smuggled goods
-
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి
ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపడంతో విదేశాల నుంచి మనదేశానికి చెందిన పురాతన వస్తువులను తిరిగి తీసుకురావడంలో విజయం దక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ 2023 జూన్‌లో అమెరికా పర్యటన చేపట్టిన సమయంలో ఆయన భారత్‌కు చెందిన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిన ప్రాచీన వస్తువులను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో అమెరికా స్మగ్గింగ్ రూపంలో వచ్చిన 105 పురాతన వస్తువులను న్యూయార్క్‌లో గల భారత కాన్సులేట్‌కు అప్పగించింది. ఇరు దేశాల సాంస్కృతిక ఆస్తి ఒప్పందం వీటిలో రెండవ, మూడవ శతాబ్దాలు మొదలుకొని 18వ, 19వ శతాబ్దాల వరకు గల అనేక అరుదైన కళాఖండాలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పురాతన కళాఖండాల అక్రమ స్మగ్లింగ్‌ను నిరోధించడంలో సహాయపడే సాంస్కృతిక ఆస్తి ఒప్పందం కోసం పని చేయడానికి భారతదేశం-అమెరికా అంగీకరించాయి. ఇటువంటి అవగాహన రెండు దేశాల అంతర్గత భద్రత, చట్ట అమలు సంస్థల మధ్య ద్వైపాక్షిక సహకారానికి దోహదపడుతుంది. ఈ 105 కళాఖండాలు భారతదేశానికి చెందిన పురాతన సంస్కృతిని వివరిస్తాయి. మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించి.. వీటిలో తూర్పు భారతదేశానికి చెందిన 47, దక్షిణ భారతదేశానికి చెందిన 27, మధ్య భారతదేశానికి చెందిన 22, ఉత్తర భారతదేశానికి చెందిన 6, పశ్చిమ భారతదేశానికి చెందిన కొన్ని పురాతన ఆనవాళ్లు ఉన్నాయి. వీటిలో 2వ, 3వ శతాబ్దాలు మొదలుకొని 18వ,19వ శతాబ్దం వరకు గల ఆనవాళ్లు ఉన్నాయి. వీటిలో టెర్రకోట, రాతితో చేసిన కళాఖండాలు, మెటల్, కలపతో రూపొందించిన ఆకృతులు ఉన్నాయి. వీటిలో దాదాపు 50 కళాఖండాలు మతపరమైన ఇతివృత్తాలకు సంబంధించినవి ఉన్నాయి. మిగిలినవి సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి. ఇప్పటివరకూ 278 పురాతన కళాకృతుల అప్పగింత విదేశాలకు అక్రమంగా తరలిపోయిన భారత పురాతన వస్తువులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పురాతన వస్తువులను తిరిగి అందజేయడంపై భారత్- యూఎస్ మధ్య సన్నిహిత సహకారం ఉంది. 2016లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా తన దగ్గరున్న భారత్‌కు చెందిన 16 పురాతన ఆనవాళ్లను అందజేసింది. అదేవిధంగా 2021 సెప్టెంబర్‌లోనూ ప్రధాని మోదీ చొరవతో 157 భారత కళాఖండాలు అమెరికా నుంచి తిరిగి వచ్చాయి. 2016 నుంచి ఇప్పటివరకూ అమెరికా.. భారత్‌కు చెందిన మొత్తం 278 పురాతన కళాకృతులను తిరిగి అప్పగించింది. ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్ విచారణలో సంచలన నిజాలు! Fostering 🇮🇳🇺🇸 Cultural bonds Following up on Prime Minister @narendramodi’s historic State Visit, the US side handed over 105 trafficked Indian antiquities. These cultural heritage span from 2nd-3rd century to 18th-19th century representing wide geographical spread. Some of… https://t.co/THba0QfxWv pic.twitter.com/bTgG0B24Tr — India in New York (@IndiainNewYork) July 18, 2023 -
స్మగ్లింగ్ దందా.. 51 లక్షల ఉద్యోగాలకు ఎసరు
సాక్షి, అమరావతి: తక్కువకు వస్తాయనే ఉద్దేశంతో కొంతమంది స్మగుల్ గూడ్స్ కొంటూ ఉంటారు. ఈ అక్రమ వ్యాపారం ద్వారా ఏటా లక్షల కోట్లు చేతులు మారతాయంటే నమ్మగలమా? ఈ స్మగ్లింగ్ వల్ల ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తోంది. దేశంలో పరిశ్రమల విస్తరణకు విఘాతంగా మారి ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. స్మగ్లింగ్ దందా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగా దెబ్బతీస్తోందనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రముఖ మార్కెట్ అధ్యయన సంస్థ ‘థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(టీఏఆర్‌ఐ) ద్వారా అధ్యయనం చేయించింది. దేశ మార్కెట్లోకి అక్రమంగా చొరబడుతున్న ఉత్పత్తుల్లో మొదటి ఐదు స్థానాల్లో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, గృహ వినియోగ, మద్యం, పొగాకు ఉత్పత్తులు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఐదు కేటగిరీల్లో స్మగ్లింగ్ దందా ప్రభావాన్ని టీఏఆర్‌ఐ ద్వారా అధ్యయనం చేశారు. విదేశాల నుంచి దేశంలోకి స్మగ్లింగ్ చేస్తున్న టాప్–5 ఉత్పత్తుల విలువ ఏటా రూ. 2.60 లక్షల కోట్లుగా ఉంటోంది. దాంతో భారత ప్రభుత్వం పన్నుల ద్వారా రావాల్సిన రూ. 58 వేల కోట్ల ఆదాయాన్ని ఏటా కోల్పోతోంది. అంతే కాదు 51 లక్షల ఉపాధి అవకాశాలకు కూడా గండి పడుతోంది. ఆ ఐదు కేటగిరీల స్మగ్లింగ్ తీవ్రత ఎలా ఉందంటే.. ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు దేశంలోకి ఏటా సగటున రూ. 1,42,284 కోట్ల విలువైన ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులు విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల మార్కెట్లో ఈ అక్రమ దిగుమతి ఉత్పత్తుల వాటా ఏకంగా 25.09 శాతం ఉంటోంది. తద్వారా దేశం రూ. 17,074 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. అంతేకాదు అక్రమ ఉత్పత్తులతో దేశంలో ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల పరిశ్రమను దెబ్బతీస్తోంది. దాంతో దేశంలో 7.94 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. గృహ వినియోగ ఉత్పత్తులు గృహోపకరణాలు, గృహవినియోగ ఉత్పత్తులు, వ్యక్తిగత వినియోగ ఉత్పత్తులే దేశంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ఈ మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ ఉత్పత్తులు కొల్లగొడుతున్నాయి. దేశంలోకి ఏటా రూ. 55,530 కోట్ల విలువైన గృహవినియోగ ఉత్పత్తులు అక్రమగా దిగుమతి అవుతున్నాయి. మొత్తం మార్కెట్ వాటాలో ఈ ఉత్పత్తుల వాటా 34.25 శాతం ఉంది. దాంతో దేశం ఏటా రూ. 9,995 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఇక పరిశ్రమలు దెబ్బతినడంతో దేశంలో ఏటా 2.89 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మద్యం ఉత్పత్తులు.. విదేశాల నుంచి వచ్చే అక్రమ మద్యం దేశ మార్కెట్‌ను కొల్లగొడుతోంది. ఏటా రూ. 23,466 కోట్ల విలువైన విదేశీ అక్రమ మద్యం దేశ మార్కెట్లోకి చొరబడుతోంది. దేశంలో మద్యం మార్కెట్లో ఈ అక్రమ మద్యం వాటా 19.87 శాతం. దాంతో దేశం ఏటా రూ. 15,262 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 97 వేల మంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. పొగాకు ఉత్పత్తులు విదేశాల నుంచి దేశ మార్కెట్లోకి ఏటా రూ. 22,930 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. దేశ పొగాకు మార్కెట్లో ఈ ఉత్పత్తుల వాటా 20.04 శాతం ఉంది. దాంతో దేశం ఏటా సగటున రూ. 13,331 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. దేశంలో 3.7 లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. మొబైల్ ఫోన్ల మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మొబైల్ ఫోన్ల మార్కెట్‌ను కూడా స్మగ్లింగ్ చీడ పీడిస్తోంది. విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఏటా రూ. 15,884 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు వచ్చి చేరుతున్నాయి. దేశ మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఈ ఫోన్ల వాటా 7.56 శాతంగా ఉంది. దాంతో దేశం రూ. 2,859 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో పాటు దేశంలో 35 వేల మంది ఉపాధి అవకాశాలకు గండి పడుతోంది. -
FRAI: చిన్న వర్తకుల పొట్ట గొడుతున్న నకిలీలు
గువహటి: చిన్న వర్తుకుల పొట్టగొడుతూ, ప్రభుత్వాల పన్ను ఆదాయానికి గండి కొడుతున్న నకిలీ ఉత్పత్తులను అరికట్టేందుకు ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఆర్ఏఐ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. రోజువా రీ వినియోగించే ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరింది. 2023–24 బడ్జెట్‌కు ముందు ఈ మేరకు తన డిమాండ్లను తెలియజేసింది. ఈ సమాఖ్య పరిధిలో 42 రిటైలర్స్ అసోసియేషన్లు భాగంగా ఉన్నాయి. వీటి పరిధిలో 80 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి రిటైల్ వర్తకులు సభ్యులుగా ఉన్నారు. నిత్యావసర వస్తువులపై అధిక పన్నులు అక్రమ వాణిజ్యానికి వీలు కల్పిస్తున్నట్టు ఈ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో రిటైల్ వర్తకులు ఈ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేసే నేరస్థులతో పోరాడాల్సి వస్తోందని ఎఫ్ఆర్ఏఐ పేర్కొంది. ‘‘80 లక్షల మంది రిటైల్ వర్తకుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వినతి పత్రం ఇచ్చాం. ఈ వర్తకులు అందరూ బిస్క ట్లు, సాఫ్ డ్రింక్‌లు, మినరల్ వాటర్, కన్ఫెక్షనరీలు, సిగరెట్లు తదితర వస్తువుల విక్రయంతో జీవనోపాధి పొందుతున్న వారే’’అని సమాఖ్య తెలిపింది. 25–30 శాతం నకిలీలే.. ‘‘చిన్న వర్తకులు కరోనా మహమ్మారికి ముందు నెలవారీగా రూ.6,000–12,000 సంపాదించే వారు. కొంచెం పెద్ద వర్తకులు, మధ్యస్థాయి రిటైలర్లు రోజువారీ ఆదాయం రూ.400–500 వరకు ఉండేది. సూక్ష్మ వర్తకుల ఆదాయం రోజుకు రూ.200గా ఉండేది. కానీ, కొంత కాలంగా మా వర్తకులు విక్రయించే ఉత్పత్తులు పోలిన నకిలీ ఉత్పత్తులు, అక్రమంగా రవాణా (పన్నులు కట్టని) అయినవి మార్కెట్లో పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇవి సులభంగా లభిస్తున్నాయి. వీటి వాటా 25–30 శాతంగా ఉంటుంది’’అని ఎఫ్ఆర్ఏఐ ప్రెసిడెంట్ రామ్ అస్రే మిశ్రా తెలిపారు. ఎఫ్ఆర్ఐఏలో సభ్యులుగా ఉన్న వర్తకుల్లో ఎక్కువ మంది చదువుకోని వారేనని, ఆర్థికంగా దిగువ స్థాయిలోని వారిగా పేర్కొంది. ఉపాధి కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా షాపులు నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నట్టు వివరించింది. వారి కుటుంబాలకు ఇదే జీవనాధారమని పేర్కొంటూ.. నేరగాళ్లు అక్రమ, నకిలీ ఉత్పత్తులతో తమ ఉపాధికి గండి కొట్టడమే కాకుండా, ప్రభుత్వానికి పన్ను రాకుండా చేస్తున్నట్టు సమాఖ్య తన వినతిపత్రంలో పేర్కొంది. చిన్న వర్తకులు నకిలీ, అక్రమార్కులను ఎదుర్కోలేని స్థితిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. మనదేశంలో తయారైన నిత్యావసర వినియోగ వస్తువలపై అధిక పన్నులే అక్రమ రవాణా, నకిలీ ఉత్పత్తులకు అవకాశం ఇస్తున్నందున.. ప్రభుత్వం పన్నులు తగ్గించడం ద్వారా చిన్న వర్తకులను ఆదుకోవాలని కోరింది. ఖజానా ఆదాయానికి గండి.. ‘‘అక్రమార్గాల్లో తీసుకొచ్చిన, నకిలీ ఉత్పత్తులు పూర్తిగా పన్నులు ఎగ్గొట్టేవి. అవి చట్టబద్ధమైన ఉత్పత్తులతో పోలిస్తే సగం ధరకే లేదంటే మూడింట ఒక వంతు ధరకే లభిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్ను ఆదాయం రాకుండా పోతోంది’’అని సమాఖ్య వివరించింది. ఉదాహరణకు సిగరెట్లను ప్రస్తావించింది. 84ఎంఎం పొడువు ఉండే 20 సిగరెట్ల ప్యాకెట్ చట్టబద్ధమైన ధర రూ.300 అయితే, అక్రమ మార్గంలో తీసుకొచ్చిన ఇదే మాదిరి ఉత్పత్తి రూ.80–150 ధరకే వినియోగదారులకు లభిస్తోందని తెలిపింది. -
అత్తరు.. అవినీతి కంపు
మడకశిర: ఇంటి పేరు కస్తూరి... ఇంటిలో గబ్బిలాల కంపు అన్న చందంగా మారింది సెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాల తీరు. ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ గంధపు చెక్కల స్మగ్లర్లతో సంబంధాలు నెరపుతూ, అక్రమ వ్యాపారానికి తెర తీశారు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న ఈ తంతు ఇటీవల పోలీసుల తనిఖీలతో వెలుగు చూసింది. అక్కడ కాదంటే ఇక్కడికొచ్చి... సెంట్ తయారీలో కీలకమైన గంధపు నూనె ఉత్పత్తి ఫ్యాక్టరీల నిర్వహణకు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అనుమతి లేదు. కొన్ని నిబంధనలతో ఫ్యాక్టరీలను నిర్వహించుకునేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో కేరళ వాసులు కొందరు మడకశిర నియోజకవర్గం అమరాపురంలో 30 ఏళ్ల క్రితం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ మూతపడింది. రొళ్ల, అగళి మండలం హుళ్లేకెర, అమరాపురం మండలం బసవనపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. నిబంధనలు గాలికి.. ప్రభుత్వ నిబంధనలను సెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు తుంగలో తొక్కారు. అటవీ శాఖ అనుమతితో కొనుగోలు చేయాల్సిన గంధపు చెక్కలను నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లోని స్మగ్లర్ల ద్వారా అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుని నూనె ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమరాపురం మండలం బసవనపల్లి సెంట్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ ఉంచిన దాదాపు రూ.1.25 కోట్లు విలువైన 35 క్వింటాళ్ల గంధపు చెక్కలు, 16 లీటర్ల గంధం నూనెను ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఈ విషయంగా ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. రెన్యూవల్ చేసుకోకుండానే ఫ్యాక్టరీని నడిపిన రోజులూ ఉన్నట్లుగా పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. గంధపు చెక్కలను ఉడకబెట్టే సమయంలో వివిధ రకాల పొట్టు తప్ప కలపను వాడరాదనే నిబంధన ఉంది. అయితే ఫ్యాక్టరీ నిర్వాహకులు యథేచ్ఛగా కట్టెలను వాడి పర్యావరణానికి హాని కలిగించినట్లు గుర్తించారు. నిబంధనలకు పాతరేస్తూ ఉత్పత్తి చేసిన గంధం నూనెను అరబ్ దేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేసి రూ.కోట్లలో నిర్వాహకులు గడించినట్లు తెలుస్తోంది. మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీల పర్యవేక్షణను అటవీశాఖ అధికారులు, పోలీసులు గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. కట్టుదిట్టమైన నిఘా మడకశిర నియోజకవర్గంలోని సెంట్ ఫ్యాక్టరీలపై ఇకపై గట్టి నిఘా పెడతాం. కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల నుంచి గంధపు చెక్కలు అక్రమంగా ప్యాక్టరీలకు చేరకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించకపోతే ప్యాక్టరీల లైసెన్సులను రద్దు చేస్తాం. -
సనత్ ఇదేం పని..
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, మరో ఇద్దరు క్రికెటర్లు భారత్‌కు కుళ్లిన వక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయని దైనిక్ భాస్కర్ వెల్లడించింది. నాగపూర్‌లో రూ కోట్లు విలువైన ముడి వక్కలను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అక్రమ దందాలో జయసూర్య పేరు వెలుగులోకి వచ్చిందని ఆ కథనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి విచారించేందుకు జయసూర్యను రెవిన్యూ ఇంటెలిజెన్స్ బృందం ముంబైకి పిలిపించినట్టు సమాచారం. అధికారుల కళ్లుగప్పి సాగిన ఈ అక్రమ దందాలో మరో ఇద్దరు క్రికెటర్ల ప్రమేయం ఉన్నా వారి పేర్లు ఇంకా వెల్లడికాలేదని తెలిసింది. డిసెంబర్ 2న జరిగే విచారణకు వారు హాజరయ్యే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ కథనం తెలిపింది. ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తరలించిన వక్కలను తర్వాత వారు భారత్‌కు చేరవేస్తున్నారని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. దక్షిణాసియా స్వేచ్ఛా వర్తక ప్రాంత చట్టాన్ని ఆసరాగా చేసుకుని మాజీ క్రికెటర్లు డమ్మీ కంపెనీలతో అక్రమ లావాదేవీలు సాగించినట్టు సమాచారం. ఈ చట్టం ప్రకారం భారత్, శ్రీలంకల మధ్య దేశీయంగా రూపొందే ఉత్పత్తుల పన్ను రహిత రవాణాకు అనుమతిస్తారు. మాజీ క్రికెటర్లు తమకున్న పలుకుబడితో డమ్మీ కంపెనీల ద్వారా శ్రీలంక అధికారుల నుంచి ట్రేడ్, ఎగుమతి లైసెన్సులు పొంది, వక్కలను శ్రీలంకలోనే తయారైనట్టు నకిలీ పత్రాలు రూపొందించి సరుకును భారత్‌కు తరలిస్తున్నట్టు ఈ కథనం పేర్కొంది. -
స్మగ్లింగ్.. డెడ్చీప్లో మొబైల్ ఫోన్స్
సాక్షి, అమరావతి బ్యూరో : ఆటబొమ్మల పేరుతో చైనా నుంచి మనదేశంలోకి భారీగా డ్రోన్లు, సెల్ఫోన్లు స్మగ్లింగ్ చేస్తున్న రాకెట్ బాగోతం బయటపడింది. పక్కా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) బృందాలు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. డీఆర్ఐ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... కొన్నేళ్లుగా పెరిగిన చైనా దిగుమతులు.. చైనా నుంచి కృష్ణపట్నం పోర్టుకు కొన్నేళ్లుగా ఆట వస్తువులు భారీగా దిగుమతి అవుతున్నాయి. అయితే పిల్లల ఆట వస్తువుల పేరుతో సెల్ఫోన్లు, కెమెరా కలిగిన డ్రోన్లు అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు హైదరాబాద్‌లోని డీఆర్ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారు ఇచ్చిన సమాచారంతో విజయవాడలోని డీఆర్ఐ ప్రాంతీయ ఆపరేషన్స్ విభాగం అధికారులు ఈనెల 3, 4వ తేదీల్లో కృష్ణపట్నం పోర్టులో తనిఖీలు చేశారు. ఆటవస్తువుల పేరుతో దిగుమతి అయిన కంటైనర్లను తనిఖీ చేయడంతో విషయం బట్టబయలైంది. హైదరాబాద్ తరలించేందుకే? చైనా నుంచి వచ్చిన కంటైనర్లలో భారీ సంఖ్యలో సెల్ఫోన్లు, డ్రోన్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ కంటైనర్‌లో దాదాపు 5,500 సెల్ఫోన్లు, 5 ఫాంటమ్ 4 డ్రోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయి. వీటి విలువ దాదాపు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇతర కంటైనర్లలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. డ్రోన్లు అక్రమంగా దిగుమతి కావడం ఆందోళనకరమైన అంశమని అధికారవర్గాలు చెబుతున్నాయి. డ్రోన్లను కృష్ణపట్నం పోర్టు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీలపై డీఆర్ఐ కేంద్ర కార్యాలయానికి నివేదించిన అనంతరం అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా స్మగ్లింగ్ చేసిన వాటిని వారంటీ, గ్యారంటీ లేకుండా తక్కువ ధరకు విక్రయిస్తున్నారని అధికారులు చెప్పారు. వీటివల్ల దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అక్రమ డ్రోన్లు ఎవరి కోసం? చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేస్తున్న సెల్ఫోన్లు, డ్రోన్లు ఎక్కడికి తరలిస్తున్నారనే అంశంపై డీఆర్ఐ వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రోన్ల వినియోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. విచ్ఛిన్నకర శక్తులు సంఘ విద్రోహ కార్యకలాపాలకు వీటిని వినియోగించే ప్రమాదం ఉండటంతో డ్రోన్ల వాడకంపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించారు. -
స్మగ్లింగ్‌లో సిగరెట్లదే అగ్రస్థానం
గతేడాది రూ. 200 కోట్ల సిగరెట్ల పట్టివేత 5 కేజీల బంగారంతో రెండో స్థానంలో బంగారం కాకినాడ రేవు ఆదాయం తగ్గి.. కృష్ణపట్నంలో పెరిగింది సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి అక్రమంగా తరలివస్తున్న వస్తువుల జాబితాల్లో మొదటి స్థానంలో సెగరెట్లు ఉండగా, ఆ తర్వాతి స్థానంలో బంగారం ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ. 200 కోట్ల విలువైన సిగరెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గడిచిన ఏడాదిలో 39 సిగరెట్ల స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయని, సుమారు రూ. 198.6 కోట్ల విలువైన 6,000 కార్టన్ల విదేశీ సిగరెట్లను పట్టుకొని ధ్వంసం చేసినట్లు రాష్ట్ర కస్టమ్స్ కమిషనర్ ఖాదర్ రెహమాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఇదే సమయంలో 5 బంగారం స్మగ్లింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం రూ. 1.37 కోట్ల విలువైన 4.67 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్‌ను అరికట్టడం ద్వారా గతేడాది రూ. 311 కోట్ల అదనపు ఆదాయం కస్టమ్స్ శాఖకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తగ్గిన కాకినాడ రేవు జోరు బొగ్గు, ఎరువుల దిగుమతులు గణనీయంగా తగ్గడంతో కాకినాడ రేవు ఆదాయం బాగా పడిపోయింది. 2015–16లో రూ. 1,208 కోట్లుగా ఉన్న కస్టమ్స్ ఆదాయం 2016–17లో 8 శాతం తగ్గి రూ. 1,109 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో కృష్ణపట్నం ఆదాయంలో 24 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. కృష్ణపట్నం రేవు కస్టమ్స్ ఆదాయం రూ. 1,735 కోట్ల నుంచి రూ. 2,152 కోట్లకు పెరిగింది. పొగాకు, గ్రానైట్, మిర్చి, పత్తి ఎగుమతులలో 20 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం తో కృష్ణపట్నం ఆదాయం పెరిగింది. ఎగుమతిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా 150 శాతం పెరిగాయి. 2015–16లో ఎగుమతి ప్రోత్సాహకాలు (కస్టమ్ డ్యూటీ వెనక్కి ఇవ్వడం) రూ. 100 కోట్లుగా ఉంటే 2016–17లో ఈ మొత్తం రూ. 250 కోట్లు దాటింది.