
పేటీఎం తన వినియోగదారులకు మరింత మెరుగైన సర్వీసు అందించేందుకు సిద్ధమైంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘రిసీవ్ మనీ క్యూఆర్ విడ్జెట్’ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ పేటీఎం క్యూఆర్ కోడ్‌ను నేరుగా తమ స్మార్ట్ ఫోన్ హోమ్ స్క్రీన్‌పై డిస్ ప్లే చేసుకోవచ్చు. ప్రతిసారి యాప్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇన్‌స్టంట్ పేమెంట్ కనెక్షన్‌కు వీలు కల్పించింది.
లావాదేవీలను సరళతరం చేయడంలో భాగంగా గతంలో ఐఓఎస్ యూజర్లకు ఈ క్యూఆర్ విడ్జెట్‌ను పేటీఎం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ సర్వీసును ఆండ్రాయిడ్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. ఇది చిన్న వ్యాపారాలు, దుకాణదారులు.. వంటివారికి నిరాటంకంగా చెల్లింపులను స్వీకరించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసు ద్వారా పేటీఎం చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రియల్ టైమ్ అలర్ట్‌లు
యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు పేటీఎం ప్రత్యేకమైన కాయిన్ డ్రాప్ సౌండ్ నోటిఫికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ రియల్ టైమ్ అలర్ట్ యూజర్ అందుకున్న చెల్లింపుల ధ్రువీకరణను నిర్ధారిస్తుంది. వినియోగదారులు యాప్‌ను తనిఖీ చేయకుండానే లావాదేవీల గురించి తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ డిజిటల్ చెల్లింపుల్లో నమ్మకాన్ని, పారదర్శకతను పెంచుతుందని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: బడ్జెట్‌లో మాకేంటి? ఎవరెవరు ఏం కోరుకుంటున్నారంటే..
క్యూఆర్ విడ్జెట్‌ను ఎలా యాడ్ చేయాలంటే..
ఆండ్రాయిడ్ ఫోన్‌లో సులభంగానే హోమ్ స్క్రీన్‌పై క్యూఆర్ విడ్జెట్‌ను సెటప్ చేసుకోవచ్చు.
పేటీఎం యాప్ ఓపెన్ చేయండి.
ఎగువ ఎడమవైపు ఉన్న ప్రొఫైల్ ఐకాన్ మీద ప్రెస్ చేయాలి.
క్యూఆర్ కోడ్ దిగువన ‘యాడ్ క్యూఆర్ టు హోమ్ స్క్రీన్’ ఆప్షన్ ఎంచుకోండి.
దాన్ని కన్ఫర్మ్ చేయాలి. వెంటనే విడ్జెట్ హోమ్ స్క్రీన్‌పై వస్తుంది.
పేటీఎం యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా క్యూఆర్ విడ్జెట్ ద్వారా చెల్లింపులు స్వీకరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment