హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెక్స్‌టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్‌ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్‌లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్‌లెస్ డిజైన్‌కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి.
"గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్‌లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.
'నీల్' కలెక్షన్‌లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్‌లో ఫర్నిషింగ్స్, బెడ్‌స్ప్రెడ్‌లు, కంఫర్టర్‌లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్‌లో ఉంటాయి. ఇందులో జమ్‌దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్‌లో ఆకట్టుకుంటాయి.
అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్‌తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్‌వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.
ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment