బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) ఐఓఎస్ వెర్షన్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ హింట్ ఇచ్చింది.కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావడం, ఆన్ లైన్ క్లాసుల కారణంగా గాడ్జెట్స్‌ల వినియోగం పెరగడంతో బీజీఎంఐ గేమ్ ఆడేవారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆ యూజర్ల సంఖ్యను మరింత పెంచేందుకు ఐఓఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు బీజీఎంఐ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రటించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జులై 2న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా విడుదలైన వారం వ్యవధిలోనే ఈ గేమ్‌ను 30 మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు వారి సంఖ్య 48మిలియన్ల డౌన్‌లోడ్లను దాటగా..49, 50 మిలియన్ల డౌన్ లోడ్సే టార్గెట్‌గా ఐఓఎస్ వెర్షన్‌ను ఆగస్ట్ 20న విడుదల చేసేలా హింట్ ఇచ్చినట్లు ఇన్‌సైడర్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఉన్న ఈ గేమ్ ఐఓఎస్ వెర్షన్‌లలో అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటు యూజర్లకు ప్రత్యేకంగా రివార్డ్‌లను ప్రకటించింది.
క్రాఫ్టన్ నిర్వహించనున్న ఈవెంట్‌లో ఆండ్రాయిడ్ యూజర్లు పాల్గొని ఈ రివార్డ్‌లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.48 మిలియన్ల డౌన్‌లోడ్లకు చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ సప్లై కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3, 49 మిలియన్ డౌన్‌లోడ్‌లతో క్లాసిక్ కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3 రివార్డ్, 50 మిలియన్ డౌన్‌లోడ్‌లను చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ పర్మినెంట్ గెలాక్సీ మెసెంజర్ సెట్ ఎక్స్ 1 రివార్డ్ ను అందించనుంది. ఈ రివార్డులు ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment