
వెబ్‌డెస్క్: ఆపిల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో అనేక అప్‌డేట్స్ వెల్లడయ్యాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఆపిల్ ప్లాట్‌ఫార్మ్‌పై రాబోతున్న కొత్త ఫీచర్లు డెవలపర్స్ వెల్లడించారు.
6ఎస్ ఆపై మోడళ్లకే
ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 15కి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఆపిల్ 6ఎస్ ఆ తర్వాత రిలీజైన మోడళ్లకు ఐఓఎస్ 15 అప్‌డేట్‌ని అందివ్వనుంది. అంతకు ముందు ఉన్న మోడళ్లకు ఈ కొత్త ఓఎస్ లేనట్టే. పెద్దతెరతో వచ్చిన ఆపిల్ 7, ఆపిల్ 8, ఆపిల్ ఎక్స్, ఆపిల్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్‌ఈ, ఐఫోన్ 12 సిరీస్‌లో వచ్చిన మోడళ్లకు కొత్త ఐఓఎస్ అప్‌డేట్ రానుంది. అయితే ఐఓఎస్ 15 ఎప్పుడు రిలీజ్ చేసేది ఇంకా తెలియలేదు.
న్యూ ఫీచర్స్
ఫేస్‌టైం పేరుతో రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ ఉండేలా వీడియో కాల్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న అప్లికేషన్‌లో వాయిస్ క్యాన్సిలేషన్ మరింత మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మెసేజ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంకా ప్రభావంతంగా ఉండేలా డెవలపర్స్ కొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఫోటోలు, వీడియోలు తదితర స్టఫ్‌ని మేసేజ్ చేయడం మరింత సులువు కానుంది. వీటితో పాటు నోటిఫికేషన్స్, కాంటాక్ట్ ఫోటో, ఫోటో ఎడిటింగ్, డీఎన్‌డీ వంటి అంశాల్లోనూ కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment