క్యూఆర్ కోడ్ ఫుల్ పార్మ్ క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది మెషీన్ రీడబుల్ లేబుల్ వంటిది. దీనిని కంప్యూటర్.. టెక్స్‌ట్ కన్నా సులభంగా అర్థం చేసుకుంటుంది.
డిజిటల్ యుగం వైపు పయనిస్తున్న భారతదేశం అభివృద్ధి పథంలోనూ దూసుకుపోతోంది. నేడు ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా, వారిలో భారతీయుల సహకారం అధికంగా ఉండటం విశేషం. అయితే దీని వెనుక పలువురు ఇంజినీర్ల సహకారం దాగుంది. వారు పలు యాప్‌లను రూపొందించి, డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ముఖ్యమైనది క్యూఆర్ కోడ్. దీని సాయంతో ఎవరికైనా నగదును సులభంగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం ద్వారా ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించారా?
క్యూఆర్ కోడ్ అంటే ఏమిటి?
ఈ రోజుల్లో ప్రతిచోటా క్యూఆర్ కోడ్‌లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం, దానిని గుర్తించడంలో దీని వినియోగం అధికంగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్‌మెంట్, బిల్‌బోర్డ్, బిజినెస్ విండోలో అధికంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్ చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే క్యూఆర్ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్‌కోడింగ్ మోడ్‌లను ఉపయోగిస్తుంది.
క్యూఆర్ కోడ్ ఎలా పని చేస్తుంది?
బార్‌కోడ్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా క్యూఆర్ కోడ్ కోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. మనకు క్యూఆర్ కోడ్‌లో అనేక చుక్కలు కనిపిస్తాయి. బార్‌కోడ్‌లో గీతలు కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్ కోడ్. రెండవది డైనమిక్ క్యూఆర్ కోడ్. స్టాటిక్ క్యూఆర్ కోడ్ స్థిరంగా ఉంటుంది. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్‌డేట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
Comments
Please login to add a commentAdd a comment