పబ్‌జీ.. ఇకపై రోజుకు ఆరు గంటలే! | New Restrictions On Pubg Game In New Delhi | Sakshi
Sakshi News home page

పబ్‌జీ.. ఇకపై రోజుకు ఆరు గంటలే!

Published Fri, Mar 22 2019 10:21 PM | Last Updated on Fri, Mar 22 2019 10:21 PM

New Restrictions On Pubg Game In New Delhi - Sakshi

న్యూఢిల్లీ: పబ్‌జీ... ఇదో మొబైల్‌ గేమ్‌. ప్రస్తుతం యువతకు ఈ గేమ్‌ వ్యసనంలా మారింది. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో ఈ గేమ్‌ను బ్యాన్‌ చేయాలని స్వచ్ఛంద సంస్థల దగ్గర్నుంచి రాజకీయ పార్టీల వరకు డిమాండ్‌ చేస్తున్నాయి. ఫలితంగా ఈ గేమ్‌కి అడ్డుకట్ట వేసే పని ప్రారంభమైంది. ఇకపై ఆరు గంటలు మించి పబ్‌జీ ఆడలేరు. ఇండియాలో కేవలం ఆరు గంటలు మాత్రమే పబ్‌జీ ఆడేందుకు అనుమతి లభించింది.

ఎవరైనా రోజుకు 6 గంటలు పబ్‌జీ ఆడగానే తాత్కాలికంగా బ్లాక్‌ అవుతుంది. మళ్లీ మరుసటి రోజు వరకు ఇక పబ్‌జీ ఆడలేరు. పబ్‌జీ 6 గంటలు ఆడగానే హెల్త్‌ రిమైండర్‌ రావడంపై అధికారికంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ విడుదల కాలేదు. కానీ... ప్లేయర్స్‌ మొబైల్‌పై హెల్త్‌ రిమైండర్‌ పేరుతో నోటిఫికేషన్‌ కనిపిస్తోంది. 18 ఏళ్ల లోపు వయస్సుగల ప్లేయర్స్‌కు 2 నుంచి 4 గంటల లోపే హెల్త్‌ రిమైండర్‌ నోటిఫికేషన్‌ వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement