receive
-
ఏ రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించవచ్చు? నియమనిబంధనలేమిటి?
రాజకీయ పార్టీల విరాళాల సేకరణ విషయంలో ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు నూతన విధానంలో విరాళాలు స్వీకరిస్తున్నాయి. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ అని అంటారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అంశంపై మరోసారి దుమారం చెలరేగడంతో పాటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయితే ఎన్నికల విరాళాలు స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు జారీకావు. ఎలక్టోరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. వీటిలో అతి తక్కువ విలువ కలిగిన బాండ్ రూ. 1,000. కోటి రూపాయలది అత్యధిక విలువ కలిగిన బాండ్. ఈ బాండ్ల కొనుగోలు సంఖ్యపై పరిమితి లేదు. ఎన్నికల సమయంలో, ఎలక్టోరల్ బాండ్ల విక్రయం విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుతాయి. ఎన్నికల విరాళాలను స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీలు ఏవి అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన అంటే రిజిస్టర్ అయిన పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు. ఇంతేకాకుండా లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల విరాళాలు స్వీకరించే పార్టీ ఓట్ షేర్ ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎన్నికల విరాళాలకు సంబంధించిన నియమాలు చాలా సులభతరం అయ్యాయి ఒక వ్యక్తి, సమూహం లేదా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. సంబంధిత రాజకీయ పార్టీ ఈ బాండ్‌ను జారీ చేసిన 15 రోజుల్లోగా ఎన్‌క్యాష్ చేసుకోవాలి. ప్రతి లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు భారీగా విరాళాలు అందుతాయి. ఇది కూడా చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం? -
మద్యం మత్తులో మేనేజర్‌కు మెసేజ్.. ‘ఏందిరా ఇది’ అంటున్న నెటిజన్లు!
మత్తులో మునిగినోడు నిజమే మాట్లాడతాడని, అన్నీ నిజాలే చెబుతాడని చాలా మంది అంటుంటారు. అలా మద్యం మత్తులో అన్నీ నిజాలే మాట్లాడేసి, ఆనక చిక్కుల్లో పడినవారు చాలామందే ఉంటారు. ఇదే బాపతుకు చెందిన ఒక మందుబాబు తన మేనేజర్‌తో చాట్ చేశాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆ మేనేజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మద్యం మత్తులో మునిగిన ఆ జూనియర్ తన బాస్‌కు అర్థరాత్రి 2:30కి మెసేజ్ చేసి, దానిలో.. ‘బాస్ నేను మద్యం మత్తులో ఉన్నాను. నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. నన్ను ముందుకు నడిపిస్తున్నందకు ధన్యవాదాలు. మంచి కంపెనీలో ఉద్యోగం దొరకడం కన్నా మంచి మేనేజర్ దొరకడం ఎంతో కష్టం. నేను చాలా లక్కీ. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోండి. మీకు మీరు అభినందనలు చెప్పుకోండి’ అని రాశాడు. ఈ పోస్టుకు క్యాప్షన్ రాసిన బాస్.. ఎక్స్ నుంచి మద్యం మత్తులో మెసేజ్‌లు రావడం సహజం. కానీ ఇటువంటి మెసేజ్‌లు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఈ పోస్ట్ వైరల్ అయిన నేపధ్యంలో పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఏందిరా ఇది’ అంటూ ఆశ్యర్యపోతున్నారు. ఒక యూజర్..‘మీరు చాలా అదృష్టవంతులు. మీ జూనియర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు’ అని రాయగా మరొకరు మీరు చాలా మంచి మేనేజరై ఉంటారు. లేకుంటే ఇలాంటి మెసేజ్‌లు మీకు రావు’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ఇది యానిమేటెడ్ 3డీ షో కాదు.. ప్రకృతి ఆవిష్కరించిన మెరుపు! Drunk text from ex is okay but have you ever received drunk texts like these? pic.twitter.com/rvkaGMYqLl — Siddhant (@siddhantmin) August 4, 2023 -
ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి
ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపడంతో విదేశాల నుంచి మనదేశానికి చెందిన పురాతన వస్తువులను తిరిగి తీసుకురావడంలో విజయం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్‌లో అమెరికా పర్యటన చేపట్టిన సమయంలో ఆయన భారత్‌కు చెందిన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన ప్రాచీన వస్తువులను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో అమెరికా స్మగ్గింగ్ రూపంలో వచ్చిన 105 పురాతన వస్తువులను న్యూయార్క్‌లో గల భారత కాన్సులేట్‌కు అప్పగించింది. ఇరు దేశాల సాంస్కృతిక ఆస్తి ఒప్పందం వీటిలో రెండవ, మూడవ శతాబ్దాలు మొదలుకొని 18వ, 19వ శతాబ్దాల వరకు గల అనేక అరుదైన కళాఖండాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాతన కళాఖండాల అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించడంలో సహాయపడే సాంస్కృతిక ఆస్తి ఒప్పందం కోసం పని చేయడానికి భారతదేశం-అమెరికా అంగీకరించాయి. ఇటువంటి అవగాహన రెండు దేశాల అంతర్గత భద్రత, చట్ట అమలు సంస్థల మధ్య ద్వైపాక్షిక సహకారానికి దోహదపడుతుంది. ఈ 105 కళాఖండాలు భారతదేశానికి చెందిన పురాతన సంస్కృతిని వివరిస్తాయి. మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించి.. వీటిలో తూర్పు భారతదేశానికి చెందిన 47, దక్షిణ భారతదేశానికి చెందిన 27, మధ్య భారతదేశానికి చెందిన 22, ఉత్తర భారతదేశానికి చెందిన 6, పశ్చిమ భారతదేశానికి చెందిన కొన్ని పురాతన ఆనవాళ్లు ఉన్నాయి. వీటిలో 2వ, 3వ శతాబ్దాలు మొదలుకొని 18వ,19వ శతాబ్దం వరకు గల ఆనవాళ్లు ఉన్నాయి. వీటిలో టెర్రకోట, రాతితో చేసిన కళాఖండాలు, మెటల్, కలపతో రూపొందించిన ఆకృతులు ఉన్నాయి. వీటిలో దాదాపు 50 కళాఖండాలు మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలినవి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి. ఇప్పటివరకూ 278 పురాతన కళాకృతుల అప్పగింత విదేశాలకు అక్రమంగా తరలిపోయిన భారత పురాతన వస్తువులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పురాతన వస్తువులను తిరిగి అందజేయడంపై భారత్- యూఎస్ మధ్య సన్నిహిత సహకారం ఉంది. 2016లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా తన దగ్గరున్న భారత్‌కు చెందిన 16 పురాతన ఆనవాళ్లను అందజేసింది. అదేవిధంగా 2021 సెప్టెంబర్‌లోనూ ప్రధాని మోదీ చొరవతో 157 భారత కళాఖండాలు అమెరికా నుంచి తిరిగి వచ్చాయి. 2016 నుంచి ఇప్పటివరకూ అమెరికా.. భారత్‌కు చెందిన మొత్తం 278 పురాతన కళాకృతులను తిరిగి అప్పగించింది. ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! Fostering 🇮🇳🇺🇸 Cultural bonds Following up on Prime Minister @narendramodi’s historic State Visit, the US side handed over 105 trafficked Indian antiquities. These cultural heritage span from 2nd-3rd century to 18th-19th century representing wide geographical spread. Some of… https://t.co/THba0QfxWv pic.twitter.com/bTgG0B24Tr — India in New York (@IndiainNewYork) July 18, 2023 -
టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు
వాషింగ్టన్: మూడు లక్షలకు పైగా మరణాలతో ప్రపంచంలో కరోనామహమ్మారికి అత్యధికంగా ప్రభావితమైన దేశం అమెరికానే. దేశంలో వ్యాక్సిన్లకు అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు కూడా భారీగానే జరుగుతోంది. ఈ క్రమంలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల వీనియోగానికి అనుమతి లభించింది. దీంతో ప్రజల్లో వ్యాక్సిన్‌పై విశ్వాసాన్ని నింపేందుకు అమెరికా తదుపరి అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. (వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్) అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, అతని భార్య జిల్ వ్యాక్సిన్‌ను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి మోతాదును బహిరంగంగా సోమవారం పొందనున్నారని బైడెన్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ప్రకటించారు. ఇప్పటికే చాలాసార్లు బైడెన్ చెప్పినట్లుగా, వ్యాక్సిన్ సురక్షితమైందని ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని పంపడకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శుక్రవారం పెన్స్ స్వీకరించినట్టుగా బహిరంగంగా టీకా తీసుకుంటారని, అలాగే డెలావేర్ కేంద్రంలో టీకాను తీసుకోనున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలపనున్నారని ఆమె వెల్లడించారు. అలాగే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్, ఆమె భర్త కూడా వచ్చే వారం టీకాను స్వీకరిస్తారు. కరోనా టీకా తొలి మోతాదును స్వీకరించనున్నామని ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కారెన్,హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించిన అనంతరం బైడెన్ నిర్ణయం రావడం విశేషం. మరోవైపు బైడెన్ సీనియర్ సలహాదారుడు, కాంగ్రెస్ సభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్కు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వల్ల 3,14000 మంది మరణించారు. -
రూ. 8.45 లక్షల కోట్ల డిపాజిట్లు
ముంబై: పెద్ద నోట్ల రద్దుతర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వెల్లువ కొనసాగుతోంది. నవంబరు 27 నాటికి మొత్తం రూ.8.45 లక్షల కోట్ల డిపాజిట్ అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వివరించింది. డిపాజిట్ల విలువ రూ. 8,44,982 కోట్లకు చేరిందని ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం ఆర్థిక వ్యవస్థనుంచి 86శాతం వాటావున్న పె ద్ద నోట్ల రద్దు తరువాత రూ 33.948 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి జరిగింది. రూ.14 లక్షల కోట్ల విలువైన రూ..500 నుంచి రూ .1,000 నోట్ల ఉపసంహరణ తరువాత వివిధ బ్యాంకులకు అందించిన డిపాజిట్లురూ. 8,11,033తో కలిపి తిరిగి వచ్చిన డబ్బు మొత్తం రూ 8,44,982 కోట్లకు చేరింది. నవంబరు 8 తరువాత నవంబరు 10 - 27తేదీల్లో బ్యాంకుల ద్వారా గానీ, ఏటీఎం ల ద్వారా ప్రజలు విత్ డ్రా చేసిన మొత్తం రూ. 2,16,617 లుగా ఆర్బీఐ వెల్లడించింది. -
మోదీకి కానుకగా పటేల్ వస్తువులు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అపూరమైన కానుక స్వీకరించారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వాడిన వ్యక్తిగత వస్తువులను మోదీకి బహూకరించారు. పటేల్ 139 జయంతి సందర్భంగా మంజరి ట్రస్ట్ర్ వీటిని అందజేసినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పటేల్ వాడిన ప్లేట్లు, కప్‌లు, సాసర్లు మోదీకి అందజేశారు. పటేల్ మనవడు దహ్యాభాయ్ పటేల్ ఆయన భార్య లూయ్ వీటిని మంజరి ట్రస్ట్ ద్వారా మోదీకి పంపించారు. భారత వారసత్వంలో పటేల్ ఉపయోగించిన వస్తువులు కీలకమని మోదీ అన్నారు. వీటిని భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని మోదీ చెప్పారు. -
మోహన్ బాబుకు బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బెజవాడ గోపాలరెడ్డి అవార్డు అందుకున్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ అవార్డును మోహన్ బాబుకు అందజేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. -
ఆంధ్రప్రదేశ్ రెండో విడత ఎన్నికలు.. ఏప్రిల్ 12 నుంచి నామినేషన్ల స్వీకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే రెండో విడత శాసన సభ, లోక్‌సభ ఎన్నికలకు ఏప్రిల్ 12 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. సీమాంధ్ర ప్రాంతాల్లో జరిగే ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేయడానికి ఆఖరు గడువు ఈ నెల 19 అని ఎన్నికల సంఘం తెలియజేసింది. కాగా 14న అంబేద్కర్ జయంతి ..18న గుడ్‌ఫ్రైడే కావడంతో సెలవు దినాలు ఉంటాయి. దీంతో 14, 18 తేదీల్లో నామినేషన్లు స్వీకరించబోమని ఎన్నికల సంఘం తెలిపింది. ఆఖరు గడువు ఈ నెల 19వ తేది రోజు ఆఖరి నిమిషంలో దాఖలయ్యే నామినేషన్లలో ఎలాంటి తప్పులున్నా తిరస్కరిస్తారు. కావున అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటపుడు ఈ విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.