Apple iOS 16 Top features coming to iPhones - Sakshi
Sakshi News home page

Apple iOS 16: యాపిల్‌ ఐఫోన్లకు కొత్త ఐవోఎస్‌16: ముఖ్య ఫీచర్స్‌ ఇవే!

Published Wed, Jun 8 2022 2:55 PM | Last Updated on Wed, Jun 8 2022 4:20 PM

Apple iOS 16 Top features coming to iPhones - Sakshi

క్యుపర్టినో (అమెరికా): టెక్‌ దిగ్గజం యాపిల్‌ తమ ఐఫోన్‌లకు సంబంధించి ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు స్వల్ప మార్పులు చేసి కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఐవోఎస్‌ 16ను ఆవిష్కరించింది.


త్వరలో దీన్ని ఉచిత డౌన్‌లోడ్‌గా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. గతంతో పోలిస్తే ఐఫోన్‌ యూజర్లు తరచూ ఫోన్‌ను మార్చేయ కుండా పాత డివైజ్‌నే మరికొంత ఎక్కువ కాలం ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు ఇవ్వాల్సిన అవసరం పెరిగింది.  కొత్త ఐవోఎస్‌తో యూజర్లు తమ ఫేవరెట్‌ యాప్‌లను లాక్‌ స్క్రీన్‌పై విడ్జెట్లుగా పెట్టుకోవచ్చు. అలాగే లాక్‌ స్క్రీన్‌పై లైవ్‌ నోటిఫికేషన్లు పొందవచ్చు.  ప్రస్తుతం ఫోన్‌ స్క్రీన్‌ పైభాగం నుంచి వచ్చే  ఇతరత్రా నోటిఫికేషన్లు ఇకనుంచి కింది భాగం నుంచి వస్తాయి.

అలాగే మెసేజీలను పంపిన తర్వాత కూడా ఎడిట్‌ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఫీచర్లు ఐఫోన్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌లో ఉంటాయి. అయితే, ఇందుకోసం ఇరువైపుల యూజర్లు, యాపిల్‌ మెసేజింగ్‌ యాప్‌ను ఉపయోగిస్తుండాలి.

హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలో జరిగిన కార్యక్రమంలో యాపిల్‌ మరికొన్ని ఉత్పత్తులను కూడా ఆవిష్కరించింది. నెక్ట్స్‌ జనరేషన్‌ మ్యాక్‌ చిప్‌లతో మ్యాక్‌బుక్‌ ఎయిర్, మ్యాక్‌బుక్‌ ప్రో ప్రదర్శించింది. మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ రేటు 1,200 డాలర్లుగా, ప్రో ధర రూ. 1,300 డాలర్లుగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement