న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అపూరమైన కానుక స్వీకరించారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ వాడిన వ్యక్తిగత వస్తువులను మోదీకి బహూకరించారు. పటేల్ 139 జయంతి సందర్భంగా మంజరి ట్రస్ట్ర్ వీటిని అందజేసినట్టు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
పటేల్ వాడిన ప్లేట్లు, కప్లు, సాసర్లు మోదీకి అందజేశారు. పటేల్ మనవడు దహ్యాభాయ్ పటేల్ ఆయన భార్య లూయ్ వీటిని మంజరి ట్రస్ట్ ద్వారా మోదీకి పంపించారు. భారత వారసత్వంలో పటేల్ ఉపయోగించిన వస్తువులు కీలకమని మోదీ అన్నారు. వీటిని భద్రపరచడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని మోదీ చెప్పారు.
మోదీకి కానుకగా పటేల్ వస్తువులు
Published Fri, Oct 31 2014 1:47 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement