India series
-
Telangana: మన కార్లపై భారత్ సిరీస్ ఎప్పుడు? దీంతో లాభలేంటి..?
సాక్షి, హైదరాబాద్: తరచూ బదిలీలతో వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్న వారి వాహనాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ సిరీస్ అమలులో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అమలులోకి తీసుకురాగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేసేందుకు నిరాకరిస్తోంది. కేంద్ర నిర్ణయంలోని కొన్ని అంశాలపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలు పెండింగులో ఉండటంతో.. ఎంతో ఉపయుక్తంగా ఉండాల్సిన భారత్ సిరీస్ రాష్ట్రంలో అసలు అమలులోకే రాకపోవటం ఇబ్బందిగా మారింది. అర్హతలుండీ ఎంతో మంది వాహనదారులు ఈ అవకా శాన్ని వినియోగించుకోలేక పోతున్నారు. అసలు భారత్ సిరీస్ అంటే? దేశవ్యాప్తంగా తరచూ బదిలీ అయి వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేయాల్సిన వాళ్లు వారి వెంట ఆయా వాహనాలను తీసుకెళ్లినప్పుడు రిజి స్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఏడాది పాటు పాత నంబర్ ప్లేట్‌తోనే ఉండే వీలున్నప్పటికీ, తర్వాత ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉంటుంది. లేని పక్షంలో అక్కడి రవాణా చట్టాల ప్రకారం పెనా ల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అలాంటి వారికి ఇబ్బంది లేకుండా, దేశవ్యాప్తంగా కామన్‌గా వినియోగించుకునేలా కేంద్ర రవాణాశాఖ భారత్ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో తెలంగాణ టీఎస్ బదులు భారత్ సిరీస్‌గా బీహెచ్ అన్న అక్షరా లుంటాయి. ముందు సంవత్సరం, తర్వాత బీహెచ్ అక్షరాలు ఆ తర్వాత 4 అంకెలు రెండు ఆంగ్ల అక్షరాలుంటాయి. ఉదా: 22బీహెచ్ 1234ఏబీ. ఇక్కడే అభ్యంతరం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, డిఫెన్స్ ఉద్యోగులు, కనీసం నాలుగు అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఈ సీరీస్ తీసుకునేందుకు అర్హులు. కొత్త వాహనం కొన్నప్పుడు డీలర్‌కు తగిన డాక్యుమెంట్లు అందించటం ద్వారా ఈ నంబర్ సీరీస్ తీసుకోవచ్చు. కారు కొన్నప్పుడు 15 ఏళ్లకు లైఫ్ ట్యాక్సు చెల్లిస్తుంటారు. ఆ కారు ధర ఆధారంగా.. రూ.5 లక్షల లోపు విలువ ఉన్నవాటికి 3%, రూ.5 – 10 లక్షల మధ్య ఉన్నవాటికి 14%, రూ.10 లక్షలు– రూ.20 లక్షల మధ్య ఉన్న వాటికి 17%, రూ.20 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాటికి 18% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డీజిల్ కారు అయితే దానికి 2% ఎక్కువగా, బ్యాటరీ కారు అయితే దానికి 2% తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అదే భారత్ సిరీస్ తీసుకుంటే, ఒకేసారి ఆ రోడ్ ట్యాక్స్ మొత్తం చెల్లించకుండా, ఆ మొత్తాన్ని రెండేళ్ల చొప్పున భాగాలుగా చేసి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పన్ను మొత్తాన్ని రాష్ట్రాలు విధిస్తున్న దానితో సంబంధం లేకుండా కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా నిర్ధారించింది. రూ.10 లక్షల లోపు విలువ ఉన్న కారుకు 8 శాతం, రూ.10 లక్షలు– రూ.20 లక్షల మధ్య విలువ ఉన్న కారుకు 10 శాతం, రూ.20 లక్షల కంటే ఎక్కువ విలువ ఉన్న కారుకు 12% గా నిర్ధారించింది. రాష్ట్రాల అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా ఇలా పన్నుల మొత్తాన్ని కేంద్రం నిర్ధారించింది. ఇవి తెలంగాణలో విధిస్తున్న పన్నుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో తెలంగాణ ప్రభు త్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని అధికారులు చెబుతున్నారు. పన్ను చెల్లింపు ఎలా ఈ సమస్యపై కేంద్ర–రాష్ట్రప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చి పరిష్కారం దిశగా ప్రయత్నం ప్రారంభించలేదు. దీంతో భారత్ సిరీస్‌కి తెలంగాణలో ఇప్పటికీ శ్రీకారం చుట్టలేదు. ఆ సిరీస్ తీసుకున్న ఇతర ప్రాంతాల వారు జనవరి నుంచి రెండో విడత పన్ను చెల్లించాల్సి ఉంది. బదిలీ పై రాష్ట్రానికి వచ్చిన ఆ సిరీస్ ఉన్నవారు ఇక్కడ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగా ఈ సిరీస్‌కు ఆమోదం లేనందున పన్ను చెల్లింపు ఎలా అన్న సమస్య ఉత్పన్నమవుతోంది. -
పబ్జీ ఆడి కోటి గెలుచుకోండి, టెస్లా కార్లలో తిరగండి
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమింగ్ లవర్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ -2021 పేరుతో గేమ్ సిరీస్ ను నిర్వహించనుంది. ఈ గేమ్‌లో గెలిచిన గేమర్స్‌కు రూ.కోటి పాటు ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెస్లా నడిపే ఆఫర్‌ను అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సంస్థ క్రాఫ్టన్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో సంప్రదింపులు జరిపింది. ఇక మూడు నెలల పాటు జరిగే ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్‌కు సంబంధించి జులై 19 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు క్రాఫ్టన్ ఇండియా తెలిపింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటగాళ్లు గేమ్ క్వాలిఫైర్ , ఆన్ లైన్ క్వాలిఫైర్, క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ , గ్రాండ్ ఫైనల్స్ ఇలా ఐదు రౌండ్లు కంప్లీట్ చేయాలి. ఎన్ని రౌండ్ల గేమ్ ఆడాలి తొలి రౌండ్ గేమ్ క్వాలిఫైర్ గేమ్ ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 8వరకు ఆన్ లైన్ క్వాలిఫైర్ ఆగస్ట్ 17 నుంచి సెప్టెంబర్ 12 వరకు క్వార్టర్ ఫైనల్ సెప్టెంబర్ 16నుంచి సెప్టెంబర్ 26 వరకు గ్రాండ్ ఫైనల్స్ అక్టోబర్ 7నుంచి అక్టోబర్ 10 వరకు జరగనుంది. మొత్తం తొమ్మిది రౌండ్లలో జరిగే గేమ్‌కు ఒక్కో రౌండ్ కు ఫ్రైజ్‌ను అనౌన్స్ చేసింది. 1-ఫ్రైజ్ - రూ.50లక్షలు 2-ఫ్రైజ్- రూ. 25లక్షలు 3-ఫ్రైజ్- రూ. 10లక్షలు 4-ఫ్రైజ్ - రూ. 3లక్షలు 5-ప్రైజ్ - రూ. 2లక్షలు 6-ఫ్రైజ్ - రూ.1లక్షా యాబైవేలు 7-ఫ్రైజ్ -రూ.లక్ష రూపాయలు 8-ప్రైజ్ -రూ. 90వేలు 9-ప్రైజ్ రూ.80వేల మనీని సొంతం చేసుకోవచ్చని బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ప్రకటించింది. చదవండి: మాటలన్నీ ఎమోజీలుగా మారిపోతాయా? -
'ఒత్తిడిని జయించాలంటే భారత్‌తో ఆడండి'
కరాచీ: ఒత్తిడిలో కూడా చక్కటి ప్రదర్శన చేయాలంటే భారత్‌తో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్ ఆ దేశ క్రికెటర్లకు సూచించాడు. భారత్‌తో రెగ్యులర్‌గా సిరీస్‌లు ఏర్పాటు చేయాలని పీసీబీని కోరాడు. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా టూర్లను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. 'మేము ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు కష్టపడ్డాం. అయితే ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకున్నాం. ప్రస్తుత క్రికెటర్లు ఒత్తిడిలో ఆడాలంటే ఉన్న చక్కటి అవకాశం రెగ్యులర్‌గా భారత్‌తో మ్యాచ్‌లు ఆడడమే' అని వ్యాఖ్యానించాడు. భారత్-పాక్ మధ్య సిరీస్ జరిగితే చూడాలని ఉందన్నాడు. భారత్‌తో ఎక్కడ ఆడామనేది కాకుండా, రెగ్యులర్‌గా ఆడితే లాభం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తమ క్రికెట్లో ఉన్న రాజకీయాలను తట్టుకొని కూడా యూనిస్ ఖాన్ ఆటపై దృష్టిపెడుతున్నాడని మెచ్చుకున్నాడు. పాక్ తరఫున టెస్టుల్లో పది వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాలని ఆకాంక్షించాడు. -
మూడు టెస్టులకు రూ. 9 కోట్లే!
శ్రీలంక బోర్డు నిరాశ కొలంబో: భారత్‌తో సిరీస్ అంటే భారీ మొత్తంలో సొమ్ము చేసుకోవచ్చని ఆశపడిన శ్రీలంక క్రికెట్ బోర్డుకు బ్రాడ్కాస్టర్లు షాక్ ఇచ్చారు. సొంతగడ్డపై ఈ ఏడాది ఆగస్టులో జరిగే మూడు టెస్టుల సిరీస్ ప్రసార హక్కుల కోసం టెన్ స్పోర్ట్స్ కేవలం 1.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9 కోట్లు) మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క చానల్ మినహా మరెవరూ హక్కుల కోసం టెండర్ వేయలేదు. ఇదే సిరీస్‌లో సంగక్కర తన కెరీర్ చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఆరంభంలో స్టార్, సోనీ సంస్థలు ఆసక్తి చూపించినా టెండర్ మాత్రం వేయలేదు. ఇటీవల ప్రపంచకప్, ఐపీఎల్ల కారణంగా ఈ చానల్స్ బ్రాడ్‌కాస్టింగ్ బడ్జెట్ అయిపోవడంతో పాటు వర్షాలు కూడా సిరీస్‌ను దెబ్బ తీసే అవకాశం ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘భారత్‌తో ఒక్కో మ్యాచ్‌కు కనీసం 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 13 కోట్లు) అయినా వస్తాయని ఆశించాం. కానీ ఈ పరిణామం మమ్మల్ని తీవ్రంగా నిరాశపర్చింది. ఇప్పుడు కోట్ చేసిన మొత్తం చాలా చాలా తక్కువ. దీనిని పెంచమని టెన్‌స్పోర్ట్స్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తాం. లేదంటే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తాం’ అని లంక బోర్డు చైర్మన్ సిదాత్ వెట్టిముని ఆవేదనగా చెప్పారు. గత ఏడాది విండీస్ జట్టు అర్ధాంతరంగా వెనుదిరగడంతో భారత్ వచ్చి వన్డేలు ఆడిన లంకకు ప్రత్యుపకారంగా బీసీసీఐ ఈ సిరీస్ ఆడించేందుకు సిద్ధమైంది. -
మహ్మదుల్లా అవుట్
ఢాకా: భారత్‌తో సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ప్రపంచకప్‌లో సంచలనాత్మకంగా ఆడిన బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా గాయం కారణంగా స్వదేశంలో జరిగే సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతని ఎడమచేతి చూపుడు వేలుకు గాయమైంది. మూడు నుంచి నాలుగు వారాలు తను ఆటకు దూరమవుతాడని జట్టు ప్రకటించింది. మొర్తజాకు యాక్సిడెంట్: బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్ మొర్తజా రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. మిర్పూర్ స్టేడియంకు తను రిక్షా లో వెళుతుండగా... బస్ ఢీకొనడంతో కిందపడ్డాడు. భారత్‌తో వన్డే సిరీస్‌కు మొర్తజా అందుబాటులో ఉంటాడని జట్టు ప్రకటించింది.