మనదేశానికి చెందిన చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అమెరికా వెళ్లి, అక్కడ ఉద్యోగం చేయాలని తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అమెరికా చేరుకున్న తరువాత వారు ప్రధానంగా అనుసరించే 12 దశలు ఇవే..
మొదటి దశ
విద్యార్థిగా ఉన్నప్పుడే మూడు లక్ష్యాలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అవి..
(ఎ) విద్యార్థి రుణాన్ని చెల్లించడం.
(బీ) యూఎస్‌ఏలో ఎక్కడైనా ఉద్యోగం పొందటం.
(సీ) హెచ్1-బీ ఆమోదానికి యత్నం. (ఇది చాలా ముఖ్యమైన లక్ష్యం)
దీనితోపాటు 5 సంవత్సరాలలోపు భారతదేశానికి తిరిగి రావడానికి విస్తృతమైన ప్రణాళికలకు రూపకల్పన.
రెండవ దశ
హెచ్1-బీ ఆమోదం.
గ్రీన్ కరెన్సీతో ఎంజాయ్ చేయడం. టయోటా క్యామ్రీ లేదా హోండా సివిక్ లేదా నిస్సాన్ ఆల్టిమాను కొనుగోలు చేయడం.
భారతదేశంలో ఎక్కడైనా ఆస్తిని కొనుగోలు చేయడం.
మూడవ దశ
విజిటర్ వీసాలపై భారతదేశం నుండి తల్లిదండ్రులను తీసుకురావడం.
ఈ కిందివాటిని విజిట్ చేయడం.
చార్ ధామ్ యాత్ర.
నయాగరా జలపాతం సందర్శన.
స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడటం.
వాల్ స్ట్రీట్‌లో బుల్ ఛార్జింగ్.
వైట్ హౌస్ సందర్శన.
నాల్గవ దశ
భారతదేశానికి వెళ్లడం. పెళ్లి సంబంధం కోసం ఒక అమ్మాయిని ఖరారు చేయడం. మూడు వారాల్లోపు వివాహం చేసుకోవడం. వాస్తవానికి ఇది టైట్ షెడ్యూల్ మధ్య చేసుకున్న వివాహం.
జీవిత భాగస్వామితో పాటు యూఎస్‌ఏకి తిరిగి రావడం.
ఐదవ దశ
ఇతర భారతీయ స్నేహితులతో వారాంతాల్లో, భోజన సమయంలో ఈ 3 అంశాలపై తరచూ చర్చిస్తారు. అవి..
(ఏ) మీరు మీ గ్రీన్ కార్డ్‌ని ఎప్పుడు పొందబోతున్నారు? ప్రస్తుతం మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు?
(బి) మోదీ భారతదేశాన్ని ఎలా మారుస్తున్నారు?
(సీ) క్రికెట్‌పై చర్చించడంతో పాటు భారతదేశంలో మరొక ఆస్తిని కొనుగోలు చేయడం.
ఆరవ దశ
అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయడం. ఇద్దరు పిల్లలను కలిగి ఉండటం. తదుపరి 15 సంవత్సరాలు వారిని చదవులో నిమగ్నమయ్యేలా చేయడం. వారి పుట్టినరోజు పార్టీలకు హాజరు కావడం. వివిధ హోమ్ ప్రాజెక్ట్‌ల కోసం హోమ్ డిపోను సందర్శించడం
ఏడవ దశ
గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షణ ముగియడం
ఎనిమిదవ దశ
ఈ సమయానికి 40 ఏళ్లకు చేరుకుంటారు. అప్పుడు తగినంత నిధులను పొదుపు చేసి ఉంటారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి ప్రణాళిక అప్పుడు వర్కౌట్ కాదు. దీంతో ఆ డబ్బు ఖర్చు చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం.
టెస్లా లేదా బిఎమ్‌డబ్ల్యూ లేదా మెర్సిడెస్‌ని కొనుగోలు చేయడం. ఇండియాలో ప్రాపర్టీలు లాభదాయకంగా ఉండవని భావించడం. ఎందుకంటే అమెరికా డాలర్లతో పోలిస్తే భారతదేశ రూపాయి మరింత క్షీణించింది. దీంతో భారతదేశంలోని ఆస్తులను విక్రయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయడం.
భారతదేశంలో భారీ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించడం. ఇక్కడి నిధులను తిరిగి యునైటెడ్ స్టేట్స్‌కు పంపడం.
తొమ్మిదవ దశ
ఇప్పుడు మిడ్ లైఫ్ సంక్షోభం ఎదురవుతుంది. కొత్త కారు, పెద్ద ఇల్లు, గ్రీన్ కార్డ్, అధిక ఆదాయంతో కూడిన ఉద్యోగం ఇకపై జీవితంలో కానరావు. అప్పుడు ఉనికిని నిలబెట్టుకునేందుకు ఏదో ఒకటి చేయడం. ఒక మారథాన్ రేస్‌లో పాల్గొనడం. అడపాదడపా ఉపవాసం చేయడం లాంటివి. లేదా కొత్త స్టార్టప్‌ని తెరవడం.
పదవ దశ
50- 60 ఏళ్ల వయసుకు చేరుకున్నాక.. పిల్లలు స్టాన్‌ఫోర్డ్ లేదా ఎంఐటీ లేదా ప్రిన్స్‌టన్ నుండి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, మీరు యూఎస్‌ఏకి వచ్చిన 5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లి ఉంటే, జీవితం ఎంత భిన్నంగా ఉంటుందో చర్చిస్తుంటారు.
11వ దశ
పిల్లలు దూరంగా వెళ్లడం, చేతిలో తగినంత సమయం ఉండటంతో, ప్రతి సంవత్సరం యూరప్ పర్యటనలు చేయడం, ఈజిప్ట్‌లోని పిరమిడ్‌లను సందర్శించడం, టర్కిష్ డిలైట్స్‌ని ఆస్వాదించడం, ఇటలీని సందర్శించడం మొదలైనవి చేస్తారు.
భారతదేశం గురించి తిరిగి ఆలోచించడం. ఇటీవలి దశాబ్దాలలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందిందనేది యూఎస్‌ఏలోని స్నేహితులతో పంచుకోవడం.
12వ దశ
ఫంక్షనల్ మొబిలిటీ తగ్గినప్పుడు జీవితానికి సంబంధించిన పెద్ద ప్రశ్న ఎదురవుతుంది. భారతదేశానికి తిరిగి వెళ్లడం లేదా యూఎస్‌ఏలో వృద్ధాశ్రమంలో ఉండటం.
ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment