
హైదరాబాద్: న్యూ హాలండ్ అగ్రికల్చర్ (సీఎన్‌హెచ్ ఇండస్ట్రియల్) రెండు నూతన ట్రాక్టర్లను విడుదల చేసింది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 3 నుంచి 5వ తేదీ వరకు జరిగిన కిసాన్ అగ్రి షోలో భాగంగా ‘బ్లూ సిరీస్ సింబా 30’, ‘5620 పవర్ కింగ్’ పేరుతో వీటిని ఆవిష్కరించింది. ఈ వ్యవసాయ సదస్సులో ఆరు ట్రాక్టర్లు, మూడు సాగు ఎకిŠవ్‌ప్‌మెంట్‌లను ప్రదర్శించింది.
ఇందులో సింబా 30 అనేది స్ప్రేయింగ్, రోటావేషన్, కల్టివేషన్, అంతర్గత కల్టివేషన్ పనులకు అనుకూలంగా ఉంటుందని సంస్థ తెలిపింది. అధిక పవర్‌తో, ఇంధనం ఆధా సామర్థ్యాలు ఇందులోని ప్రత్యేకతలు. ఇక 5620 పవర్ కింగ్ అనేది రవాణాకు, సాగుకు సంబంధించి పనులకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది.