iOS Version
-
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఆ ఫీచర్
సాక్షి,ముంబై: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్‌ను దాచిపెట్టేలా చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తాము ఆన్లైన్లో ఉన్న విషయం గోప్యంగా ఉంచాలనుకునే వినియోగదారులకు 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఎప్పటికపుడు తన ప్లాట్ ఫామ్‌ను అప్డేట్ చేస్తూ, కస్టమర్ల ఫ్రెండ్లీగా ఉండేందుకు పలు ఫీచర్లను అందిస్తోందివాట్సాప్. తాజా రిపోర్టుల ప్రకారం ఈ గోప్యతా సెట్టింగ్ Android వెర్షన్ 2.22.16.12 కోసం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఎంచుకోవడం ఎలా? Settings-> Account-> Privacy-> Last seen లో ఉండే లాస్ట్ సీన్ అనే దాంట్లోనే ఈ ఫీచర్ కూడా ఉండనుంది. లాస్ట్ స్టీన్ ఆప్షన్ ఎనేబుల్, డిసేబుల్ చేసుకునే విధంగానే ఈ 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఆప్షన్‌ను పొందుపర్చనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ మొత్తం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా తెలియలేదు. అలాగే Apple iOS వినియోగదారుకు సంబంధించి ఈ ఫీచర్‌పై గత నెలలో పరీక్ష దశలో ఉంది. కాగా ఈ వారం ప్రారంభంలో వాట్సాప్ యూజర్లు వారి మొత్తం చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్, ఐవోఎస్కినుంచి ఆండ్రాయిడ్‌కి ఈజీగా బదిలీ చేసేలా కొత్త ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. -
యాపిల్ ఐఫోన్లకు కొత్త ఐవోఎస్16: ముఖ్య ఫీచర్స్ ఇవే!
క్యుపర్టినో (అమెరికా): టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 16ను ఆవిష్కరించింది. త్వరలో దీన్ని ఉచిత డౌన్‌లోడ్‌గా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. గతంతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు తరచూ ఫోన్‌ను మార్చేయ కుండా పాత డివైజ్‌నే మరికొంత ఎక్కువ కాలం ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇవ్వాల్సిన అవసరం పెరిగింది. కొత్త ఐవోఎస్‌తో యూజర్లు తమ ఫేవరెట్ యాప్‌లను లాక్ స్క్రీన్‌పై విడ్జెట్లుగా పెట్టుకోవచ్చు. అలాగే లాక్ స్క్రీన్‌పై లైవ్ నోటిఫికేషన్లు పొందవచ్చు. ప్రస్తుతం ఫోన్ స్క్రీన్ పైభాగం నుంచి వచ్చే ఇతరత్రా నోటిఫికేషన్లు ఇకనుంచి కింది భాగం నుంచి వస్తాయి. అలాగే మెసేజీలను పంపిన తర్వాత కూడా ఎడిట్ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఫీచర్లు ఐఫోన్ మెసేజింగ్ సిస్టమ్‌లో ఉంటాయి. అయితే, ఇందుకోసం ఇరువైపుల యూజర్లు, యాపిల్ మెసేజింగ్ యాప్‌ను ఉపయోగిస్తుండాలి. హెడ్‌క్వార్టర్స్ క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్ మరికొన్ని ఉత్పత్తులను కూడా ఆవిష్కరించింది. నెక్ట్స్ జనరేషన్ మ్యాక్ చిప్‌లతో మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రో ప్రదర్శించింది. మ్యాక్‌బుక్ ఎయిర్ రేటు 1,200 డాలర్లుగా, ప్రో ధర రూ. 1,300 డాలర్లుగా ఉంటుంది. -
యాపిల్ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్ చేసి చూడండి..అదిరిపోద్దంతే..!
స్మార్ట్ ఫోన్లలో రారాజు ఐఫోన్. ఫోన్లు ఎన్ని ఉన్నా ఐఫోన్ తర్వాతనే ఏదైనా. అటు ఫీచర్లు, ఇటు సెక్యూరిటీ విషయంలో మిగిలిన ఫోన్ల కంటే ఐఫోన్ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఇన్ని హంగులున్న ఈ ఐఫోన్ ధర మాత్రం ఎక్కువే. అందుకే ఆ ఫోన్ సామాన్యులకు అందని ద్రాక్షాగా మిగిలిపోయింది. దీనికి తోడు ఆండ్రాయిడ్ వెర్షన్ కంటే యాపిల్ ఐఓఎస్ వెర్షన్ ను ఆపరేట్ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ ఆ ఫోన్లను వినియోగించే వారికి ఫోన్లో ఉండే ఫీచర్లు గురించి తెలియదంటే నమ్మశక్యం కాదు, కానీ ఇది వాస్తవం..! అయితే అటువంటి ఐఫోన్లో ఓ సూపర్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఫోన్ లోపల కాదు. బయటే? అదెలా అంటారా? ఐఫోన్ లోగో యాపిల్ ఐఫోన్లో యూజర్లను ఎట్రాక్ట్ చేసేది లోగోనే. తాజాగా లోగోను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చేసింది యాపిల్ సంస్థ. ఫోన్లపై దిష్టిబొమ్మలాగ ఉండేలోగోలు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయా అనే అనుమానం రావొచ్చు. యూకేకి చెందిన ప్రముఖ మీడియా 'డైలీ రికార్డ్' కథనం ప్రకారం.. యాపిల్ సంస్థ గతేడాది సెప్టెంబర్ 16న ఐఓఎస్ 14ను అందుబాటులోకి తెచ్చింది. యాక్సిలేటర్ ఆధారంగా పనిచేసేలా ఐఫోన్ 8 నుంచి ఆపై మోడల్స్ అన్నింటిలో బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆ ఫీచర్ ఉన్న ఐఫోన్పైన ఉండే లోగోను రెండు లేదా మూడుసార్లు టచ్ చేస్తే చాలు ఫోన్‌లోపల ఉండే అప్లికేషన్లు డీఫాల్ట్‌గా పనిచేస్తాయని డైలీ రికార్డ్ తన కథనంలో పేర్కొంది. ఐఫోన్లో బ్యాక్ ట్యాప్ ఉపయోగించి ఇంకేం చేయొచ్చో? యాపిల్ లోగోను 'బ్యాక్ ట్యాప్'గా ఉపయోగించడం ద్వారా వాల్యూమ్‌ను తగ్గించడం, పెంచడం, స్క్రీన్షాట్లను తీయడం, హోమ్ స్క్రీన్‌కి వెళ్లడం లేదంటే సెట్టింగ్‌లో మీరు సెలక్ట్ చేసుకున్న యాప్స్‌లలో ఎంటర్ అవ్వొచ్చు. అంతేకాదు మాగ్నిఫైయర్, వాయిస్ ఓవర్, అసెస్టీవ్ టచ్, సిరి షార్ట్‌కట్, రీచబిలిటీ వంటి ఫీచర్లను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మీరు ఐఫోన్‌ను వినియోగిస్తుంటే మీరు ఐఫోన్ 8 కానీ, ఆ తర్వాత సిరీస్ ఫోన్లను వినియోగిస్తుంటే ఈ బ్యాక్ ట్యాప్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఫోన్లో లేటెస్ట్ ఓస్ వెర్షన్‌ను అప్డేట్ చేసి ఉండాలి. 'బ్యాక్ ట్యాప్' ఫీచర్‌ను వినియోగించడం చాలా సులభం. మీ ఐఫోన్లో సెట్టింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి >> క్లిక్ చేస్తే యాక్సెసిబిలిటీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది >> అందులో టచ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి >> క్లిక్ చేస్తే మీరు బ్యాక్ ట్యాప్ ఆప్షన్‌లోకి వెళతారు. చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య...! డిలీట్ చేస్తే అంతే..!
గత వారం ఐఫోన్లకు ఐవోఏస్ 15ను ఆపిల్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఐవోఎస్15 సాఫ్ట్‌వేర్‌లో బగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఐఫోన్లను అప్డేట్ చేసిన వారికి ఈ సమస్య తలెత్తుంది. యూజర్లు కొత్త ఐవోఎస్ వెర్షన్‌కి అప్డేట్ చేసిన తర్వాత, మెసేజెస్ యాప్‌లో ఫోటోస్ థ్రెడ్‌ని డౌన్లోడ్ చేశాక థ్రెడ్‌ను డిలీట్ చేయగానే ఫోన్ మెమరీలో కన్పించడం లేదంటూ తెలుస్తోంది. మరికొంత మంది యూజర్లకు డిఫాల్ట్ కెమెరా యాప్ కొన్నిసార్లు నాన్-ఫంక్షనల్ వ్యూఫైండర్ను ఆటోమేటిక్‌గా ఆన్ అవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఐఫోన్ వేకప్‌లో కూడా సమస్యలు ఉన్నట్లు యూజర్లు గుర్తించారు. అంతేకాకుండా డిఫాల్ట్ మెయిల్ యాప్ కూడా నిలిచిపోతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Rolls-Royce: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! దృష్టిలోపం ఉన్నవారికి ఐఫోన్లలోని సిరి అందించే కామండ్స్‌ను కూడా ఈ బగ్ తొలగిస్తున్నట్లు తెలుపోతుంది. అంతేకాకుండా మునపటి వెర్షన్లలో కూడా కామండ్స్ పనిచేయడం లేదు. దీంతో యూజర్లు ఆపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్స్‌కు రిపోర్ట్ చేస్తున్నారు. కాగా ఆపిల్ ఈ సమస్య స్పందించలేదు. మెసేజ్ యాప్ థ్రెడ్ నుంచి ఫోటోస్ థ్రెడ్‌ను డిలీట్ చేయకుండా ఉంటే ఫోన్ మేమోరీలోను ఉంటాయి. ఆపిల్ ఈ బగ్ సమస్యను పరిష్కరించే వరకు ఈ పద్దతినే ఫాలో అవ్వడం ఉత్తమమని టెక్నికల్ నిపుణులు అభిప్రాయపడ్డారు. చదవండి: భారత్‌లో ఊపందుకొనున్న స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు -
Google: గూగుల్ వాడుతున్నారా? అయితే అర్జెంటుగా..
గూగుల్ తన యూజర్లకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అర్జెంట్‌గా గూగుల్ క్రోమ్‌ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్ -94 అప్డేట్ గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హఠాత్తుగా బుధవారం ఈ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయి, ఐవోఎస్, విండోస్‌తో పాటు మాక్‌ఓస్ వెర్షన్లను సైతం కొత్త ఫీచర్స్‌తో ఒకేసారి అప్డేట్ అందించింది. ప్రైవసీ, కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తూనే క్రోమ్-94.. బగ్స్‌ను(దాదాపు 32) సైతం ఫిక్స్ చేసేసింది గూగుల్. ఇక 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త వెర్షన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్లను వెబ్సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. హాట్‌న్యూస్: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..! మరో విశేషం ఏంటంటే.. ఇది HTTPS-First modeకి సంబంధించిన వెర్షన్. అంటే.. సురక్షితంకానీ వెబ్సైట్లను ఓపెన్ చేసినప్పుడు ఫుల్ పేజీ అలర్ట్‌ను చూపించే వెర్షన్‌గా లేటెస్ట్ అప్డేట్ ఘనత సాధించింది. తద్వారా యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ ప్రకటించుకుంది. వెబ్సైట్ ఆరంభంలో ఉండే హెచ్‌టీటీపీఎస్ అనే లెటర్ష్.. సంబంధిత వెబ్సైట్ అసలా? నకిలీనా? అనే విషయం తెలియజేస్తుందని తెలుసు కదా!. ఒక్కోసారి సురక్షితంకానీ వెబ్సైట్లను సైతం ఓపెన్ కావడానికి క్రోమ్ అనుమతిస్తుంది. అలాంటప్పుడు గతంలో గూగుల్ అలర్ట్ ఏదో నామమాత్రంగానే.. చిన్నగా వచ్చేది. కానీ, ఒక్కోసారి అది గమనించకుండా యూజర్లు ముందుకెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు కొత్త అప్డేట్ ద్వారా ఫుల్‌పేజీ అలర్ట్ ఇస్తారు. తద్వారా యూజర్ మరింత జాగ్రత్త పడొచ్చు. అలాంటి సైట్ల నుంచి వెనక్కి వచ్చేయొచ్చు. ఓవైపు సేఫ్ బ్రౌజింగ్. మరోవైపు వెబ్కోడెక్స్ ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లకు అందించనుంది క్రోమ్ 94. అంటే.. మానిటర్, ఇతర స్క్రీన్ల మీద వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్‌వేర్ డీకొడింగ్ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. చదవండి: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే! ఇదీ చదవండి: ఫోన్ స్టోరేజ్ నిండిందా? డోంట్ వర్రీ.. వీటిలో ట్రై చేయండి -
బీజీఎంఐ నుంచి మరో అప్డేట్, హింట్ ఇచ్చేసిందిగా..!
బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా(BGMI) ఐఓఎస్ వెర్షన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ గేమ్ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ హింట్ ఇచ్చింది.కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావడం, ఆన్ లైన్ క్లాసుల కారణంగా గాడ్జెట్స్‌ల వినియోగం పెరగడంతో బీజీఎంఐ గేమ్ ఆడేవారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఆ యూజర్ల సంఖ్యను మరింత పెంచేందుకు ఐఓఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు బీజీఎంఐ డిజైన్ సంస్థ క్రాఫ్టన్ ప్రటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 2న బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియాగా విడుదలైన వారం వ్యవధిలోనే ఈ గేమ్‌ను 30 మిలియన్ల మంది గేమింగ్ లవర్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు వారి సంఖ్య 48మిలియన్ల డౌన్లోడ్లను దాటగా..49, 50 మిలియన్ల డౌన్ లోడ్సే టార్గెట్‌గా ఐఓఎస్ వెర్షన్‌ను ఆగస్ట్ 20న విడుదల చేసేలా హింట్ ఇచ్చినట్లు ఇన్సైడర్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఉన్న ఈ గేమ్ ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటు యూజర్లకు ప్రత్యేకంగా రివార్డ్‌లను ప్రకటించింది. క్రాఫ్టన్ నిర్వహించనున్న ఈవెంట్లో ఆండ్రాయిడ్ యూజర్లు పాల్గొని ఈ రివార్డ్‌లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.48 మిలియన్ల డౌన్లోడ్లకు చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ సప్లై కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3, 49 మిలియన్ డౌన్లోడ్లతో క్లాసిక్ కూపన్ క్రేట్ స్క్రాప్ ఎక్స్3 రివార్డ్, 50 మిలియన్ డౌన్లోడ్లను చేరుకున్న తర్వాత క్రాఫ్టన్ పర్మినెంట్ గెలాక్సీ మెసెంజర్ సెట్ ఎక్స్ 1 రివార్డ్ ను అందించనుంది. ఈ రివార్డులు ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉండనున్నాయి. -
iOS 15 వచ్చేది ఈ మోడళ్లకే
వెబ్‌డెస్క్: ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో అనేక అప్డేట్స్ వెల్లడయ్యాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఆపిల్ ప్లాట్ఫార్మ్పై రాబోతున్న కొత్త ఫీచర్లు డెవలపర్స్ వెల్లడించారు. 6ఎస్ ఆపై మోడళ్లకే ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 15కి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఆపిల్ 6ఎస్ ఆ తర్వాత రిలీజైన మోడళ్లకు ఐఓఎస్ 15 అప్డేట్ని అందివ్వనుంది. అంతకు ముందు ఉన్న మోడళ్లకు ఈ కొత్త ఓఎస్ లేనట్టే. పెద్దతెరతో వచ్చిన ఆపిల్ 7, ఆపిల్ 8, ఆపిల్ ఎక్స్, ఆపిల్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్ఈ, ఐఫోన్ 12 సిరీస్‌లో వచ్చిన మోడళ్లకు కొత్త ఐఓఎస్ అప్డేట్ రానుంది. అయితే ఐఓఎస్ 15 ఎప్పుడు రిలీజ్ చేసేది ఇంకా తెలియలేదు. న్యూ ఫీచర్స్ ఫేస్‌టైం పేరుతో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండేలా వీడియో కాల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న అప్లికేషన్లో వాయిస్ క్యాన్సిలేషన్ మరింత మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మెసేజ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకా ప్రభావంతంగా ఉండేలా డెవలపర్స్ కొత్త సాఫ్ట్వేర్ రూపొందించారు. ఫోటోలు, వీడియోలు తదితర స్టఫ్‌ని మేసేజ్ చేయడం మరింత సులువు కానుంది. వీటితో పాటు నోటిఫికేషన్స్, కాంటాక్ట్ ఫోటో, ఫోటో ఎడిటింగ్, డీఎన్డీ వంటి అంశాల్లోనూ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. -
‘ఫేస్బుక్’లో క్వైడ్ మోడ్
సాక్షి, న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’లో కంపెనీ యాజమాన్యం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కరోనా వైరస్ కారణంగా అనుకోకుండా సెలవులు రావడం లేదా ఇంటి పట్టునే ఉండాల్సి రావడం వల్ల లేదా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా ఆతృత వల్ల ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగించి యూజర్లు అలసిపోయి ఉండవచ్చు. కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలనిపించవచ్చు. ‘అమ్మో! విశ్రాంతి తీసుకుంటే ఎలా ? అవతలి వారి పోస్టింగ్స్‌కు సకాలంలో స్పందించపోతే వారికి కోపం రాదు! గ్రూప్‌కు గుడ్‌బై చెప్పరు లేదా గ్రూప్ నుంచి తీసేయరు!’ అనే ఆందోళన కలగవచ్చు. అలాంటి ఆందోళనలను తొలగించి యూజర్లు కావాల్సినంత విశ్రాంతి కల్పించేందుకే ఫేస్బుక్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీన్ని ‘క్వైడ్ మోడ్’గా వ్యవహరిస్తున్నారు. అంటే స్పందించకుండా ‘నిశ్శబ్దం’గా ఉండిపోవడం. ఎవరు, ఎంత సేపు ఈ మోడ్‌లో ఉండదల్చుకున్నారో! అంతసేపు సమయాన్ని పేర్కొని విశ్రాంతి తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కాలం గడిపేందుకు, ప్రశాంతంగా నిద్ర పోవడానికి ఈ మోడ్ తోడ్పడుతుందని ఫేప్‌బుక్ యాజమాన్యం పేర్కొంది. కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు లేదా ఉపాధి కోల్పోయి మానసికంగా ఆందోళనకు గురవుతుండవచ్చని, అలాంటి వారికి మరింత మానసిక ఒత్తిడి తీసుకరాకూడదనే సదుద్దేశంతోనే ఈ మోడ్‌ను ప్రవేశ పెట్టామని, ప్రస్తుతం ఈ మోడ్ ఐవోఎస్ ఫ్లాట్‌ఫారమ్ మీద పని చేస్తోందని, జూన్ నెల నాటికి ఆండ్రాయిడ్‌కు కూడా అనుసంధానం చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. -
వాట్సాప్ : ఐఫోన్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్
టెక్ దిగ్గజం ఆపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12 ఐఫోన్ యూజర్ల ముందుకు వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో, అప్డేట్లతో ఐఫోన్ యూజర్లను, ఐప్యాడ్ యూజర్లను ఇది అలరిస్తోంది. కొత్త ఐఓఎస్ 12 మార్కెట్లోకి వచ్చిన రెండు రోజుల్లోనే... ఐఫోన్ యూజర్లకు షాక్ ఇస్తూ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐఓఎస్ 7.1.2కి ముందున్న ఐఓఎస్ వెర్షన్లకు తమ యాప్ పనిచేయదని ప్రకటించింది. అంటే 1 ఫిబ్రవరి, 2020 నుంచి ఐఓఎస్ 7, దాని ముందున్న వెర్షన్లు వేటికి కూడా వాట్సాప్ సపోర్టు చేయదని చెప్పేసింది. ఐఓఎస్ 7.1.2 యూజర్లకు కూడా తమ యాప్‌ను వాడుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన కొత్త ఎఫ్ఏక్యూ సెక్షన్లో వెల్లడించింది. వాట్సాప్ సపోర్టు చేసే ఐఫోన్ డివైజ్‌లను కూడా పేర్కొంది. ఇక నుంచి కేవలం ఐఓఎస్ 8, ఆపై యూజర్లకు మాత్రమే వాట్సాప్ పనిచేయనుందని స్పష్టం చేసింది. ‘ఐఫోన్‌కు వాట్సాప్ కావాలంటే, ఐఓఎస్ 8 లేదా ఆ తర్వాతి వెర్షన్లు ఉండాల్సిందే’నని తేల్చి చెప్పింది. 1 ఫిబ్రవరి, 2020 తర్వాత కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకోవడానికి, పాత అకౌంట్లను పునఃధృవీకరించుకోవడానికి కూడా కుదరదు. అయితే ఈ ప్రభావం ఎక్కువ మంది యూజర్లపై పడదని తెలుస్తోంది. ఐఓఎస్ 7.1.2 వచ్చిన తర్వాత ఐఫోన్ పాత డివైజ్‌లకు ఎలాంటి అప్డేట్లు లేదు. ముఖ్యంగా ఐఫోన్ 4కు, ఐఫోన్ 3జీఎస్లకు. ఐఫోన్ 4ను 2010లో లాంచ్ చేయగా.. ఐఫోన్ 3జీఎస్ 2009లో మార్కెట్లోకి వచ్చింది. ఐఫోన్ 3జీఎస్, ఐఓఎస్ 6.1.6 తర్వాత ఇక ఎలాంటి అప్డేట్ను పొందలేదు. 2008లో లాంచ్ అయిన ఐఫోన్ 3జీ కి కూడా వాట్సాప్ పనిచేయదు. అయితే 2011లో లాంచ్ అయిన ఐఫోన్ 4ఎస్‌లకు చివరి అప్డేట్ ఐఓఎస్ 8.4.1. దీంతో వీటికి వాట్సాప్ పనిచేస్తుంది. కాగా, తాజాగా ఆపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 12ను సెప్టెంబర్17న విడుదల చేసింది.. 85 శాతం యాక్టివ్ డివైజ్‌లు ఐఓఎస్ 11తో పనిచేస్తూ ఉండగా.. ఐఓఎస్ 10తో 10 శాతం, పాత వెర్షన్లతో మిగిలిన 5 శాతం పనిచేస్తున్నాయి. అంటే ఐఓఎస్ 10కు ముందున్న వెర్షన్ డివైజ్‌లు లక్షల్లో కొన్ని మాత్రమే. -
వాట్సాప్ సరికొత్త ఫీచర్ : ఆండ్రాయిడ్స్లోకి...
న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ తన యూజర్లకు ఎప్పడికప్పుడూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ అలరిస్తూ ఉంది. తాజాగా మరో ఆసక్తికర ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఐఓఎస్ ఎక్స్‌క్లూజివ్ ఫీచర్‌గా ఉన్న ‘పిక్చర్-టూ-పిక్చర్ మోడ్’ ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లోనే వీడియోను చూసుకునేలా ఈ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు డబ్ల్యూఏబీటా ఇన్ఫో రిపోర్టు చేసింది. కంపెనీ మీ చాట్ అనుభవాన్ని ఎలాంటి అవాంతరం కలిగించకుండా.. వీడియో ప్లే చేసుకునేందుకు ఒక పాప్-అప్/ ఫ్లోటింగ్ విండోను జోడిస్తుంది. గూగుల్ ప్లే బీటా ప్రొగ్రామ్‌లో కంపెనీ ఇప్పటికే తన అప్డేట్ను సమర్పించింది. ఈ అప్డేట్లో ఆండ్రాయిడ్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ ఫీచర్‌కు సపోర్టు చేస్తుంది. యాప్‌కు ఈ ఫీచర్‌ను యాడ్ చేస్తే, ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్‌లో వచ్చిన వీడియో కోసం ప్లే ఐకాన్‌ను క్లిక్ చేసుకుని చూడొచ్చు. అదేవిధంగా చాట్‌ను కూడా నేవిగేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలకు పనిచేయనుంది. ఇదే ఫీచర్ ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంది. మరోవైపు ఇప్పటికే యూట్యూబ్ వీడియోలను యాప్‌లోనే చూసుకునేలా వాట్సాప్ యూజర్లకు అనుమతి ఇస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. గత రెండేళ్లుగా వాట్సాప్ యూజర్లు వాయిస్, వీడియో కాల్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకు 200 కోట్ల నిమిషాల కాల్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాయిస్, వీడియో కాల్స్‌కు మరింత డిమాండ్‌ను పెంచేందుకు గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు వాట్సాప్ తెలిపింది. -
శుభవార్త : ఐఓఎస్ 12 వచ్చేసింది...
కాలిఫోర్నియా : టెక్ దిగ్గజం ఆపిల్ తన అభిమానులకు శుభవార్త చెప్పేసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న ఐఓఎస్ 12ను ఆపిల్ ఎట్టకేలకు విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో(డబ్ల్యూడబ్ల్యూడీసీ) ఈ అప్డేట్ను కంపెనీ ప్రవేశపెట్టింది. లక్షల కొద్దీ ఐఫోన్లు, ఐప్యాడ్లు మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం ఈ ఐఓఎస్ 12ను విడుదల చేయడంతో పాటు సరికొత్త ఫీచర్స్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఐఓఎస్ 12 బగ్స్‌ను ఫిక్స్ చేయడంతోపాటు ఐఫోన్, ఐప్యాడ్ల పనితీరును మెరుగుపరుస్తుందని కంపెనీ చెప్పింది. ఐఓఎస్ 12తో ముందు అనుభవించలేని సరికొత్త అనుభూతిని అందించనున్నామని ఆపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రైగ్ ఫెడెర్గి చెప్పారు. ఐఓఎస్ 12.. టాప్ 12 ఫీచర్లు.. మరింత వేగం, మరింత రెస్పాన్సివ్ : ఐఫోన్ 5ఎస్తో పాటు సిస్టమ్స్ అన్నింటిలోనూ మెరుగైన పనితీరుపై ఇది ఎక్కువగా ఫోకస్ చేసింది. ఐఓఎస్ 12తో కెమెరాను 70 శాతం వరకు, కీబోర్డ్ 50 శాతం వరకు వేగవంతం చేసింది. షేర్డ్ ఏఆర్ ఎక్స్పీరియన్స్ : ఐఓఎస్ 12తోపాటు ఏఆర్‌కిట్2ను ఆపిల్ ప్రవేశపెట్టింది. దీంతో మరింత మెరుగైన ఏఆర్ యాప్స్‌ను డెవలప్ చేసుకోవచ్చు. కొత్త ఓపెన్ ఫైల్ ఫార్మాట్, యూఎస్డీజెడ్ను ఆపిల్ డిజైన్ చేసింది. దీంతో ఐఓఎస్‌లో ఎక్కడైనా ఏఆర్ అనుభవాన్ని తేలికగా పొందవచ్చు. గ్రూప్ ఫేస్ టైమ్ : ఆపిల్లోఉండే ఫేస్‌టైమ్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చారు. ఇది ప్రస్తుతం గ్రూప్ కాల్స్‌కు సపోర్టు చేయనుంది. ఈ కొత్త గ్రూప్ ఫేస్‌టైమ్ ఫీచర్‌తో ఒకేసారి అనేక మందితో చాట్ చేయొచ్చు. ఈ గ్రూప్ ఫేస్‌టైమ్ కాల్లో గ్రూప్ మెసేజ్ నుంచి కనెక్ట్ అవొచ్చు. ఏ సమయంలోనైనా అభ్యర్థులు జాయిన్ కావొచ్చు. సంభాషణ మధ్యలో ఉండగానే కూడా చేరవచ్చు. ఆపిల్ వాచ్ నుంచి కూడా ఫేస్‌టైమ్ ఆడియోలో పాలుపంచుకోవచ్చు. సిరి షాట్‌కట్స్ : సిరితో ఈ రంగంలో కొత్త సంచలనానికి తెరలేపిన ఆపిల్‌కు గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సాల నుంచి పోటీ ఎదురైంది. ఇపుడు సిరి మరింత స్మార్ట్‌గా చేశారు. ఇప్పుడు అన్ని యాప్‌లు సిరితో కలిసి పనిచేస్తాయి. మరింత వేగవంతంగా.. సరియైన సమయానికి పని పూర్తి చేస్తాయి. ఇప్పటికే సిరి ఒక్క నెలలో 10 బిలియన్ అభ్యర్థలను పూర్తి చేస్తుంది. ఫోటో సెర్చ్ మెరుగుపరచడం : ఫోటోయాప్ అంతాకొత్తగా ‘ఫర్ యూ’ అనే ట్యాబ్‌ను కలిగి ఉంటుంది. ఇది మెమరీస్, ఐక్లౌడ్ షేర్డ్ అల్బామ్స్ నుంచి ఇష్టమైన క్షణాలన్నింటిన్నీ ఒకచోటికి చేరుస్తోంది. ఈ ఫీచర్‌తో స్నేహితులతో తేలికగా ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్నేహితులు అదే ఈవెంట్‌కు సంబంధించి తిరిగి వీడియోలను, ఫోటోలను షేర్ చేయవచ్చు. డు నాట్ డిస్టర్బ్ : నోటిఫికేషన్ బెడద లేకుండా హాయిగా నిద్రపోయేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. పైగా బెడ్ టైమ్ మోడ్‌ని ఆన్ చేస్తే డిస్ప్లే కూడా డిమ్ అయిపోతుంది. అంతేకాకుండా అన్ని నోటిఫికేషన్లను లాక్ స్క్రీన్ నుంచి హైడ్చేసుకోవచ్చు. అంతేకాక ఫోన్ యూజర్ చెప్పిన సమయానికి ఈ డీఎన్డీ బెడ్‌టైమ్ మోడ్ పూర్తయి నార్మల్లోకి వచ్చేస్తుంది. నోటిఫికేషన్లను డిస్ప్లే అవుతాయి. గ్రూప్డ్ నోటిఫికేషన్లు : పదేపదే వచ్చే నోటిఫికేషన్లతో ఎప్పుడూ తలనొప్పిగా ఉంటుంది. ఆ తలనొప్పి నుంచి బయటపడేందుకు గ్రూప్డ్ నోటిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి సెట్టింగ్స్‌లోకి వెళ్లకుండానే నోటిఫికేషన్లను కంట్రోల్ చేసుకోవచ్చు. అనుకున్న నిర్ణీత సమయంలో వాటిని చూసుకునేలా ఇది ఉపయోగపడుతోంది. స్ర్కీన్ టైమ్ : అందరూ ఊహించినట్లే డిజిటల్ హెల్త్ ఫీచర్‌ను ఐఓఎస్12లో పొందుపర్చారు. దీనివల్ల యాప్స్, వెబ్‌సైట్స్‌పై మీరు వెచ్చించే సమయాన్ని ఈ ఫీచర్ కంట్రోల్ చేస్తుంది. ఒక్కో యాప్‌పై మీరు ఎంత సమయం వెచ్చించారో గంటవారీ, రోజువారీ, వారంవారీగా డేటా తెలుపుతుంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ : ఆపిల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, మెరుగైన ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి ఐఓఎస్ 12 అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. సఫారీలో ఇంటెలిజెన్స్ ట్రాకింగ్ ప్రివెన్షన్ ఆప్షన్‌తో మీరు సోషల్ మీడియా లైక్ లేదా షేర్ బటన్స్‌ను బ్లాక్ చేయొచ్చు. మెమోజీ, ఫన్ కెమెరా ఎఫెక్ట్స్ : గత ఏడాది అనిమోజీని ప్రవేశపెట్టిన ఆపిల్ ఈసారి మెమోజీలను ప్రవేశపెట్టింది. ఇది అచ్చం శాంసంగ్ ఏఆర్ ఎమోజీలాగానే ఉంది. మెజర్ యాప్ : కొత్త యాప్ ఇది. వస్తువులు, గోడల కొలతలను ఈ ఫీచర్‌తో కొలవవచ్చు. ఐ బుక్స్‌ను ఆపిల్ బుక్స్‌గా రీడిజైన్ చేసింది. -
ఈ మొబైల్స్‌లో ఇక వాట్సాప్ పనిచేయదు!
శాన్ఫ్రాన్సిస్కో : వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలపై డిసెంబర్ 31, 2017 తర్వాత మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్ ద్వారా ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను ఇంకా అభివృద్ధి చేద్దామనుకుంటున్నామని, కానీ ఈ ఫ్లాట్‌ఫాంలకు అంత సామర్థ్యం లేదని చెప్పింది. ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్ వెర్షన్(ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఇది మాకు ఒక కఠినమైన నిర్ణయం, కానీ వాట్సాప్ ద్వారా వినియోగదారులు మరింత మంది స్నేహితులు, కుటుంబం, ప్రియమైన వారిని తో సన్నిహితంగా ఉండేలా, ఉన్నతమైన ఫీచర్లను మెరుగైన సౌలభ్యాన్ని అందిస్తున్నాం. ఈ క్రమంలో అప్‌గ్రేడ్ చేసుకోవాలసింది రికమెండ్ చేశాం’’ అని వాట్సాప్ తన బ్లాగులో పేర్కొంది. ఈ సంవత్సరం చివరి నాటికి వాట్సాప్ బంద్ అయ్యే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బ్లాక్ బెక్రీ, ఓఎస్, 10 విండోస్ ఫోన్ 8.0 , అంతకంటే పాతవి దీనితోపాటు నోకియా ఎస్ 40 ఫోన్లలో వాట్సాప్ డిసెంబర్ 31,2018 తరువాత పనిచేయదని పేర్కొంది. ఫిబ్రవరి 1, 2020 తర్వాత ఆండ్రాయిడ్ 2.3.7 , అంతకంటే పాత వెర్షన్లలో కూడా వాట్సాప్ సేవలను నిలిపి వేయనుంది. కాగా 2016 లో వివిధ మొబైల్ ఫ్లాట్‌ఫాంలలో వాట్స్అప్ సేవలు నిలిపివేత గురించి మొదటిసారి ప్రకటించింది. ఆ తరువాత మరికొన్ని ఓఎస్‌లలో ఈ గడువును జూన్ 30, 2017 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. తాజాగా గడువు డిసెంబరు 31, 2017తో ముగియనుందని తెలిపింది. -
ఆండ్రాయిడ్స్లోకి వచ్చేసిన సూపర్ మారియో
నీలం రంగు జుబ్బా.. ఎరుపు రంగు టోపి పెట్టుకుని పరుగెత్తుకుంటూ అడ్వెంచర్లతో దూసుకెళ్లే బుడతడి గేమ్ సూపర్ మారియో ఎవరికి తెలియదు చెప్పండి. టీవీ వీడియో గేమ్స్ లో ఎక్కువగా పాపులర్ అయిన ఈ గేమ్ ను నిటెండో కంపెనీ సూపర్ మారియో రన్ పేరుతో ఐఓఎస్ లోకి తీసుకొచ్చింది. ఐఓఎస్ లో ఈ గేమ్ సూపర్ సక్సెస్ కావడంతో, నేటి నుంచి దీన్ని ఆండ్రాయిడ్ లోకి అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో ఆండ్రాయిడ్ వెర్షన్లలో కూడా ఇక నుంచి సూపర్ మారియో రన్ అందుబాటులోకి వచ్చిందని కంపెనీ పేర్కొంది. గతేడాది ఐఓఎస్ లోకి వచ్చిన ఈ గేమ్ కు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. లాంచ్ అయిన తొలి నాలుగు రోజుల్లోనే 40 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ అయింది. జనవరి వరకు 78 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ నమోదుచేసింది. ప్రస్తుతం స్వల్పమార్పులతో ఆండ్రాయిడ్ లోకి తీసుకొచ్చారు. అయితే ఈ మార్పులు గేమ్ సేల్ పై ప్రభావం చూపే అవకాశముందని కొందరంటున్నారు. ఆండ్రాయిడ్ లో లాంచ్ చేసిన ఈ కంపెనీ ముందస్తుగా గూగుల్ ప్లే స్టోర్ లో ప్రీ-రిజిస్టర్లు అందుబాటులో ఉంచింది. ఒకవేళ డౌన్ లోడ్ కావాలనుకునే వారు ఏపీకే మిర్రర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆండ్రాయిడ్ లో ఈ గేమ్ లాంచ్ తో పాటు ఐఓఎస్ లోనూ దీన్ని అప్ డేట్ చేశారు. ఐఓఎస్ లో మాదిరిగా ఆండ్రాయిడ్ లోనూ ఇది సక్సెస్ సాధిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తంచేస్తోంది.