Ranveer Singh BGMI బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) గేమింగ్‌కు ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ను నియమించుకున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా వెల్లడించింది. గేమింగ్ థ్రిల్ ,సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ కరిష్మా రెండూ కలిపి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది గేమర్‌లకు ఉన్నతమైన అనుభవాన్ని అందించడమే కంపెనీ లక్ష్యం.
దేశవ్యాప్తంగా ఉన్న గేమింగ్ ఔత్సాహికులకోసం ఆకర్షణీయమైన కంటెంట్‌ను తీసుకురావడానికి ఈ సహకారం ఒక కొత్త మార్గాన్ని అందిస్తుందని, గేమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త శకాన్ని ప్రారంభించనున్నామని తెలిపింది. యూజర్లను కట్టిపడేసే అనుభూతిని అందించే గేమ్‌లను రూపొందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు క్రాఫ్టాన్ ఇండియా సీఈవో షాన్ హ్యునిల్ సోన్ తెలిపారు. దేశీ గేమింగ్ కమ్యూనిటీని కలిసేందుకు క్రాఫ్టాన్ భాగస్వామ్యం మంచి అవకాశం కాగలదని రణ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment