10 నెలల సస్పెన్షన్ తర్వాత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) ఈ నెల 29న భారత్‌లో పునఃప్రారంభం కానుంది. గేమర్స్ ఆడేందుకు వీలుగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో లభ్యం కానుంది.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెక్యూరిటీ మార్పులు చేసిన తర్వాత గేమ్‌కు మూడు నెలల ట్రయల్‌కు అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే బీజీఎంఐని డౌన్‌లోడ్ కోసం అందుబాటులోకి తెస్తామని గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది.
ఈ సందర్భంగా బీజీఎంఐ ఇప్పుడు ప్రీలోడ్ కోసం అందుబాటులో ఉందని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. వినియోగదారులకు గేమ్‌ప్లే అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నామని’ అని క్రాఫ్టన్ ఇండియా సీఈవో సీన్ హ్యూనిల్ సోహ్న్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment