అనంతపురం ఎడ్యుకేషన్: మరో టీచరు అప్పుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మొన్న రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో బయాలజీ టీచరుగా పని చేస్తున్న రమేష్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఉడాయించారు. నిన్న అనంతపురం ఆర్‌ఎంహెచ్‌ఎస్ స్కూల్‌లో తెలుగు టీచరు దివాకర్‌నాయుడు చీటీలు, వడ్డీ పేరుతో రూ. 12 కోట్ల దాకా అప్పులు చేసి ఉడాయించారు. చివరకు కోర్టులో లొంగిపోవడంతో సబ్‌జైల్‌కు తరలించారు. తాజాగా రూ. 5 కోట్లకు పైగా అప్పులు చేసి అదృశ్యమైన మరో టీచరు బాగోతం వెలుగు చూసింది.
విడపనకల్లు మండలం హావలిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగా పని చేస్తున్న కె.బద్రీనాథ్ కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులే ఉన్నారు. వీరి వద్దే రూ. 3.5 కోట్ల అప్పులు చేశారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోరూ. 25 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది.
ఈయన దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉండటంతో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకున్న డబ్బును బద్రీనాథ్‌కు ఇచ్చామని కొందరు చెబుతుండగా, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును ఇచ్చామని మరికొందరు చెబుతున్నారు. చాలామంది బాధితులు వడ్డీకి ఆశపడి ఇచ్చారు.
రెండు నెలలుగా రావడం లేదు
గణితం టీచరు బద్రీనాథ్ దాదాపు రెండు నెలలుగా పాఠశాలకు రావడం లేదు. ఆయన ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. వీఆర్‌ఎస్ తీసుకుంటాడని మరికొందరు అంటున్నారు. ఆయనైతే నేరుగా నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
– మధురవాణి, హెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్, హావలిగి
Comments
Please login to add a commentAdd a comment