Mobile Game
-
హైటెక్స్ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్!
క్రాఫ్టాన్ (KRAFTON) ఇండియా సమర్పించు బ్యాటిల్ రాయల్ ఎస్పోర్ట్స్ ఈవెంట్ 2024 ఫినాలే (BGIS) హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా ఈనెల (జూన్) 28, 29, 30 తేదీల్లో జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్లలో ఒకటైన BGISలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జట్లు రిజిస్టర్ చేసుకున్నాయి. పలు దఫాల పోటీల అనంతరం టాప్ 16 జట్లు తుది పోటీలకు అర్హత సాధించాయి. ఈ ఈవెంట్లో పోటీ పడే జట్లు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీని షేర్ చేసుకుంటాయి.KRAFTON సంస్థ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని కేటాయించడం భారత్‌లో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం. BGIS 2024 Finaleతో హైదరాబాద్ నగరం గేమింగ్ గమ్యస్థానంగా తమ ప్రతిష్ట మరింత పెంచుకోనుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోగా.. ప్రీమియం సీటింగ్, భోజన సదుపాయం కల ఎలైట్ పాస్‌లు (పెయిడ్ టికెట్లు) అందుబాటులో ఉన్నాయి.ఎలైట్ పాస్‌ల ధర రూ. 5000గా నిర్ణయించారు. ఎలైట్ పాస్‌ల విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని సంప్రదాయ క్రీడలకు మద్దతుగా అభినవ్ బింద్రా ఫౌండేషన్‌కు అందిస్తారు. గేమింగ్ ఔత్సాహికులు, అభిమానులు ఈ ఈవెంట్‌ను KRAFTON India Esports YouTube ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగిన KRAFTON, Inc. ఆకర్షణీయమైన ఆటలను కనుగొనే ఆన్లైన్ గేమింగ్ సంస్థ. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెవలపర్లకు నిలయంగా ఉంది. ఇందులో PUBG స్టూడియోస్, స్ట్రైకింగ్ డిస్టెన్స్ స్టూడియోస్, వెక్టర్ నార్త్, నియాన్ జెయింట్, క్రాఫ్టాన్ మాంట్రియల్ స్టూడియో, బ్లూహోల్ స్టూడియో, రైజింగ్ వింగ్స్, 5మిన్ల్యాబ్స్, డ్రీమోషన్, రెలుగేమ్స్, ఫ్లైవేగేమ్స్ వంటి స్టూడియోలు ఉన్నాయి.ప్రతి స్టూడియో నిరంతరం కొత్త సవాళ్లను స్వీకరించడానికి, వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలను విస్తృతం చేయడం ద్వారా మరింత మంది అభిమానులను గెలుచుకోవడం KRAFTON లక్ష్యం. -
మొబైల్ గేమ్ పాస్వర్డ్ ఇవ్వలేదని యువకుని హత్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆన్లైన్ మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్వర్డ్ షేర్ చేయలేదని ఓ యువకున్ని అతని స్నేహితులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి అడవిలో పడేశారు. యువకుడి తల్లి ఫిర్యాదుతో ఈ భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాపాయి దాస్ (18) గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి పూర్ణిమా దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పాపాయి దాస్ మృతదేహం జనవరి 15న అడవి సమీపంలో లభ్యమైంది. హత్యకు గల కారణాలను అన్వేషిస్తూ యువకుని స్నేహితులను విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్వర్డ్ ఇవ్వనందుకు నలుగురు స్నేహితులు కలిసి యువకున్ని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన నలుగురు మైనర్ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదీ చదవండి: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి -
ప్లే ప్యూర్: బీజీఎంఐ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్వీర్ సింగ్
Ranveer Singh BGMI బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమింగ్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను నియమించుకున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా వెల్లడించింది. గేమింగ్ థ్రిల్ ,సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ కరిష్మా రెండూ కలిపి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది గేమర్లకు ఉన్నతమైన అనుభవాన్ని అందించడమే కంపెనీ లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఔత్సాహికులకోసం ఆకర్షణీయమైన కంటెంట్‌ను తీసుకురావడానికి ఈ సహకారం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుందని, గేమింగ్ ఎంటర్టైన్మెంట్ కొత్త శకాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లను కట్టిపడేసే అనుభూతిని అందించే గేమ్‌లను రూపొందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా సీఈవో షాన్ హ్యునిల్ సోన్ తెలిపారు. దేశీ గేమింగ్ కమ్యూనిటీని కలిసేందుకు క్రాఫ్టాన్ భాగస్వామ్యం మంచి అవకాశం కాగలదని రణ్వీర్ సింగ్ పేర్కొన్నారు. -
తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు!
న్యూఢిల్లీ:మారాం చేస్తున్న పిల్లలకు అన్నం తినిపించాలన్నా, అల్లరి చేసినా, ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేసు కోవాలన్నా తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్న మంత్రం దండం స్మార్ట్‌ఫోన్. ఇది ప్రస్తుత కాలంలో పిల్లలకు అడిక్షన్‌లా మారిపోయింది. ఇది ప్రమాదకర ధోరణి అని, పిల్లలకు, మైనర్లకు స్మార్ట్‌ఫోన్ దూరంగా ఉంచాలని నిపుణులు పదేపదే హెచ్చిరిచ్చుస్తున్నారు. తాజాగా పేరెంట్స్ గుండెలు గుభిల్లుమనే స్టోరీ ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఇండియాలో మళ్లీ షురూ అయిన నేపథ్యలో ఈ షాకింగ్ న్యూస మరింత ఆందోళన రేపుతోంది ఇన్సైడర్ ప్రకారం చైనాకు చెందిన టీనేజ్ బాలిక (13) మొబైల్ గేమ్స్ కారణంగా తల్లి ఖాతాలోని మొత్తం సొమ్మును ఖతం చేసేసింది. అయితే స్కూలు నుంచి ఫోన్ వచ్చేవరకు బాలిక ఈ కుటుంబం ఈ విషయాన్ని పసిగట్టలేదు. స్కూల్లో ఎక్కువసేపు ఫోన్లో గడుపుతున్న బాలికను విచారించగా విషయం బైటపడింది. పే టూ ప్లే గేమ్స్‌కు బాలిక అడిక్ట్ అయిందని గుర్తించిన టీచర్ బాలిక తల్లిని అప్రమత్తం చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే బాలిక తల్లి యివాంగ్‌కు బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోగా అందులో కేవలం రూ. 5( 0.5 యువాన్ )మాత్రమే మిగలడంతో లబోదిబో మంది. (రిటర్న్ టు ఆఫీస్ గూగుల్ వార్నింగ్: ఉద్యోగులేమంటున్నారంటే!) నాలుగు నెలల్లో కుటుంబం దాచుకున్న సొమ్మునంతటినీ మొబైల్‌గేమ్స్‌కు తగలేసింది. అంతకాదు తన క్లాస్మేట్స్ గేమ్స్‌కు కూడా ఈమే చెల్లింపులు చేసింది ఇంటిలో డెబిట్ కార్డు కనిపించడంతో దాన్ని తన స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నానని, దాని పాస్‌వర్డ్‌ను తల్లి తనకు చెప్పిందని బాలిక చెప్పింది. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే తల్లికి అనుమానం రాకుండా తన స్మార్ట్‌ఫోన్‌లో మొబైల్ గేమ్స్ లావాదేవీలకు సంబంధించిన, మెసేజ్‌లు, ఇతర రికార్డులు అన్నింటినీ డిలీట్ చేసింది. (మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర) అయితే తన సహవిద్యార్థులకు డబ్బులు ఇచ్చినట్లు ఒప్పుకుంది. వాళ్లు కూడా గేమ్ ఆడేందుకు డబ్బు డిమాండ్ చేశారనీ, వారికి పంపకపోతే, ఇబ్బంది పెట్టేవారని సదరు బాలిక వెల్లడించింది. అలాగే టీచర్‌కి చెబితే టీచర్ తన పేరెంట్స్‌కికి చెబితే, వారికి కోపం వస్తుందేనని భయపడినట్టు చెప్పుకొచ్చింది. కాగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ యాప్స్ వైపు ఆకర్షితులవుతున్న యూత్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చైనాతో సహా అనేక దేశాలు గేమింగ్ వ్యసనంనుంచి మైనర్లను కాపాడే చర్యలను చేపడుతున్నాయి. -
బీజీఎంఐ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. త్వరలోనే
10 నెలల సస్పెన్షన్ తర్వాత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఈ నెల 29న భారత్‌లో పునఃప్రారంభం కానుంది. గేమర్స్ ఆడేందుకు వీలుగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో లభ్యం కానుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెక్యూరిటీ మార్పులు చేసిన తర్వాత గేమ్‌కు మూడు నెలల ట్రయల్‌కు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్లోడ్ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది. ఈ సందర్భంగా బీజీఎంఐ ఇప్పుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. వినియోగదారులకు గేమ్‌ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని’ అని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ సోహ్న్ తెలిపారు. -
ఈ–నగ్గెట్స్ ప్రమోటర్ల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కోల్‌కతాకు చెందిన మొబైల్ గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌పై పేర్చిన రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టల ఫొటోను ఈడీ విడుదల చేసింది. అమీర్ ఖాన్, అతడి కుమారుడు నెజార్ అహ్మద్ ఖాన్ కలిసి ‘ఈ–నగ్గెట్స్ పేరిట మొబైల్ గేమింగ్ యాప్ ప్రారంభించారు. వారితోపాటు మరికొందరు ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి చెందిన దాదాపు 6 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టామని ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.17 కోట్ల నగదు లభ్యమైందని, నోట్ల కట్టల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఈ–నగ్గెట్స్ కంపెనీ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వాటిని తిరిగి వెనక్కి తీసుకొనే అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తోందంటూ ఫెడరల్ బ్యాంకు అధికారులు కోల్‌కతా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కంపెనీతోపాటు ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు 2021 ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో ఈడీ సోదాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీ సొదాలు జరుగుతుండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న వ్యాపారవేత్తలపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వల్ల బెంగాల్‌కు పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సెల్‌ఫోన్ భూతం.. మొబైల్ గేమ్‌తో మతిపోయింది
కణేకల్లు: స్మార్ట్‌ఫోన్ బానిసైన ఓ యువకుడు అదేపనిగా ‘ఫ్రీ ఫైర్ గేమ్’ ఆడుతూ మానసికస్థితిని కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో జరిగింది. కణేకల్లు మండలం బెణికల్లు గ్రామానికి చెందిన మహేష్ ఇంటర్ చదివేవాడు. తండ్రి అతన్ని చదువు మాన్పించి పనిలో చేర్పించాడు. పనిచేయగా వచ్చిన డబ్బుతో మహేష్ ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ‘ఫ్రీ ఫైర్ గేమ్’ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని గంటల తరబడి ఆడేవాడు. మహేష్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రెండు రోజుల క్రితం అతని తండ్రి కణేకల్లులోని ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. తన కుమారుడు 3 నెలలుగా రాత్రి పూట నిద్ర పోవడం లేదని, అన్నం కూడా సరిగా తినడం లేదని చెప్పాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ అహమ్మద్..ఫ్రీ ఫైర్ గేమ్ ఆడడం వల్ల ఆ యువకుడు మతిస్థిమితం కోల్పోయినట్లుగా గుర్తించి, బళ్లారిలోని న్యూరాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో యువకుడిని తీసుకుని తల్లిదండ్రులు బళ్లారికి వెళ్లినట్లు సమాచారం. -
బిజీఎమ్ఐ మొనగాళ్లకు భారీ షాక్ ఇచ్చిన క్రాఫ్టన్..!
1,42,000 మంది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(బిజీఎమ్ఐ) యూజర్లకు క్రాఫ్టన్ భారీ షాక్ ఇచ్చింది. వారం కంటే తక్కువ సమయంలోనే 142,000 మంది యూజర్ల ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది. ఈ విషయం గురుంచి క్రాఫ్టన్ సంస్థ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ సంవత్సరం డిసెంబర్ 6 - డిసెంబర్ 12 మధ్య కాలంలో అనుమానం గల ఖాతాలను తనికి చేసి శాశ్వతంగా నీషేదించినట్లు తెలిపింది. యాప్ డెవలపర్ ఈ నిషేధిత ఖాతాల జాబితాను పేర్లతో సహ ప్రచురించింది. అనుమతి లేకున్నా హ్యాకింగ్ చేసి ఇతర లెవెల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆడటంతో ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది. గత నెలలో, నవంబర్ 17 నుంచి నవంబర్ 23 మధ్య కాలంలో 157,000కు పైగా ఖాతాలను బిజీఎమ్ఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అనధికారిక ఛానల్స్ నుంచి గేమ్ డౌన్ లోడ్ చేసుకోవడం, చట్టవిరుద్ధమైన సహాయక కార్యక్రమాన్ని ఇన్ స్టాల్ చేయడం వంటి ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తిస్తే క్రాఫ్టన్ ఆటగాళ్లకు నోటీసు పంపుతుంది. బీజీఎంఐ పేరుతో చీటింగ్ చేసే వాళ్లపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించింది. ఇందుకోసం క్రాఫ్టన్ సంస్థ చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. (చదవండి: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..!) -
పబ్జీ మొనగాళ్లకు షాక్..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్ అవుతాయ్..!
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మనదేశంలో దేశ భద్రత కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్ చేసింది. దీంతో ఆ గేమ్ మాతృసంస్థ దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ 'బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' (బీజీఎంఐ) గేమ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్‌లో 40 రోజుల వ్యవధిలో 25 లక్షల అకౌంట్లను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నిషేధించినట్లు బీజీఎంఐ క్రాఫ్టన్ తెలిపింది. లక్షల్లో అకౌంట్లు బ్లాక్ వరల్డ్ వైడ్ పబ్జీ గేమ్ క్రేజ్ కొనసాగుతుంది. రెవెన్యూ పరంగా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 197 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న గేమ్‌లో మోసాలు పెరిగిపోతున్నాయి. అందుకే క్రాఫ్టన్ సంస్థ సెప్టెంబర్‌లో 1,40,000, అక్టోబర్‌లో 88వేల అకౌంట్లను బ్లాక్ చేసింది. అక్టోబర్ 1నుంచి నవంబర్ 10 మధ్యకాలంలో ఖచ్చితంగా 25,19,262 గేమ్ అకౌంట్లను శాస్వతంగా, 7,06,319 అకౌంట్లను తాత్కాలికంగా నిషేదం విధించినట్లు క్రాఫ్టన్ సంస్థ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. బీజీఎంఐ పేరుతో చీటింగ్ చేసే వాళ్లపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాన్ పై సందిగ్ధత గేమ్ పేరుతో చీటింగ్ చేసే అకౌంట్లను బ్యాన్ చేసే అంశంపై సందిగ్ధత నెలకొందని గేమ్ డెవలపర్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. కానీ మోసాలు పెరిగిపోవడంతో అకౌంట్లను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించారు. ఇందుకోసం క్రాఫ్టన్ సంస్థ చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్! -
జస్ట్ ఒక్క మొబైల్ గేమ్‌తో 75 వేల కోట్లు సొంతం...!
టెన్సెంట్, టీఐఎంఐ స్టూడియోస్ సంయుక్తంగా రూపోందించిన 'హానర్ ఆఫ్ కింగ్స్’ మొబైల్ గేమ్స్ చరిత్రలో సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గేమ్ ఆదాయం సుమారు 10 బిలియన్ డాలర్లకు చేరుకున్న తొలి మొబైల్ గేమ్‌గా హానర్ ఆఫ్ కింగ్స్ నిలిచింది. హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్‌ను చైనా రూపొందించింది. ఈ గేమ్ కేవలం చైనాలో అందుబాటులో ఉండగా...మిగతా దేశాల గేమింగ్ ప్రియులకు ‘ఆరేనా ఆఫ్ వాలర్’ గేమ్‌గా అందుబాటులో ఉంది. చదవండి: ట్విటర్లో యూజర్ల గోలాగోలా..! ఇవి చూస్తే నవ్వలేక చచ్చిపోవాల్సిందే..! హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్ చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా గేమింగ్ మార్కెట్లో చైనా గణనీయమైన అభివృద్దిని సాధించింది.2021లో హానర్ ఆఫ్ కింగ్స్ ఇప్పటివరకు సగటు రెవెన్యూ 14 శాతం మేర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా మల్టీప్లేయర్ ఆన్లైన్ బాటిల్ అరేనా గేమ్స్ విభాగంలో భారీగా పురోగతి కన్పిస్తోంది. కరోనా రాకతో ఆన్లైన్ గేమింగ్ ఆడే వారి సంఖ్య భారీగా పెరిగింది. గేమింగ్ ప్రియులు ఆయా ఆన్లైన్ గేమింగ్‌లో డబ్బులను వెచ్చించడంతో వెనుకాడడం లేదు. సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం... ఈ ఏడాదిలో హానర్ ఆఫ్ కింగ్స్ గేమ్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్స్ సహాయంతో సుమారు రెండు బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిన్నట్లు వెల్లడించింది. ఒకానొక సమయంలో ఐఫోన్ యూజర్ల నుంచి 717 మిలియన్‌డాలర్లను కేవలం 3 నెలల్లోనే ఆర్జించింది. అత్యధికంగా గడించిన గేమింగ్ యాప్స్‌లో వరుసగా పబ్జీ మొబైల్, జెన్షిన్ ఇంపాక్ట్, రోబ్లోక్స్, త్రీ కింగ్డమ్ టాక్టిక్స్ నిలిచాయి చదవండి: ఆరు గంటల్లో 50 వేల కోట్ల నష్టం.. హ్యాకింగ్ కాదు జరిగింది ఇది -
పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా?
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వివాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో కొందరు యువతీయువకులు తమ వివాహాలను భిన్నంగా.. కొత్త తరహాలో చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ యాసలో అద్భుతంగా ఉన్న ‘బుల్లెట్టు బండి’ పాట వివాహాల్లో మార్మోగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జంట పెళ్లిపీటలపై కూర్చుని ఫోన్లో గేమ్ ఆడడం వింతగా ఉంది. ఇద్దరు తమ తమ ఫోన్లలో ఆడుకుంటూ బిజీగా ఉన్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: తాలిబన్ల అరాచకం.. జర్నలిస్టులకు చిత్రహింసలు వారి వివరాలు తెలియరాలేదు. కానీ వారి వస్త్రధారణ చూస్తుంటే పశ్చిమబెంగాల్‌కు చెందిన వధూవరులుగా కనిపిస్తున్నారు. ఈ వీడియోను నిరంజన్ మహాపాత్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. పెళ్లి దుస్తుల్లో ఉన్న ఆ ఇద్దరు దంపతులు తమ మొబైల్ ఫోన్లలో పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘ఫ్రీ ఫైర్’ ఆడుకుంటూ కనిపించారు. శత్రువులను చంపుతూ నవ్వుకుంటూ.. మాట్లాడుకుంటూ వారు ఆడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వారిని తిట్టి పోస్తున్నారు. ఫోన్లు ఎంతటి దారుణ పరిస్థితులకు తీసుకువచ్చిందోనని ఓ పెద్ద మనిషి కామెంట్ చేశారు. జై పబ్జీ లవర్స్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ‘అది పబ్జీ కాదురా అయ్య ఫ్రీ ఫైర్’ మరికొందరు వివరణ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
కొత్త పేరుతో త్వరలో పబ్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాపులర్ గేమ్ పబ్జీ గుర్తుందిగా.. కొద్ది రోజుల్లో బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఈ గేమ్ దర్శనమీయనుంది. అది కూడా కేవలం భారత్‌కే పరిమితం కానుందని దక్షిణ కొరియాకు చెందిన వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ వెల్లడించింది. చైనా యాప్స్‌కు అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగంగా ప్లేయర్ అన్నోన్స్ బాటిల్‌గ్రౌండ్స్ (పబ్జీ) మొబైల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ఇంటర్నెట్ కంపెనీ టెన్సెట్ భారత్‌లో పబ్జీని ఆఫర్ చేసింది. అయితే ఇక నుంచి ఈ గేమ్ అధికారం టెన్సెట్ ఇండియాకు లేదని పబ్జీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఎప్పుడు ఈ గేమ్‌ను అందుబాటులోకి తెచ్చేదీ వెల్లడించనప్పటికీ కొత్త లోగోను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. ఉచితంగానే గేమ్‌ను విడుదల చేయనున్నట్టు క్రాఫ్టన్ వెల్లడించింది. భారత్‌లో అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడి మార్కెట్ కోసం ప్రత్యేక గేమ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు గతేడాది నవంబర్‌లో పబ్జీ కార్పొరేషన్ ప్రకటించింది. వ్యాపార పునరుద్ధరణ కోసం మాతృ సంస్థ అయిన క్రాఫ్టన్‌తో కలిసి సుమారు రూ.740 కోట్లు భారత్‌లో ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. పబ్జీ డౌన్లోడ్స్ దేశంలో 17.5 కోట్లకుపైమాటే. -
ఫోన్లో గేమ్ ఆడిన కప్ప; చివర్లో మాత్రం
న్యూఢిల్లీ: మొబైల్ గేమ్స్ మనమేనా.. జంతువులు కూడా ఆడేస్తున్నాయి. గేమ్‌లో ఓడిపోతే మనం లైట్ తీస్కుంటామేమో కానీ అవి నేరుగా మనసుకు తీసుకుంటాయి. ఎందుకో ఈ స్టోరీ చదివేసేయండి. చీమలు, పురుగులు స్క్రీన్ మీద పరిగెడుతుంటే మనం వేలితో టచ్ చేసి చంపేయాలి. ఇది 'యాంట్ స్మాషర్' గేమ్.. అయితే ఈ ఆటను కప్పతో ఆడించాడో మహానుభావుడు. అది మనలాగా వేలితో కాకుండా నాలుకతో ఆటాడింది. చీమ కనిపించగానే లటుక్కున మింగేద్దామనుకుంది. దాని నాలుక స్క్రీన్ మీదకు ఆడించగానే చీమ చచ్చిపోతుంది, కానీ నోటికి అందడం లేదు. దీంతో అది మరింత తీక్షణంగా ఆడటం మొదలు పెట్టింది. (ఈ కప్ప నిజంగా లక్కీఫెలో) ఈసారి వచ్చేదాన్ని వదిలిపెట్టనంత కసిగా ఆటలో లీనమైపోయింది. అలా చీమల్ని చంపుతూ ఉండగా గేమ్ ముగిసింది. దీంతో అక్కడున్న వ్యక్తి స్క్రీన్‌పై వేలు ఆనించగా అది వెంటనే అతడి వేలును నోట కరుచుకుంది. ఇది పాత వీడియోనే అయినప్పటికీ అటవీశాఖ అధికారి సుశాంత్ నందా తిరిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారింది. "లాస్ట్‌లో మాత్రం ట్విస్ట్ అదిరింది" అంటూ నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. "జంతువుల వేట కన్నా వాటితో ఆటే ప్రమాదకరం" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. (కార్వార కప్ప గోవాలో కూర) -
పబ్జీ సరికొత్త వెర్షన్; వారి పరిస్థితేంటో..!
ప్రాణాంతక పబ్జీ గేమ్‌ను ఇష్టపడే వాళ్లకు దాని సృష్టికర్తలు శుభవార్త చెప్పారు. పబ్జీ మొబైల్ గేమ్ రెండేళ్ల సెలబ్రేషన్స్ సందర్భంగా మరో సరికొత్త అప్డేట్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు తెలిపారు. తొలుత టైమ్‌పాస్ బాటిల్ గేమ్‌గా మొదలైన పబ్జీ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పటికే ఎన్నో అప్డేటెడ్ వెర్షన్లు వచ్చాయి. ఆయుధాలే ప్రధానంగా సాగే ఈ ఆటలో.. తాజా పన్నెండో వెర్షన్లో మరిన్ని నూతన ఆయుధాలను ప్రవేశపెట్టనున్నారు. బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ గేమ్ అప్డేటెడ్ వెర్షన్ 0.17.0 గా రానుంది. (చదవండి : అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చి గలాటా) ఇక బాటిల్ గ్రౌండ్లో శత్రువులను ఎదుర్కొనే క్రమంలో గేమర్ ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. 12 వ సీజన్లో కీలకమైన డెత్ రీప్లే అవకాశం కల్పిస్తున్నారు. శత్రువుల దాడిలో గేమర్ ఎలా చనిపోయాడో తెలుసుకునేందుకు డెత్ రీప్లే ఆప్షన్ తోడ్పడుతుంది. చేసిన పొరపాట్లేవో తెలుసుకుని, మరోసారి గేమర్ చనిపోకుండా కాపాడుకునేందుకు ఈ ఆప్షన్ సహకరిస్తుంది. ఇక పబ్జీ గేమ్‌తో మొబైల్స్‌కు అతుక్కుపోయే వారిని ఈ వెర్షన్ ఇంకెలా మారుస్తుందో మరి..! గంటల తరబడి పబ్జీలో మునిగి ప్రాణాలు కోల్పోయిన వారి గురించి, మానసిక రుగ్మతలు కొని తెచ్చుకున్న వారి గురించి తెలిసే ఉంటుంది..! (చదవండి : ప్రాణం తీసిన పబ్జీ.. యువకుడికి బ్రైయిన్ స్ట్రోక్) -
టిక్‌టాక్ తీసిన ప్రాణాలెన్నో...
టిక్ టాక్.. ఓ యాప్.. సింపుల్‌గా యాప్ అనడం కంటే ఇదొక వ్యసనం అనొచ్చు. అంతగా టిక్ టాక్ యూజర్లను మైకంలో ముంచేస్తోంది. ఇప్పుడు ఎవరైనా గంటలు గంటలు ఒంటరిగా గడిపేస్తున్నారంటే.. టిక్ టాక్‌లో దూరిపొయ్యారని అర్థం చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ అదేపనిగా స్క్రోల్ చేసేస్తున్నారంటే కూడా టిక్ టాక్ వీడియోస్ చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇలా వీడియోలు చూస్తూ, చేస్తూ కుటుంబాలను కూల్చుకుంటున్న వారూ, ప్రాణాలు తీసుకుంటున్నవారూ ఎందరో. టిక్ టాక్ అనే ఈ ఆధునిక జబ్బుకు మందులేదు.. నివారణా మార్గమూ లేదు.. మన పక్కనే కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ వేరే లోకంలో విహరిస్తోంటే వాళ్లు కచ్చితంగా టిక్ టాక్‌లో ఉన్నట్టే... ఇంట్లోనే ఉంటూ చడీ చప్పుడు లేకుండా ఏవో డాన్సులు, ఎక్స్ ప్రెషన్లు పెడుతోంటే.. వాళ్లు కచ్చితంగా టిక్ టాక్ వీడియోలు చేస్తున్నట్టే లెక్క.. అవును ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సప్లను మించి టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు.. చూస్తున్నారు. ఈ చైనా యాప్ కొంత మందిని స్టార్లను చేస్తోంటే.. కొన్ని జీవితాలను నాశనం చేస్తోంది. కాపురాలను నిలువునా కూల్చేస్తోంది. మరికొన్ని ప్రాణాలను గాల్లో కలిపేస్తోంది. మొత్తంగా మన దేశంలో టిక్ టాక్ ఒక సంచలనం.. పెను దుమారం.. యూత్‌లో ఫేస్ బుక్ పాతబడిపోయింది.. వాట్సప్ పాచిబట్టిపోయింది... ఇప్పుడంతా టిక్ టాక్ మయం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా.. అందులో టిక్ టాక్ యాప్ ఉందా.. ఇవి చాలు సినిమాల్లో హీరోలను మించిన ఎక్స్ప్రెషన్స్..హీరోయిన్స్‌ని మించిన డాన్సులతో ఓ ఊపుఊపెయ్యడానికి. ఎక్స్ ప్రెషన్స్ పెట్టు.. అప్లోడ్ కొట్టు.. లైకులు.. కామెంట్లు ఫాలోయింగులు.. స్టార్లుగా వెలిగిపోవడానికీ సినిమాల్లోకే వెళ్లనక్కర్లేదు.. హీరోహీరోయిన్లను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇప్పుడు ఒక్క స్మార్ట్ ఫోన్ అందులో టిక్ టాక్ యాప్ ఉంటే చాలు అని యూత్ నమ్ముతోంది. అది కొంత వరకు నిజం కూడా.. చాలా మందిని టిక్ టాక్ ఓవర్ నైట్ స్టార్లను చేసేంది. టిక్ టాక్‌లో పాపులర్ అయిన వాళ్ల ఫాలోయింగ్ మిలియన్లలో ఉందంటే.. వాళ్ల క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. యాప్‌లో మంచి ఎఫెక్ట్స్.. అదిరిపోయే షార్ట్ మ్యూజిక్ బిట్స్.. డైలాగ్ బిట్స్ ఉంటాయి.. వాటికి తగ్గట్టుగా పెదాలు ఆడిస్తూ శరీరాన్ని కదిలిస్తే చాలు.. నచ్చిన వాళ్లు అక్కడికక్కడే కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తారు.. ఎవరికి వారు స్టార్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పట్నుంచో లోలోపల ఉన్న కోరికేదో తీరినట్లనిపిస్తుంది. ఈ ఆశే కుర్రకారును కిర్రెక్కిస్తోంది.. ఎక్కడో పల్లెటూరిలో ఉన్న పోరగాడికి టిక్ టాక్ వీడియోల ద్వారా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు.. ఇంకా ఇంటర్మీడియట్ కూడా పూర్తవని టీనేజ్ అమ్మాయి కొత్త వీడియో ఎప్పుడు చేస్తుందా అని మిలియన్ల మంది వెయిట్ చేస్తుంటారు... ఇప్పుడు మన దేశంలోని యూత్‌ని టిక్ టాక్ ఆకర్షించినంతగా మరేదీ ఆకట్టుకోవడం లేదు.. నిజంగానే టిక్ టాక్ క్రియేటివిటీని బయటపెట్టేలా చేస్తోంది.. కాన్ఫిడెన్స్ పెంచుతోంది. అమ్మాయిల్లో బెరుకుపోగొట్టి ఫ్రీ ఎక్స్ప్రెషన్ను బయటపెడుతోంది. అయితే.. అదే శ్రుతి మించితే.. అవసరానికి మించి చేస్తే ఏదైనా అనర్థాలకే దారితీస్తుంది. పుస్తకాలను పక్కన పడేసి విద్యార్థులు.. పిల్లల్ని పక్కన పడేసి చంటిబిడ్డల తల్లులు... భార్యా పిల్లల్ని పట్టించుకోకుండా మగవాళ్లు టిక్ టాక్ వీడియోలు చేస్తూ చూస్తూ గంటలకు గంటలు గడిపేస్తున్నారు.. ఒక్క మన దేశంలోనే 35 కోట్ల మంది ఈ యాప్ వాడుతున్నారు. టిక్ టాక్ ఒక్క రోజు ఆదాయం మూడున్నర కోట్ల రూపాయలు. టిక్ టాక్ పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెట్టే స్థాయికి చేరింది.. ఆ మధ్య కోయంబత్తూర్‌లో ఓ వ్యక్తి ...భార్య టిక్ టాక్ చేస్తోందని ఆమెను హత్య చేశాడు. తాజాగా తమిళనాడులో భర్త టిక్ టాక్ వీడియోలు చెయ్యొద్దన్నాడని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆరియలూర్లో అనిత అనే మహిళ తరచూ టిక్ టాక్ వీడియోలు చేసి అప్ లోడ్ చేసేది. ఈ క్రమంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. వీడియోలు చెయ్యవద్దని భర్త ఆంక్షలు పెట్టడంతో భరించలేకపోయిన అనిత పురుగుల మందు తాగేసింది.. తాను విషం తాగుతున్న వీడియోను కూడా టిక్ టాక్‌లో పోస్ట్ చేసింది. అందులో తాను చనిపోతున్నాననీ.. పిల్లల్ని బాగా చూసుకోవాలనీ అనిత భర్తకు సూచించింది. టిక్ టాక్ వీడియోలు చెయ్యడం అనితకు వ్యసనంగా మారిందనీ.. ఆ మాయలో పడి పసిబిడ్డను కూడా పట్టించుకోలేదని.. అనిత టిక్ టాక్ వీడియోల్లో మునిగిపోయి ఉన్నప్పుడు పాప చాలా సార్లు కింద పడి గాయాలపాలైందని భర్త చెబుతున్నాడు. అనిత ఆత్మహత్య వీడియో వైరల్ అవడంతో.. టిక్ టాక్‌పై ఓ చర్చకు తెరలేపింది. టిక్ టాక్ చేస్తున్న చూస్తున్న వాళ్లకు కలిగి ప్రయోజనం మాట అటుంచితే.. కలుగుతున్న అనర్థాలు, అపార్థాల మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. మొన్నటివరకు ఫేస్బుక్, వాట్సప్‌లపై గంటలు గడిపే వారు కాస్త ఇప్పుడు టిక్‌టాక్ వీడియోలను చేతులు అరిగిపోయేలా స్ర్కోల్ చేసుకుంటూ చూసేస్తున్నారు. నచ్చిన వారిని ఫాలో అవడంతో పాటు, నచ్చిన వీడియోలను మళ్లీ మళ్లీ చూడడం కోసం ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా వీడియో డౌన్లోడ్ కాకపోతే ప్రత్యేకమైన యాప్స్ వాడడం ద్వారా వాటిని ఫోన్లోకి డౌన్లోడ్ చేస్తున్నారు. వీక్షకుల సంగతి ఇలా ఉంటే, టిక్ టాక్‌లాంటి యాప్స్‌లో వీడియోలు తయారు చేసే వారి పరిస్థితి మరోలా ఉంటుంది. ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, టిక్ టాక్‌లో రెచ్చగొట్టే హావభావాలతో చేసిన వీడియోలను.. యువత ఎక్కువగా ఆస్వాదిస్తూ వీక్షిస్తున్నట్లుగా వెల్లడైంది. ఇక అలాంటి వీడియోల చేసే కామెంట్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. చిన్న పిల్లల్ని లైంగికంగా ప్రేరేపించేలా ఈ వీడియోలు ఉంటున్నాయన్న విమర్శలతో పాటు.. టిక్ టాక్‌కి నేరుగా బాధితులయ్యేది చిన్నారులేననేది మద్రాసు హైకోర్టుదాకా వెళ్లింది. ఇటీవలి కాలంలో కొంతమంది సెక్స్ వర్కర్లు టిక్‌టాక్‌ని వేదికగా చేసుకొని, అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేస్తూ, తమని ఫాలో అవుతున్న వారితో టచ్‌లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ధోరణులను ప్రోత్సహించబోమని టిక్ టాక్ యాజమాన్యం చెబుతున్నా చేతల్లో ఎక్కడా నియంత్రణ కనిపించడం లేదు. అనేకచోట్ల టిక్ టాక్ వీడియోలు చేయటం ఒక సరదాగా మొదలై, అది కుటుంబ కలహాలకు, విడాకులకు దారి తీయటం జరుగుతోంది. టిక్ టాక్‌లో ఉన్న డ్యూయట్ ఫీచర్ వలన సమస్య మరింత ముదురుతోంది. ఒక మహిళ ఒక వీడియోను పబ్లిక్‌గా పెడితే దాన్ని ఆసరాగా చేసుకొని, ముక్కు మొహం తెలియని పురుషులు డ్యూయట్ వీడియోలు తయారు చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో కాపురాలు కూలిపోతున్నాయి. ఊరూపేరు తెలియని వ్యక్తులను టిక్ టాక్ లో చూసి ప్రేమలో పడి చదువులను పాడుచేసుకునే టీనేజర్లు ఎందరో. -
టిక్ టాక్ ఈ జబ్బుకు మందులేదు!
-
పబ్జీ.. ఇకపై రోజుకు ఆరు గంటలే!
న్యూఢిల్లీ: పబ్జీ... ఇదో మొబైల్ గేమ్. ప్రస్తుతం యువతకు ఈ గేమ్ వ్యసనంలా మారింది. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని స్వచ్ఛంద సంస్థల దగ్గర్నుంచి రాజకీయ పార్టీల వరకు డిమాండ్ చేస్తున్నాయి. ఫలితంగా ఈ గేమ్‌కి అడ్డుకట్ట వేసే పని ప్రారంభమైంది. ఇకపై ఆరు గంటలు మించి పబ్జీ ఆడలేరు. ఇండియాలో కేవలం ఆరు గంటలు మాత్రమే పబ్జీ ఆడేందుకు అనుమతి లభించింది. ఎవరైనా రోజుకు 6 గంటలు పబ్జీ ఆడగానే తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది. మళ్లీ మరుసటి రోజు వరకు ఇక పబ్జీ ఆడలేరు. పబ్జీ 6 గంటలు ఆడగానే హెల్త్ రిమైండర్ రావడంపై అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ విడుదల కాలేదు. కానీ... ప్లేయర్స్ మొబైల్‌పై హెల్త్ రిమైండర్ పేరుతో నోటిఫికేషన్ కనిపిస్తోంది. 18 ఏళ్ల లోపు వయస్సుగల ప్లేయర్స్‌కు 2 నుంచి 4 గంటల లోపే హెల్త్ రిమైండర్ నోటిఫికేషన్ వస్తోంది. -
పబ్జీ.. మహాడేంజర్జీ
మొన్న పోకెమాన్.. నిన్న బ్లూవేల్.. తాజాగా పబ్జీ ఉరఫ్ ‘ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్‌గ్రౌండ్’.. దేశంలో ప్రస్తుతం యువతను ప్రత్యేకించి స్కూలు విద్యార్థులను గంగవెర్రులెత్తిస్తున్న ప్రమాదకర ఆన్లైన్ మొబైల్ గేమ్ ఇది. ఆత్మహత్యలవైపు ప్రేరేపించిన బ్లూవేల్, పోకెమాన్ల స్థాయిలో కాకున్నా పబ్జీ విద్యార్థులను హింస, నేరప్రవృత్తి స్వభావంవైపు పురిగొల్పుతోంది. స్కూళ్లు ఎగ్గొట్టి మరీ గంటల తరబడి వారు ఈ ఆటలో మునిగితేలేలా బానిసలుగా మార్చుకుంటోంది. యువతలో వివిధ శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణమవుతోంది. – సాక్షి, హైదరాబాద్ ఏమిటీ గేమ్...? ఇది దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ యాప్. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని గేమ్‌లో ప్రవేశించగానే ఒక ఐడీ లభిస్తుంది. ఇది ఎక్కువగా ఒక జట్టుగా ఆడే గేమ్. ఎంత మందితో ఈ గేమ్ ఆడాలి అనేది ముందే దీన్ని ఆడేవారు నిర్ణయించు కుంటారు. ఈ గేమ్ ఆడేవారు ప్రత్యేక సైనిక వేషధారుల్లా మారిపోతారు. అలాగే ఇది గ్రూప్ వాయిస్ గేమ్. అంటే ఈ గేమ్ ఆడేవారంతా ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వెసులుబాటు ఈ యాప్‌లో ఉంది. ఈ గేమ్‌లో గరిష్టంగా వంద మంది ఉంటారు. దీన్ని ఆడేవారు ఏర్పాటు చేసుకున్న టీం తప్ప మిగతా వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపు కుంటూ పోవడమే ఈ ఆట. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేం దుకు మెడికల్ కిట్ వంటివి ఇందులో ఉంటాయి. ఒక్క సారి ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోనట్లే లెక్క. అందుకే యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చని పోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లో ప్రవేశించాలనుకుంటారు. గుజరాత్ స్కూళ్లలో నిషేధం పబ్జీ వల్ల బానిసలుగా మారిన యువతను చూసి చైనా ఈ గేమ్‌ను ఇప్పటికే పూర్తిగా నిషేధించింది. సర్వర్ లింకులను కూడా తొలగించి నెటిజన్లకు ఈ గేమ్ లింక్ దొరకకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ ఆటను స్కూళ్లలో నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులెవరూ స్కూళ్లకు స్మార్ట్ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేసింది. అలాగే దేశవ్యాప్తంగా ఈ గేమ్‌ను నిషేధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు సైతం చేసింది. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) సైతం హాస్టళ్లలోని విద్యార్థులు పబ్జీకి బానిసలవుతున్నారని గుర్తించి తమ సంస్థ ఆవరణలో దీన్ని ఆడటంపై నిషేధం విధించింది. 20 కోట్ల మంది యూజర్లు ప్రపంచవ్యాప్తంగా పబ్జీ ఆడేవాళ్లు దాదాపు 20 కోట్ల మంది ఉన్నారు. ఏ సమయంలోనైనా ఈ గేమ్‌లో యాక్టివ్‌గా ఉండే వాళ్ల సంఖ్య 3 కోట్ల నుంచి 4 కోట్లుగా ఉంది. దీన్నిబట్టి ఈ ఆటకు ఎంత మంది బానిసలుగా మారారో అర్థంచేసుకోవచ్చు. దేశంలో పబ్జీ ప్రభావం.... పబ్జీ కారణంగా జమ్మూకశ్మీర్‌లో ఇటీవల పది, పన్నెండో తరగతి పరీక్షా ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయని, వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని ఆ రాష్ట్ర విద్యార్థుల సంఘా లు డిమాండ్ చేశాయి. ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్‌ను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పబ్జీ ప్రభావం అధికంగానే ఉంది. ఎక్కడ చూసినా విద్యార్థులు ఈ గేమ్‌లో మునిగితేలి కనిపిస్తున్నారు. బానిసలుగా ఎందుకు మారుతున్నారు? ఏదైనా ఆట ఆడేటప్పుడు గెలవాలనే కసి ఉండటం సహజం. కానీ పబ్జీ విషయంలో మాత్రం అది మరీ ఎక్కువ. ఈ గేమ్ ఆడుతున్నంతసేపూ యుద్ధం చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి యువత ఓడిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్‌లోకి ప్రవేశిస్తూ విజయం కోసం తహతహలాడుతోంది. ఈ ఆట ఆడే సమయంలో ఎవరు వచ్చినా పట్టించుకొరు. గేమ్ నుంచి క్షణం దృష్టి మరిల్చినా చనిపోతామనే భయంతో ఎవరు పిలిచినా పట్టించుకోరు. ఎవరు ఫోన్లు చేసినా కట్ చేస్తారు. మానసికంగా పూర్తిగా దానికే అంకితమవుతూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తుంటారు. పబ్జీ ఆడే వారిలో కనిపించే లక్షణాలు... ►చదువులో ఏకాగ్రత లోపించడం ► కోపం, చిరాకు ప్రదర్శించడం, దుందుడుకు స్వభావం ► ఎవ్వరితోనూ కలవలేకపోవడం ► నిద్రలేమి, కంటి సమస్యలు -
బ్లూ వేల్ తర్వాత మరో డెడ్లీ గేమ్
నొయిడా : కొన్నాళ్ల క్రితం బ్లూవేల్ గేమ్ రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ డేంజరస్ డెత్ గేమ్‌ను అదుపు చేయటానికి ప్రభుత్వాలు కఠిన చర్యలే తీసుకున్నాయి. ఇంతలో మరో గేమ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైస్కూల్ గ్యాంగ్ స్టర్ ఎస్కేప్ అనే ఆట మూలంగా ఢిల్లీలో జంట హత్యలు చోటుచేసుకోవటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆటకు బానిసైన ఓ బాలుడు తల్లి, సోదరిలనే పొట్టనబెట్టుకున్నాడు. ఏం జరిగింది... మంగళవారం ఈ ఘటన చోటు చేసుకోగా... ఇంటి నుంచి పరారైన ఆ బాలుడు చివరకు పట్టుబడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నొయిడాలోని గౌర్ ప్రాంతంలో వ్యాపారవేత్త సౌమ్య అగర్వాల్ కుటుంబం నివసిస్తోంది. ఆయన భార్య అంజలి(42), కూతురు మణికర్ణిక(11) సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో కంగారు పడిన ఆయన బంధువులకు పురమాయించి ఇంటికి పంపించగా.. వారు రక్తపు మడుగులో పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంలో లభించిన క్లూస్ ఆధారంగా వారి తనయుడి(16 ఏళ్లు) పై అనుమానపడ్డారు. వారి మృత దేహాలను, పక్కనే క్రికెట్ బ్యాట్-కత్తెర పడి ఉండటం, బాత్ రూంలో రక్తపు మరకలు ఉన్న బాలుడి దుస్తులు లభ్యం కావటం, బాలుడు పరారీలో ఉండటంతో ఆ అనుమానాన్ని మరింత బలపరిచాయి. సీసీ పుటేజీలో బాలుడు రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లటం.. 11 గంటలకు బయటకు రావటం కనిపించింది. అందులో అతను మొబైల్ ఫోన్లోనే నిశీతంగా చూస్తూ వెళ్తున్న దృశ్యాలను పోలీసులు గమనించారు. చివరకు రైలు మార్గం ద్వారా వారణాసి చేరుకున్న బాలుడు శుక్రవారం ఓ వ్యక్తి ఫోన్ నుంచి తండ్రికి కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. ఆ నంబర్ ఆధారంగా వెంటనే వారణాసికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను నిజం ఒప్పుకున్నట్లు నొయిడా ఎస్ఎస్పీ లవ్ కుమార్ తెలిపారు. హైస్కూల్ గ్యాంగ్ స్టర్ ఎస్కేప్ గేమ్‌కు బానిసైన బాలుడు.. తల్లి ఫోన్‌ను లాక్కుని అడ్డుకోవటంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని ఆయన తెలిపారు. శనివారం అతన్ని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇలాంటి డేంజరస్ గేమ్‌లు వైరల్ అవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ఆట నేపథ్యం ఏంటి? హైస్కూల్ గ్యాంగ్ స్టర్ ఎస్కేప్.. ఇందులో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆటగాడు అడ్డువచ్చే పోలీసులను చంపుతూ పోతుండాలి. ఇందుకోసం బేస్ బాస్ లాంటి ఓ బ్యాట్ సహకారం తీసుకొవచ్చు. లెవల్స్ పెరిగే కొద్దీ తోటి విద్యార్థులతోసహా అడ్డువచ్చే ప్రతీ ఒక్కరినీ చంపుకుంటూ పోవాలి. నేర ప్రవృత్తిని పెంచే ఈ ఆట ఇప్పుడు యువతలో విపరీతమైన మోజును పెంచుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. -
మొబైల్ గేమ్ ఎంత పనిచేసింది!
బీజింగ్: స్మార్ట్‌ఫోన్‌కి బానిసలై ఆన్లైన్లోనే గడిపేస్తున్న వారికిది నిజంగానే ఓ హెచ్చరిక. 21 ఏళ్ల యువతి స్మార్ట్‌ఫోన్‌లో 24 గంటల పాటు ఏకధాటిగా వీడియో గేమ్ ఆడి తన కుడి కంటి చూపును కోల్పోయింది. ఈ ఘటన వాయవ్య చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఆన్లైన్లో ‘హానర్ ఆఫ్ కింగ్స్’ అనే మల్టీప్లేయర్ గేమ్ ఆడుతున్న యువతికి ఒక్కసారిగా కంటి చూపు మసకమసకగా మారింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే యువతి తన కుడి కంటిచూపును కోల్పోయిందని దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. యువతిని దగ్గర్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా.. చూపు కోల్పోడానికి గల కారణాన్ని గుర్తించలేకపోయారు. చివరికి నాన్‌చాంగ్ జిల్లాలోని ఓ ఆస్పత్రి ‘రెటినాల్ ఆర్టరీ అక్జూజన్’అనే సమస్య కారణంగా యువతి చూపు కోల్పోయినట్లు గుర్తించింది. ఈ యువతి స్థానికంగ ఉన్న కంపెనీలో ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తునట్లు తెలిసినా.. పేరు కానీ, ఇతర ఏ వివరాలు కానీ తెలియరాలేదని పేర్కొంది. హానర్ ఆఫ్ కింగ్స్ ఆన్లైన్ గేమ్‌కు కేవలం చైనాలోనే సుమారు 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. -
అజహర్ మొబైల్ గేమ్ ఆవిష్కరణ
ముంబై: భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ పేరుతో 3–డి మొబైల్ గేమ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ‘బిగ్కోడ్ గేమ్స్’ సంస్థ ఈ గేమ్‌ను రూపొందించింది. బుధవారం జరిగిన 3–డి గేమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ మాజీ సారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుంబ్లే నిష్క్రమణ, రవిశాస్త్రి వ్యాఖ్యలు, తనపై, శ్రీశాంత్‌పై నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు. ‘కోచ్‌గా అనిల్ కుంబ్లే అవమానకరంగా నిష్క్రమించడం నన్ను బాధించింది. అనిల్ నాకు బాగా తెలుసు. ఒకరు వేలెత్తి చూపే వ్యక్తిత్వం కాదతనిది. జట్టుకు మేలు చేయాలని తపించేవాడు తప్ప చేటు చేసే వ్యక్తి కాదు. తన ఆత్మ గౌరవం కోసమే స్వయంగా తప్పుకున్నాడు. ఇది మంచి నిర్ణయమే’ అని అన్నాడు. భారత క్రికెట్లో కోహ్లి జట్టే అత్యుత్తమమన్న రీతిలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మాట్లాడిన తీరును అజహర్ తప్పుబట్టారు. ‘అప్పటి జట్టు వేరు. ఈ జట్టు వేరు. ఇవి సమకాలీన జట్లు కానే కావు. రెండు భిన్న తరాలకు చెందిన జట్లను పోల్చడం సహేతుకం కాదు. అప్పటి బౌలర్లు, ప్రత్యర్థులు, పరిస్థితులు అన్నీ వేరు. అలాంటి జట్లను పోల్చడమేంటి? నిజానికి శాస్త్రి కూడా అప్పటి జట్టులో సభ్యుడే. అంటే తనను కూడా తక్కువ చేసుకున్నట్లే కదా’ అని అన్నారు.తనకు బోర్డు నుంచి రావాల్సిన పెన్షన్, ఏకమొత్తం చెల్లింపు సమస్య త్వరలోనే సమసి పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బోర్డుతో తనకెలాంటి శత్రుత్వం లేదని న్యాయం కోసమే కోర్టుమెట్లు ఎక్కానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ హోదా గల పదవిలో ఉన్న జి.వివేక్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తుందని చెప్పారు. ఇక్కడ జీతం తీసుకుంటున్నారా లేదా అన్నది అనవసరమన్నారు. -
టు కె రన్
మొబైల్ గేమ్ ఇటీవల భారత ప్రభుత్వం నోట్లు రద్దు చేసిన అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘మిస్ ప్లేస్డ్ మైండ్స్’ సంస్థ ఒక మొబైల్ గేమ్ రూపొందించింది. ఆండ్రాయిడ్‌లో వచ్చిన ఈ గేమ్ పేరు ‘టు కె రన్’. కరెంట్ టాపిక్‌ని ఆధారంగా మన దేశంలో ఒక గేమ్ మార్కెట్లోకి రావడం ఇదే ప్రథమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్యారికేచర్లతో యానిమేషన్ చేసి రూపొందిన ఈ గేమ్‌ను జనవరి మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ గేమ్‌లో... ఎన్నికల గుర్తుతో నోట్లను కొల్లగొడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపు చేస్తున్న కానిస్టేబుల్‌గా మోడీ లాఠీతో కనిపిస్తారు. ఈ గేమ్ ఆడేందుకు తేలిగ్గా ఉంది. చూడటానికి ఆసక్తికరంగా ఉంది. సూర్యప్రకాశ్ (విజయవాడ), చంద్రధర్, సాయి తేజ, మోహనవంశీ, శిఖాశర్మ (హైదరాబాద్) ఈ గేమ్ రూపకర్తలు. గూగుల్ ప్లే నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
డేంజర్ గేమ్..పోకెమాన్ గో..
ప్రపంచాన్ని పిచ్కెక్కిస్తున్న మొబైల్ గేమ్ మొబైల్‌ని చూస్తూ తిరగాల్సి రావటంతో ప్రమాదాలు - తొలిసారి వర్చువల్ రియాలిటీతో అనుసంధానం - రోడ్లపై డ్రైవింగ్‌లోనూ ఆటే; ప్రమాదాలు- పోలీసుల హెచ్చరిక - అమెరికాలో శ్మశానంలో ఇరుక్కున్న మహిళ - తమను గుర్తుపట్టేశాడని యువకుడిని కాల్చేసిన దుండగులు - ఇండియాలో మూడునాలుగు రోజుల్లో విడుదల: నింటెండో - ఇక్కడ విదేశాల మాదిరి రోడ్లపై ఆడితే చాలా ఇబ్బందికరం - మొబైల్ సిగ్నల్స్ కూడా వీక్‌గా ఉంటాయి కనక ఇక్కడ కష్టం - నింటెండో కంపెనీకి కిక్కిచ్చిన గేమ్; 10 రోజుల్లో షేరు డ బుల్ - పోకెమాన్ పేరున్న ప్రతి వ్యాపారానికీ భలే గిరాకీ స్కూలు పిల్లలే కాదు. కాలేజీ కుర్రాళ్లనైనా సరే... ఉన్నట్టుండి ‘మన రాష్ట్రపతి ఎవరు?’ అని అడిగారనుకోండి. చాలామంది కాసేపు ఆలోచిస్తారు. కొందరైతే చెప్పలేరు కూడా. కానీ వారిని... ‘పోకెమాన్ గురించి తెలుసా?’ అని అడిగారనుకోండి. గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. అంతేకాదు!! నాకు 50 క్యారెక్టర్ల పేర్లు తెలుసు!! అని ఒకరంటే... నాకు 80 తెలుసు!! అని మరొకరు... ఇలా పోటీలు పడి పేర్లు కూడా చెప్పేస్తారు!!. అదీ... పోకెమాన్ పవర్.!! పోకెమాన్ అంటే జపనీస్‌లో ‘పాకెట్ మాన్స్టర్’కు సంక్షిప్త రూపం. ఇదో టీవీ షో. సినిమాలూ వచ్చాయి. గేమ్స్ కూడా ఉన్నాయి. పోకెమాన్ ట్రయినర్ యాష్... తన స్నేహితులు మిస్టీ, బ్రోక్తో కలిసి పోకెమన్ భాగస్వాముల్ని తీసుకుని కల్పిత ప్రపంచంలో తిరగటమే ఈ షో కథ. మరి యాష్ లక్ష్యమేంటి? పోకెమాన్ మాస్టర్ కావాలి. ఈ గేమ్ ఆడే పిల్లల లక్ష్యం కూడా అదే. సాధ్యమైనన్ని పోకెమాన్లను సంపాదించి, వాటిని ట్రెయిన్ చేసి మాస్టర్ కావటమే. జంతువులు, మాయలు, అద్భుతాలు... ఇలా కావాల్సిన మసాలాలన్నీ ఉండటంతో పోకెమాన్ అంటే పిల్లలకు, యువతకు పిచ్చి. జూలై 6న పోకెమాన్ ప్రపంచంలో ఓ సంచలనం!! ఇంకా చెప్పాలంటే... పోకెమాన్ ప్రపంచం మొత్తం ఓ అడుగు ముందుకేసింది. మొబైల్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తూ... అగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత ‘పోకెమాన్ గో’ గేమ్ కొన్ని దేశాల్లో విడుదలయింది. నిజం చెప్పాలంటే... అగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా రూపొందిన తొలి పాపులర్ గేమ్ ఇదే. ఇది విడుదలైన క్షణంలోనే... మొబైల్ గేమ్స్ అభిమానుల క్రేజ్ తారస్థాయికి వెళ్లిపోయింది. క్షణాల్లోనే వేల డౌన్లోడ్లు. రోజులు తిరక్కుండానే అవి లక్షలుగా మారిపోయాయి. వారం తిరక్కుండా కోట్లు దాటిపోయాయి. ఇండియా సహా పలు దేశాల్లో ఇది ఇంకా విడుదల కాకపోయినా... ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లేస్టోర్లలో అత్యధిక డౌన్లోడ్లు చేసుకున్న గేమ్‌గా రికార్డులు బద్దలుగొట్టేసింది. అంతేకాదు!! పలు దేశాల్లో వివాదాలకూ కారణమవుతోంది. కొన్ని దేశాలైతే నిషేధించాయి కూడా!! మరి ప్రపంచాన్ని ఇంతలా పిచ్కెక్కిస్తున్న ఈ గేమ్ విశేషాలేంటి? ఎందుకింత క్రేజ్ ? అసలు ఇండియాలో ఎప్పుడు విడుదలవుతుంది? ఒకవేళ ఇండియాలో విడుదలైతే మిగతా దేశాల్లాగే మనమూ ఆడగలమా? ఇవన్నీ వివరించేదే ఈ వారం ‘ఫోకస్’... - సాక్షి, బిజినెస్ విభాగం సాధారణంగా ఏ మొబైల్ గేమైనా స్థిరంగా ఒకచోట కూర్చుని ఆడేదే. కానీ ‘పోకెమాన్ గో’ అలా కాదు. నడుస్తూ... వాహనాలపై ఎక్కడెక్కడికో వెళుతూ... మొత్తంగా కదులుతూ ఆడే గేమ్. ఈ గేమ్ ఆడాలంటే మొదట గూగుల్ లేదా యాపిల్ ప్లేస్టోర్ల నుంచి ‘పోకెమాన్ గో’ ఫ్రీ గేమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే ఇండియాలో ఇంకా ఇది విడుదల కాలేదు కనక... ‘మీ దేశంలో ఇది లభ్యం కావటం లేదు’ అనే సందేశం మాత్రం వస్తుంది. కాస్త టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్గా ఉన్నవారైతే... ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్కో అనుసంధానమై దీన్ని డౌన్లోడ్ చేసేయొచ్చు. కాకపోతే అధికారికంగా విడుదలయ్యాకే దీన్లోని ఫీచర్లన్నీ లభిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇండియాలో వచ్చేవారంలోనే విడుదల చేస్తామని కూడా వెల్లడించింది. మరి దీన్నెలా ఆడాలి..? డౌన్లోడ్ చేసి లాగిన్ అయ్యాక... మీరు పోకెమాన్ ట్రెయినర్‌గా మారాలి. హెయిర్ నుంచి స్కిన్, కళ్లు, దుస్తులు, స్టయిల్స్‌తో సహా ఒక అవతార్‌ను ఎంచుకోవాలి. లొకేషన్‌ను ఆన్ చేస్తే... ఆ వెంటనే మీరున్న చోటు ఫోన్లో మ్యాప్స్ ద్వారా కనిపిస్తుంటుంది. అదే మ్యాప్‌లో పోకెమాన్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఎక్కడ ఉన్నాయనేది కరెక్ట్‌గా తెలియకపోయినా... ఎంత దూరంలో ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. సదరు ప్రాంతానికి నిజంగా వెళితేనే కనిపిస్తాయవి. దీంతో... మనం ఫోన్ పట్టుకుని, కెమెరాలోంచి చూస్తూ ముందుకు వెళ్లాలన్న మాట. ఎక్కడైనా పోకెమాన్ ఉన్న ప్రదేశంలోకి వెళ్లగానే... ఫోన్లోని కెమెరా నుంచి చూస్తాం కనక... ఆ కెమెరా, గైరోస్కోప్ ఆధారంగా అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా పోకెమాన్ చిత్రం మొబైల్లో కనిపిస్తుంది. మన ఎదురుగా కనిపిస్తున్న పోకెమాన్ని... ఫోన్లోని పోకెబాల్తో కొట్టాలి. ఈ బాల్ ఎలా ఉంటుందంటే గూగుల్ మ్యాప్స్‌లో పిన్ మాదిరి. కావాలంటే ఆటగాళ్లు పోకెమాన్లను ఫొటోలు కూడా తీసుకోవచ్చు. ఈ పోకెమాన్లు ఎక్కడుంటాయి? రోడ్డు మీద, రెస్టారెంట్ల పక్కన, నీటిలో, కొండల మీద, అడవిలో, బస్టాప్‌ల వద్ద, ఆసుపత్రుల వద్ద... ఇలా ఎక్కడైనా పోకెమాన్స్ ఉండొచ్చు. సరైన సమయంలో సరైన బాల్‌ను వినియోగించడంపైనే ఆటగాడి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఎన్కౌంటర్ చేసిన తరువాతో..? పోకెమాన్లను ఎన్కౌంటర్ చేశాక ఆటగాడికి రెండు రకాలుగా పాయింట్లొస్తాయి. 1. క్యాండీస్ 2. స్టార్‌డస్ట్. పోకెమాన్ పోరాట శక్తిని పెంచేందుకు ఆటగాడు అవసరమైతే క్యాండీస్, స్టార్‌డస్ట్ పాయింట్లను వినియోగించుకోవచ్చు. అన్ని పోకెమాన్ల శక్తీ ఒకేలా ఉండదు. లెవల్స్ పెరుగుతున్న కొద్దీ వాటి శక్తి కూడా ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. అవసరమైతే ఆటగాడు పోకెమాన్‌ను తిరిగి వెనక్కి పంపించి మరో పోకెమాన్‌ను సృష్టించుకునే వీలుంటుంది. ఈ ఆట ముగిసేదెక్కడ? ఐదు లెవల్స్ దాటాక ఆటగాడు వలోర్- రెడ్ టీం, మైస్టిక్- బ్లూ టీం, ఇన్స్టింక్ట్- ఎల్లో.. ఈ మూడు జట్లలో చేరొచ్చు. దీంతో పోకెమాన్ జిమ్‌లో తలపడటానికి అర్హత సాధిస్తాడన్నమాట. ఈ జిమ్‌లు కూడా రియల్ లొకేషన్లలోనే ఉంటాయి. అక్కడకు వెళితే కనిపిస్తాయి. జిమ్ మీద ఆధిపత్యం సాధించి, జిమ్‌లో శిక్షణ ద్వారా తన పోకెమాన్స్ను బలోపేతం చేయొచ్చు. పోకెమాన్ గోలో మొత్తం 151 పోకెమాన్ ర్యాంకింగ్స్ ఉంటాయి. ప్రతీదానికో పేరుంది. ఫస్ట్ పోకెమాన్ పికాచు. తర్వాత మ్యూ, చార్మెండర్, హంటర్.. ఇలా జుబట్, ప్రిడ్జి, రట్టాటాతో ముగుస్తుంది. ఈ గేమ్ అంతిమ విజయం ఏంటంటే.. పొకెడెక్స్లో బందీలుగా ఉన్న పోకెమాన్లను విడిపించడమే. మన దేశంలో ఆడగలమా? ► ఇండియాలో ఇంకా ఈ గేమ్ విడుదల కాలేదు. విడుదలైనా సరే... ఆడటంలో చాలా ఇబ్బందులుండవచ్చనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ గేమ్కోసం వీధుల్లో తిరగాల్సి ఉంటుంది. మనుషులు మామూలుగా నడవటానికే వీలుకాని మన రోడ్లపై... ఫోన్‌వైపు చూస్తూ నడిస్తే ఇంకేమైనా ఉందా? విదేశాల్లో కన్నా ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందన్నది వారి భావన. ► ఈ గేమ్‌ను వీధుల్లో తిరుగుతూ ఆడాలి కనక వైఫైతో సాధ్యం కాదు. 2జీతో ఆడలేం. 3జీ లేదా 4జీ డేటాను వాడాల్సి ఉంటుంది. మన దేశంలో 3జీ సిగ్నల్స్ చాలా చోట్ల పనిచేయవు. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాల్సి ఉంటుంది. వీక్ సిగ్నల్ కారణంగా చాలా ప్రాంతాల్లో ఆడే అవకాశం ఉండదు. సిగ్నల్ బలంగా ఉన్నచోట ఆడదామనుకుంటే అక్కడ పోకెమాన్లు, పోకె జిమ్‌లు ఉండక పోవచ్చు. ► మనదేశమే కాదు. ఎక్కడైనా బ్యాటరీ సమస్యే. ఎందుకంటే కెమెరా, జీపీఎస్ ఒకేసారి వినియోగిస్తూ ఈ గేమ్ ఆడాలి. దీంతో బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది. గంట సేపు ఆడితే బ్యాటరీ మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదముంది. అందుకని వేరే బ్యాటరీని వెంట తీసుకెళ్ళాలనేది గేమర్ల సూచన. ► బెంగళూరులోని బాబాజాబ్స్ సంస్థ ఇప్పటికే ‘పోకెమాన్ క్యాచర్స్’ కావాలంటూ కొత్త ఉద్యోగ ప్రకటన వేసిం ది. అంటే కాస్త బలంగా ఉండి అటూ ఇటూ పరుగులెత్తి పోకెమాన్లను పట్టుకుంటే... వాటిని విక్రయిస్తారన్న మాట. ► కొన్ని లెవెల్స్ చేరుకున్న వారు తమ ఖాతాల్ని కూడా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. వాటిని కొంటే... నిజంగా పోకెమాన్లను పట్టుకోకపోయినా మన ఖాతాలోకి వచ్చేస్తాయన్న మాట. ► పోకెమాన్ పేరిట ఇప్పటికే దుస్తులతో పాటు క్యాప్‌లు, కార్డ్‌లు, స్కూల్ బ్యాగ్‌ల వంటి రకరకాల యాక్సెసరీలు మార్కెట్లో ఉన్నాయి. తాజా గేమ్‌తో వాటి గిరాకీ అమాంతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ► పోకెమాన్ వస్తువులమ్మే ప్రతి వ్యాపారానికీ గి రాకీ పెరిగింది. పోకెమాన్ బొమ్మలతో కేకు లు తయారు చేస్తున్న ఓ బేకరీ షేరు జపాన్‌లో 10 రోజుల్లోనే 50% పెరిగింది. ప్రమాదాలే ప్రమాదాలు..! ► పోకెమాన్ గోపై భిన్న స్పందనలున్నాయి. ఈ గేమ్‌ను నడుస్తూ, పరుగెడుతూ ఆడతారు కనక.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరమైనదేనని కొందరు చెబుతున్నారు. అయితే రోడ్లు మీద వెళుతూ ఆడాల్సిన గేమ్ కావటంతో ప్రమాదకరమని మరికొందరు చెబుతున్నారు. ► నిజానికి ఇప్పటికే పోకెమాన్ గేమ్ వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ పోకెమాన్లను వెతుకుతూ... ఏకంగా దగ్గర్లోని స్మశానంలోకి వెళ్లిపోయింది. పోకెమాన్లను పట్టుకునే క్రమంలో అక్కడ చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులొచ్చి ఆమెను రక్షించాల్సి వచ్చింది. ► స్టోర్బ్రిడ్జ్లో ఓ వ్యక్తి పోకెమాన్ గో ఆడుతూ... రోడ్డుపైకి చూడటానికి బదులు మొబైల్‌వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు కూడా పట్టుకున్నారు. చివరకు పోకెమాన్ గో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ... కొన్ని జాగ్రత్తలు చెబుతూ క్లీవ్‌లాండ్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ► గ్వాటెమాలాలో ఇద్దరు అన్నదమ్ములు పోకెమాన్ ఆడుతూ ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడున్న దుండగులు తమను జీపీఎస్ సాయంతో వెతుకుతూ వచ్చేశారని భావించి ఇద్దరిలో ఒకరిని కాల్చిచంపేశారు. ► నార్త్ టెక్సాస్‌లో పోకెమాన్ ఆడుకుంటూ నిర్జీవ ప్రదేశానికి వెళ్లిన వ్యక్తిని పాము కాటేసింది. ఇదే ప్రాంతంలో మరొక వ్యక్తి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. మరొక వ్యక్తి పోలీస్ వాహనానికి ఢీకొన్నాడు. దీంతో నార్త్ టెక్సాస్ పోలీస్ విభాగం పోకెమాన్ గేమ్- భద్రత చిట్కాలను వివరిస్తూ నిమిషం నిడివిగల వీడియోను విడుదల చేసింది. ► మరోవైపు శుక్రవారం కెనడాలో పోకెమాన్ గో ఆడుతూ ఇద్దరు టీనేజర్లు దేశ సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించారు. వారిని బోర్డర్ పెట్రోల్ సిబ్బంది అదుపులోకి తీసుకుని వెనక్కి తీసుకొచ్చారు. ► ఒకవైపు ప్రమాదాలు పెరుగుతుండగా... ఇదొక జూదం లాంటిదంటూ దీన్ని నిషేధించాలని సౌదీ అరేబియా కౌన్సిల్ ఆఫ్ సీనియర్ స్కాలర్స్ ఫత్వా జారీ చేశారు. ఇది అనారోగ్యకరమని ఈజిప్ట్ రాజధాని కైరోలోనూ నిషేధించారు. ఇంగ్రెస్ గేమ్ డేటాతోనే పోకెమాన్ నియాంటిక్ మూలాలు గూగుల్వే. ఈ సంస్థ 2012లోనే ఇంగ్రెస్ గేమ్‌ను రూపొందించింది. కానీ అది పట్టాలెక్కలేదు. గూగుల్ కాస్తా ఆల్ఫాబెట్గా మారాక నియాంటిక్ సంస్థ పూర్తిగా విడిపోయింది. పోకెమాన్ సీఈఓ ట్సునికాజు ఐషిహారా, నింటెండో ప్రెసిడెంట్ అండ్ సీఈఓ సటోరూ ఐవాటా కలిసి... అగ్మెంటెడ్ రియాలిటీతో గేమ్ రూపొందించాలనుకున్నారు. నియాంటిక్తో చేతులు కలిపారు. ఇంగ్రెస్ను దీనికి వాడుకున్నారు. ఈ గేమ్ గురించి అగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీలో ఉన్న ఇమాజినేట్ సంస్థ సీఈఓ హేమంత్ సత్యనారాయణ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. + జీపీఎస్, కెమెరా, ఫోన్లోని కంపాస్ ఆధారంగా వర్చువల్ వరల్డ్‌లో భౌగోళిక ప్రాంతాల్ని గుర్తిస్తారు. ఇందులో అగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా పోర్టల్స్‌ను ట్రాక్ చేసిపెడతారు. వీటిని నావిగేషన్ చేయాలంటే వాస్తవ ప్రపంచంలో వాటి వద్దకు వెళ్లాలి. మొబైల్లోని దిక్సూచి, సెన్సార్ కనెక్ట్ అయి ఉంటాయి కనక.. యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న మొబైల్‌ను వెంట తీసుకెళ్లాలి. అయితే ఇక్కడ మనకొక సందేహం రావొచ్చు. అదేంటంటే.. పోకెమాన్ కోసం బహిరంగ ప్రదేశాల్లో తిరగాల్సి ఉంటుందని డెవలపర్లకు ముందే తెలిసినప్పుడు నిర్మానుష్య ప్రదేశాల్లో, ఓపెన్ ప్లేసుల్లోనో ఈ పోకెమాన్లను పెట్టొచ్చు కదా అని!. కరెక్టే.. కానీ పోకె మాన్లను వారెలా నావిగేట్ చేశారు? గూగుల్ ఏపీఐ ద్వారా కదా! అంటే ఎక్కడైతే పది మంది గుంపులుగా ఉంటారో అక్కడే పోకెమాన్లను పెట్టారు. బస్టాండ్లు, పార్కులు, మైదానాలు, రెస్టారెంట్ల వంటివన్నమాట. + ప్రపంచం మొత్తం మీద పోకెమాన్లను మాన్యువల్‌గా పెట్టలేం. గూగుల్ మ్యాప్స్‌లో ప్రతి పాయింట్‌ను ఎంచుకుని కూడా చేయలేం. అందుకే డెవలపర్లు ఏం చేశారంటే.. రాండమ్‌గా బస్టాండ్లు, పార్కులు, మైదానాలు, రెస్టారెంట్లు, ఆసుపత్రుల వంటి ప్రాంతాలను ఎంచుకున్నారు. అక్కడ గూగుల్ అప్లికేషన్ ప్రొగ్రాం ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా పోకెమాన్లను పెట్టేశారు. అయితే కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్, ఏపీఐ రెండూ నావిగేషన్స్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. అక్కడ డెవలపర్లు అనుకున్న ప్రాంతం ఒకటైతే వాస్తవంగా వేరే ప్రాంతం ఉండొచ్చు. ఇదీ అసలు మ్యాటర్!! నకిలీలున్నాయ్ జాగ్రత్త.. ► పోకెమాన్ గో విడుదలైన రెండు రోజుల్లో నే యాపిల్, ఆండ్రాయిడ్ స్టోర్లలో ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న గేమ్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. వారం రోజుల్లో 10 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం పోకెమాన్కు 35 మిలియన్ల యూజర్లున్నారని సెన్సార్ టవర్ లెక్కలు చెబుతున్నాయి. ► పోకెమాన్ గో ఆధారం చేసుకొని పోకె రా డార్, హెల్పర్ ఫర్ పోకెమాన్ గో వంటి 215 నకిలీ యాప్స్ చెలామణిలోకి వచ్చాయి. వీటి ని డౌన్లోడ్ చేసుకుంటే పలు వైరస్లు డౌన్లోడ్ అవుతాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ రిస్కీఐక్యూ హెచ్చరించింది. నకిలీ యాప్స్‌తో ఫోన్లోని డేటా బదిలీ అవుతుంది. మొబైల్ వ్యాలెట్లపై దాడి చేస్తుండటంతో ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదముంది. ►ఆండ్రాయిడ్ ఫోన్లలో రోజుకు సగటున ఈ గేమ్ వినియోగం స్నాప్‌చాట్, టిండర్, ట్విటర్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ వినియోగాన్ని మించిపోయింది. ఐఓఎస్ ఫోన్లలో సగ టున రోజుకు 33 నిమిషాల 25 సెకన్ల పాటు ఈ గేమ్‌ను ఆడుతున్నారు. అదే ఫేస్‌బుక్‌ను 22 నిమిషాల 8 సెకన్లు, స్నాప్‌చాట్‌ను 18 నిమిషాల 7 సెకన్లు మాత్రమే వినియోగిస్తున్నారు. పోకెమాన్ సిరీస్ ఇవే... 1996లో పోకెమాన్ రెడ్ అండ్ బ్లూతో ప్రారంభమైన ఈ సిరీస్ మొదలైంది. తరవాత పలు ఎడిషన్ల అనంతరం... ఈ జూలై 6న పోకెమాన్ గో విడుదలైంది. నవంబరులో పోకెమాన్ సన్ అండ్ మూన్ కూడా విడుదలకానుంది. 30కి పైగా దేశాల్లో విడుదల జూలై 6న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాల్లో విడుదలయింది. తరవాత జర్మనీ, యూకే, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్... ఇలా 30కి పైగా దేశాల్లో విడుదలయింది. శనివారంనాడు జపాన్‌లో విడుదల సందర్భంగా... మూడు నాలుగు రోజుల్లో ఇండియాలోనూ విడుదల చేస్తామని దీని సృష్టికర్త నింటెండో సంస్థ ప్రకటించింది. సర్వర్లకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతో ఒకేసారి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయలేదు. నింటెండో షేరు పరుగులు.. పోకెమాన్ సిరీస్ సృష్టికర్త జపాన్‌కు చెందిన నింటెండో. అమెరికాకు చెందిన నియాంటిక్ సహకారంతో నింటెండో ఈ గేమ్‌ను విడుదల చేసింది. జూలై 6న విడుదల చేసేనాటికి నింటెండో మార్కెట్ విలువ 20 బిలియన్ డాలర్లుగా ఉంది. కానీ షేరు పరుగులు పెట్టడంతో సంస్థ విలువ జూలై 20 నాటికి ఏకంగా 42 బిలియన్ డాలర్లకు చేరింది. అంటే... రెట్టింపుకన్నా ఎక్కువన్న మాట. ప్రస్తుతం నింటెండోకు ఈ గేమ్ ద్వారా రోజుకు 2 మిలియన్ డాలర్ల... (రూ.14 కోట్ల) ఆదాయం సమకూరుతున్నట్లు అంచనా. -
పోకెమాన్ ఆడుతుంటే కాల్చిచంపారు!
గ్వాటెమాల సిటీ: ప్రపంచవ్యాప్తంగా పిచ్చి పిచ్చిగా ఆడుతున్న ‘పోకెమాన్ గో’ వర్చువల్ రియాలిటీ మొబైల్ గేమ్ ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారణమైంది. చికిములా సిటీలో జెర్సన్ లోపెజ్ డీ లియాన్ అనే 18 ఏళ్ల యువకుడు, 17 ఏళ్ల అతడి కజిన్ బుధవారం పోకెమాన్ గేమ్ ఆడుతూ ఇంటి నుంచి రోడ్డెక్కారు. ఓ రైలు పట్టాల పక్క నుంచి వారు ఈ గేమ్ ఆడుతూ ముందుకు నడచివెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిపైన కాల్పులు జరిపారు. కాల్పుల్లో డీ లియాన్ అక్కడికక్కడే మరణించగా, ఆయన కజిన్ పిసెన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటనా స్థలంలో 20 ఖాళీ బుల్లెట్ల క్యాస్టింగ్స్ దొరికాయి. కాల్పుల సమయంలో అటుగుండా ఓ వ్యాన్ దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుండడంతో అందులోని వ్యక్తులే కాల్పులు జరిపి ఉండవచ్చని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పోకెమాన్ గో గేమ్ కారణంగా జరిగిన మొదటి క్రైమ్ ప్రపంచంలో ఇదేనని పోలీసులు వెల్లడించారు. గేమ్‌కు, వ్యక్తుల హత్యకు ఏమైనా ప్రత్యక్ష సంబంధం ఉందా? అన్న అంశంపైనా కూడా దర్యాప్తు అధికారులు దృష్టిని సారించారు.