ప్రజాప్రతినిధులను ఎన్నుకోని తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వివిధ స్థాయిల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు. ఈసారి దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్‌లోనే జరగనున్నాయి. అలాగే ఎన్నికల ముఖ్య అధికారి సాధారణ ఎన్నికల జరిగే అవకాశం ఉన్న తాత్కాలిక తేదీని కూడా జారీ చేశారు. ఆ తేదీకి అటు ఇటుగా పలు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో ఈ సారి ఓటర్లు ఎంతమంది? వారిలో మహిళా ఓటర్లు ఎంతమందంటే..?
ఈసారి దేశంలో జరగబోయే సాధారణ ఎన్నికల కోసం ప్రంపచంలోనే అత్యధిక మంది ఓటర్లు నమోదయ్యారని ఎన్నికల సంఘం పేర్కొంది. అందుకోసం ఇంటెన్సివ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 పేరుతో జరిపిన సర్వేలో ఈ విషయంలో వెల్లడయ్యింది. అంతేగాదు జనవరి 1,2024ని అర్హత తేదీగా సూచిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/స్వయం ప్రతిపత్తి ప్రాంతాల వారిగా ఓటర్ల జాబితాలను కూడా ప్రచురించింది. అలాగే నియోజక వర్గాల విభజన తర్వాత జమ్మూ కాశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాల్లో విజయవంతంగా ఓటర్ల జాబితాల సవరణ పూర్తయ్యింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏకంగా 96.88 మంది అత్యధిక ఓటర్లు నమోదయ్యారు. ఈ ఓటర్ల జాబితాలో లింగ సమానత్వం హైలెట్‌గా నిలిచింది. ఈసారి కనివినీ ఎరుగని రీతీలో మహిళా ఓటర్ల నమోదులో పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లు నమోదవ్వగా, వారిలో మహిళా ఓటర్ల జాబితా ఏకంగా 1.41 కోట్ల మంది నమోదు చేసుకోవడం విశేషం. ఓటు హక్కు వినియోగంలో పురుష ఓటర్ల కంటే సుమారు 15% పెరిగింది. అంతేగాదు లింగ నిష్పత్తి 2019లో 940 ఉండగా అది కాస్తా 2024కి 948కి పెరిగడం విశేషం.
అలాగే ఈసారి 2 కోట్ల మంది యువ ఓటర్లు నమోదు చేసుకున్నారు. దీంతోపాటుగా వికలాంగులకు కూడా ఓటింగ్‌లో అన్ని రకాల వెసులబాటు కల్పించడంతో వారి నమోదు కూడా కాస్త పెరిగింది. ఎన్నికల సంఘం అధికారుల చేత ఇంటింటికి సమగ్ర సర్వే చేయించి మరీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితాలో 1,65,76,654 మంది చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినవారు ఉన్నారు. ఇందులో 67,82,642 మంది చనిపోయిన ఓటర్లు, 75,11,128 మంది శాశ్వతంగా మారిన/గైర్హాజరైన ఓటర్లు ఉండగా, 22,05,685 నకిలీ ఓటర్లు ఉన్నారు. అలాగే ఈసారి ఓటర్లగా నమోదు చేసుకునే దరఖాస్తులు ఏకంగా 10.64 లక్షలకు పైగా వచ్చినట్లు ఎన్నికల సంఘం పేర్కొది. .ఈ సారిగా ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా ముఖ్యంగా బలహీన గిరిజన వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఇంత భారీ స్థాయిలో ఓటర్లు నమోదవ్వడం అనేది భారతదేశం స్థితిస్థాపకత, ప్రజలకు ప్రజాస్వామ్య విధానం పట్ల ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోంది.
ఎన్నికల సంఘం దృష్టి సారించిన అంశాలు..
రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్‌ను ఎక్కువ మంది ఓటర్లు నమోదయ్యేలా ఈ కింది అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవేంటంటే..
- పారదర్శకత
- స్వచ్ఛత
- లింగ నిష్పత్తి
- చేరిక
పారదర్శకత చర్యలు
- వివిధ రాజకీయ పార్టీలతో తరచుగా జిల్లాఎన్నికల అధికారులు,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు సాధారణ సమావేశం అవ్వడం.
- స్పెషల్ సమ్మరీ రివిజన్‌తో డేటా సేకరించడం.
- ఓటర్ల జాబితా కాపీలను రాజకీయ నాయకులతో కలిసి షేర్ చేసుకోవడం.
- వారి అభ్యంతరాలను నోటీసు చేయండం. గడవు ముగిసేలోపు చేయాల్సిన ధృవీకరణ, ఫీల్డ వెరిఫికేషన్
స్వచ్ఛత
- డూప్లికేట్/బహుళ ఎంట్రీల తొలగింపు.
- చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు.
- ఓటర్ల ఫోటోల్లో వ్యత్యాసాలను తొలగించడం
- అలాగే ఓటర్ల ఫోటోల చిత్ర నాణ్యతను మెరుగుపరచడం.
అంతరాలు లేకుండా..
ఓటర్లు/జనాభా నిష్పత్తితో అంతరాలు తగ్గించడం
లింగ నిష్పత్తి
వయస్సు వారీగా జాబితా తీసుకోవడం (ప్రత్యేకంగా 18 నుంచి 19, 19 నుంచి 20 ఏళ్లు వారీగా )
చేరిక:
- దివ్యాంగులు సులభంగా ఓటు వేసేలా ఎన్నికల డేటాబేస్‌లో గుర్తింపు
- ముఖ్యంగా చదువుకున్న యువత నమోదుపై దృష్టిసారించేలా చేయటం
- మహిళా ఓటర్లను పెంచేలా డ్రైవ్‌లు
- అలాగే థర్డ్ జెండర్‌లో పెరుగుతున్న నమోదు కోసం కేంద్రీకృత వ్యూహం
- ముఖ్యంగ బలహీన గిరిజనలు నూటికి నూరు శాతం నమోదు చేసుకునేలా ప్రత్యేక ప్రయత్నాలు.
ఇంతలా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భారీగా నమోదు రాజకీయ పార్టీలు, పౌరులు అందించిన సహకారం వల్లే సాధ్యమయ్యిందని ఎన్నికల కమిషన్ పేర్కోంది. అలాగే ఎలక్టోరల్ జాబితా సవరణ 2024లో ఇంకా ఎన్‌రోల్ చేయించుకోని అర్హులైన పౌరులు ఇప్పటికైనా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నామినేషన్ లోపు ఓటర్లు అప్‌డేట్ చేయించుకునే వెసులుబాటు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
(చదవండి: 'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!)
Comments
Please login to add a commentAdd a comment