
సాక్షి'లివ్ వెల్ ఎక్స్‌పో'ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్: అందరికీ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించేందుకు సాక్షి 'లివ్ వెల్ ఎక్స్‌పో' కార్యక్రమాన్ని చేపట్టింది. రెండురోజులపాటూ కొనసాగే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి శనివారం హైటెక్స్లో ప్రారంభించారు.
ప్రపంచాన్ని ఇప్పుడు జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు శాసిస్తున్నాయి. వాటి నివారణ కూడా జీవనశైలిని మార్పుచేసుకోవడం అనే ప్రక్రియ ద్వారా మన చేతుల్లోనే ఉంది. శని, ఆదివారాల్లో జరిగే 'సాక్షి లివ్ వెల్ ఎక్స్‌పో'లో మంచి ఆరోగ్యకరమైన జీవనం కోసం అవలంబించాల్సిన విధానాలు, పోషకాలతో కూడిన ఆహారాలు, వాటివల్ల ఒనగూడే ప్రయోజనాలు, ఒత్తిడిని తొలగించుకునే మార్గాలు, సరదగా శ్రమ తెలియకుండా తేలికగా చేయగల వ్యాయామాలు, యోగభోగాలను సాధించేందుకు దారులు, మనల్ని మనం ఉత్తేజితం చేసుకుంటూ స్వయం ప్రేరణ పొందేందుకు ఉన్న మార్గాల వంటి అనేక అంశాలపై ఆయా రంగాలకు చెందిన అత్యున్నత స్థాయి నిపుణులు మాట్లాడతారు.