
మహేష్
కణేకల్లు: స్మార్ట్‌ఫోన్ బానిసైన ఓ యువకుడు అదేపనిగా ‘ఫ్రీ ఫైర్ గేమ్’ ఆడుతూ మానసికస్థితిని కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలో జరిగింది. కణేకల్లు మండలం బెణికల్లు గ్రామానికి చెందిన మహేష్ ఇంటర్ చదివేవాడు. తండ్రి అతన్ని చదువు మాన్పించి పనిలో చేర్పించాడు. పనిచేయగా వచ్చిన డబ్బుతో మహేష్ ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడు. ‘ఫ్రీ ఫైర్ గేమ్’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని గంటల తరబడి ఆడేవాడు.
మహేష్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రెండు రోజుల క్రితం అతని తండ్రి కణేకల్లులోని ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. తన కుమారుడు 3 నెలలుగా రాత్రి పూట నిద్ర పోవడం లేదని, అన్నం కూడా సరిగా తినడం లేదని చెప్పాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ అహమ్మద్..ఫ్రీ ఫైర్ గేమ్ ఆడడం వల్ల ఆ యువకుడు మతిస్థిమితం కోల్పోయినట్లుగా గుర్తించి, బళ్లారిలోని న్యూరాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో యువకుడిని తీసుకుని తల్లిదండ్రులు బళ్లారికి వెళ్లినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment