ఢిల్లీ : గడిచిన ఎన్నికల్లో స్థానిక పార్టీల్లో బీఆర్‌ఎస్‌కు ఊహించని విధంగా విరాళాలు అందాయి. విరాళాలు పొందే విషయంలో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా..రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది.
రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? అందులో వివరించింది.
ఈసీ నివేదిక ప్రకారం.. 2023-24లో దాతలు బీజేపీకి రూ. 20,000 అంత కంటే ఎక్కువ మొత్తం దాదాపు రూ.2,244 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం 2022-23లో అందుకున్న మొత్తం కంటే మూడు రెట్లు ఎక్కువ. బీఆర్‌ఎస్ రూ.580 కోట్లతో రెండవ స్థానంలో, కాంగ్రెస్ రూ.289 కోట్లతో మూడో స్థానంలో ఉంది.
కాంగ్రెస్‌కు అంతకుముందు సంవత్సరం రూ.20,000 అంతకంటే ఎక్కువ విరాళాల రూపంలో రూ.79.9 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కాంగ్రెస్ కంటే బీజేపీకి అందిన విరాళాలు 776.82 శాతం ఎక్కువ.
ట్రస్ట్ (Satya Electoral Trust)లు బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ అత్యధిక విరాళాలు అందించాయని భారత ఎన్నికల సంఘం (eci) డేటా చెబుతోంది. అందులో బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ. 156 కోట్లు ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ విరాళంగా వచ్చాయి.
ఇతర పార్టీలలో, ఆమ్ ఆద్మీ 2023-24లో రూ. 11.1 కోట్ల విలువైన విరాళాలు పొందింది. అంతకు ముందు ఏడాది ఆప్ రూ.37.1 కోట్లు అందుకుంది. 2023-24లో సీపీఎం విరాళాలు రూ. 6.1 కోట్ల నుండి రూ. 7.6 కోట్లను పొందింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈసీ ఆయా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment