Battlegrounds Mobile India
-
బీజీఎంఐ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. త్వరలోనే
10 నెలల సస్పెన్షన్ తర్వాత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఈ నెల 29న భారత్‌లో పునఃప్రారంభం కానుంది. గేమర్స్ ఆడేందుకు వీలుగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో లభ్యం కానుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెక్యూరిటీ మార్పులు చేసిన తర్వాత గేమ్‌కు మూడు నెలల ట్రయల్‌కు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్లోడ్ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది. ఈ సందర్భంగా బీజీఎంఐ ఇప్పుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. వినియోగదారులకు గేమ్‌ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని’ అని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ సోహ్న్ తెలిపారు. -
మళ్లీ భారత్‌లోకి రీ ఎంట్రీ కోసం ఆరాటం, టిక్‌టాక్ సరికొత్త వ్యూహం!
టిక్‌టాక్ యూజర్లకు శుభవార్త. దేశ భద్రత దృష్ట్యా భారత కేంద్ర ప్రభుత్వం జున్ 2020లో టిక్‌టాక్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడా ఆ యాప్ తిరిగి భారత్‌లో తన కార్యకలాపాల్ని కొనసాగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టిక్‌టాక్ పరిచయం అక్కర్లేని పేరు. చైనాకి చెందిన బైట్ డ్యాన్స్ సంస్థ తయారు చేసిన ఈ యాప్ ప్రపంచ దేశాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారత్ - చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. దీంతో భారత్‌లో చైనా వస్తువులు,యాప్స్‌పై నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతూ వచ్చింది. దీంతో కేంద్రం దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో టిక్‌టాక్ యాప్ కూడా ఉంది. అయితే భారత్‌లో టిక్ టాక్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బైట్ డ్యాన్స్ సంస్థ దేశీయ సంస్థలతో పలు మార్లు చర్చులు జరిపింది. ఆ ప్రయత్నాల్ని విఫలమయ్యాయి. ఈ తరుణంలో బైట్ డ్యాన్స్ సంస్థ భారత్‌లో టిక్‌టాక్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ముంబైకి చెందిన గేమింగ్ సంస్థ స్కైస్పోర్ట్స్‌తో, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ హీరా నందిని గ్రూప్‌కు చెందిన పేరెంట్ సంస్థ యోటా ఇన్ ఫ్రాస్టక్చర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమతో బైట్‌డ్యాన్స్ సంప్రదింపులు జరుపుతుందన్నారు. ఆ చర్చలు జరుగుతున్నాయని..త్వరలో టిక్‌టాక్‌ను వినియోగంలోకి తెస్తామని స్కై స్పోర్ట్స్ సీఈవో శివ నంది తెలిపారు. దీంతో పాటు బీజీఎంఐ సైతం గేమింగ్ ప్రియులు వినియోగించే అవకాశం త్వరలో రానుందని ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీస్‌లో వెల్లడించారు. భారత్‌లో బీజీఎంఐపై బ్యాన్ విధించడంపై శివ నంది స్పందించారు. బీజీఎంఐను నిషేధించాలని కేంద్రం అనుకోకుండా నిర్ణయం తీసుకోలేదని, ఇందుకోసం సుమారు 5నెలల సమయం తీసుకుందన్నారు. కేంద్రం నిర్ణయంపై బీజీఎంఐ మాతృ సంస్థ క్రాఫ్టన్‌కు నోటీసులు అందించినట్లు చెప్పారు. టిక్‌టాక్‌తో పాటు బీజీఎంఐని వినియోగించే అవకాశం త్వరలో రానుంది. కేంద్రం బీజీఎంపై శాశ్వతంగా బ్యాన్ చేయలేదని.. తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
బీజీఎంఐ గేమ్ ఆడి రూ.12.5 లక్షలు గెలుచుకున్న కుర్రాళ్లు..!
ముంబై: భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీ మీడియాటెక్‌తో కలిసి రిలయన్స్ జియో ప్రత్యేకంగా అత్యంత ప్రజాదరణ పొందిన బీజీఎంఐ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఈ బీజీఎంఐ గేమింగ్ మాస్టర్స్ టోర్నమెంట్ రూ.12.5 లక్షల ప్రైజ్ పూల్తో అక్టోబర్ 30, 2021న ప్రారంభమయ్యింది. అయితే, టోర్నమెంట్‌కు దేశంలోని బీజీఎంఐ కమ్యూనిటీ నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చినట్లు సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చాయని పేర్కొంది. టోర్నమెంట్లో పాల్గొన్న సాధారణ గేమర్లు, ఔత్సాహిక ప్లేయర్లు మధ్య తీవ్రంగా పోటీ ఏర్పడినట్లు సంస్థ తెలిపింది. చివరకు టోర్నమెంట్లో బీజీఎంఐ గేమింగ్ మాస్టర్స్ విజేతలుగా మాయావీ టీమ్ నిలచింది. ఈ ఎస్పోర్ట్స్ టోర్నమెంట్ 9 జనవరి 2022న ముగిసింది. ఈ ఫైనల్ టోర్నమెంట్‌ను మిలియన్ల మంది వీక్షకులు యూట్యూబ్ ద్వారా చూశారు. (చదవండి: జియో యూజర్లకు రెండు రోజులు ఉచితంగా కాల్స్, డేటా!) -
బిజీఎమ్ఐ మొనగాళ్లకు భారీ షాక్ ఇచ్చిన క్రాఫ్టన్..!
1,42,000 మంది బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(బిజీఎమ్ఐ) యూజర్లకు క్రాఫ్టన్ భారీ షాక్ ఇచ్చింది. వారం కంటే తక్కువ సమయంలోనే 142,000 మంది యూజర్ల ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది. ఈ విషయం గురుంచి క్రాఫ్టన్ సంస్థ తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ సంవత్సరం డిసెంబర్ 6 - డిసెంబర్ 12 మధ్య కాలంలో అనుమానం గల ఖాతాలను తనికి చేసి శాశ్వతంగా నీషేదించినట్లు తెలిపింది. యాప్ డెవలపర్ ఈ నిషేధిత ఖాతాల జాబితాను పేర్లతో సహ ప్రచురించింది. అనుమతి లేకున్నా హ్యాకింగ్ చేసి ఇతర లెవెల్ బ్యాటిల్ రాయల్ గేమ్ ఆడటంతో ఖాతాలను నిషేదించినట్లు తెలిపింది. గత నెలలో, నవంబర్ 17 నుంచి నవంబర్ 23 మధ్య కాలంలో 157,000కు పైగా ఖాతాలను బిజీఎమ్ఐ నిషేదం విధించిన సంగతి తెలిసిందే. అనధికారిక ఛానల్స్ నుంచి గేమ్ డౌన్ లోడ్ చేసుకోవడం, చట్టవిరుద్ధమైన సహాయక కార్యక్రమాన్ని ఇన్ స్టాల్ చేయడం వంటి ఏదైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తిస్తే క్రాఫ్టన్ ఆటగాళ్లకు నోటీసు పంపుతుంది. బీజీఎంఐ పేరుతో చీటింగ్ చేసే వాళ్లపై సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించింది. ఇందుకోసం క్రాఫ్టన్ సంస్థ చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. (చదవండి: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..!) -
2021 భారత్‌లో నిలిచిన బెస్ట్ యాప్స్ ఇవే..!
Google Best Android Apps, Games of 2021 in India: స్మార్ట్‌ఫోన్..! ఏ ముహుర్తాన వచ్చిందో కానీ...అది లేకుండా బతకలేకపోయే రోజులు వచ్చాయి. లేవడంతోనే వాట్సాప్, ఫేస్బుక్, జీ మెయిల్ ఇలా రకరకాల యాప్స్‌కు వచ్చే నోటిఫికేషన్స్‌ను చూసుకోవడం మన దినచర్యగా మారిపోయింది. మనకు ఉపయోగపడే యాప్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసుకుంటూ వాటి సేవలను పొందుతాం. మనం వాడుతున్న యాప్స్‌లో బెస్ట్ యాప్ ఏదంటే చెప్పడం కాస్త కష్టం. కాగా ప్రతి ఏడాది అత్యంత ఆదరణను పొందిన యాప్స్ లిస్ట్‌ను గూగుల్ ప్లే స్టోర్ రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఆయా కేటగిరీలో బెస్ట్ యాప్స్‌గా నిలిచిన వాటికి అవార్డులను కూడా అందజేస్తుంది. 2021గాను ఇండియాలో బెస్ట్ యాప్స్ లిస్ట్‌ను గూగుల్ ప్లే స్టోర్ రిలీజ్ చేసింది. 2021గాను భారత్‌లో బెస్ట్ యాప్‌గా ‘బిట్‌క్లాస్’ నిలిచిందని గూగుల్ ప్రకటించింది. బెస్ట్ గేమ్ కేటగిరీలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ అంతేకాకుండా గేమ్స్, ఫన్, వ్యక్తిగత వృద్ధి, రోజువారి అవసరాలను తీర్చే కేటగిరీలో బెస్ట్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ ప్రకటించింది. వినోదాన్ని పంచే బెస్ట్ యాప్స్ ఫ్రంట్‌రో క్లబ్‌హౌస్: సోషల్ ఆడియో యాప్ హాట్స్టెప్ రోజువారి అవసరాలకోసం వాడే బెస్ట్ యాప్స్ సోర్టిజీ - వంటకాలు, మీల్ ప్లానర్ & కిరాణా జాబితాలు అందిస్తోంది. సర్వ - యోగా & ధ్యానం ట్రూకాలర్ పర్సనల్గ్రోత్ ఉత్తమ యాప్‌లు బిట్‌క్లాస్ (Bitclass) ఎంబైబ్: లెర్నింగ్ అవుట్‌కమ్స్ యాప్ ఏవాల్వ్: ధ్యానాలు, స్వీయ సంరక్షణ & బ్రీతింగ్ థెరపీ యాప్ బెస్ట్ కాంపిటిటీవ్ గేమింగ్ యాప్స్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సమ్మనర్స్ వార్: లాస్ట్ సెంచూరియా మార్వెల్ ఫ్యూచర్ రివల్యూషన్ పోకీమాన్ యునైట్ సస్పెక్ట్: మిస్టరీ మాన్షన్ చదవండి: సగం మైక్రోసాఫ్ట్ షేర్లు అమ్మేసుకున్న సత్య నాదెళ్ల, కారణం ఏంటంటే.. -
పబ్జీ మొనగాళ్లకు షాక్..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్ అవుతాయ్..!
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మనదేశంలో దేశ భద్రత కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం ఆ గేమ్‌ను బ్యాన్ చేసింది. దీంతో ఆ గేమ్ మాతృసంస్థ దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ 'బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' (బీజీఎంఐ) గేమ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత్‌లో 40 రోజుల వ్యవధిలో 25 లక్షల అకౌంట్లను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా నిషేధించినట్లు బీజీఎంఐ క్రాఫ్టన్ తెలిపింది. లక్షల్లో అకౌంట్లు బ్లాక్ వరల్డ్ వైడ్ పబ్జీ గేమ్ క్రేజ్ కొనసాగుతుంది. రెవెన్యూ పరంగా ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా 197 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఇంత క్రేజ్ సంపాదించుకున్న గేమ్‌లో మోసాలు పెరిగిపోతున్నాయి. అందుకే క్రాఫ్టన్ సంస్థ సెప్టెంబర్‌లో 1,40,000, అక్టోబర్‌లో 88వేల అకౌంట్లను బ్లాక్ చేసింది. అక్టోబర్ 1నుంచి నవంబర్ 10 మధ్యకాలంలో ఖచ్చితంగా 25,19,262 గేమ్ అకౌంట్లను శాస్వతంగా, 7,06,319 అకౌంట్లను తాత్కాలికంగా నిషేదం విధించినట్లు క్రాఫ్టన్ సంస్థ ఓ రిపోర్ట్ విడుదల చేసింది. బీజీఎంఐ పేరుతో చీటింగ్ చేసే వాళ్లపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాన్ పై సందిగ్ధత గేమ్ పేరుతో చీటింగ్ చేసే అకౌంట్లను బ్యాన్ చేసే అంశంపై సందిగ్ధత నెలకొందని గేమ్ డెవలపర్ ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. కానీ మోసాలు పెరిగిపోవడంతో అకౌంట్లను బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక్కసారి పూర్తిస్థాయిలో నిషేదం విధిస్తే.. తిరిగి దాన్ని కొనసాగించే అవకాశం లేదని వెల్లడించారు. ఇందుకోసం క్రాఫ్టన్ సంస్థ చీట్ డిటెక్షన్, బ్యానింగ్ మెకానిజం పేరుతో వ్యవస్థను బిల్డ్ చేసింది. ఆ రెండింటి ద్వారానే చీటింగ్ చేసే అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. చదవండి: నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ఇండియన్ గేమర్! -
సినిమా థియేటర్స్‌లో బ్యాటిల్ గ్రౌండ్
న్యూఢిల్లీ: గేమ్స్‌కి సంబంధించి లైవ్ టోర్నమెంట్లను థియేటర్లలో వెండి తెరపై ప్రదర్శించే దిశగా ఈ–స్పోర్ట్స్ కంపెనీ నాడ్విన్ గేమింగ్‌తో జట్టు కట్టినట్లు థియేటర్ల చెయిన్ పీవీఆర్ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్, ఇండోర్ వంటి నాలుగు నగరాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఆఫ్ స్ట్రాటజీ కమల్ జ్ఞాన్చందాని తెలిపారు. సిల్వర్ స్క్రీన్‌పై ఈ మధ్య ప్రాచుర్యం పొందిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) కాంపిటీషన్‌ను ఆయా నగరాల్లోని థియేటర్లలో లైవ్‌గా చూపించనున్నట్లు వివరించారు. గేమర్లు ప్రారంభ రౌండ్లను మొబైల్లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తదుపరి క్వార్టర్, సెమీస్, ఫైనల్స్‌ను సినిమా హాళ్లలో ప్రదర్శిస్తామని కమల్ వివరించారు. అక్టోబరు 7న తొలి రౌండు చాంపియన్‌షిప్ అక్టోబర్ 7న గురుగ్రామ్‌లోని పీవీఆర్ యాంబియన్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో ప్లేయర్లు తమ ఫోన్లు లేదా చేతి పరికరాల్లో ఆడే గేమ్‌ను వెండి తెరపై ప్రదర్శిస్తామని .. అదనంగా కామెంటరీ, గ్రాఫిక్స్, చర్చలు వంటి హంగులన్నీ కూడా ఉంటాయని కమల్ పేర్కొన్నారు. పీవీఆర్‌కు భారత్, శ్రీలంకలోని 72 నగరాల్లో 842 స్క్రీన్లు ఉన్నాయి. చదవండి : Netflix: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..! -
పబ్జీ లైట్ తరహాలో బీజీఎమ్ఐ లైట్ త్వరలోనే...!
పబ్జీ ఈ గేమ్ గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఈ గేమ్ ఆడే ఉంటారు. అయితే, ఈ గేమ్ ని దేశ భద్రత కారణాల రీత్యా మన దేశంలో నిషేదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 2న పబ్జీ స్థానంలో బీజీఎమ్ఐను క్రాఫ్టన్ తీసుకువచ్చింది. ఈ గేమ్‌ను అత్యధిక సంఖ్యలో యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. బీజీఎమ్ఐ లాంటి గేమ్స్ హై ఎండ్ ర్యామ్ ఉన్న ప్లాగ్ షిప్ ఫోన్లలో సులువుగా పనిచేస్తుంది. ర్యామ్ తక్కువగా ఉన్న బడ్జెట్ స్మార్ట్ఫోన్లలో బీజీఎమ్ఐ అంతగా సపోర్ట్ చేయదు. తరుచూ ఫోన్ హ్యగ్ అవుతోంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లను దృష్టిలో ఉంచుకొని పబ్జీ లైట్ తరహాలోనే బీజీఎమ్ఐ లైట్ గేమ్‌ను త్వరలోనే తీసుకురావాలని క్రాఫ్టన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజీఎమ్ఐ లైట్ వర్షన్‌తో అధిక సంఖ్యలో యూజర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను ముమ్మురం చేస్తోంది. కాగా లైట్ వెర్షన్ ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా తెలియలేదు. చదవండి: ఎస్బీఐ కార్డ్ యూజర్లకు బంపర్ ఆఫర్! -
బీజీఎంఐ నుంచి మరో అప్డేట్, హింట్ ఇచ్చేసిందిగా..!
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) ఐఓఎస్ వెర్షన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ హింట్ ఇచ్చింది.కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావడం, ఆన్ లైన్ క్లాసుల కారణంగా గాడ్జెట్స్‌ల వినియోగం పెరగడంతో బీజీఎంఐ గేమ్ ఆడేవారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆ యూజర్ల సంఖ్యను మరింత పెంచేందుకు ఐఓఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు బీజీఎంఐ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 2న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా విడుదలైన వారం వ్యవధిలోనే ఈ గేమ్‌ను 30 మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు వారి సంఖ్య 48మిలియన్ల డౌన్లోడ్లను దాటగా..49, 50 మిలియన్ల డౌన్ లోడ్సే టార్గెట్‌గా ఐఓఎస్ వెర్షన్‌ను ఆగస్ట్ 20న విడుదల చేసేలా హింట్ ఇచ్చినట్లు ఇన్సైడర్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఉన్న ఈ గేమ్ ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటు యూజర్లకు ప్రత్యేకంగా రివార్డ్‌లను ప్రకటించింది. క్రాఫ్టన్ నిర్వహించనున్న ఈవెంట్లో ఆండ్రాయిడ్ యూజర్లు పాల్గొని ఈ రివార్డ్‌లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.48 మిలియన్ల డౌన్లోడ్లకు చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ సప్లై కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3, 49 మిలియన్ డౌన్లోడ్లతో క్లాసిక్ కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3 రివార్డ్, 50 మిలియన్ డౌన్లోడ్లను చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ పర్మినెంట్ గెలాక్సీ మెసెంజర్ సెట్ ఎక్స్ 1 రివార్డ్ ను అందించనుంది. ఈ రివార్డులు ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనున్నాయి. -
పబ్జీ ఆడి కోటి గెలుచుకోండి, టెస్లా కార్లలో తిరగండి
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమింగ్ లవర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ -2021 పేరుతో గేమ్ సిరీస్ ను నిర్వహించనుంది. ఈ గేమ్‌లో గెలిచిన గేమర్స్‌కు రూ.కోటి పాటు ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెస్లా నడిపే ఆఫర్‌ను అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సంస్థ క్రాఫ్టన్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో సంప్రదింపులు జరిపింది. ఇక మూడు నెలల పాటు జరిగే ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు సంబంధించి జులై 19 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు క్రాఫ్టన్ ఇండియా తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటగాళ్లు గేమ్ క్వాలిఫైర్ , ఆన్ లైన్ క్వాలిఫైర్, క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ , గ్రాండ్ ఫైనల్స్ ఇలా ఐదు రౌండ్లు కంప్లీట్ చేయాలి. ఎన్ని రౌండ్ల గేమ్ ఆడాలి తొలి రౌండ్ గేమ్ క్వాలిఫైర్ గేమ్ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 8వరకు ఆన్ లైన్ క్వాలిఫైర్ ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 12 వరకు క్వార్టర్ ఫైనల్ సెప్టెంబర్ 16నుంచి సెప్టెంబర్ 26 వరకు గ్రాండ్ ఫైనల్స్ అక్టోబర్ 7నుంచి అక్టోబర్ 10 వరకు జరగనుంది. మొత్తం తొమ్మిది రౌండ్లలో జరిగే గేమ్‌కు ఒక్కో రౌండ్ కు ఫ్రైజ్‌ను అనౌన్స్ చేసింది. 1-ఫ్రైజ్ - రూ.50లక్షలు 2-ఫ్రైజ్- రూ. 25లక్షలు 3-ఫ్రైజ్- రూ. 10లక్షలు 4-ఫ్రైజ్ - రూ. 3లక్షలు 5-ప్రైజ్ - రూ. 2లక్షలు 6-ఫ్రైజ్ - రూ.1లక్షా యాబైవేలు 7-ఫ్రైజ్ -రూ.లక్ష రూపాయలు 8-ప్రైజ్ -రూ. 90వేలు 9-ప్రైజ్ రూ.80వేల మనీని సొంతం చేసుకోవచ్చని బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రకటించింది. చదవండి: మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా? -
BGMI గేమ్ యూజర్ల డేటా భద్రతపై క్రాఫ్టన్ క్లారిటీ
కేంద్రం గత ఏడాది దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 256 యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇందులో చైనా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ కూడా ఉంది. వాస్తవానికి పబ్జీ చైనాది కాదు. సౌత్ కొరియాకు చెందిన యాప్. ఈ పేటెంట్ రైట్స్ ను చైనా టెన్సెంట్ సంస్థ దక్కించుకొని దాని కార్యకలాపాల్ని నిర్వ హిస్తుంది. వివిధ దేశాల్లో గేమ్‌ను రిలీజ్ చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంది. గత ఏడాది నిషేదం తర్వాత కొద్ది రోజుల క్రితమే సౌత్ కొరియాకు చెందిన క్రాఫ్టన్ సంస్థ పబ్జీ గేమ్‌ను కాస్తా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్పులు చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ డేటాను ఈ చైనా సంస్థ ముంబై, సింగపూర్ సర్వర్లలో భద్రపరుస్తుంది. ఇప్పుడు విడుదలైన బీజీఎంఐ వినియోగదారుల డేటా ముంబైలో ఉన్న సర్వర్ ల నుంచి అక్రమంగా చైనాలో ఉన్న సంస్థ సర్వర్లలోకి వెళ్లినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై క్రాఫ్టన్ స్పందించింది. ప్రస్తుత బీజీఎంఐ యూజర్ల డేటాను చైనా సర్వర్లలో నిల్వ చేస్తున్నట్లు క్రాఫ్టన్ ఒప్పుకుంది. అయితే, ఇతర మొబైల్ యాప్స్, గేమ్స్ మాదిరిగానే ఈ గేమ్‌కు యూనిక్ ఫీచర్ల కోసం థర్డ్ పార్టీ సేవలను వినియోగించుకుంటున్నామని అందుకోసమే గేమ్‌కు సంబంధించిన డేటాను వారికి షేర్ చేయాల్సి వచ్చింది. అయితే కొత్తగా తీసుకొచ్చిన క్రాఫ్టన్ ప్రైవసీ పాలసీ పూర్తిగా యూజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్లేయర్ల డేటా నిర్వహణ, రక్షణకు కట్టుబడి ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్ చైనీస్ సర్వర్లకు యూజర్ల డేటా బదిలీ కాకుండా నిరోధిస్తుందని క్రాఫ్టన్ పేర్కొంది. చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్ -
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి!
పబ్జీ..! అదేనండీ మనదేశంలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో విడుదలైన ఈ గేమ్‌పై మరో వివాదం తలెత్తింది. ఈ గేమ్‌ను ఆడేందుకు లాగిన్ అయిన ఇండియన్ యూజర్ల డేటా చైనా సర్వర్లలోకి వెళ్లిందనే ఆధారాలు కలకలం రేపుతున్నాయి. దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 116 యాప్స్‌పై కేంద్రం గతేడాది సెప్టెంబర్ 16న నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిలో చైనా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ కూడా ఉంది. వాస్తవానికి పబ్జీ చైనాది కాదు. సౌత్ కొరియాకు చెందిన యాప్. ఈ పేటెంట్ రైట్స్ ను చైనా టెన్సెంట్ సంస్థ దక్కించుకొని దాని కార్యకలాపాల్ని నిర్వ హిస్తుంది. వివిధ దేశాల్లో గేమ్‌ను రిలీజ్ చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంది. కానీ బోర్డర్లో భారత్ పై కాలు దువ్విన చైనాకు చెక్ పెట్టేందుకు.. కేంద్రం చైనా యాప్స్ పై నిషేధం విధించింది. నిషేదంతో పబ్జీ మాతృసంస్థ సౌత్ కొరియాకు చెందిన క్రాఫ్టన్ సంస్థ పబ్జీ గేమ్‌ను కాస్తా బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా మార్పులు చేసి మార్కెట్ లో విడుదల చేసింది. ఐజీఎన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. చైనా సంస్థ ముంబై కేంద్రంగా సర్వర్లను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు విడుదలైన బీజీఎంఐ వినియోగదారుల డేటా ముంబైలో ఉన్న సర్వర్ లనుంచి నుంచి అక్రమంగా చైనాలో ఉన్న సంస్థ సర్వర్లలోకి వెళ్లినట్లు పేర్కొంది. అందుకు సంబంధించిన ఆధారాల్ని విడుదల చేసింది. అయితే ఈ డేటా వ్యవహారంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురావడం లేదని, భారతీయుల డేటాను దొంగతనం చేసి సర్వర్లలోకి పంపుకోవడం ఎంత దారుణం అని ఒకరు కామెంట్ చేస్తుంటే .. చైనా ఉత్పత్తులపై బ్యాన్ విధించాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
Review: అదరగొట్టిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్(పబ్జీ)
గేమింగ్ ప్రియులకు పబ్జీ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై పబ్జీ అంటూ వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పబ్జీ మన దేశంలో యువతను బాగా అతుక్కుపోయేలా చేసుకున్న గేమ్. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత కారణాల రీత్యా బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. బ్యాన్ విధించినప్పటికీ వీపీఎన్ సౌలత్‌తో ఇంకా ఆడుతూనే ఉన్నారు. అయితే, పబ్జీ మరో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా పేరుతో అనేక ఆటంకాలు దాటుకొని జూన్ 18న విడుదల అయ్యింది. అయితే, దశల వారీగా ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఎంతో మంది గేమింగ్ ప్రియులు చాలా కాలం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. దీంతో ఇప్పుడు వచ్చిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ ఎలా ఉంది? పబ్జీ మించి ఉంటుందా? లేక అప్పటి లాగే ఉంటుందా? అని ఆతృతతో ఉన్నారు. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సైజ్ వచ్చేసి 700 ఎంబీ, అదనపు డేటా 1.77జీబీ. కాబట్టి, మీ స్మార్ట్ ఫోన్ లో మీకు అంత స్థలం ఉంటేనే ఇన్స్టాల్ అవుతుంది. చిరాకు తెప్పిస్తున్న హెచ్చరికలు క్రాఫ్ట్టన్ సెటప్ ప్రక్రియను చాలా ఎక్కువగా ఉంది. ఇది వాస్తవానికి గేమర్ల గోప్యత గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్లు చూపిస్తుంది కానీ, వాస్తవానికి అదేమీ ఉండదు. ఉదా: మీరు 18 సంవత్సరాల కంటే పెద్దవారా లేదా అని మిమ్మల్ని అడుగుతుంది. అయితే, ఇందులో దానిని ధృవీకరించడానికి ఇన్ గేమ్ ప్రక్రియ అంటూ ఏమి లేదు. అదేవిధంగా, గేమ్ అడుతున్నప్పుడు రెగ్యులర్ ఆడియో హెచ్చరికలు వస్తున్నాయి. అది మీకు చాలా చిరాకు, కోపం తెప్పిస్తుంది. మీరు గేమ్ ఆడటం ప్రారంభించిన తర్వాత, అదే స్వరంతో ఎక్కువ గంటలు ఆడకూడదని మీకు గుర్తు చేస్తుంది. మీరు మ్యాచ్ ప్రారంభించిన ప్రతిసారీ ఇలానే జరుగుతుంది. ఆటగాళ్ళు ఒక నిర్దిష్ట సమయం ఆడిన తర్వాత ఈ హెచ్చరికలు వస్తే బాగుండేది. ప్లేయర్ డేటాను బదిలీ చేయవచ్చు ఇందులో మంచి విషయం ఏమిటంటే, మీరు పాత ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లే ఖాతా ద్వారా లాగిన్ అయితే డేటాను పబ్జీ నుంచి బదిలీ చేసుకోవచ్చు. ఈ గేమ్ ఇప్పుడు అల్ట్రా హెచ్ డీ, యుహెచ్ డీతో సహా చాలా గ్రాఫిక్స్ ఆప్షన్ ని అందిస్తుంది. నేను రెండు సార్లు గేమ్ ఆడిన రెండు సందర్భాలలో వెయిటింగ్ రూమ్ 45 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదు. అదే సాధారణంగా కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ అయితే మొబైల్ లో 70 నుంచి 90 సెకన్ల మధ్య ఉంటుంది. సుపరిచితమైన గేమ్ ప్లే గేమ్ ప్లే విషయానికి వస్తే, లొకేషన్ లు, గ్రాఫిక్స్ మొత్తం పబ్జీ మొబైల్ తరహాలోనే ఉంటుంది. మ్యాప్ కూడా పబ్జీ తరహాలోనే ఉంటుంది. దీనిలో భారతదేశంలోని నిర్ధిష్ట లొకేషన్ లు లేవు. ఇందులో మొదటి ప్రధాన మార్పు ఏమిటంటే గేమ్ లో ఎరుపుకు బదులుగా ఆకుపచ్చ రంగులో రక్తాన్ని చూపిస్తుంది. రంగులను మార్చుకోవచ్చు కానీ, ఎరుపు మాత్రం కాదు. అలాగే, ఆటగాళ్లు కాల్చినప్పుడు రక్తానికి బదులుగా ఆకుపచ్చ రంగులో చూపిస్తుంది. అలాగే, మీరు ఒక ఆటగాడిని కోల్పోతే, 'కిల్'కు బదులుగా పూర్తయింది అని వస్తుంది. ఈ గేమ్ ఆట టెన్సెంట్ వెర్షన్ నుంచి క్రాఫ్ట్టన్ తనను తాను వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. నేను ఎంఐ 11 అల్ట్రాలో ఈ గేమ్ అడినప్పుడు ఎటువంటి అంతరాయం కలగలేదు. మొత్తానికి మాత్రం మనం పబ్జీ గేమ్ ఆడిన అనుభూతి మాత్రమే వస్తుంది. వేరే గేమ్ ఆడిన అనుభూతి రాదు. మీరు ఈ గేమ్ అడినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ క్రింద కామెంట్ చేయండి. చదవండి: రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త! -
పబ్జీ లవర్స్‌కు మరో షాక్, ఊపందుకున్న బ్యాన్ డిమాండ్
సాక్షి,వెబ్‌డెస్క్:పబ్జీ గేమింగ్ ప్రియులకు షాక్ తప్పదా? ఆ గేమ్‌కు అదిలోనే హంసపాదు ఎదురు కానుందా?పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పేరుతో విడుదల కానున్న..ఈ గేమ్ అసలు విడుదలవుతుందా? విడుదలైన ఎంతవరకు మనుగడ సాధిస్తుందనేది తాజా పరిణామాలతో ప్రశ్నార్ధకంగా మారింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమాచార సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాధ్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్జీ గేమ్, క్రాఫ్టన్ సంస్థకు చెందిన బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. తాజాగా సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ కు వివిధ పార్టీల నేతలు కలిశారు. చైనా గేమ్‌పై నిషేదం విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరుణంలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా "భారత సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు, యువ తరాలకు హానికరం. గతేడాది నిషేదించిన పబ్జీ ఇప్పుడు భారత చట్టాల్ని అధిగమించి దొడ్డిదారిన ఎంట్రీ ఇస్తోందని ప్రవీణ్ ఖండేల్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన స్టైల్లో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేయాలని నాడు కేంద్రానికి లేఖ రాసిన అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ నుంచి తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ పాటు పలు పార్టీల నేతలు బీజీఎంఐ గేమ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత నిబంధనల రీత్యా ప్రభుత్వం క్రాఫ్టన్ గేమ్ బ్యాన్ అంశాన్ని పట్టించుకునే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే..? క్రాఫ్టన్‌కు చెందిన ఈ గేమ్‌పై నిషేధం విధిస్తారా? లేదా అనే అంశంపై పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్టీఐ చట్టం కింద అడిగారు. అందుకు ప్రభుత్వం బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్‌ను ముందస్తుగా నిషేధించలేమని ధృవీకరించింది. అదే సమయంలో క్రాఫ్టన్ సంస్థ దక్షిణ కొరియాలోని సియోల్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులతో గేమ్ ప్రారంభంపై చర్చించారు. ఒప్పందం ప్రకారం 100మిలియన్ల పెట్టుబడి పెట్టారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ గేమ్ తాజా పరిణాలతో విడుదలవుతుందా? నిషేదానికి గురవుతుందా? అనేది కాలమనే నిర్ణయించాలి. చదవండి: BGMI ఆడాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే, లేదంటే బ్లాక్ చేస్తారు -
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా విడుదలకు లైన్ క్లియర్
న్యూఢిల్లీ: పబ్జీకి చెందిన త్వరలో లాంచ్ కానున్న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ యాప్ నిషేధం విషయంలో కేంద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాను భారత్ లో విడుదల కాకముందే తాము నిషేదించలేమని జెఎన్‌యులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ గౌరవ్ త్యాగి అనే విమర్శకుడు ఇటీవల దాఖలు చేసిన ఆర్టీఐకి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ నిబంధనల ప్రకారం విడుదల తర్వాత మాత్రమే ఈ ఆటను నిషేదించే అవకాశం ఉంటుంది అని చెప్పింది. డాక్టర్ గౌరవ్ త్యాగి దాఖలు చేసిన ఆర్టీఐపై స్పందిస్తూ ఐటి మంత్రిత్వ శాఖ.. "భారతదేశంలో పబ్జీ లేదా ఏదైనా కంపెనీ/మొబైల్ యాప్ ప్రవేశానికి అనుమతి ఇవ్వడంలో ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఎటువంటి అధికారులు లేవు" అని పేర్కొంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో.. "హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ యాప్ విడుదలకు అనుమతి ఇవ్వదు. భారతదేశం సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, రక్షణ విషయంలో నిబందనలు పాటించకపోతే మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69ఎ, ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా మొబైల్ యాప్ ను నిషేదించే అవకాశం ఉంటుంది" అని తెలిపింది. ఈ గేమ్ ను భారతదేశంలోకి క్రాఫ్టన్ తీసుకొస్తుంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా మే 18 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులకు ఆహ్వానించింది. ఈ నెల 18న గేమ్ విడుదల అవుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే, విడుదల విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెల్లడించలేదు. As part of my research on predatory practise of Chinese companies in India and it's impact on National Security, had filed an RTI about the relaunch of PUBG Mobile in India by Krafton (in which the Chinese behemoth has the second largest stake). pic.twitter.com/WL5rkThdOb — Dr Gaurav Tyagi (@drtyagigaurav) June 13, 2021 చదవండి: గుడ్ న్యూస్: టీవీఎస్ అపాచీ బైక్ పై భారీ ఆఫర్