
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ట్యాంకును నడిపారు. బుధవారం ఆయన దేశ సైనిక దళాల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు పెద్ద ప్రయత్నాలు చేయాలని సేనలకు పిలుపునిచ్చారు.
అధికార వార్తా సంస్థ(కేసీఎన్‌ఏ) గురువారం ఈ విషయం వెల్లడించింది. పొరుగుదేశం దక్షిణ కొరియా, అమెరికా 11 రోజులుగా కొనసాగిస్తున్న భారీ సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. అందుకు బదులుగా అన్నట్లు కిమ్ యుద్ధ ట్యాంకుల పోరాట సన్నద్ధతను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment