Seema Haider-Sachin Meena's Neighbour Is Back With Fresh Rant - Sakshi
Sakshi News home page

పబ్జీ లవ్‌స్టోరీ: మిడతలా ఉంటాడు.. వాడి కోసమా? పాకిస్థాన్‌లో నిన్ను ప్రేమించేవాడే దొరకలేదా?

Published Sat, Aug 5 2023 11:32 AM | Last Updated on Sat, Aug 5 2023 11:45 AM

Seema Haider Sachin Meena Neighbour Is Back With Fresh Rant - Sakshi

గ్రేటర్ నోయిడా: 'పాకిస్తాన్ ప్రియురాలు - భారత ప్రేమికుడు'.. ఈ కథ ఆ జంట దృష్టిలో సుఖాంతమైంది కానీ లోకం దృష్టిలో మాత్రం డైలీ సీరియల్‌లా సాగుతూనే ఉంది. చట్టం ఎలాగు తన పని తాను చేసుకుంటూ పోతుంది. వచ్చిన సమస్యల్లా ఇరుగుపొరుగు వారితోనే. మొన్నామధ్య వీరి ఇంటికి పొరుగున ఉండే ఒకామె సచిన్ పైనా సీమా హైదర్ పైనా వ్యాఖ్యలు చేసి ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోనే హల్‌చల్‌ చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆ వ్యాఖ్యలతో మీమర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. తాజాగా ఆమె మరోసారి అదే అంశంపై సరికొత్త కామెంట్లతో తెరపైకి వచ్చింది.  

ఈసారైతే ఆమె ర్యాగింగ్ నెక్స్ట్ లెవెల్‌లో చేసింది... ఆ మహాతల్లికి ఒక తోడు కావాలి?  వాడు మగవాడైతే చాలు. వీడు చూస్తే ఎండిపోయి మిడత పురుగులా ఉంటాడు, బలంగా గాలి వీస్తే చాలు, ఎంత దూరం వెళ్లి పడతాడో ఎవ్వరికీ తెలియదు. మీరంతా కలిసి వెతికినా వాడిని కనుగొనలేరు. ఇక ఆమె విషయానికి వస్తే ఆవిడకి పాకిస్థాన్‌లో ఎక్కడా ప్రేమ దొరకలేదు. వీడిని ప్రేమించి నలుగురు పిల్లలతో సహా వాలిపోయిందని ఆగకుండా మాట్లాడుతూనే ఉంది. 

ఈ వీడియో కూడా మొదటి వీడియోలాగే  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కామెంట్లు చేసేవారు పాకిస్తాన్ జోడీ గురించి పక్కనబెట్టి ఈమె గురించే కామెంట్లు పెడుతున్నారు. 'ఈ మహాతల్లిని ఆ మహానుభావుడు(మహిళ భర్త) ఎలా భరిస్తున్నాడో' అంటూ ఒకరు, 'నీ బాధ ఏంటమ్మా.. వాడి తల్లిదండ్రులు కూడా నీ అంత బాధపడి ఉండరు..' అని మరొకరు ఇలా సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా యాష్ రాజ్ ముఖతే అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఈమె చేసిన కామెంట్లనే పాటగా రాగం కట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది.     

ఇది కూడా చదవండి: సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement