కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆన్‌లైన్ మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్‌వర్డ్ షేర్ చేయలేదని ఓ యువకున్ని అతని స్నేహితులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చి అడవిలో పడేశారు. యువకుడి తల్లి ఫిర్యాదుతో ఈ భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాపాయి దాస్ (18) గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో తల్లి పూర్ణిమా దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పాపాయి దాస్ మృతదేహం జనవరి 15న అడవి సమీపంలో లభ్యమైంది. హత్యకు గల కారణాలను అన్వేషిస్తూ యువకుని స్నేహితులను విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ గేమ్ (ఫ్రీ ఫైర్) పాస్‌వర్డ్ ఇవ్వనందుకు నలుగురు స్నేహితులు కలిసి యువకున్ని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన నలుగురు మైనర్ స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా జువైనల్ కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదీ చదవండి: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. ఐదుగురు పౌరులు మృతి
Comments
Please login to add a commentAdd a comment