hiding
-
రూ. 5 కోట్ల అప్పు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన టీచర్
అనంతపురం ఎడ్యుకేషన్: మరో టీచరు అప్పుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మొన్న రాప్తాడు జెడ్పీహెచ్ఎస్లో బయాలజీ టీచరుగా పని చేస్తున్న రమేష్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఉడాయించారు. నిన్న అనంతపురం ఆర్‌ఎంహెచ్‌ఎస్ స్కూల్లో తెలుగు టీచరు దివాకర్‌నాయుడు చీటీలు, వడ్డీ పేరుతో రూ. 12 కోట్ల దాకా అప్పులు చేసి ఉడాయించారు. చివరకు కోర్టులో లొంగిపోవడంతో సబ్‌జైల్‌కు తరలించారు. తాజాగా రూ. 5 కోట్లకు పైగా అప్పులు చేసి అదృశ్యమైన మరో టీచరు బాగోతం వెలుగు చూసింది. విడపనకల్లు మండలం హావలిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగా పని చేస్తున్న కె.బద్రీనాథ్ కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులే ఉన్నారు. వీరి వద్దే రూ. 3.5 కోట్ల అప్పులు చేశారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోరూ. 25 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈయన దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉండటంతో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకున్న డబ్బును బద్రీనాథ్‌కు ఇచ్చామని కొందరు చెబుతుండగా, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును ఇచ్చామని మరికొందరు చెబుతున్నారు. చాలామంది బాధితులు వడ్డీకి ఆశపడి ఇచ్చారు.రెండు నెలలుగా రావడం లేదు గణితం టీచరు బద్రీనాథ్ దాదాపు రెండు నెలలుగా పాఠశాలకు రావడం లేదు. ఆయన ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. వీఆర్ఎస్ తీసుకుంటాడని మరికొందరు అంటున్నారు. ఆయనైతే నేరుగా నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. – మధురవాణి, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, హావలిగి -
'అతిగా దాచుకోవడం కూడా జబ్బే..' అని మీకు తెలుసా!?
రాజీవ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. పెళ్లయి ఇద్దరు పిల్లలు. భార్య కూడా ప్రభుత్వోద్యోగి. ఇటీవల కాలంలో వారిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులో లేక అభిప్రాయభేదాలో కాదు. రాజీవ్‌కున్న వింత అలవాటు. అది దినపత్రికల్లో, మ్యాగజై¯Œ్సలో వచ్చే నచ్చిన స్టోరీలను దాచుకునే అలవాటు. అందులో వింతేముంది? నచ్చిన పుస్తకాలు దాచుకున్నట్లే అదికూడా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ఇల్లంతా ఆ ఫైల్స్‌తోనే నిండిపోతే? వాటినుంచి వచ్చే దుమ్ము వల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే? ఆ విషయం తెలిసినా ఆ ఫైల్స్ పడేయడానికి ఒప్పుకోకుంటే? వాటిని బయట పడేయడానికి ప్రయత్నించే భార్యతో గొడవ పడుతుంటే? ఆమె వెళ్లిపోతానని బెదిరించినా పట్టించుకోకపోతే? భార్యాపిల్లల కంటే ఫైల్సే ముఖ్యమనుకుంటే? దాన్నే హోర్డింగ్ డిజార్డర్ అంటారు. అంటే అవసరం లేని వస్తువులను అతిగా దాచుకునే మానసిక వ్యాధి. పేపర్ క్లిపింగ్సే కాదు పెన్నులు, పిన్నులు, రబ్బర్ బ్యాండ్లు, కర్చీఫ్‌లు.. ఇలా ఏదైనా సరే అతిగా దాచుకుంటున్నారంటే ఈ వ్యాధి బారిన పడినట్లే. వస్తువులను దాచుకోవడమే కాదు, అతిగా జంతువులను పెంచుకోవడం కూడా ఈ రుగ్మత కిందకే వస్తుంది. అతిగా ఆస్తులు కూడగట్టుకోవడం, వాటిని ఎవరికీ ఇవ్వకుండా దాచుకోవడం కూడా ఈ రుగ్మత పరిధిలోనిదే. హాబీ, హోర్డింగ్ డిజార్డర్ వేర్వేరు.. హాబీలకు, హోర్డింగ్ డిజార్డర్‌కు తేడా ఉంది. స్టాంపుల సేకరణ, నాణేల సేకరణ వంటి హాబీలున్నవారు అనేక అంశాలు శోధించి, సేకరిస్తారు. వాటిని ప్రదర్శిస్తారు. ఈ సేకరణలు భారీ స్థాయిలో ఉండవచ్చు. కానీ అవి చిందరవందరగా ఉండవు. చక్కగా, ఒక పద్ధతిలో అమర్చి ఉంటాయి. కానీ హోర్డింగ్ డిజార్డర్‌లో ఇందుకు భిన్నంగా చిందరవందరగా ఉంటాయి. అందువల్ల ఇవి రెండూ వేర్వేరు. టీనేజ్ లో మొదలు.. హోర్డింగ్ సాధారణంగా 15 నుంచి 19 సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. వయసుతో పాటు సమస్య కూడా పెరుగుతుంది. చివరకు భరించలేనిదిగా తయారవుతుంది. ఈ డిజార్డర్ ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.. తమకు నచ్చిన వస్తువులు ప్రత్యేకమైనవని లేదా భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో అవసరమని నమ్మడం వాటితో మానసికంగా కనెక్ట్ అయినట్లు అనిపించడం.. అవి చుట్టూ ఉన్నప్పుడు సురక్షితంగా ఫీలవ్వడం, ఓదార్పును అనుభవించడం.. అవసరం లేకపోయినా దాచుకోవడం, విలువ లేకపోయినా విసిరేయ లేకపోవడం.. వస్తువులను భద్రపరచాలని భావించడం, వదిలించుకోవాలంటే కలత చెందడం.. మీ గదులను ఉపయోగించలేని స్థాయిలో వస్తువులను నింపడం.. అపరిశుభ్రమైన స్థాయిలకు ఆహారం లేదా చెత్తను దాచడం.. దాచుకున్న వస్తువుల కోసం ఇతరులతో విభేదాలు.. అస్పష్టమైన కారణాలు.. హోర్డింగ్ డిజార్డర్‌కు కారణమేమిటో స్పష్టంగా తెలియలేదు. జన్యుశాస్త్రం, మెదడు పనితీరు, ఒత్తిడితో కూడిన సంఘటనలు సాధ్యమయ్యే కారణాలుగా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ డిజార్డర్ ఉన్న కుటుంబ సభ్యుడిని కలిగి ఉండటం కూడా బలమైన కారణమని తెలుస్తోంది. ప్రేమించిన వ్యక్తి మరణం, విడాకులు తీసుకోవడం లేదా అగ్నిప్రమాదంలో ఆస్తులను కోల్పోవడం వంటి ఒత్తిడితో కూడిన సంఘటనను ఎదుర్కొన్న తర్వాత కొందరిలో ఈ డిజార్డర్ మొదలవుతుంది. తక్షణ చికిత్స అవసరం.. కొందరు తమ జీవితాలపై హోర్డింగ్ డిజార్డర్ చూపించే ప్రతికూల ప్రభావాన్ని గుర్తించరు, చికిత్స అవసరమని భావించరు. ఈ డిజార్డర్‌ను అధిగమించేందుకు సైకోథెరపీ అవసరం. దాంతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. దాచుకోవడానికి కారణమైన నమ్మకాలను గుర్తించాలి , వాటిని సవాలు చేయాలి. మరిన్ని వస్తువులను పొందాలనే కోరికల నియంత్రణ అలవరచుకోవాలి. ఏయే వస్తువులను వదిలించుకోవచ్చో వాటిని వదిలించుకోవాలి. డెసిషన్ మేకింగ్‌ను.. కోపింగ్ మెకానిజాన్ని మెరుగుపరచుకోవాలి. గందరగోళాన్ని తగ్గించుకోవడానికి రోజువారీ పనులను షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటిని చక్కగా నిర్వహించుకునేందుకు సాయం తీసుకోవాలి. హోర్డింగ్ ఒంటరితనానికి దారితీస్తుంది కాబట్టి ఇతరులకు చేరువవ్వాలి. ఇంటికి సందర్శకుల హడావిడిని వద్దనుకుంటే మీరే బయటకు వెళ్లొచ్చు. హోర్డింగ్ డిజార్డర్ సపోర్ట్ గ్రూప్‌లో చేరాలి. ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ సహాయం తీసుకోవాలి. హోర్డింగ్ డిజార్డర్‌కి సిఫారసు అయిన మొదటి చికిత్స.. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఈ రుగ్మత వల్ల వచ్చే ఆందోళన, నిరాశ వంటి వాటికి మందులు ఇస్తారు. థెరపీ షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా అనుసరించాలి. దాచుకోవాలనే కోరికను తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై ఆ ఫీచర్
సాక్షి,ముంబై: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్‌ను దాచిపెట్టేలా చేసే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. తాము ఆన్లైన్లో ఉన్న విషయం గోప్యంగా ఉంచాలనుకునే వినియోగదారులకు 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఎప్పటికపుడు తన ప్లాట్ ఫామ్‌ను అప్డేట్ చేస్తూ, కస్టమర్ల ఫ్రెండ్లీగా ఉండేందుకు పలు ఫీచర్లను అందిస్తోందివాట్సాప్. తాజా రిపోర్టుల ప్రకారం ఈ గోప్యతా సెట్టింగ్ Android వెర్షన్ 2.22.16.12 కోసం అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఎంచుకోవడం ఎలా? Settings-> Account-> Privacy-> Last seen లో ఉండే లాస్ట్ సీన్ అనే దాంట్లోనే ఈ ఫీచర్ కూడా ఉండనుంది. లాస్ట్ స్టీన్ ఆప్షన్ ఎనేబుల్, డిసేబుల్ చేసుకునే విధంగానే ఈ 'హైడ్ ఆన్లైన్ స్టేటస్' ఆప్షన్‌ను పొందుపర్చనుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ మొత్తం ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టంగా తెలియలేదు. అలాగే Apple iOS వినియోగదారుకు సంబంధించి ఈ ఫీచర్‌పై గత నెలలో పరీక్ష దశలో ఉంది. కాగా ఈ వారం ప్రారంభంలో వాట్సాప్ యూజర్లు వారి మొత్తం చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్, ఐవోఎస్కినుంచి ఆండ్రాయిడ్‌కి ఈజీగా బదిలీ చేసేలా కొత్త ఫీచర్ గురించి అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. -
మేమున్న అపార్ట్‌మెంట్‌పై దాడి జరిగింది
కీవ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇక్కడ బాంబుల మోతమోగుతోంది. భద్రతా సిబ్బంది నన్ను, మరో 40 మంది విద్యార్థులను మా అపార్ట్మెంట్ నుంచి దూరంగా ఓ బంకర్‌కు తరలించారు. తర్వాత గంటకే మా అపార్ట్ మెంట్ పక్కన ఉన్న మెట్రో స్టేషన్‌పై మిస్సైల్ దాడి జరిగింది. మా అపార్ట్మెంట్లో రెండంత స్తులు కూడా దెబ్బ తిన్నాయి. బంకర్లో భయం భయంగా ఉంటున్నాం. కరెంటు, నీటి వసతి, ఆహారం సరిగా లేదు. త్వరగా ఇండియాకు తీసుకెళ్లాలి. – గాజుల అభిషేక్, మదనపల్లి, మాక్లూరు మండలం, నిజామాబాద్ -
స్కూటీలో తాచుపాము
కేసముద్రం: పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలోకి దూరిన తాచుపామును బయటకు రప్పించేందుకు మెకానిక్ రెండు గంటల పాటు శ్రమించాడు. దానిని బటయకు రప్పించి పట్టుకుని వెళ్లి అడవిలో వదిలిన ఘటన కేసముద్రం మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌లో జరిగింది. ఉపాధ్యాయురాలు సునీత రోజు మాదిరిగానే స్కూటీపై వచ్చి పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసింది. ఈ క్రమంలో ముళ్లపొదల నుంచి వచ్చి స్కూటీలోకి దూరిన పామును విద్యార్థులు గమనించి, ఉపాధ్యాయులకు తెలిపారు. దానిని బయటకు రప్పించేందుకు ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో అమీనాపురం గ్రామానికి చెందిన బైక్‌మెకానిక్ విజయ్‌ని పాములు పట్టే వ్యక్తి కుమారస్వామి పిలిపించాడు. ఆయన రెండు గంటల పాటు శ్రమించి స్కూటీ పార్టులన్నీ విప్పి పామును బయటకు రప్పించాడు. కాగా కుమారస్వామి పామును పట్టుకుని వెళ్లి అడవిలో వదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
చివరి ఘట్టానికి చేరిన ఆపరేషన్ పఠాన్‌కోట్
-
నల్లధనంపై ఎందుకీ దాపరికం?
సర్కారు కళ్లుగప్పి విదేశాలకు తరలిన లక్షల కోట్ల నల్ల డబ్బునంతా వెనక్కు తీసుకురావడంతోపాటు, నల్ల కుబేరులందరినీ చట్టంముందు నిలబెట్టి శిక్షింప జేస్తామని మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చేసిన శపథాలన్నీ ఉత్త బోలుమాటలని ఎన్డీయే ప్రభుత్వం నిరూపించుకుంది. విదేశాల్లో నల్ల ధనం దాచుకున్నవారంటూ ఎనిమిది మంది జాబితాతో సర్వోన్నత న్యాయస్థానం ముందు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ దేశ ప్రజలనే కాదు...బీజేపీ సీనియర్ నేతలను కూడా దిగ్భ్రమపరిచింది. వాస్తవానికి అఫిడవిట్లో ఉన్నవి మూడు పేర్లే. వీరిలో ఒకరు డాబర్ సంస్థకు చెందిన మాజీ డెరైక్టర్ ప్రదీప్ బర్మన్కాగా, మరొకరు బులియన్ వ్యాపారి పంకజ్ లోధియా, మూడో వ్యక్తి గోవాకు చెందిన వ్యాపారవేత్త రాధా టింబ్లూ, ఆమె సంస్థలోని మరో అయిదుగురు డెరైక్టర్లు. యథాప్రకారం ఈ ముగ్గురూ ఖండనలు కూడా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎన్నారైగా ఉండగా చట్టబద్ధంగానే తాను స్విస్ బ్యాంకు ఖాతా ప్రారంభించానని బర్మన్ సంజాయిషీ ఇస్తే, మిగిలిన ఇద్దరూ ఇందులో తమ పేర్లు ఎందుకొచ్చాయో తెలియడంలేదని అమాయకత్వాన్ని ప్రకటించారు. మొత్తానికి ఈ నల్లడబ్బు వ్యవహారమంతా ‘గజం మిథ్య... పలాయనం మిథ్య’ తరహాలో సాగుతున్నట్టు కనబడుతున్నది. గుప్తధనంపై ఆదినుంచీ పాలకుల వైఖరి ఒకలాగే ఉన్నది. విపక్షంలో ఉన్నప్పుడు ఏంచెప్పినా అధికార పీఠం ఎక్కేసరికి అందరూ ఒకేలా మాట్లాడు తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా నల్లడబ్బు గురించి ఉపన్యాసాలిచ్చిన బీజేపీ ఇప్పుడు అచ్చం కాంగ్రెస్ భాషను పుణికిపుచ్చుకుని మాట్లాడుతున్నది. ఆనాటి బీజేపీ పాత్రను ఇప్పుడు కాంగ్రెస్ సమర్థవంతంగా పోషిస్తున్నది. కొన్ని దేశాలతో మనకున్న ద్వంద్వ పన్నుల ఎగవేత నిరోధక ఒప్పందం (డీటీఏఏ) కారణంగా ఆయా దేశాల్లో నల్ల డబ్బు దాచుకున్నవారి పేర్లు వెల్లడించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని వారం క్రితం సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించుకుంది. ఇదేమీ కొత్త వాదన కాదు. రెండేళ్లక్రితం అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నల్ల డబ్బుపై శ్వేతపత్రం విడుదలచేస్తూ ఈ మాటే పార్లమెంటులో చెప్పారు. 81 దేశాలతో కుదుర్చుకున్న ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం ద్వారా, నాలుగు బ్యాంకులతో కుదుర్చుకున్న పన్ను సమాచార బదిలీ ఒప్పందం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టామని, అయితే ఒప్పందాల కారణంగా సమాచారంలోని పేర్లను వెల్లడించడం సాధ్యపడటంలేదని తెలిపారు. నల్లడబ్బు కూడబెట్టడాన్ని కేవలం పన్ను ఎగవేతగా మాత్రమే పరిగణించవద్దని సుప్రీంకోర్టు ఆ కాలంలోనే చెప్పింది. అయినా పాలకులు పదే పదే ఆ దోవనే ఎంచుకుంటున్నారు. అరుణ్‌జైట్లీ ప్రకటనపై అన్నివైపులనుంచీ దాడి మొదలయ్యేసరికి కేంద్రం పునరాలోచనలో పడినట్టు కనబడింది. ‘తిరుగులేని సాక్ష్యాధారాలున్న’ నల్లధనవంతుల పేర్లన్నీ సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టుకు అందజేస్తామని నాలుగు రోజులనాడు మీడియాకు లీకులిచ్చి అడుగంటిన ఆశలకు ప్రాణప్రతిష్ట చేసింది. తీరా ఇప్పుడు వెల్లడించిన పేర్లు గమనిస్తే అవన్నీ మూడేళ్లక్రితం హెచ్ఎస్బీసీ ఉద్యోగి ఒకరు ప్రపంచానికి వెల్లడించిన 782 ఖాతాల్లోనివే. తమ వద్ద ఉన్న జాబితాలో యూపీఏ హయాంలో మంత్రిగా చేసిన నేతతోపాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యులున్నారని అరుణ్‌జైట్లీ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలకు ఇప్పుడు సమర్పించిన అఫిడవిట్ దరిదాపుల్లో కూడా లేదు. కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్‌కు విదేశీ ఖాతా గురించి ఆరా తీస్తూ ఆదాయం పన్ను విభాగంనుంచి నోటీసు వెళ్లిందని మాత్రం చెబుతున్నారు. మన ప్రభుత్వాలు నల్ల డబ్బు విషయంలో ప్రదర్శిస్తున్న సాచివేత వైఖరివల్ల ఇప్పటికే విదేశీ బ్యాంకుల్లోని 60 శాతం నల్ల డబ్బు రంగు మార్చుకుని ఎటో వెళ్లిపోయింది. ఖాతాదార్లందరికీ మారిన నిబంధనలను వివరించి డబ్బు ఉంచుకుంటారో, పట్టుకెళ్తారో మీ ఇష్టమని స్విస్ బ్యాంకులు తమ ధర్మంగా వర్తమానం పంపించాయి. అంటే మిగిలిన 40 శాతం డబ్బుకూడా అక్కడినుంచి తరలిపోయే ఉంటుంది. స్విస్ బ్యాంకుల్లో 2006నాటికి మొత్తం రూ. 23,373 కోట్ల నల్ల ధనం ఉన్నదని... అది 2010నాటికి రూ. 9,295 కోట్లకు తగ్గిపోయిందని ప్రణబ్ శ్వేతపత్రం ప్రకటించింది. విదేశీ బ్యాంకుల్లో నిరుడు మొత్తంమీద రూ. 14,000 కోట్లు ఉన్నదని తేలిందని ఈమధ్యే ఓ పత్రిక వెల్లడించింది. ఇలా ఇంత సమయమిచ్చి, ఇంత హడావుడిచేసి ఎక్కడివారక్కడ సర్దుకున్నాక మొక్కుబడిగా ప్రకటించిన పేర్లవల్ల ఫలితం ఉంటుందని కేంద్ర ప్రభుత్వమైనా నమ్ముతున్నదా అనే అనుమానం కలుగుతుంది. విదేశీ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచుకున్న ప్రముఖుల్లో కీలక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారని ఒకపక్క వదంతులు షికార్లు చేస్తుండగా దానిపై స్పష్టతనీయకుండా చేసే ఎలాంటి విన్యాసమైనా ఎవరినీ ఆకట్టుకోదు. ‘పేర్లు వెల్లడిస్తాం... కానీ, దర్యాప్తు పూర్తి కావాలి, చార్జిషీట్లు దాఖలు చేయాలి. అందుకు ఇంకా వ్యవధి కావాలి’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ముగ్గురిపైనా అన్ని లాంఛనాలూ పూర్తయ్యాయి గనుకే వెల్లడించామంటున్నారు. విదేశాలకు తరలివెళ్లిన నల్లడబ్బు ఎఫ్‌డీఐల రూపంలో తిరిగి దేశంలోనికి ప్రవేశిస్తున్నదని... రియల్ఎస్టేట్, బంగారం క్రయవిక్రయాల్లో నల్లధనం మూలాలున్నాయని ప్రణబ్ శ్వేతపత్రం చెప్పింది. దానికి సంబంధించి ఇప్పటి వరకూ తీసుకున్న నిర్దిష్ట చర్యలేమిటో అరుణ్‌జైట్లీ కూడా చెప్పలేదు. మూడు పేర్ల వెల్లడికే ఇంత సమయం తీసుకుంటే, ఈ తరహా చర్యలకు ఇంకెంత కాలం పడుతుందో ఊహకందని విషయం. ఇప్పటికైనా ఎన్డీయే సర్కారు దేశ ప్రజలకు వాస్తవాలేమిటో వివరించాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.