five crores
-
రూ. 5 కోట్ల అప్పు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన టీచర్
అనంతపురం ఎడ్యుకేషన్: మరో టీచరు అప్పుల బాగోతం వెలుగులోకి వచ్చింది. మొన్న రాప్తాడు జెడ్పీహెచ్ఎస్లో బయాలజీ టీచరుగా పని చేస్తున్న రమేష్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఉడాయించారు. నిన్న అనంతపురం ఆర్‌ఎంహెచ్‌ఎస్ స్కూల్లో తెలుగు టీచరు దివాకర్‌నాయుడు చీటీలు, వడ్డీ పేరుతో రూ. 12 కోట్ల దాకా అప్పులు చేసి ఉడాయించారు. చివరకు కోర్టులో లొంగిపోవడంతో సబ్‌జైల్‌కు తరలించారు. తాజాగా రూ. 5 కోట్లకు పైగా అప్పులు చేసి అదృశ్యమైన మరో టీచరు బాగోతం వెలుగు చూసింది. విడపనకల్లు మండలం హావలిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగా పని చేస్తున్న కె.బద్రీనాథ్ కోట్లాది రూపాయలు అప్పులు చేశారు. బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, ఇతర ఉద్యోగులే ఉన్నారు. వీరి వద్దే రూ. 3.5 కోట్ల అప్పులు చేశారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోరూ. 25 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈయన దాదాపు రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నమ్మకంగా ఉండటంతో తమ పిల్లల ఉన్నత చదువుల కోసం దాచుకున్న డబ్బును బద్రీనాథ్‌కు ఇచ్చామని కొందరు చెబుతుండగా, తమ పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న సొమ్మును ఇచ్చామని మరికొందరు చెబుతున్నారు. చాలామంది బాధితులు వడ్డీకి ఆశపడి ఇచ్చారు.రెండు నెలలుగా రావడం లేదు గణితం టీచరు బద్రీనాథ్ దాదాపు రెండు నెలలుగా పాఠశాలకు రావడం లేదు. ఆయన ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. వీఆర్ఎస్ తీసుకుంటాడని మరికొందరు అంటున్నారు. ఆయనైతే నేరుగా నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. – మధురవాణి, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, హావలిగి -
ఎన్నికల వేళ కరెన్సీ కలకలం.. మరో ఐదు కోట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఈనెల 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. మరోవైపు.. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇక, తనిఖీలో భాగంగా భారీగా నగదు పట్టుబడుతున్నది. తాజాగా మరో ఐదు కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, ఇప్పటి వరకు పట్టుబడిన నగదు ఏకంగా రూ.650 కోట్లకు పైగానే చేరుకున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఎన్నికల సందర్బంగా గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదును పట్టుకున్నారు. రెండు కార్లలో రూ.5కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ వైపుగా కారులో గుర్తు తెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో కార్లలో రూ.5కోట్లను తరలిస్తున్నట్లు గుర్తించి.. నగదును సీజ్ చేశారు. అయితే, పట్టుబడిన నగదు ఓ వ్యాపారవేత్తదిగా సమాచారం. పోలీసులు పట్టుకున్న నగదును ఐటీశాఖకు అప్పగించారు. ఇది కూడా చదవండి: పవన్ కంటే బర్రెలక్క నూరుపాళ్లు నయం! -
జిల్లాలో ఐదుకోట్ల మెుక్కలు లక్ష్యం
కలెక్టర్ వాకాటి కరుణ వెల్లడి స్టేషన్‌ఘన్‌పూర్ టౌన్ : జిల్లాలో హరితహారం కార్యక్రమంలో ఐదు కోట్ల మెుక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కలెక్టర వాకాటి కరుణ తెలిపారు. మండలంలోని మీదికొండ క్రాస్‌రోడ్ వద్ద బుధవారం జరిగిన హరితహారంలో ఆమె మెుక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెట్ట పెంపకంతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. అనంతరం కోమటిగూడెంలో శరత్ ఐ ఆసుపత్రి ఆధ్వరంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ సంపత్‌రావు, తహసీల్దార్ సదానందం, డాక్టర్లు శరత్, రామ్మోహన్, డానియేల్, గ్రామసర్పంచ్ రమేష్, ఎంపీటీసీ సభ్యురాలు లత పాల్గొన్నారు. -
చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు నిధులు విడుదల
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సుని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రూ.5.05 కోట్ల అంచనా వ్యయంతో చండీగఢ్‌కు చెందిన జేసీబీఎల్ సంస్థ నుంచి ఈ బస్సు కొనుగోలు నిమిత్తం తుది విడతగా రూ.కోటి ఇరవై ఆరు లక్షలను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషన్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వాయిదాల్లో రూ.రెండున్నర కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రాత్రికి రాత్రే ఉడాయించిన చిట్టీల వ్యాపారి
నార్కెట్‌పల్లి: చిట్టీల వ్యాపారంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిని బాధితులు నిలదీయడంతో.. బుధవారం అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మంగళవారం రాత్రి తట్టా బుట్ట సర్దుకొని పారిపోయాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న అక్కెనపల్లి సైదులు చిట్టీల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈక్రమంలో గత ఐదు నెలలుగా చిట్టీ డబ్బులు చెల్లిచకుండా.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులు తమ డబ్బులు తిరిగి చెల్లించాలని వారం రోజులుగా అతని పై వత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సైదులు బుధవారం అందరి డబ్బులు చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. ఈ రోజు ఉదయం అతని ఇంటికి వచ్చిన బాధితులు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి తాము మోసపోయమని గుర్తించి ఆందోళనకు దిగారు. సుమారు రూ. 5 కోట్ల వరకు నగదు ఇవ్వాల్సి ఉందని బాధితులు వాపోతున్నారు. -
పేరు మహిళలది.. పెత్తనం నేతలది
సాక్షి, కర్నూలు : జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి రూ. 5 కోట్ల ఇసుక అమ్మకాలు జరిగాయి. పరిస్థితులు, అవసరాలు అంచనా వేస్తే ఇప్పటికే రూ. వంద కోట్ల వరకూ వ్యాపారం సాగాలి. వాస్తవానికి అనధికారికంగా అంత వ్యాపారమూ జరిగింది. వివిధ రాజకీయ నాయకుల ప్రమేయంతో అధిక మొత్తం ఇసుకను పక్కదారి పట్టించారు. అన్ని రీచ్‌లలో ఇసుక అమ్మకాలను నేతలు అంతా తామే అయి నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తెచ్చి పెట్టేందుకు ప్రజాప్రతినిధులు తమవంతు పాత్ర పోషించాలి. అవసరమైన సలహాలు ఇవ్వాలి. లోపాలుంటే సరిదిద్దాలి. అధికారులకు సహకరించాలి. అయితే ఇసుక ఆదాయం విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి వీరిలో కొందరు ప్రజాప్రతినిధులే గండికొడుతున్నారు. తెరవెనుక ఉంటూ తమవంతు పాత్ర పోషిస్తుండగా.. నియోజకవర్గ స్థాయి నేతలు కొందరు వారికి వంత పాడుతున్నారు. దీంతో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. అడ్డుకుంటున్న అధికారులపై అధికారపార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అసభ్య పదజాలంతో బెదిరిస్తున్నారు. దీంతో కొందరు అధికారులు మౌనపాత్ర పోషించక తప్పడం లేదు. మరికొందరు అధికారులు మాత్రం నేతల అడుగులకు మడుగులొత్తుతూ అక్రమాలకు ఉడతాభక్తిగా సాయపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్న మహిళలు కేవలం పాత్రధారులు మిగిలిపోతుండగా స్థానిక నాయకులే ప్రధానపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో 12 రీచ్‌లను డ్వాక్రా మహిళలకు అప్పగించారు. ఏ గ్రామంలోనైతే రీచ్ ఉందో ఆ ప్రాంతంలో చురుగ్గా ఉన్న మహిళలకుగాని, మండలం మొత్తం మీద ఉన్న మండల సమాఖ్యలో ఆసక్తి కలిగిన మహిళలకు గానీ రీచ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు. గతంలో ఇసుక రీచ్‌లకు వేలం పాటలు నిర్వహించే వారు. ప్రభుత్వం ధర నిర్ణయిస్తే దానికంటే ఎంత ఎక్కువగా పాడితే వారికి ఆ రీచ్‌ను అప్పగించేవారు. రెండో సంవత్సరం అదే కాంట్రాక్టరు 20 శాతం అదనంగా చెల్లించి రీచ్‌లను నిర్వహించేవారు. ప్రభుత్వం మారాక ఈ విధానంలో మార్పు తీసుకొచ్చింది. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వాస్తవానికి మహిళ సంఘాలకు అంత ఆర్థిక ప్రతిపత్తి లేదు. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అందుకు అనుకూలంగా వీరికి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు అప్పగించారు కానీ క్షేత్రస్థాయిలో వీరు నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశమే కనిపించడం లేదు.