
ఉక్రెయిన్‌లోని కీవ్ నగరంలో ఓ బంకర్‌లో తలదాచుకున్న భారత విద్యార్థులు
కీవ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇక్కడ బాంబుల మోతమోగుతోంది. భద్రతా సిబ్బంది నన్ను, మరో 40 మంది విద్యార్థులను మా అపార్ట్‌మెంట్ నుంచి దూరంగా ఓ బంకర్‌కు తరలించారు. తర్వాత గంటకే మా అపార్ట్ మెంట్ పక్కన ఉన్న మెట్రో స్టేషన్‌పై మిస్సైల్ దాడి జరిగింది. మా అపార్ట్‌మెంట్లో రెండంత స్తులు కూడా దెబ్బ తిన్నాయి. బంకర్‌లో భయం భయంగా ఉంటున్నాం. కరెంటు, నీటి వసతి, ఆహారం సరిగా లేదు. త్వరగా ఇండియాకు తీసుకెళ్లాలి.
– గాజుల అభిషేక్, మదనపల్లి, మాక్లూరు మండలం, నిజామాబాద్
Comments
Please login to add a commentAdd a comment