రాత్రికి రాత్రే ఉడాయించిన చిట్టీల వ్యాపారి | Chits merchant absconding | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే ఉడాయించిన చిట్టీల వ్యాపారి

Published Wed, Jan 6 2016 10:36 AM | Last Updated on Sat, Sep 15 2018 8:03 PM

Chits merchant absconding

నార్కెట్‌పల్లి: చిట్టీల వ్యాపారంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి.. తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిని బాధితులు నిలదీయడంతో.. బుధవారం అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి మంగళవారం రాత్రి తట్టా బుట్ట సర్దుకొని పారిపోయాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లిలో బుధవారం వెలుగుచూసింది.

స్థానికంగా నివాసముంటున్న అక్కెనపల్లి సైదులు చిట్టీల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఈక్రమంలో గత ఐదు నెలలుగా చిట్టీ డబ్బులు చెల్లిచకుండా.. తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో బాధితులు తమ డబ్బులు తిరిగి చెల్లించాలని వారం రోజులుగా అతని పై వత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సైదులు బుధవారం అందరి డబ్బులు చెల్లిస్తానని ఒప్పుకున్నాడు. ఈ రోజు ఉదయం అతని ఇంటికి వచ్చిన బాధితులు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి తాము మోసపోయమని గుర్తించి ఆందోళనకు దిగారు. సుమారు రూ. 5 కోట్ల వరకు నగదు ఇవ్వాల్సి ఉందని బాధితులు వాపోతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement