ముంబై: భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద సెమీకండక్టర్ కంపెనీ మీడియాటెక్‌తో కలిసి రిలయన్స్ జియో ప్రత్యేకంగా అత్యంత ప్రజాదరణ పొందిన బీజీఎంఐ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఈ బీజీఎంఐ గేమింగ్ మాస్టర్స్ టోర్నమెంట్ రూ.12.5 లక్షల ప్రైజ్ పూల్‌తో అక్టోబర్ 30, 2021న ప్రారంభమయ్యింది. అయితే, టోర్నమెంట్‌కు దేశంలోని బీజీఎంఐ కమ్యూనిటీ నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చినట్లు సంస్థ తెలిపింది.
దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లు వచ్చాయని పేర్కొంది. టోర్నమెంట్‌లో పాల్గొన్న సాధారణ గేమర్‌లు, ఔత్సాహిక ప్లేయర్‌లు మధ్య తీవ్రంగా పోటీ ఏర్పడినట్లు సంస్థ తెలిపింది. చివరకు టోర్నమెంట్‌లో బీజీఎంఐ గేమింగ్ మాస్టర్స్ విజేతలుగా మాయావీ టీమ్ నిలచింది. ఈ ఎస్పోర్ట్స్ టోర్నమెంట్ 9 జనవరి 2022న ముగిసింది. ఈ ఫైనల్ టోర్నమెంట్‌ను మిలియన్ల మంది వీక్షకులు యూట్యూబ్ ద్వారా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment