Battle
-
ఈ టమాటాలతో సరదా యుద్ధం.. ఎలా మొదలైందో తెలుసా?
దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కొందరు మిత్రుల మధ్య సరదా వేడుకగా ప్రారంభమైంది. అనతి కాలంలోనే ఇది అతిపెద్ద ఆహార యుద్ధ వేడుకగా పేరు పొందింది. జనాలంతా వీథుల్లోకి చేరి, ఒకరిపై మరొకరు టమాటోలను విసురుకుంటూ, వీథుల్లో మడుగులు కట్టే టమాటో రసంలో మునిగి తేలుతూ సంబరాలు చేసుకునే ఈ వేడుక పేరు ‘లా టమాటినా’. స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ఏటా ఆగస్టు నెలలో ఆఖరి బుధవారం రోజున ఈ వేడుక జరుగుతుంది. ‘లా టమాటినా’లో పాల్గొనే జనాలు టన్నుల కొద్ది టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకోవడంతో, రోడ్లన్నీ టమాటో రసంతో నెత్తుటేర్లను తలపిస్తాయి.ఈ సందర్భంగా దాదాపు 1.50 లక్షల కిలోల టమాటోలను ఒకరిపైకి ఒకరు విసురుకుంటారు. ఈసారి ‘లా టమాటినా’ వేడుకను ఘనంగా నిర్వహించడానికి బునోల్ పట్టణ సంస్థ ఏర్పాట్లు చేసింది. బునోల్ పట్టణ జనాభా దాదాపు తొమ్మిదివేలు మాత్రమే! అయితే, ఏటా జరిగే ఈ టమాటోల సరదా యుద్ధం తిలకించడానికి విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ వేడుకలో భాగంగా సంగీత, నృత్య కార్యక్రమాలు, విందు వినోదాలు కూడా జరుగుతాయి. ఈ వేడుక చూడటానికి విదేశాల నుంచి విపరీతంగా జనాలు వచ్చిపడుతుండటంతో బునోల్ పట్టణంలో హోటళ్లు కిటకిటలాడిపోయేవి.స్థానికులకు మంచినీటి సరఫరాకు కూడా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితిని నివారించడానికి 2013 నుంచి ఈ వేడుకను తిలకించడానికి వచ్చే సందర్శకుల సంఖ్య ఇరవైవేలకు మించరాదంటూ బునోల్ స్థానిక సంస్థ పరిమితి విధించింది. సందర్శకుల సంఖ్యను కట్టడి చేయడానికి అప్పటి నుంచి టికెట్లు కూడా ప్రవేశపెట్టారు. టికెట్లు పెట్టినా సరే సందర్శకులు ఏమాత్రం వెనుకాడకుండా ఈ వేడుకను చూడటానికి నెలల ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటుండటం విశేషం. ‘లా టమాటినా’ స్ఫూర్తితో అమెరికాలోని కొలరడో–టెక్సస్ల మధ్య 1982 నుంచి ‘కొలరడో–టెక్సస్ టమాటో వార్’ వేడుక జరుపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొలంబియా, చైనా తదితర దేశాల్లోనూ ఇలాంటి టమాటో యుద్ధాల నిర్వహణ మొదలు పెట్టారు. మన దేశంలో కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు నగరాల్లోను, బిహార్ రాజధాని పట్నాలోను దాదాపు దశాబ్దంగా ఏటా ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. -
మళ్లీ తడబడ్డ బైడెన్
మిల్వాయుకీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి తర్వాత ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మళ్లీ తప్పులు మాట్లాడారు. విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటాం అనబోయి ‘బ్యాటిల్ (యుద్ధ) బాక్సుల్లో’ పరిష్కరించుకుంటామని అన్నారు. దాంతో ఆయన సొంత పార్టీ అయిన డెమొక్రాట్ నేతలు మరోసారి తలపట్టుకున్నారు. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయమని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాలంటే యుద్ధ క్షేత్రం కాదు. పారీ్టలుగా నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం శత్రువులం కాదని, కలిసి పనిచేసే వారిమని, తోటి పౌరులమేనని గుర్తుంచుకోవాలి. చర్చలైనా, మరోటైనా శాంతియుతమైన జరగాలి. మన దేశంలో హింసకు తావు లేదు. జాతిగా మనమంతా ఒక్కటి కావాల్సిన సమయమిది’’ అంటూ పిలుపునిచ్చారు. -
ఆన్లైన్ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ..
సాక్షి, సిటీబ్యూరో: భారత్‌లో ప్రతిష్టాత్మకమైన ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2024’(బీజీఐఎస్) గ్రాండ్ ఫినాలేకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. క్రాఫ్టన్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా గ్రాండ్ ఫినాలే ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది.దేశంలోనే అతిపెద్దదైన ఈ రాయల్ ఎస్పోర్ట్స్ ఇండియా సిరీస్ టోర్నమెంట్లో రూ.2 కోట్ల ప్రైజ్ మనీ అందించడం విశేషం. దేశంలోని యువ ఆటగాళ్లతో కూడిన చివరి 16 అగ్రశ్రేణి జట్లు చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవడానికి ఆన్లైన్ రౌండ్లలో పోటీ పడనున్నారు. గేమింగ్ ఔత్సాహికులు ఈ సీరీస్‌ను ప్రత్యక్షంగానే కాకుండా క్రాఫ్టన్ ఇండియా ఈ–స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్లో వీక్షించవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు.ఇవి చదవండి: టీనేజర్ల రక్షణ కోసం.. సరికొత్తగా స్నాప్‌చాట్! -
హైటెక్స్ వేదికగా దేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్!
క్రాఫ్టాన్ (KRAFTON) ఇండియా సమర్పించు బ్యాటిల్ రాయల్ ఎస్పోర్ట్స్ ఈవెంట్ 2024 ఫినాలే (BGIS) హైదరాబాద్‌లో హైటెక్స్ వేదికగా ఈనెల (జూన్) 28, 29, 30 తేదీల్లో జరుగనుంది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ గేమింగ్ ఈవెంట్లలో ఒకటైన BGISలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జట్లు రిజిస్టర్ చేసుకున్నాయి. పలు దఫాల పోటీల అనంతరం టాప్ 16 జట్లు తుది పోటీలకు అర్హత సాధించాయి. ఈ ఈవెంట్లో పోటీ పడే జట్లు రూ. రెండు కోట్ల ప్రైజ్‌మనీని షేర్ చేసుకుంటాయి.KRAFTON సంస్థ ఇంత భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని కేటాయించడం భారత్‌లో ఈ-స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధికి నిదర్శనం. BGIS 2024 Finaleతో హైదరాబాద్ నగరం గేమింగ్ గమ్యస్థానంగా తమ ప్రతిష్ట మరింత పెంచుకోనుంది. ఈ ఈవెంట్‌కు ప్రవేశ టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోగా.. ప్రీమియం సీటింగ్, భోజన సదుపాయం కల ఎలైట్ పాస్‌లు (పెయిడ్ టికెట్లు) అందుబాటులో ఉన్నాయి.ఎలైట్ పాస్‌ల ధర రూ. 5000గా నిర్ణయించారు. ఎలైట్ పాస్‌ల విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని సంప్రదాయ క్రీడలకు మద్దతుగా అభినవ్ బింద్రా ఫౌండేషన్‌కు అందిస్తారు. గేమింగ్ ఔత్సాహికులు, అభిమానులు ఈ ఈవెంట్‌ను KRAFTON India Esports YouTube ఛానెల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.దక్షిణ కొరియాలో ప్రధాన కార్యాలయం కలిగిన KRAFTON, Inc. ఆకర్షణీయమైన ఆటలను కనుగొనే ఆన్లైన్ గేమింగ్ సంస్థ. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డెవలపర్లకు నిలయంగా ఉంది. ఇందులో PUBG స్టూడియోస్, స్ట్రైకింగ్ డిస్టెన్స్ స్టూడియోస్, వెక్టర్ నార్త్, నియాన్ జెయింట్, క్రాఫ్టాన్ మాంట్రియల్ స్టూడియో, బ్లూహోల్ స్టూడియో, రైజింగ్ వింగ్స్, 5మిన్ల్యాబ్స్, డ్రీమోషన్, రెలుగేమ్స్, ఫ్లైవేగేమ్స్ వంటి స్టూడియోలు ఉన్నాయి.ప్రతి స్టూడియో నిరంతరం కొత్త సవాళ్లను స్వీకరించడానికి, వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలను విస్తృతం చేయడం ద్వారా మరింత మంది అభిమానులను గెలుచుకోవడం KRAFTON లక్ష్యం. -
యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ట్యాంకును నడిపారు. బుధవారం ఆయన దేశ సైనిక దళాల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు పెద్ద ప్రయత్నాలు చేయాలని సేనలకు పిలుపునిచ్చారు. అధికార వార్తా సంస్థ(కేసీఎన్ఏ) గురువారం ఈ విషయం వెల్లడించింది. పొరుగుదేశం దక్షిణ కొరియా, అమెరికా 11 రోజులుగా కొనసాగిస్తున్న భారీ సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. అందుకు బదులుగా అన్నట్లు కిమ్ యుద్ధ ట్యాంకుల పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
ఉత్తరకొరియా యుద్ధానికి సిద్ధమవుతోందా?
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ కొరియా- యునైటెడ్ స్టేట్స్ సంయుక్త విన్యాసాల ముగింపునకు ముందు కొరియాలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. దీనికి కిమ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ కమాండర్లతో మాట్లాడుతూ ఈ విన్యాసాలకు నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని ఆదేశించారు. ఈ సమయంలో ఒక నూతన యుద్ధ ట్యాంక్ తన మొదటి ప్రదర్శనలో విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. తన కమాండర్ల పనితీరుకు కిమ్ సంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ విన్యాసాల వివరాలను వెల్లడించిన ఒక నివేదికలో ‘యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకే సారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయని’ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్‌తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్నామ్తో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఒక ఫోటోలో కొరియన్ నియంత యుద్ధట్యాంక్‌ను పరీక్షించడాన్ని చూడవచ్చు. కిమ్ స్వయంగా ట్యాంక్‌ను నడిపినట్లు మీడియా పేర్కొంది. మరొక ఫోటోలో కిమ్ లెదర్ జాకెట్ ధరించగా, కమాండర్లు అతని చుట్టూ ఉన్నట్లు కనిపించారు. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు కూడా ఫొటోలలో కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగియనున్న తరుణంలో ఈ కసరత్తు కనిపించింది. నవంబర్‌లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఈ సైనిక విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలకు ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్‌ర్‌సైజ్’ అని పేరు పెట్టారు. లైవ్ ఫైర్ డ్రిల్‌లో పలు యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఎఫ్ఏ-50 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. -
ఇద్దరికీ ఇబ్బందులే!
200 స్థానాలున్న రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. బీజేపీ, పాలక కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ మేనియా తమను ఈసారి కచ్చితంగా గట్టెక్కిస్తాయని బీజేపీ ఆశపడుతోంది. ఇక అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైనే నమ్మకం పెట్టుకుంది. మరోవైపు రెండు పార్టీలూ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నాయి. పైగా అవతలి పార్టీలోని తలనొప్పులు తమకే మేలు చేస్తాయన్న భావనలో ఉన్నాయి...! ఐదేళ్లకోసారి అధికార పార్టీని మార్చడం రాజస్తాన్ ఓటర్లకు ఆనవాయితీ. 1993 మధ్యంతర ఎన్నికల నాటినుంచి ఏ పార్టీ కూడా అధికారాన్ని నిలబెట్టుకున్న చరిత్ర లేదు. అలా చూస్తే ఈసారి బీజేపీకి అవకాశం దక్కాలి. దీనికి తోడు కాంగ్రెస్‌లో సీఎం గెహ్లోత్, ఆ పార్టీ అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలను వీలైనంతగా ప్రచారం చేయడం ద్వారా మరింత లబ్ధి పొందాలని కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక కొన్నేళ్లుగా ఎన్నో శాంతిభద్రతల సమస్యలను రాజస్తాన్ చవిచూడటాన్ని ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇక అవినీతి విచ్చలవిడిగా మారిపోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా గెహ్లోత్‌కే మొగ్గు...! అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు, అంతర్గత కుమ్ములాటల వంటివి ఎన్నున్నా గెహ్లోత్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతుండటం విశేషం! ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెహ్లోత్ పలు ప్రజాకర్షక పథకాలను వరుసబెట్టి ప్రకటించారు. ఇవన్నీ జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నట్టు చెబుతున్నారు. 2014లో రాష్ట్రంలో కనిపించిన మోదీ వేవ్ ఇప్పుడు దాదాపుగా లేనట్టేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటివాటి వల్ల మోదీపై రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలగాయంటూ కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా కేంద్రం పట్ల మహిళల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ఇది తమకు బాగా అనుకూలిస్తుందని ఆ పార్టీ నేతలంటున్నారు. అధికార ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి ఆ పార్టీకి బాగా చేటుచేయవచ్చన్న అభిప్రాయం అంతర్గతంగా వినిపిస్తోంది. పైగా వారిలో చాలామందిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు వస్తున్న వార్తలు నాయకత్వానికి సమస్యగా మారాయి. ఇవన్నీ అంతిమంగా పుట్టి ముంచితే ఎలాగన్న ఆందోళన కాంగ్రెస్ అధిష్టానంలో నెలకొంది. అందుకే బీజేపీ బాటలోనే ఆ పార్టీ ఈసారి గెహ్లోత్‌ను సీఎం అభ్యర్థిగా ఎక్కడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. అయితే ఈ ఎత్తుగడ అంతిమంగా బెడిసికొట్టి వారికే చేటు చేసే ప్రమాదం లేకపోలేదంటూ వస్తున్న వార్తలు పార్టీ పెద్దలను చికాకు పరుస్తున్నాయి. గుజ్జర్లు ఏం చేస్తారో? 24 అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయకంగా ఉన్న గుజ్జర్లు, మీనా సామాజిక వర్గం ఓటర్లు ఈసారి కాంగ్రెస్‌ను ఆదరించడం కష్టమేనంటున్నారు. ఇక ఓబీసీ సామాజికవర్గంలో ప్రధానమైన జాట్లు గెహ్లోత్‌తో ఎప్పుడూ సంతృప్తిగా లేరు పైగా జాట్ ప్రాబల్య స్థానాల్లో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ పోటీకి దిగుతుండటం కాంగ్రెస్ అవకాశాలను దెబ్బ తీసేలా కనిపిస్తోంది. గుజ్జర్ సామాజిక వర్గానికి చెందిన సచిన్ పైలట్ సీఎం అవుతారన్న భావనతో గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు కాంగ్రెస్‌కు జైకొట్టారు. ఈసారి వారు బీజేపీకేసి మొగ్గితే కాంగ్రెస్‌కు కష్టమేనని చెబుతున్నారు. భారతీయ ఆదివాసీ పార్టీ 2018లో రెండు స్థానాలే గెలిచినా పలు గిరిజన ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు సాధించింది. బీఎస్పీ సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి 5 శాతం ఓట్లు కొల్లగొట్టినట్టు గత ఎన్నికల ఫలితాల విశ్లేషణలో తేలింది. ఈసారి ఈ ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్‌కు మరింత నష్టమే. బీజేపీకీ ఇంటి పోరు బీజేపీ ఇంటి పోరుతో సతమతమవుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం వసుంధర రాజే వర్గం స్థానిక బీజేపీ ముఖ్యులకు సహాయ నిరాకరణ చేస్తూ చిక్కులు సృష్టిస్తోంది. ఈ గొడవలు ముదిరితే మొదటికే మోసమని గ్రహించిన అధిష్టానం ఈసారి సీఎం అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించకుండా జాగ్రత్త పడింది. రాజే సూచించిన వారిలో పలువురికి టికెట్లు నిరాకరించింది. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో పడింది. హిందూత్వ కార్డుతో పాటు మోదీ ఛరిష్మాపైనే బీజేపీ ప్రధానంగా నమ్మకం పెట్టుకుంది. కానీ వసుంధర రాజే మాదిరిగా రాష్ట్రమంతటా జనాకర్షణ ఉన్న మరో నాయకుడంటూ ఎవరూ లేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు 100 యూనిట్లదాకా ఉచిత కరెంటు రూ.500కే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ వృద్ధాప్య పింఛన్ల మొత్తం పెంపు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం -
Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం
జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో నెత్తుటేర్లు పారుతున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణ మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. హమాస్ మిలిటెంట్ల పీచమణచడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. దక్షిణ గాజాలోని రఫాలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 19 మంది మృతిచెందారు. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు. అడపాదడపా రాకెట్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. గాజాలో వెయ్యికి పైగా టార్గెట్లపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. గాజాలో ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. తాజా యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్‌లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ అ«దీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్‌కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గాజా దిగ్బంధానికి ఆదేశాలు గాజాలో హమాస్ ముష్కరులను, వారి ప్రభుత్వాన్ని తుదముట్టిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. హమాస్‌ను ఇప్పటికే చాలావరకు బలహీనపర్చామని ఇజ్రాయెల్ అధికార వర్గాలు వెల్లడించాయి. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గల్లాంట్ తమ సైన్యాన్ని ఆదేశించారు. గాజాకు విద్యుత్, ఆహారం, ఇంధనం సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇజ్రాయెల్–గాజా సరిహద్దుల్లో 24 కాలనీలు ఉండగా, 15 కాలనీలను ఖాళీ చేయించారు. మిగిలినవాటిని 24 గంటల్లోగా ఖాళీ చేయిస్తామని ఇజ్రాయెల్ అధికారులు చెప్పారు. గాజాపై ఇప్పటిదాకా వైమానిక దాడులకే పరిమితం అయిన ఇజ్రాయెల్ ఇక భూ యుద్ధంపై దృష్టి పెట్టింది. నేరుగా భూమిపైనుంచే క్షిపణులు ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. యుద్ధం వల్ల గాజాలో 1,23,000 మంది నిరాశ్రయులయ్యారని, ఇళ్లు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గాజా బయట తమ పోరాటం కొనసాగుతోందని, సోమవారం ఉదయం మరికొంతమంది ఇజ్రాయెల్ పౌరులను బంధించామని హమాస్ ప్రతినిధి అబ్దెల్–లతీఫ్ అల్–ఖనౌవా చెప్పారు. ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడిపించి, స్వేచ్ఛ ప్రసాదించడమే తక్ష లక్ష్యమని ఉద్ఘాటించారు. హమాస్ చేతిలో ఉన్న బందీలను విడిపించడానికి సహకరించాలంటూ ఇజ్రాయెల్ కోరిందని ఈజిప్టు అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్‌కు అమెరికా సాయం మిత్రదేశం ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. సైనిక సాయం అందిస్తోంది. తూర్పు మధ్యదరా సముద్రానికి యుద్ధ నౌకలను పంపించింది. ఇంకా అదనపు సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. 260 మృతదేహాలు లభ్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో శనివారం సూపర్నోవా ఫెస్టివల్లో ఆనందంగా గడుపుతున్న జనంపై హమాస్ ముష్కరులు హఠాత్తుగా దాడి చేశారు. సైనిక దుస్తుల్లో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 260కిపైగా మృతదేహాలను ఇజ్రాయెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతం గాజాకు సమీపంలోనే ఉంది. నా భార్యాబిడ్డలను అపహరించారు యువకుడు యెనీ అషెర్ గాజా సరిహద్దుకు సమీపంలో ఇజ్రాయెల్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. హమాస్ మిలిటెంట్లు అతడి భార్య డోరన్, కుమార్తెలు రజ్(5), అవివ్(3)ను శనివారం అపహరించారు. ఎక్కడ దాచారో తెలియడం లేదు. వారి కోసం అషెర్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. వారిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకంటున్నాడు. ఫోన్లో మాట్లాడుతుండగానే చంపేశారు ఇలాన్ ట్రోయెన్ అమెరికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె డెబోరా మతియాస్, అల్లుడు స్కోమ్లీ మతియాస్, మనవడు ఇజ్రాయెల్‌లో ఉంటున్నారు. శనివారం ఆమె అమెరికాలో ఉన్న తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతుండగా హమాస్ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డెబోరా, స్కోమ్లీ దంపతులు బలయ్యారు. వారి 16 ఏళ్ల కుమారుడు గాయాలతో బయటపడ్డాడు. హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు ఇజ్రాయెల్ ఆయాగా పనిచేస్తున్న కేరళ మహిళ షీజా ఆనంద్ హమాస్ మిలిటెంట్ల దాడిలో గాయపడ్డారు. కేరళ రాష్ట్రం కన్నూర్ జిల్లా పయ్యావూర్కు చెందిన షీజా ఆనంద్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని సముద్ర తీర నగరం అషె్కలాన్లో ఆయాలో పని చేస్తున్నారు. శనివారం హమాస్ మిలిటెంట్ల అషె్కలాన్పై రాకెట్లు ప్రయోగించంతో ఆమె గాయాలపాలయ్యారు. భారత్‌లో ఉన్న భర్త ఆనంద్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు షీజా ఆనంద్‌ను ఆసుపత్రిలో చేరి్పంచారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆదివారం మధ్యాహ్నం షీజా భారత్‌లోని తన తల్లితో మాట్లాడారు. ‘అమ్మా.. ఐయామ్ ఓకే’ అని చెప్పారు. -
నారీ శక్తితో గణతంత్రం వచ్చే ఏడాది మహిళలతోనే రిపబ్లిక్ డే పరేడ్
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ అంటే మన దేశ త్రివిధ బలగాల శక్తిని ప్రపంచానికి చాటడమే. యుద్ధ శకటాలు, విమానాల విన్యాసాలు, కొత్త ఆయుధాల ప్రదర్శన ఇలా పరేడ్ అంటే కదనరంగంలో మన సత్తా ఎంతో ప్రదర్శించడమే. అలాంటి పరేడ్‌ను వచ్చే ఏడాది మహిళా శక్తితో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నింగి నేలా నీరు అంతా మాదే అంటూ నినదిస్తున్న మహిళల భాగస్వామ్యం ఇటీవల కాలంలో త్రివిధ బలగాల్లో పెరుగుతోంది. యుద్ధభూమిలోకి అడుగు పెట్టడానికి కూడా మహిళలు సై అంటున్నారు. కేంద్ర బలగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం 2024 జనవరి 26న కర్తవ్యపథ్‌లో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌ను కేవలం మహిళలతో నిర్వహించాలని రక్షణ శాఖ ఫిబ్రవరిలో ప్రతిపాదించింది. దీనిపై ఫిబ్రవరిలో రక్షణ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో త్రివిధ బలగాల అధిపతులతో ఒక సమావేశం కూడా జరిగిందని ఆదివారం రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. త్రివిధ బలగాల్లోని మహిళా అధికారులే రిపబ్లిక్ డే కవాతుని నడిపిస్తారని ఆ సమావేశం నిర్ణయించింది. ఈ విషయాన్ని వివిధ ప్రభుత్వ శాఖలకి కూడా సమాచారం అందించారు. రక్షణ , హోం సంస్కృతి పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా దీనిని ఎలా అమలు చేయాలో చర్చిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డేలో నారీ శక్తి థీమ్‌ను ప్రధానంగా చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట, త్రిపుర రాష్ట్రాలు నారీశక్తి థీమ్‌తో శకటాలు రూపొందించాయి. ఇక వచ్చే ఏడాది అందరూ మహిళలతోనే పరేడ్ సాగనుంది. -
జర్మనీ నిర్ణయం సబబేనా?
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం రేపో మాపో పరిసమాప్తం కాకతప్పదని, పెను సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవటం మొదలవుతుందని ఆశిస్తున్నవారిని తాజా పరిణామం తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఉక్రెయిన్‌కు లెపార్డ్ 2 రకం భారీ యుద్ధ ట్యాంకులు అందజేయడానికి గత కొన్ని నెలలుగా ససేమిరా అంటున్న జర్మనీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. యుద్ధంలో ఆయుధ సంపత్తి ప్రధానమే కావొచ్చుగానీ... ప్రతిఘటనదారుల సంకల్పబలం ముందు అవి దిగదుడుపేనని యుద్ధ నిపుణులంటారు. ఒక చిన్న దేశం వియత్నాం ముందు అరవయ్యో దశకంలో అమెరికా చిత్తయిన ఉదంతం మొదలుకొని తాజాగా రష్యాపై ఉక్రెయిన్ సాగిస్తున్న ప్రతిఘటన వరకూ అది రుజువవుతూనే ఉంది. నెలరోజుల్లో ఉక్రెయిన్ను పాదాక్రాంతం చేసుకోవాలనుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాది గడిచాక దాన్నుంచి బయటి కొచ్చే దారీతెన్నూ కానక ఆపసోపాలు పడుతున్నారు. అందరూ ఏకమై పుతిన్ మెడలువంచి ఆయన్ను చర్చలకు ఒప్పించాల్సివున్న ఈ తరుణంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలందిస్తూ ఆ యుద్ధాన్ని మరింత సాగదీసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే జర్మనీ అంత సులభంగా ట్యాంకు లివ్వటానికి అంగీకరించలేదు. అమెరికా తన ఎం1 అబ్రామ్ ట్యాంకుల్ని కూడా తరలించేందుకు ఒప్పుకుంటేనే లెపార్డ్ 2 ట్యాంకులు అందిస్తామన్న షరతు విధించింది. ఈ విషయంలో జర్మనీ చాన్సలర్ ఒలోఫ్ షుల్జ్ మనసు మారేలా చేసేందుకు అమెరికా అన్నివిధాలా ప్రయత్నించింది. జర్మనీలోని పాలక, ప్రతిపక్షాలతోపాటు నాటో కూటమి దేశాలు సైతం షుల్జ్‌పై ఒత్తిళ్లు తెచ్చాయి. నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వటం అభ్యంతరమైతే తమకు సరఫరా చేసిన లెపార్డ్లివ్వటానికైనా అనుమ తించాలని పోలెండ్ గత కొన్ని వారాలుగా డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇది ట్యాంకు లివ్వటంతో ఆగదు. విమాన విధ్వంసక చీతా ట్యాంకులివ్వాలని కూడా జర్మనీపై ఒత్తిడి ఉంది. వాటితోపాటు ఉక్రెయిన్ ఎఫ్–16 యుద్ధ విమానాలివ్వాలని చాన్నాళ్లుగా అమెరికాను కోరుతోంది. ఉక్రెయిన్‌కు ఏడాదిగా జర్మనీ చేస్తున్న సాయం తక్కువేం కాదు. కానీ అదంతా నాటో కూటమి సాయంలో భాగంగా ఉంది. ప్రత్యక్షంగా ట్యాంకులు పంపటం మొదలైతే ఆ చర్య రష్యాను రెచ్చ గొడుతుందన్న భయం షుల్జ్కి ఉంది. అదే జరిగితే ఆర్థికంగా, సైనికంగా కూడా జర్మనీ నష్టపోతుందని ఆయన అంచనా. దానికితోడు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమా అని జర్మనీకి ఆ దేశంపై ఎన్నో సంశయాలున్నాయి. యుద్ధంలోకి దిగాక చివరివరకూ అమెరికా అండగా ఉంటుందా అన్నది దాని ప్రధాన సందేహం. అబ్రామ్ ట్యాంకులు విడుదల చేయటం ససేమిరా కుదరదని అధ్యక్షుడు బైడెన్ చెప్పటం ఆ సందేహాన్ని మరింత పెంచింది. అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ జర్మనీని ఈ విషయంలో ఒప్పించటానికి అన్నివిధాలా ప్రయత్నించి విఫలమయ్యాక చివరకు బైడెన్‌ను అంగీకరింపజేయగలిగారు. అయితే తన అమ్ములపొదిలో ఉన్న ట్యాంకులు కాకుండా తయారీదారులనుంచి కొనుగోలు చేసుకోవాలని అమెరికా అంటోంది. జర్మనీకి మరో సమస్య కూడా ఉంది. దానిదగ్గర ప్రస్తుతం లెపార్డ్ 2 ట్యాంకులు భారీ సంఖ్యలో లేవు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 4,000 వరకూ ఉండే ఆ ట్యాంకుల సంఖ్య ఇప్పుడు 300కు పడిపోయింది. వాటిని పెంచుకోవాలంటే చాన్నాళ్లు పడుతుంది. పైగా తోటి యూరప్ దేశాలకు ఇప్పటికే ఎగుమతి చేసిన ట్యాంకులకు విడి భాగాలు అందించాల్సివుంది. నిజానికి అమెరికా సైతం అలాంటి అభ్యంతరమేచెప్పింది. ప్రస్తుతం తమ బలగాల దగ్గరున్న 4,000 ట్యాంకులు దేశ భద్రతరీత్యా కదల్చటం సాధ్య పడదంటున్నది. అందుకు బదులు కొనుగోలు చేసుకోవాలంటున్నది. అమెరికా తయారీ అబ్రామ్ లముందు లెపార్డ్లు కొంత తీసికట్టే. గల్ఫ్ యుద్ధంలో, 2003 నాటి ఇరాక్ దురాక్రమణలో, అఫ్గానిస్తాన్ దురాక్రమణలో అమెరికాకు అబ్రావ్ులు అక్కరకొచ్చాయని సైనిక నిపుణులంటారు. అయితే ఇందుకు ఎంతో సమన్వయం అవసరం. అఫ్గాన్‌లో మందుపాతరలనూ, ఇతర బాంబు దాడులనూ అవి తట్టుకున్నాయి. కానీ వాటి సాంకేతికత అత్యంత సంక్లిష్టమైనది. నెలల తరబడి శిక్షణ ఉంటేనే వాటిని వినియోగించటం సాధ్యం. అదీగాక అబ్రామ్ల వ్యయం, వాటి విడి భాగాలు భారీ ఖర్చుతో కూడుకున్నవి. ఈ విషయంలో లెపార్డ్లు మెరుగే అయినా వాటిపైన కూడా ప్రత్యేక శిక్షణ అవసరం. అందువల్ల తక్షణం ఈ ట్యాంకులు యుద్ధ క్షేత్రానికి రాలేవు. తనపై నేరుగా లడాయికి దిగే ధైర్యం నాటోకు ఉండదని, ఆ కూటమిలో చీలిక రావటం ఖాయమని మొదటినుంచీ అనుకుంటున్న రష్యాకు జర్మనీ నిర్ణయం శరాఘాతమే. నేరుగా తమ గడ్డపై దాడి చేయగల భారీ ట్యాంకుల్నీ, అధునాతన యుద్ధ విమానాలనూ మోహరిస్తే ఆత్మ వినాశనం కొని తెచ్చుకున్నట్టేనని రష్యా చేస్తున్న హెచ్చరికల సారాంశం పుతిన్ మొదటినుంచీ బెదిరిస్తున్న అణుయుద్ధమే అయితే ప్రపంచానికి చేటుకాలం దాపురించినట్టే. తమ ఆహార అవస రాల్లో 80 శాతం వరకూ ఉక్రెయిన్‌పైనే ఆధారపడ్డ ఈజిప్టువంటి దేశాలు ఇప్పటికే సంక్షోభంలో పడ్డాయి. ఇతరత్రా ఉత్పత్తులు మందగించి ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించేలా మారణాయుధాలు తరలించటంకాక యుద్ధం ఆపేందుకు అవసరమైన ఇతరత్రా చర్యలన్నిటిపైనా దృష్టి సారించాలి. ఆ విషయంలో శాంతిని కోరుకునే ప్రపంచ ప్రజానీకం ఒత్తిళ్లు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే పరిస్థితి కుదుటపడుతుంది. -
స్ధానిక సమరం!
-
హరియాణ్ హిస్సార్‌లో ఆసక్తికర రాజకీయ పోరు
-
బీజేపీ, కాంగ్రెస్ మధ్య మరో కీలక పోరు
-
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ రికార్డు
సాక్షి, సిద్దిపేట: గోదావరి జలాలను తెలంగాణలోని బీడు భూములకు మళ్లించేందుకు నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధంగా భావించి చేపడుతున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్‌లో నిర్మిస్తున్న రంగనాయక సాగర్ రిజర్వాయర్ పనులను, సొరంగ మార్గంలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. టన్నెల్ ద్వారా సొరంగం తొలియడం, కాల్వల నిర్మాణ పనులను మంత్రి నేరుగా చూశారు. భూ అంతర్భాగంలో నిర్మించే కాల్వలు, సర్జిబుల్ సంప్ నిర్మాణాలు, అక్కడి నుంచి రిజర్వాయర్లకు నీరు మళ్లించడం మొదలైన అంశాలపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూ పైభాగానికి సగటున 100 మీటర్ల లోతులో భూమిని తొలిచి సొరంగ మార్గం ద్వారా కాల్వల నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి పనులు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా చేపట్టలేదని ఇది ఒక రికార్డుగా మంత్రి అభివర్ణించారు. ప్రతీ పాయింట్ వద్ద మూడు షిఫ్టుల పని జరుగుతుందని, ప్రతిచోట షిఫ్టుకు 2 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి వివరించారు. 95 శాతానికి పైగా టన్నెల్ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జూలై చివరి నాటికి సిద్దిపేటకు.. అనంతరం దశలవారీగా తెలంగాణలో సగభాగానికి గోదావరి జలాలు పారిస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ.. రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు 49.15 కిలోమీటర్లు సొరంగ మార్గంలో ఇప్పటి వరకు 46 కిలోమీటర్ల పని జరిగిందని చెప్పారు. మిడ్‌మానేరు నుంచి 32 కిలోమీటర్ల సొరంగ మార్గం కాలువ పనులకు గాను ఇప్పటి వరకు 31 కిలోమీటర్ల పని పూర్తి చేసి ఫినిషింగ్ వర్క్ జరుగుతోందని వివరించారు. ఇందుకోసం ఇప్పటి వరకు రూ.22 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. జూలై చివరి నాటికి ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు గోదావరి నీటిని పారిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు 600 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలు తీసుకెళ్లేందుకు అధునాతన పరిజ్ఞానంతో పంప్‌హౌస్‌లు, మోటార్లు బిగిస్తున్నామని, వీటిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన వివరించారు. -
దళితులపై దాడుల నిరోధానికి పోరాటాలు
ఎస్సీ వర్గీరకణను సమర్థిస్తే ఏ పార్టీనైనా భూస్థాపితం చేస్తాం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు భీమారావు అమలాపురం టౌన్ : నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అత్యధికంగా మాలలు ఉన్నారని... ఎస్సీ వర్గీకరణ జోలికి వచ్చి ఆ అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకురావాలని ప్రయత్నించే ఏ రాజకీయ పార్టీనైనా భూ స్థాపితం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు హెచ్చరించారు. ఇప్పుడే కాదు భవిష్యత్‌లో కూడా వర్గీకరణను సమర్థిస్తూ భూజాన వేసుకునే పార్టీలకు తగిన గుణ పాఠం చెప్పేందుకు మాల మహానాడు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అమలాపురంలోని మదర్ థెరిస్సా పాఠశాలలో కోనసీమ దళిత నేతలు, వివిధ సామాజిక వర్గాల నాయకుల ఆధ్వర్యంలో మాల మహానాడుకు జాతీయ అధ్యక్షుడు అయిన సందర్భంగా భీమారావుకు ఆదివారం అభినందన సభ జరిగింది. సభకు భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు పుట్టిన మాల మహానాడు ఉద్యమాల, దాని ఫలితాల వల్లే నేడు ఆ అంశం మరుగున పడిందని భీమారావు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడుల నిరోధానికి మాల మాహనాడు జాతీయ స్థాయిలో పోరాటాలు చేసేందుకు నడుం బిగిస్తోందని వెల్లడించారు. పెరుగుతున్న ఎస్సీ జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం అమలువుతున్న 15 శాతం రిజర్వేషన్లను 23 శాతానికి పెంచాలన్న డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లనున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలను క్రమేపీ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్దతుల్లో భర్తీ చేస్తుండడం వల్ల రిజర్వేషన్ల ఉనికి తగ్గిపోతున్న క్రమంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో మాల మహానాడు ఉద్యమాలకు ప్రణాళికి సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. అనంతరం సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ 21 ఏళ్ల మాల మహానాడు ఉద్యమ ప్రస్థానం ఆదిలో భీమారావు ఉద్యమకారుడిగా లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు అనుభవించారని... అలాంటి రాజీ లేని ఉద్యమ వాదికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. కోనసీమ దళిత ఐక్య వేదిక చైర్మన్ డీబీ లోక్, ఆ వేదిక ముఖ్య ప్రతినిధులు ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావు, ఉండ్రు బుల్లియ్య, సాపే బాలరవి, కాట్రు చంద్రమోహన్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పినిపే రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షుడు వెంటపల్లి జాన్‌మార్క్, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్ దివాకర్, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యిళ్ల సత్యనారాయణ, కోనసీమ కాపు మిత్ర ప్రతినిధి బండారు రామమోహనరావు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ బ్రాహ్మణ సమాఖ్య కో ఆర్డినేటర్ మంగళంపల్లి అంజిబాబు తదితరులు సభలో ప్రసంగించారు. అనంతరం భీమారావును సత్కరించారు. -
కన్నీటి గాధలు
-
నోట్ల రద్దుతో నిర్మాణ రంగంలో ఉపాధి ఉఫ్
-
యుద్ధం
-
పోతున్న ప్రాణాలు ఒడిసిపట్టింది
బ్రిస్టల్: 'ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే బతికుండే వాడు' సాధారణంగా ఇది అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వైద్యుల నోట వినిపించే డైలాగ్. ఈ మాట వినగానే అతడి తలరాత అంతేలే అందుకే చనిపోయాడని అనుకుంటాం. కానీ, వాస్తవానికి ఆ నిమిషానికి సరిగ్గా కాపలా కాస్తే పోయే ప్రాణాన్ని అరచేతపట్టుకొని తిరిగి ఆ వ్యక్తిని బతికించవొచ్చని బ్రిస్టల్ నగరంలో నిరూపితం అయింది. పట్టపగలే కత్తిపోట్లతో పడి ఉన్న ఓ 40ఏళ్ల బిల్డర్‌ను చూసి అందరూ తమకెందుకులే అని వెళ్లిపోతుండగా నర్సుగా పనిచేస్తున్న ఆమె మాత్రం ఆగిపోయింది. తన స్నేహితుడితో కలిసి అతడి వద్దకు గబాగబా వెళ్లి మొకాలిపై కూర్చొని అతడి ప్రాణం కోసం ఎంతో ఆరాటపడింది. అతడు ఎవరూ ఏమిటీ అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. డిగ్నిటీ అనే అహంకారానికి వెళ్లకుండా నేరుగా అతడి చేయి చేతుల్లోకి తీసుకొని పల్స్ చెక్ చేసింది. శ్వాస కూడా ఆగిపోయిన ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) పద్ధతి ద్వారా తిరిగి ఊపరిపోసింది. అంతకుముందు అతడి ఛాతీపై తన శాయశక్తులా బలంగా నొక్కుతూ క్షణాల్లో దూరమవుతున్న ఆయుషును తిరిగి తనకు అందించింది. అలా దాదాపు ఐదు నిమిషాలపాటు రోడ్డుపక్కనే ఓ ప్లాట్ ఫాం పై పడుకోబెట్టి ఆమె చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆ వెంటనే బాధితుడిని బ్రిస్టల్ లోని సౌత్ మెడ్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టింది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగానే ఉంది. -
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీల కసరత్తు
-
డీఎంకె సోదరుల మధ్య మళ్లీ వర్గపోరు
-
శిశువు కోసం రగడ
-
బ్యూటీ... బాంబు.....
ఈ చిత్రంలో ఎర్రటి డ్రస్సులో ఓ నల్ల కలువ లాంటి అందగత్తె కనిపిస్తోంది కదూ... ఆమె ఓ బ్యూటీ క్వీన్. ఆమె పేరు యిత్యిష్ టిటి ఐనావ్. 2013 మిస్ వరల్డ్ పోటీలో ఇజ్రాయిల్ తరఫున పాల్గొన్న అందాల బొమ్మ. ఆమె పక్కన ఆటోమేటిక్ రైఫిల్ పట్టుకుని శత్రువుల గుండెల్లోకి బుల్లెట్లు దించే ఇంకో కత్తి లాంటి అమ్మాయి కనిపిస్తోంది కదూ. ఆమె ఎవరనుకుంటున్నారు. ఆ సొగసుల కొమ్మ, ఈ సాహసాల బొమ్మ ఒకరే. పువ్వంత మృదువుగా ఉన్న ఆ అమ్మాయి వజ్రమంత కఠినంగా ఎందుకు మారిందనే కదా మీ ప్రశ్న. గాజాలో ఇజ్రాయిలీ సైనికుల సరసన నిలిచి నిజంగానే యుద్ధం చేస్తోంది ఐనావ్. తన దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. ఒక ఇజ్రాయిలీగా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. మన దగ్గరైతే సౌందర్యవతి నేరుగా సినిమాల్లోకి వెళ్తుంది. ఇజ్రాయిల్ లో నైతే సైన్యంలోకి వెళ్తుంది. అదే ఇజ్రాయిల్ విజయ రహస్యం. -
యుద్ధానికి మారుపేరు ప్రతీకారం
వెస్ట్‌బ్యాంక్‌లో కిడ్నాప్‌నకు గురై మరణిచించిన ఇజ్రాయెలీ కుర్రాళ్ల ప్రాణాలకు బదులుగా ప్రతీకారానికి ప్రధాని నెతన్యాహూ పిలుపునిచ్చారు. నిరాధారంగా అది ‘హమస్’ పనేనని నిర్ధారించి గాజాపై పూర్తి స్థాయి యుద్ధానికి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాదిని పాలస్తీనా ప్రజల అంతర్జాతీయ సౌహార్ద్రతా సంవత్సరంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే దేశంలేని ప్రజలుగా దశాబ్దాల తరబడి బతుకుతున్న పాలస్తీనీయుల్లో ఈ ఏడాది మొదటి అర్ధ భాగం ఆశలను రేకెత్తింపజేసింది. ఎంత చిన్నదైనా తమకంటూ ఒక దేశం ఉండాలన్న వారి కలలను సాకారం చేయడానికేనన్నట్టుగా... హమస్, ఫతా అనే రెండు పాలస్తీనా సంస్థల మధ్య ఏప్రిల్‌లో ఐక్యతా ఒప్పందం కుదిరింది. రెండు ముక్కలుగా దూరంగా విసిరేసినట్టున్న పాలస్తీనా అవశేష భూభాగాలు వెస్ట్‌బ్యాంక్, గాజాలలో వచ్చే ఏడాది ఎన్నికలను నిర్వహిం చడం కోసం... నిరంతరం కలహించే ఆ రెండు సంస్థలు ప్రభుత్వం ఏర్పరచడానికి రంగం సిద్ధమైంది. కానీ పాల స్తీనా సౌహార్ద్రతా సంవత్సరం మొదటి భాగం మొలకెత్తింపజేసిన ఆశలకు ద్వితీయార్ధ భాగం సమాధి కట్టేలా ఉంది. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్ (ఐఎస్ఐఎల్) సృష్టిస్తున్న ఉగ్ర ఉత్పాతంపై ప్రపంచమంతా దృష్టి సారించి ఉండగా... ఇజ్రాయెల్ పాలస్తీనాపై యుద్ధ ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ , పాలస్తీనా అనే రెండు దేశాలు లేనే లేవని, ఉండ జాలవని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నె తన్యాహూ గత నెల 17 నుంచి పదే పదే ప్రకటిస్తున్నారు. జూన్ 1 నుంచి గాజాపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాం బులు కురిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగాల్లో, జెరూసలెంలో పాలస్తీనీయులపై దాడులు, ఆస్తుల విధ్వం సం సాగుతున్నాయి. గాజాపై పూర్తి స్థాయి యుద్ధం తప్పదని నెతన్యాహూ ప్రకటించారు. గాజాను తిరిగి అక్రమించక తప్పదని విదేశాంగ మంత్రి లిబర్‌మాన్ ప్రకటించారు. ఇదంతా పాలస్తీనీయుల స్వయంకృతాపరాధమేనని ఇజ్రాయెల్ అంటోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఇజ్రాయెలీ అక్రమ సెటి ల్మెంట్లో 16-19 ఏళ్ల ముగ్గురు కుర్రాళ్లు కిడ్నాప్‌నకు గురయ్యారు. నెతన్యాహూ సహా ఇజ్రాయెల్ నేతలంతా నిరా ధారంగా అది ‘హమస్’ పనేనని నిర్ధారించేశారు. ప్రతీ కారం తప్పదంటూ యూదులను రెచ్చగొట్టారు. గత నెల 30న ముగ్గురు కుర్రాళ్ల శవాలు దొరకడంతో ప్రతీకారం మొ దలైంది. కిడ్నాప్‌తో ఎలాంటి సంబంధమూ లేదని హమస్ ప్రకటించింది. కిడ్నాప్ చేసిన ఇద్దరు హమస్ మిలిటెంట్లను గుర్తించామంటూ ఇజ్రాయెల్ వెస్ట్‌బ్యాంక్‌లోని ఆ ఇద్దరి ఇళ్లను కూలగొట్టింది ఆ ప్రతీకారం చాలలేదు. పాలస్తీనా ‘పశవులందరికీ బుద్ధి చెప్పాల’ని నెతన్యాహూ లికుద్ పార్టీ ప్రతీకారానికి పిలుపునిచ్చింది. ఆక్రమిత పాలస్తీనా, తూర్పు జెరూసలెం, గాజాలలో ఇంతవరకు తొమ్మిది మంది కుర్రాళ్లను హతమార్చారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిం చే వరకు ఇజ్రాయెల్‌ను కూడా గుర్తించేది లేదనే హమస్ పాలనలోని గాజాపై జరిపిన ముప్పై వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించారు. విదేశాంగ మంత్రి సెలవిచ్చినట్టే ముగ్గురు యూదు కుర్రాళ్ల ప్రాణాలకు పాలస్తీనీయులు ‘మూల్యాన్ని’ చెల్లిస్తున్నారు. మసీదులు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. కిడ్నాపైన కుర్రాళ్ల కోసం వెతుకులాట సాగుతుండగానే జూన్ 17న నెతన్యాహూ మరో ప్రకటన చేశారు. ఇరాక్‌లోని ఐఎస్ఐఎల్ ఉగ్రవాదులతో సంబంధమున్న అబూ బకర్ అల్ బాగ్దాదీ గ్రూపు పాలస్తీనాలో కార్యకలాపాలు సాగిస్తోందని హెచ్చరించారు. ఆ ముప్పును అరికట్టాలంటే జోర్డాన్ నదీ తీరానికి ఇజ్రాయెల్ బలగాల రక్షణను విస్తరించక తప్పదని మంగళవారం సెలవిచ్చారు. వెస్ట్ బ్యాంక్‌ను కబళించేయడమే లక్ష్యమని చెప్పకనే చెప్పారు. అదేమో గానీ హమస్‌తో ఐక్యత కారణంగానే వెస్ట్‌బ్యాంక్‌లో అధికారంలో ఉన్న ఫతాకు ముప్పు వాటిల్లిందంటూ పాల స్తీనా ఐక్యతను విచ్ఛిన్నం చేసే లక్ష్యాన్ని సాధించినట్టే ఉంది. పాశ్చాత్య మీడియా కళ్లకు ఇయాల్ యిఫ్రాచ్, గిలాద్ షార్, నఫ్తై ఫ్రాంక్తెల్ల నూరేళ్ల జీవితాలను చిదిమేసిన ఘా తుకత్వం మాత్రం కనబడి, ఆలీ, మొహ్మద్, ముస్తాఫా, నదీమ్‌లాంటి పాలస్తీనా కుర్రాళ్ల జీవితాలను ప్రతీకారంగా తుంచేయడంలోని ఘాతుకత్వం కనిపించదు. గతంలో హమస్ ఇలాంటి కిడ్నాప్‌లకు పాల్పడిన మాట నిజమే. కానీ ఫతాతో ఐక్యతా కుదిరినప్పటి నుంచి అది హింసాత్మక ఘటనలకు దూరంగా ఉంటోంది. హమస్‌ను వ్యతిరేకించే ఖతార్‌కు చెందిన ‘అల్ రయా,’ ఒమన్‌కు చెందిన ‘అల్ వతన్’ పత్రికలు ఇదంతా పాలస్తీనాపై యుద్ధానికి ఇజ్రాయెల్ గూఛడార సంస్థ ‘మొసాద్’ రచించిన పకడ్బందీ వ్యూహమని అభిప్రాయపడ్డాయి. ముగ్గురు యూదు పిల్లల హంతకులెవరైనా నరహంతకులే, శిక్షార్హులే. మరి బాధ్యతాయుతమైన దేశాధినేతగా ఉండి బహిరంగంగా సమష్టి ప్రతీకారానికి, యుద్ధానికి రెచ్చగొడుతున్న నెతన్యాహూ...? పిళ్లా వెంకటేశ్వరరావు -
భయం.. భయం
నిర్మల్ : దేశం కాని దేశం.. ఉపాధి పొంది నాలుగు రాళ్లు సంపాదించుకుందామని అయిన వారిని వదులుకుని పోతే.. అక్కడా మనవాళ్లకు కష్టాలు తప్పడం లేదు. ఆ దేశంలో చోటుచేసుకున్న అల్లర్లు మన వాళ్లని గందరగోళానికి గురిచేయడమే కాకుండా ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంతో వలసవాదులు, వారి కుటుంబీకులు నానా హైరానా పడుతున్నారు. అక్కడ తమ వారు ఎలా ఉన్నారోనంటూ నిత్యం వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే.. జరుగుతున్న పరిణామాలతో అక్కడి వారిలోనూ, ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులూ భయాందోళనలకు గురవుతూనే ఉన్నారు. నిత్యం క్షేమ సమాచారాలు.. అంతర్యుద్ధం దృష్ట్యా అక్కడ ఉన్న వారు నిత్యం తమ క్షేమ సమాచారాలను కుటుంబీకులకు చేరవేస్తూనే ఉన్నారు. జరుగుతున్న దాడులకు, జిల్లా వాసులు ఉన్న ప్రాంతాలకు దూరభారం ఎక్కువగా ఉన్నట్లు అక్కడ ఉన్న వారు పేర్కొంటున్నారు. అయితే.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ఆందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఓ పక్క ఉగ్రవాదులు ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామంటూ చెబుతుండగా, అక్కడి ప్రభుత్వ దళాలు మాత్రం తమ అధీనంలోనే ఆ ప్రాంతాలు ఉన్నాయంటూ ప్రకటనలు చేస్తోంది. దీంతో ఎవరి ప్రకటన నిజమో తెలియక అక్కడికి ఉపాధి కోసం వెళ్లిన తమ వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారు. కంపెనీలు ఇండియాకు పంపడం లేదు.. ఎనిమిది నెలల క్రితం నేను ఎలక్ట్రీషియన్ పనిమీద ఇరాక్‌కు వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆందోళనల మధ్యే పనిచేస్తున్నాను. వివిధ ప్రాంతాల ను ఆక్రమించుకుని, ఆజమాయిషి పెంచుకోవడానికి ఇరు జాతుల మధ్య దాడులు జరుగుతున్నాయి. మాకు సమీపంలోని కుర్దిస్థాన్ ఆర్బిల్ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కొంత మంది ఇండియాకు వెళ్లిపోతామని కంపెనీలను అడిగినా క్యాంపుల్లోనే ఉంచుతున్నారు కానీ తిరిగి పంపడం లేదు. - కొక్కుల మహేశ్, ఖానాపూర్ రావడానికి సిద్ధంగా ఉన్న.. కుంటాల : బతుకుదెరువు కోసం భార్యపిల్లలను వదిలి రూ. 3 లక్షల అప్పు చేసి ఇరాక్ దేశానికి వచ్చాను. అకస్మాత్తుగా ఇక్కడ అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నం. నేను బాగ్దాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. భార్యాపిల్లలను వదిలి 8 నెలల క్రితం బతుకుదెరువు కోసం వచ్చాను. ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న. జిహాదీలు, ప్రభుత్వ భద్రత బలగాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తంది. నేను క్షేమంగానే ఉన్నానని ఇంటికి సమాచారం ఇచ్చా. స్వగ్రామానికి రావాలని నాతోపాటు మరో 20 మంది నిర్మల్, లక్ష్మణ్‌చాంద తదితర ప్రాంత వాసులు కంపెనీ ఎదుట రెండ్రోజులుగా ఎదురుచూస్తున్నం. అయినా.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలి. - కూన గంగన్న, నందన్, కుంటాల మండలం జిల్లా నుంచి 300ల మందికి పైనే.. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక, చేసే వ్యవసాయం లాభసాటిగా లేక, తమ కుటుంబాలను ఆర్థికంగా మంచి స్థానాల్లో ఉంచాలన్న ఆశతో ఎంతో మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తున్నారు. అదే మాదిరిగా ఇరాక్ దేశానికి జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. దాదాపు 200 నుంచి 300 మంది వరకు అక్కడ వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. అయితే అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంతో వలదారుల్లో, కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. -
తెలంగాణను అడ్డుకుంటే యుద్ధమే..
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వేగవంతం చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన కార్యక్రమాలు, విభజనకు సహకరించాలన్న విజ్ఞప్తితో శాంతి ర్యాలీలు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఖమ్మంలో ఉద్యోగులు గురువారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బెలూన్లు చేబూని, తెలంగాణ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ‘యూటీ అంటే యుద్ధమే’, ‘పది జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలి’, ‘హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకోం’, ‘సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలి’ అని పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం, ‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ ‘జై తెలంగాణ.. జైజై తెలంగాణ’ అని రాసిన తెల్ల బెలూన్లను ప్రధాన రహదారిపై గాల్లోకి ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు మాట్లాడుతూ.. హైదరాబాదును యూనియన్ టెరి టరీ (యూటీ)గా ప్రకటిస్తే యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు యత్నించడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి విభజనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటపతిరాజు, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కె.ఖాజామియా మాట్లాడుతూ.. హైదరాబాదులో ఏపీ ఎన్జీవోలు సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అనుమతి ఇప్పించారని విమర్శించా రు. ఈ సభను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణావాదులు శాంతి ర్యాలీకి అనుమతివ్వని ప్రభుత్వం.. ఏపీ ఎన్జీవోల సభ కు ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగిరెడ్డి, కోడి లింగయ్య, కోటేశ్వరరావు, వై.వెంకటేశ్వ ర్లు, రవీంద్రప్రసాద్, బడ్జెట్ శ్రీనివాస్, రాజేష్, మల్లయ్య, బాలకృష్ణ, దుర్గాప్రసాద్, తుమ్మలపల్లి రామారావు, భాను, నందగిరి శ్రీను, వల్లోజు శ్రీనివాస్, రమణయాదవ్, ఆర్విఎస్.సాగర్, బాబూజాన్, కూరపాటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ముల్కీ అమరవీరుల సద్భావన ర్యాలీ బయ్యారం: రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం బయ్యారంలో ముల్కీ అమరవీరు ల సద్భావన శాంతి ర్యాలీ జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్‌కు చేరింది. అనంత రం, ర్యాలీనుద్దేశించి జేఏసీ మండల కన్వీనర్ గౌని ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును సీమాంధ్రులు అడ్డుకోవడం సరికాదన్నారు. ర్యాలీలో రిటైర్డ్ ఉపాధ్యాయులు యాదగిరి, వెంకట్‌రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు రామగిరి బిక్షం, నాయకులు మదా ర్, పొమ్మయ్య, నాగేశ్వరరావు, వీరభద్రం, శేషగిరిరావు, లక్ష్మణ్, సర్పంచులు కోటమ్మ, నగేశ్, క్రిష్ణ, శంకర్ పాల్గొన్నారు. -
‘యుద్ధం’ అమెరికా నైతిక హక్కు!
యుద్ధాన్ని ప్రారంభించడం లో అమెరికా చరిత్ర, గొప్ప యూరోపియన్ రాజ్యాల ప్రమాణాలతో పోలిస్తే ఏమంత ఘనమైనదేమీ కాదు. 20వ శతాబ్దాన్ని నిర్వచించే మైలు రాళ్లలాంటి మూడు ప్రపంచ యుద్ధాల (ప్రచ్ఛన్న యుద్ధాన్ని కలుపుకుని) నడుమ అది తారట్లాడిందే తప్ప, ముందుకు గంతువేసింది లేదు. అమెరికాను రెండు ప్రపంచ యుద్ధాలలోకి దించడానికి బ్రిటన్ దాన్ని బాగానే అనునయించాల్సి వచ్చింది. జర్మన్ల మహా మూర్ఖత్వం సైతం అందుకు అవసరమైందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ప్రచ్ఛన్న యుద్ధకాలంలో కమ్యూనిజాన్ని ఎదుర్కోవడంపై అమెరికా మరింత ఎక్కువ శ్రద్ధను కనబరచింది. అయితే నాటో కూటమికి, సోవియట్ యూనియన్‌కు మధ్య ఇనుప తెరను నిర్మించిన ఖ్యాతి మాత్రం విన్స్టన్ చర్చిల్ కంటే హెన్రీ ట్రూమన్కే ఎక్కువగా దక్కుతుంది. కమ్యూనిజం భయం అమెరికాను కొరియా యుద్ధంలోకి దించింది. ఆ యుద్ధం ఆగిందేగానీ ఇంకా ముగియలేదు. ఇక వియత్నాం యుద్ధం వియత్నాం షరతులకు లోబడే ముగిసింది. అమెరికన్ ఉలిపికట్టెవాదానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నిటిలోకీ అత్యంత ఉత్తమమైనది మాత్రం అనిశ్చితే. యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందే యుద్ధాన్ని ముగించడం గురించి అమెరికా ఆందోళన చెందడం సమంజసమే. యూరప్ సాగించిన వలసవాద యుద్ధాలకు నిరుత్సాహకరమైన స్పష్టత ఉంది. వాటి లక్ష్యం అధికారంలో ఉన్న సామ్రాజ్యాలను కూలదోయడం, ఆ స్థానంలో రాజప్రతినిధులను లేదా విధేయులైన మహారాజాలు, నవాబులు, షాలు, అమీర్లను ప్రతిష్ఠించడం. వాటికి భిన్నంగా ధార్మిక యుద్ధాలు లేదా కోరుకున్న భావజాలం కోసం చేసే యుద్ధాల లక్ష్యం ప్రపంచాన్ని ఇప్పుడున్న దానికంటే మరింత మెరుగైనదిగా మార్చడం. అలాంటి యుద్ధాల లోతు కొలవగలిగేదీ కాదు, అవి ఎలా సాగుతాయనేది నిర్ణయించగలిగేదీ కాదు. ఎందుకంటే అలాంటి యుద్ధాల్లో ఒక కాలాతీతమైన ప్రశ్నను ఎదురోవాల్సి వస్తుంది: మెరుగైనది అంటే ఖచ్చితంగా ఏది? వాస్తవానికి ఆ సంఘర్షణ మెరుగైన దానిని వాయిదా వేస్తుందా? లేక త్వరితం చేస్తుందా? ప్రచ్ఛన్న యుద్ధంతో అమెరికా మరింత ఎక్కువగా స్వతంత్ర దురాక్రమణశీలిగా మారింది. 9/11 న్యూయార్క్ ఉగ్రవాద దాడుల తదుపరి అమెరికా దురాక్రమణ తత్వాన్ని తన నైతిక హక్కుగా భావిస్తుండటం అర్థం చేసుకోగలిగేదే. విశాలమైన అర్థంలో ముస్లిం ప్రపంచంగా పిలుచుకునే ప్రాంతం నుంచి తనకు ముప్పు ఉన్నదని భావించినప్పుడల్లా అది ఆ నైతిక హక్కును ప్రదర్శిస్తోంది. ఇంతకుమునుపెన్నడూ ఏ సంప్రదాయక సంఘర్షణలోనూ చూడనంతటి భీకరంగా అమెరికా నేడు అజ్ఞాత ఇస్లామిక్ మిలిటెన్సీని వెంటాడుతోంది. ఆ అజ్ఞాత మిలి టెన్సీ నీడల్లోంచే న్యూయార్క్ జంట టవర్లపై దాడులు జరగడం అందుకు కారణం. ఇది మితిమీరిన మారణాయుధ ప్రయోగానికి, పౌర మరణాలకు, ప్రజాస్వామిక నాగరికతకు అత్యంత మౌలిక ప్రాతిపదికగా ఉండే భావాలకు తీవ్ర హాని కలగడానికి దారి తీసింది. ఇది అతి తక్కువగా యుద్ధ ఖైదీలను పట్టుకునే యుద్ధం. ప్రాణాలతో మిగిల్చినవాళ్లను గ్వాంటనామాకు పంపుతారు. మరణమే అంతకంటే నయం కావచ్చు. వెర్రిపట్టినట్టుగా అదే పనిగా శత్రువుల కోసం అన్వేషించే అమెరికాను ఎదిరించే ప్రభుత్వాలు లేదా దాని దారికి అడ్డువచ్చిన ప్రభుత్వాలు తమకు ముప్పును కొనితెచ్చుకోడానికి సిద్ధపడే ఆ పని చేయాలి. జాతీయవాదం, సామాజిక ఐక్యత, తమను తాము రక్షించుకుంటూ, అమెరికా దురాక్రణను నివారించగుకోగల శక్తిసామర్థ్యాలు వంటి విషయాలలో అవి అసాధారణమైన భద్రతను చేపట్టడం ఆవశ్యకం. అయితే అమెరికా తప్పులు చేసింది. వాటిలోకెల్లా శిఖరాయమానమైనది ఇరాక్. అంతటి భారీ విధ్వంసం లేకుండానే అది దాన్ని దారికి తెచ్చుకోగలిగేది. అమెరికా అత్యాధునిక రాజధాని నగరంలో మనకు తారసపడే పలువురితో పోలిస్తే జార్జి డబ్ల్యూ బుష్ ఏమంత ప్రతిభాపాటవాలు కలవారేమీ కాదు. పైగా ఆయన చుట్టూ ఉన్నవాళ్లు అంతకన్నా అసమర్థులు. సద్దాం హుస్సేన్ ప్రభుత్వ దుర్భలతను ఖచ్చితంగానే అంచనా వేసినా, ఆయన ఇరాకీ ప్రజలను మాత్రం చాలా తప్పుగా అంచనా వేశారు. ప్రపంచ భౌగోళిక వ్యూహాత్మక పటంపై ఇరాక్ ఇప్పుడు మబ్బులాంటి అస్పష్ట ప్రాంతంగా మారింది. ఎక్కువ యుద్ధాలను అంతం చేసిగాక, ఎక్కువ యుద్ధాలను ప్రారంభించి నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న వ్యక్తిగా బరాక్ ఒబామా చరిత్రలో నిలిచిపోతారు. అయినా అయన బుష్ కారు. 9/11 దుమారం ఒబామాను వెన్నంటే ఉంది. అది ఆయనకూ తెలుసు. అది, అగ్రరాజ్యపు నౌకల ప్రయాణానికి దోహదపడేదే తప్ప, స్వదేశంలోని సొంత బలగాలపై విరుచుకుపడి, విధ్వంసం కలుగజేసే టైఫూన్ కాదని కూడా ఆయనకు రూఢిగా తెలుసు. నావికా బలాలను దాడికి అనువైన స్థానాలలో మోహరింపజేసిన తర్వాత వెనక్కుతగ్గడమంటే స్వదేశంలో తన ప్రతిష్టకు పూడ్చుకోలేని దెబ్బతగలడమేనని సైతం ఆయనకు తెలుసు. గందరగోళం కూడా ఒక సమస్యేనని గుర్తించగలిగేపాటి తెలివితేటలు ఒబామాకు ఉన్నాయి. అయితే ఆయనకు ముందటి అధ్యక్షుడు బుష్ గందరగోళంలో అవకాశం దాగి ఉన్నదని విశ్వసించేవారు. సిరియాలో తన లక్ష్యాలేమిటో ఒబామాకు తెలుసు. అయితే వాటిని సాధించాలంటే ప్రజాభిప్రాయం అనుమతించే పరిమిత యుద్ధం సరిపోదని సైతం ఆయన గుర్తించారు. అసద్ కుటుంబీకులు డమాస్కస్ వీడిపోవడం ఒబామాకు కావాలి. అయితే అందుకోసం అమెరికా సైన్యం అక్కడ కాలుమోపడం అవసరం. కలగూరగంపలాంటి, ప్రమాదకరమైన తిరుగుబాటు ముఠాలు అమెరికా నియంత్రణకు గానీ లేదా ప్రాంతీయ శక్తులైన టర్కీ, సౌదీ అరేబియా వంటి ప్రాంతీయ శక్తుల నియంత్రణకుగానీ లోబడే బాపతు కాదు. యుద్ధం కాకపోతే అమెరికాకు ఎంచుకోడానికి ఉన్న అత్యుత్తమ అవకాశం సిరియా ఆయుధ పాటవాన్ని క్షీణింపజేయడం, దాని కాల్బలాల నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడం, యుద్ధ సన్నద్ధమై ఉన్న దాని మిత్రపక్షం హిజ్బుల్లాను దెబ్బతీయడం. చివరిగానే అయినా ప్రాధాన్యంలేనిదేమీ కాని మరోపని కూడా ఉంది. అది- సిరియాకు సైనిక మిత్రులుగా రష్యా, ఇరాన్లకున్న పరిమితులు బట్టబయలయ్యేట్టు చేయడం. ఇరాన్, రష్యాలు చేయగలిగినదల్లా గర్జించడం మాత్రమే. కాబట్టి అమెరికా తాను పంపదలుచుకున్న సందేశాన్ని పంపినట్టవుతుంది. ఇరాన్, రష్యాలు స్పందించడానికి తమకు అనువైన సమయాన్ని, వారాలు లేదా నెలల్లో ఎంచుకోగలుగుతాయనేదే ఇందులో ఇమిడి ఉన్న ప్రమాదం. ఇరాన్‌కు, దాని షియా మిత్రులకు వ్యతిరేకంగా సున్నీ గగనతలాన్ని సంఘటిత పరుచుకోవడం కోసం సౌదీ అరేబియా... సిరియాలోని బషర్ అల్ అసద్ వ్యతిరేక పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. కాబట్టి రష్యా, సిరియా గగనతలాన్ని ఉపయోగించుకొని సౌదీ అరేబియాపై ప్రతీకార చర్యకు దిగవచ్చు. 9/11 ఉగ్రవాదదాడులు తీవ్రవాద సున్నీల కుట్రే. అయినాగానీ సౌదీ నేతృత్వంలో సాగుతున్న ఈ సున్నీ వ్యూహానికి అమెరికా కట్టుబడి ఉండటం ఆసక్తికరం. ఇక ఇరాన్, తర్కరహితమైన అవకాశాలను ఎంచుకునేలా దాన్ని ప్రోత్సహించడం ఒక విరోధాభాస. అస్థిరత ఆవరించిన ఆ ప్రాంతంలో ఇరాన్ సుస్థిరత అనేది అమెరికన్ వ్యూహకర్తలకు ఆందోళన కలిగిస్తూనే ఉండి ఉండాలి. సంక్లిష్టమైనదానికంటే సుపరిచితమైనదే మేలని అమెరికా ఎంచుకుంది. మొదటి ప్రపంచ యుద్ధంపై 2014, ఆగస్టులో సెమినార్లు జోరుగా చోటుచేసుకోబోతున్నాయి. సిరియా, మధ్యప్రాచ్యాలను నేటికీ యుద్ధాలను ప్రేరేపించే విధంగా మార్చినది ఆ యుద్ధమే. ఇంకా ముగియని ఆ యుద్ధపు శతవార్షికోత్సవాలకు ఒక క్షిపణి ప్రయోగం నాంది పలుకుతుంది. అంతకంటే ఇంకా కొత్తది ఏముంది? బైలైన్ ఎం.జె.అక్బర్,సీనియర్ సంపాదకులు