రాజకీయ పార్టీల విరాళాల సేకరణ విషయంలో ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు నూతన విధానంలో విరాళాలు స్వీకరిస్తున్నాయి. దీనినే ఎలక్టోరల్ బాండ్స్ అని అంటారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ అంశంపై మరోసారి దుమారం చెలరేగడంతో పాటు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. అయితే ఎన్నికల విరాళాలు స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు జారీకావు.
ఎలక్టోరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. వీటిలో అతి తక్కువ విలువ కలిగిన బాండ్ రూ. 1,000. కోటి రూపాయలది అత్యధిక విలువ కలిగిన బాండ్. ఈ బాండ్ల కొనుగోలు సంఖ్యపై పరిమితి లేదు. ఎన్నికల సమయంలో, ఎలక్టోరల్ బాండ్ల విక్రయం విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుతాయి.
ఎన్నికల విరాళాలను స్వీకరించే అర్హతలేని రాజకీయ పార్టీలు ఏవి అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన అంటే రిజిస్టర్ అయిన పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు. ఇంతేకాకుండా లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల విరాళాలు స్వీకరించే పార్టీ ఓట్ షేర్ ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
ఎన్నికల విరాళాలకు సంబంధించిన నియమాలు చాలా సులభతరం అయ్యాయి ఒక వ్యక్తి, సమూహం లేదా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. సంబంధిత రాజకీయ పార్టీ ఈ బాండ్‌ను జారీ చేసిన 15 రోజుల్లోగా ఎన్‌క్యాష్ చేసుకోవాలి. ప్రతి లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు భారీగా విరాళాలు అందుతాయి.
ఇది కూడా చదవండి: పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం?
Comments
Please login to add a commentAdd a comment