ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపడంతో విదేశాల నుంచి మనదేశానికి చెందిన పురాతన వస్తువులను తిరిగి తీసుకురావడంలో విజయం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్‌లో అమెరికా పర్యటన చేపట్టిన సమయంలో ఆయన భారత్‌కు చెందిన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన ప్రాచీన వస్తువులను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో అమెరికా స్మగ్గింగ్ రూపంలో వచ్చిన 105 పురాతన వస్తువులను న్యూయార్క్‌లో గల భారత కాన్సులేట్‌కు అప్పగించింది.
ఇరు దేశాల సాంస్కృతిక ఆస్తి ఒప్పందం
వీటిలో రెండవ, మూడవ శతాబ్దాలు మొదలుకొని 18వ, 19వ శతాబ్దాల వరకు గల అనేక అరుదైన కళాఖండాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాతన కళాఖండాల అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించడంలో సహాయపడే సాంస్కృతిక ఆస్తి ఒప్పందం కోసం పని చేయడానికి భారతదేశం-అమెరికా అంగీకరించాయి. ఇటువంటి అవగాహన రెండు దేశాల అంతర్గత భద్రత, చట్ట అమలు సంస్థల మధ్య ద్వైపాక్షిక సహకారానికి దోహదపడుతుంది. ఈ 105 కళాఖండాలు భారతదేశానికి చెందిన పురాతన సంస్కృతిని వివరిస్తాయి.
మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించి..
వీటిలో తూర్పు భారతదేశానికి చెందిన 47, దక్షిణ భారతదేశానికి చెందిన 27, మధ్య భారతదేశానికి చెందిన 22, ఉత్తర భారతదేశానికి చెందిన 6, పశ్చిమ భారతదేశానికి చెందిన కొన్ని పురాతన ఆనవాళ్లు ఉన్నాయి. వీటిలో 2వ, 3వ శతాబ్దాలు మొదలుకొని 18వ,19వ శతాబ్దం వరకు గల ఆనవాళ్లు ఉన్నాయి. వీటిలో టెర్రకోట, రాతితో చేసిన కళాఖండాలు, మెటల్, కలపతో రూపొందించిన ఆకృతులు ఉన్నాయి. వీటిలో దాదాపు 50 కళాఖండాలు మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలినవి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి.
ఇప్పటివరకూ 278 పురాతన కళాకృతుల అప్పగింత
విదేశాలకు అక్రమంగా తరలిపోయిన భారత పురాతన వస్తువులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పురాతన వస్తువులను తిరిగి అందజేయడంపై భారత్- యూఎస్ మధ్య సన్నిహిత సహకారం ఉంది. 2016లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా తన దగ్గరున్న భారత్‌కు చెందిన 16 పురాతన ఆనవాళ్లను అందజేసింది. అదేవిధంగా 2021 సెప్టెంబర్‌లోనూ ప్రధాని మోదీ చొరవతో 157 భారత కళాఖండాలు అమెరికా నుంచి తిరిగి వచ్చాయి. 2016 నుంచి ఇప్పటివరకూ అమెరికా.. భారత్‌కు చెందిన మొత్తం 278 పురాతన కళాకృతులను తిరిగి అప్పగించింది.
ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు!
Fostering 🇮🇳🇺🇸 Cultural bonds
— India in New York (@IndiainNewYork) July 18, 2023
Following up on Prime Minister @narendramodi’s historic State Visit, the US side handed over 105 trafficked Indian antiquities.
These cultural heritage span from 2nd-3rd century to 18th-19th century representing wide geographical spread.
Some of… https://t.co/THba0QfxWv pic.twitter.com/bTgG0B24Tr
Comments
Please login to add a commentAdd a comment