హైటెక్స్‌ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్‌ గేమింగ్‌ ఈవెంట్‌! | KRAFTON India To Host India Biggest Battle Royale Esports Event BGIS 2024 Finale In Hyderabad | Sakshi
Sakshi News home page

హైటెక్స్‌ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్‌ గేమింగ్‌ ఈవెంట్‌!

Published Tue, Jun 25 2024 2:43 PM | Last Updated on Tue, Jun 25 2024 3:02 PM

KRAFTON India To Host India Biggest Battle Royale Esports Event BGIS 2024 Finale In Hyderabad

క్రాఫ్టాన్‌ (KRAFTON) ఇండియా సమర్పించు బ్యాటిల్ రాయల్ ఎస్పోర్ట్స్ ఈవెంట్‌ 2024 ఫినాలే (BGIS) హైదరాబాద్‌లో హైటెక్స్‌ వేదికగా ఈనెల (జూన్‌) 28, 29, 30 తేదీల్లో జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్‌ గేమింగ్‌ ఈవెంట్లలో ఒకటైన BGISలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జట్లు రిజిస్టర్‌ చేసుకున్నాయి. పలు దఫాల పోటీల అనంతరం టాప్‌ 16 జట్లు తుది పోటీలకు అర్హత సాధించాయి. ఈ ఈవెంట్‌లో పోటీ పడే జట్లు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీని షేర్‌ చేసుకుంటాయి.

KRAFTON సంస్థ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని కేటాయించడం భారత్‌లో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం. BGIS 2024 Finaleతో హైదరాబాద్‌ నగరం గేమింగ్‌ గమ్యస్థానంగా తమ ప్రతిష్ట మరింత పెంచుకోనుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోగా.. ప్రీమియం సీటింగ్‌, భోజన​ సదుపాయం కల ఎలైట్‌ పాస్‌లు (పెయిడ్‌ టికెట్లు) అందుబాటులో ఉన్నాయి.

ఎలైట్‌ పాస్‌ల ధర రూ. 5000గా నిర్ణయించారు. ఎలైట్ పాస్‌ల విక్రయం ద్వారా వచ్చే  మొత్తాన్ని సంప్రదాయ క్రీడలకు మద్దతుగా అభినవ్ బింద్రా ఫౌండేషన్‌కు అందిస్తారు. గేమింగ్‌ ఔత్సాహికులు, అభిమానులు ఈ ఈవెంట్‌ను KRAFTON India Esports YouTube ఛానెల్‌లో  ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగిన KRAFTON, Inc. ఆకర్షణీయమైన ఆటలను కనుగొనే ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థ. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన  డెవలపర్‌లకు నిలయంగా ఉంది. ఇందులో PUBG స్టూడియోస్‌, స్ట్రైకింగ్ డిస్టెన్స్ స్టూడియోస్‌, వెక్టర్ నార్త్, నియాన్ జెయింట్, క్రాఫ్టాన్ మాంట్రియల్ స్టూడియో, బ్లూహోల్ స్టూడియో, రైజింగ్‌ వింగ్స్‌, 5మిన్‌ల్యాబ్స్, డ్రీమోషన్‌, రెలుగేమ్స్‌, ఫ్లైవేగేమ్స్‌ వంటి స్టూడియోలు ఉన్నాయి.

ప్రతి స్టూడియో నిరంతరం కొత్త సవాళ్లను స్వీకరించడానికి, వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలను విస్తృతం చేయడం ద్వారా మరింత మంది అభిమానులను గెలుచుకోవడం KRAFTON లక్ష్యం.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement