
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమింగ్ లవర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ -2021 పేరుతో గేమ్ సిరీస్ ను నిర్వహించనుంది. ఈ గేమ్‌లో గెలిచిన గేమర్స్‌కు రూ.కోటి పాటు ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెస్లా నడిపే ఆఫర్‌ను అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సంస్థ క్రాఫ్టన్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో సంప్రదింపులు జరిపింది.
ఇక మూడు నెలల పాటు జరిగే ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు సంబంధించి జులై 19 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు క్రాఫ్టన్ ఇండియా తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటగాళ్లు గేమ్ క్వాలిఫైర్ , ఆన్ లైన్ క్వాలిఫైర్, క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ , గ్రాండ్ ఫైనల్స్ ఇలా ఐదు రౌండ్లు కంప్లీట్ చేయాలి.
ఎన్ని రౌండ‍్ల గేమ్ ఆడాలి
తొలి రౌండ్ గేమ్ క్వాలిఫైర్ గేమ్ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 8వరకు
ఆన్ లైన్ క్వాలిఫైర్ ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 12 వరకు
క్వార్టర్ ఫైనల్ సెప్టెంబర్ 16నుంచి సెప్టెంబర్ 26 వరకు
గ్రాండ్ ఫైనల్స్ అక్టోబర్ 7నుంచి అక్టోబర్ 10 వరకు జరగనుంది.
మొత్తం తొమ్మిది రౌండ్లలో జరిగే గేమ్‌కు ఒక్కో రౌండ్ కు ఫ్రైజ్‌ను అనౌన్స్ చేసింది.
1-ఫ్రైజ్ - రూ.50లక్షలు
2-ఫ్రైజ్- రూ. 25లక్షలు
3-ఫ్రైజ్- రూ. 10లక్షలు
4-ఫ్రైజ్ - రూ. 3లక్షలు
5-ప్రైజ్ - రూ. 2లక్షలు
6-ఫ్రైజ్ - రూ.1లక్షా యాబైవేలు
7-ఫ్రైజ్ -రూ.లక్ష రూపాయలు
8-ప్రైజ్ -రూ. 90వేలు
9-ప్రైజ్ రూ.80వేల మనీని సొంతం చేసుకోవచ్చని బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రకటించింది.
చదవండి: మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా?
Comments
Please login to add a commentAdd a comment