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు శాసిస్తున్నాయి. వాటి నివారణ కూడా జీవనశైలిని మార్పుచేసుకోవడం అనే ప్రక్రియ ద్వారా మన చేతుల్లోనే ఉంది. శని, ఆదివారాల్లో జరిగే 'సాక్షి లివ్ వెల్ ఎక్స్పో'లో మంచి ఆరోగ్యకరమైన జీవనం కోసం అవలంబించాల్సిన విధానాలు, పోషకాలతో కూడిన ఆహారాలు, వాటివల్ల ఒనగూడే ప్రయోజనాలు, ఒత్తిడిని తొలగించుకునే మార్గాలు, సరదగా శ్రమ తెలియకుండా తేలికగా చేయగల వ్యాయామాలు, యోగభోగాలను సాధించేందుకు దారులు, మనల్ని మనం ఉత్తేజితం చేసుకుంటూ స్వయం ప్రేరణ పొందేందుకు ఉన్న మార్గాల వంటి అనేక అంశాలపై ఆయా రంగాలకు చెందిన అత్యున్నత స్థాయి నిపుణులు మాట్లాడతారు. -
స్పెషల్ ఎడిషన్ : పుడ్ బజార్ పార్ట్-1
-
స్పెషల్ ఎడిషన్ : పుడ్ బజార్ పార్ట్-2
-
హైటెక్స్‌లో ఫుడ్‌బజార్ ప్రారంభం
-
పుడ్బజార్ను ప్రారంభించిన కేటీఆర్
-
హైటెక్స్‌లో టీఎస్ఆర్ మనవడి వివాహ వేడుక
-
హైటెక్స్‌లో చిన్నారుల్ని అలరిస్తోన్న కిడ్స్‌ఫెయిర్
-
సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడి వివాహ వేడుక
-
మెట్రో'త్సాహం..
-
'ఆన్లైన్ లో ప్రాజెక్ట్‌లకు అనుమతులు'
హైదరాబాద్: రియల్ఎస్టేట్ రంగానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలిపారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆన్లైన్ పద్దతిలో ప్రాజెక్ట్‌లకు అనుమతులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. రియాల్టీ ప్రాజెక్ట్‌లకు, విమాన సంస్థ అనుమతులు హైదరాబాద్‌లోనే మంజూరు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రియార్టీ సంస్థలు పాల్గొంటున్నాయి.