టీకా భద్రత : బైడైన్‌ దంపతుల ​ముందడుగు | Joe Biden, wife to get COVID-19 vaccine doses on Monday | Sakshi
Sakshi News home page

టీకా భద్రత : బైడైన్‌ దంపతుల ​ముందడుగు

Published Sat, Dec 19 2020 12:00 PM | Last Updated on Sat, Dec 19 2020 12:01 PM

Joe Biden, wife to get COVID-19 vaccine doses on Monday - Sakshi

వాషింగ్టన్‌: మూడు లక్షలకు పైగా మరణాలతో ప్రపంచంలో కరోనామహమ్మారికి అత్యధికంగా ప్రభావితమైన దేశం అమెరికానే. దేశంలో వ్యాక్సిన్లకు అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు కూడా భారీగానే జరుగుతోంది. ఈ క్రమంలో ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్ల వీనియోగానికి అనుమతి లభించింది. దీంతో ప్రజల్లో వ్యాక్సిన్‌పై విశ్వాసాన్ని నింపేందుకు అమెరికా తదుపరి అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. (వ్యాక్సిన్‌ షాట్‌: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్‌)

అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌,  అతని భార్య జిల్  వ్యాక్సిన్‌ను స్వీకరించేందుకు ముందుకు వచ్చారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి మోతాదును  బహిరంగంగా సోమవారం పొందనున్నారని  బైడెన్‌  ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి ప్రకటించారు. ఇప్పటికే చాలాసార్లు  బైడెన్‌ చెప్పినట్లుగా, వ్యాక్సిన్‌ సురక్షితమైందని ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని పంపడకోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శుక్రవారం పెన్స్‌ స్వీకరించినట్టుగా బహిరంగంగా  టీకా తీసుకుంటారని, అలాగే డెలావేర్‌ కేంద్రంలో టీకాను తీసుకోనున్న సిబ్బందికి  కృతజ్ఞతలు తెలపనున్నారని ఆమె వెల్లడించారు.  అలాగే ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్,  ఆమె భర్త కూడా వచ్చే వారం టీకాను స్వీకరిస్తారు.  కరోనా టీకా తొలి మోతాదును స్వీకరించనున్నామని ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ఆయన భార్య కారెన్‌,హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ప్రకటించిన అనంతరం బైడెన్‌ నిర్ణయం రావడం విశేషం. మరోవైపు బైడెన్‌ సీనియర్ సలహాదారుడు, కాంగ్రెస్ సభ్యుడు సెడ్రిక్ రిచ్‌మండ్‌కు కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వల్ల 3,14000 మంది మరణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement