వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌, ఇకపై ఆ ఫీచర్‌ | How to hide online status on WhatsApp for Android users: Report | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌, ఇకపై ఆ ఫీచర్‌

Published Sat, Jul 23 2022 4:50 PM | Last Updated on Sat, Jul 23 2022 5:05 PM

How to hide online status on WhatsApp for Android users: Report - Sakshi

సాక్షి,ముంబై: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్‌ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను దాచిపెట్టేలా చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తాము ఆన్‌లైన్‌లో ఉన్న విషయం గోప్యంగా ఉంచాలనుకునే వినియోగదారులకు 'హైడ్ ఆన్‌లైన్ స్టేటస్' ఫీచర్ బాగా ఉపయోగపడనుంది.

ఎప్పటికపుడు తన ప్లాట్‌ ఫామ్‌ను అప్‌డేట్‌ చేస్తూ, కస్టమర్ల ఫ్రెండ్లీగా ఉండేందుకు పలు ఫీచర్లను అందిస్తోందివాట్సాప్‌. తాజా రిపోర్టుల ప్రకారం ఈ గోప్యతా సెట్టింగ్ Android వెర్షన్ 2.22.16.12 కోసం అందుబాటులో ఉంది. 


 

ఈ ఫీచర్‌ను ఎంచుకోవడం  ఎలా?
Settings-> Account-> Privacy-> Last seen లో ఉండే లాస్ట్‌ సీన్‌ అనే దాంట్లోనే  ఈ ఫీచర్‌  కూడా ఉండనుంది.  లాస్ట్‌ స్టీన్‌ ఆప్షన్‌ ఎనేబుల్‌, డిసేబుల్‌ చేసుకునే విధంగానే ఈ 'హైడ్ ఆన్‌లైన్ స్టేటస్' ఆప్షన్‌ను పొందుపర్చనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ మొత్తం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా తెలియలేదు. అలాగే Apple iOS వినియోగదారుకు సంబంధించి ఈ ఫీచర్‌పై గత నెలలో పరీక్ష దశలో ఉంది. 

కాగా ఈ వారం ప్రారంభంలో వాట్సాప్‌  యూజర్లు వారి మొత్తం చాట్  హిస్టరీని ఆండ్రాయిడ్‌ నుంచి ఐవోఎస్‌, ఐవోఎస్‌కినుంచి ఆండ్రాయిడ్‌కి  ఈజీగా బదిలీ చేసేలా కొత్త ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేసిన సంగతి  తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement