1,42,000 మంది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(బిజీఎమ్ఐ) యూజర్లకు క్రాఫ్టన్ భారీ షాక్ ఇచ్చింది. వారం కంటే తక్కువ సమయంలోనే 142,000 మంది యూజర్ల ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది. ఈ విషయం గురుంచి క్రాఫ్టన్ సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ సంవత్సరం డిసెంబర్ 6 - డిసెంబర్ 12 మధ్య కాలంలో అనుమానం గల ఖాతాలను తనికి చేసి శాశ్వతంగా నీషేదించినట్లు తెలిపింది. యాప్ డెవలపర్ ఈ నిషేధిత ఖాతాల జాబితాను పేర్లతో సహ ప్రచురించింది. అనుమతి లేకున్నా హ్యాకింగ్ చేసి ఇతర లెవెల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆడటంతో ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది.
గత నెలలో, నవంబర్ 17 నుంచి నవంబర్ 23 మధ్య కాలంలో 157,000కు పైగా ఖాతాలను బిజీఎమ్ఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అనధికారిక ఛానల్స్ నుంచి గేమ్ డౌన్ లోడ్ చేసుకోవడం, చట్టవిరుద్ధమైన సహాయక కార్యక్రమాన్ని ఇన్ స్టాల్ చేయడం వంటి ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తిస్తే క్రాఫ్టన్ ఆటగాళ్లకు నోటీసు పంపుతుంది. బీజీఎంఐ పేరుతో చీటింగ్ చేసే వాళ్లపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించింది. ఇందుకోసం క్రాఫ్టన్ సంస్థ చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment