Test drive
-
ఏఐని వాడుకుంటాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలందించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హైదరాబాద్ ఐఐటీలో అభివృద్ధి చేస్తున్న సాంకేతికతను వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పంటలకు మందులు పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ వినియోగిస్తోందని, అలాగే రవాణా, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని తెలిపారు.సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో పరిశోధన విభాగం టీహాన్ అభివృద్ధి చేస్తున్న డ్రైవర్ రహిత (అటానమస్ నావిగేషన్) వాహనాన్ని పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఈ వాహనంలో ప్రయాణించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో మాదిరిగా మన దేశంలోని రోడ్లు, ట్రాఫిక్ తీరుకు అనుగుణంగా పనిచేసే డ్రైవర్ రహిత వాహన టెక్నాలజీని హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను రోడ్లపైకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ పరిశోధనకు సహకరిస్తున్న జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ ప్రతినిధులను, పరిశోధన విభాగం విద్యార్థులు, ప్రొఫెసర్లను మంత్రి అభినందించారు. ఐఐటీని ఇక్కడకు తీసుకొచి్చంది వైఎస్సే దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఈ హైదరాబాద్ ఐఐటీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సంగారెడ్డి జిల్లా కందిలో స్థాపించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. స్కిల్స్ యూనివర్సిటీలో ఒక డైరెక్టర్‌గా ఉండాలని మంత్రి హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీహాన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
5 డోర్ల థార్ ‘రాక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా అయిదు డోర్ల థార్ రాక్స్ భారత్‌లో ఎంట్రీ ఇచి్చంది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.12.99 లక్షలు. సెప్టెంబర్ 14 నుంచి టెస్ట్ డ్రైవ్ కోసం రాక్స్ అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ ప్రారంభం. దసరా నుంచి డెలివరీలు ఉంటాయి. 2 లీటర్ ఎం–స్టాలియన్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్, 2.2 లీటర్ ఎం–హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఆరు వేరియంట్లలో రేర్ వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ డ్రైవ్ట్రెయిన్తో లభిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంచుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, కీ లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, 644 లీటర్స్ బూట్ స్పేస్ వంటి హంగులు ఉన్నాయి. -
యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్వయంగా ట్యాంకును నడిపారు. బుధవారం ఆయన దేశ సైనిక దళాల శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. యుద్ధానికి సిద్ధం అయ్యేందుకు పెద్ద ప్రయత్నాలు చేయాలని సేనలకు పిలుపునిచ్చారు. అధికార వార్తా సంస్థ(కేసీఎన్ఏ) గురువారం ఈ విషయం వెల్లడించింది. పొరుగుదేశం దక్షిణ కొరియా, అమెరికా 11 రోజులుగా కొనసాగిస్తున్న భారీ సైనిక విన్యాసాలు గురువారంతో ముగియనున్నాయి. అందుకు బదులుగా అన్నట్లు కిమ్ యుద్ధ ట్యాంకుల పోరాట సన్నద్ధతను పరిశీలించారు. -
టెస్ట్ డ్రైవ్‌లో రూ.33 లక్షల కారు నుజ్జునుజ్జు - వీడియో వైరల్
సాధారణంగా ఒక కారు కొనడటానికి ముందు కంపెనీ డీలర్షిప్ టెస్ట్ డ్రైవ్ సదుపాయం కల్పిస్తుంది. అయితే కొన్ని సార్లు అనుభవం లేని డ్రైవర్లు కారుని డ్రైవ్ చేస్తే అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి సంఘటన తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం ఈ సంఘటన కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీలో జరిగినట్లు తెలుస్తోంది. అమెరికన్ కార్ బ్రాండ్ అయిన జీప్ మెరిడియన్ టెస్ట్ డ్రైవ్ సమయంలో అనుకోని పెద్ద ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లయితే, రోడ్డు తడిగా ఉండటం గమనించవచ్చు. ప్రమాదం జరగటానికి ఖచ్చితమైన కారణం వెల్లడి కాలేదు. దీనికి కారణం అతి వేగమా? లేక డ్రైవింగ్‌లో పెద్దగా అనుభవం లేకపోవడమా? అనేది తెలియాలి ఉంది. అయితే ప్రమాదంలో కారు చాలా ఎక్కువ దెబ్బతినడంతో ఫ్రంట్ బంపర్, రియర్ ప్రొఫైల్ చాలా వరకు పనికిరాకుండా పోయింది. కారు డివైడర్‌ను ఢీకొట్టి రెండు స్ట్రీట్‌లైట్ స్తంభాలను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఏదైనా ప్రమాదం జరిగిందా.. లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. లోపల ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడం వల్ల బహుశా వారికి గాయాలేమైనా అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: న్యూ ఐఫోన్ 15 గురించి ఆసక్తికర విషయాలు.. 16 సిరీస్ వస్తుందా? జీప్ మెరిడియన్.. టెస్ట్ డ్రైవ్ సమయంలో వినియోగదారుడు పరిమిత వేగంతో డ్రైవ్ చేయాలి, ఎందుకంటే కొత్త కారు గురించి వారికి పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఇలాంటి ప్రమాదాలే జరిగే అవకాశం ఉంది. కారు ప్రమాదానికి గురైతే టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకున్న వారు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగిందా? లేదా స్పష్టంగా వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన జీప్ మెరిడియన్ ధర రూ. 33.41 లక్షల నుంచి రూ. 38.61 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదం ఇదే మొదటి సారి కాదు.. టెస్ట్ డ్రైవ్ సమయంలో కార్లు ప్రమాదానికి గురవ్వడం ఇదే మొదటిసారి కాదు, గతంలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా, టాటా కంపెనీకి చెందిన కార్లు, హ్యుందాయ్ ఐ20 ప్రమాదాలకు గురయ్యాయి. కేవలం సాధారణ కార్లు మాత్రమే కాకుండా టెస్లా కార్లు కూడా టెస్ట్ డ్రైవ్‌లో ప్రమాదానికి గురైనట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. -
మొదలైన 'ఎంజీ కామెట్' టెస్ట్ డ్రైవ్స్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
ఇటీవల భారతదేశంలో విడుదలైన చిన్న హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ కామెట్' ఎంతో మంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లు 2023 మే 15 నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు, టెస్ట్ డ్రైవ్స్ వంటి వివరాలు ఇక్కడ చూసేద్దాం.. గత నెల చివరిలో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా డెలివరీలు మే నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఎంజి కామెట్ చూడటానికి చిన్న కారు అయినప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే ఎంజీ కామెట్ ఈవీ వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బార్ కలిగి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ లైట్ బార్ కింద ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం గమనించవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే ఈ చిన్న కారు 10.25 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే రెండూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, మ్యాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు 55కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) 3.67 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI దృవీకరించింది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఎంజి కామెట్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పరిమాణం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఢిల్లీలో ఉండి స్వీడన్లో కారు నడిపిన మోదీ.. అది ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్‌లోని స్వీడన్లో కారు నడపటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. అది నిజమే. 5జీ టెక్నాలజీతో అది సాధ్యమైంది. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. దేశంలో 5జీ మొబైల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. 5జీ లింక్ సాయంతో ఇండియా మొబైల్ కాన్ఫరెన్స్‌లోని ఎరిక్సన్ బూత్ నుంచి యూరప్‌లో కారు టెస్ట్ డ్రైవ్ చేశారు. ఆ సమయంలో కారు స్వీడన్లో ఉంది. స్వీడన్లో ఉన్న కారును నియంత్రించే సాకేతికతను ఎరిక్సన్ బూత్‌లో అమర్చటం ద్వారా ఇది సాధ్యమైంది. రిమోట్ కంట్రోల్ కారు స్టీరింగ్ పట్టుకుని ఉన్న ప్రధాని మోదీ ఫోటోను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘భారత 5జీ టెక్నాలజీ సాయంతో ఢిల్లీ నుంచి యూరప్‌లోని కారును రిమోట్ కంట్రోల్స్ ఆధారంగా ప్రధాని మోదీజీ టెస్ట్ డ్రైవ్ చేశారు.’ అని రాసుకొచ్చారు గోయల్. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ సాంకేతికత ప్లాట్‌ఫాం. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ప్రారంభమైన ఆరవ ఎడిషన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం అక్టోబర్ 4 వరకు జరగనుంది. రిమోట్ కంట్రోల్స్‌తో కారు నడపటంతో పాటు 5జీ సాంకేతికతతో అందుబాటులోకి వచ్చే వివిధ సౌకర్యాలను పరిశీలించారు మోదీ. India driving the world. PM @NarendraModi ji tests driving a car in Europe remotely from Delhi using India’s 5G technology. pic.twitter.com/5ixscozKtg — Piyush Goyal (@PiyushGoyal) October 1, 2022 WATCH | Prime Minister @narendramodi tries his hands on virtual wheels at the exhibition put up at Pragati Maidan before the launch of 5G services in the country. pic.twitter.com/zpbHW9OiOU — Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) October 1, 2022 ఇదీ చదవండి: PM launch 5G services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని -
దేశంలో తొలిసారిగా.. కొత్త రకం టెస్ట్‌డ్రైవ్
ముంబై: ఆటో టెక్ స్టార్టప్ సంస్థ కార్జ్‌సోడాట్‌కామ్ తాజాగా హర్యానాలోని కర్నాల్‌లో వర్చువల్ రియాలిటీ (వీఆర్) ఆధారిత ఎక్స్పీరియన్స్ స్టోర్ ప్రారంభించింది. దేశీయంగా ఈ తరహా స్టోర్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారని సంస్థ తెలిపింది. 25 కార్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మెట్రోయేతర నగరాల్లోకి మరింతగా విస్తరించేందుకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్లు మరిన్ని ప్రారంభించనున్నట్లు వివరించింది. సాధారణంగా ప్రీ–ఓన్డ్ కార్లను కస్టమర్లు స్వయంగా వెళ్లి చూసి, షార్ట్‌లిస్ట్ చేసి, కొనుక్కునేందుకు కొన్ని పరిమితులు ఉంటాయని కంపెనీ వ్యవస్థాపక సీఈవో వైభవ్ శర్మ తెలిపారు. వీఆర్ సాంకేతికతతో తక్కువ సమయంలోనే మరిన్ని ఉత్పత్తులను చూసేందుకు కస్టమర్లకు వీలుంటుందని పేర్కొన్నారు. దేశీ ఆటోమొబైల్ పరిశ్రమలో వీఆర్ టెక్నాలజీని మరింత వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా ఆటోమోటివ్ పరిశ్రమలో వీఆర్ మార్కెట్ ప్రస్తుతం 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా 2027 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నట్లు శర్మ చెప్పారు. కార్జ్‌సోడాట్‌కామ్.. గుర్గావ్లో అత్యంత భారీ స్థాయిలో ప్రీ–ఓన్డ్ కార్ల తొలి సూపర్‌స్టోర్ నిర్మిస్తోంది. ఇందులో 300 పైగా కార్లకు పార్కింగ్ ఉంటుంది. -
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఓలా..!
ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ఓలా ఎలక్ట్రిక్ గుడ్‌న్యూస్‌ను చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నవంబర్ 10 నుంచి ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను టెస్ట్ రైడ్‌కు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్ డ్రైవ్ కేవలం ఎంపిక చేయబడిన మెట్రో పాలిటన్ నగరాల్లోనే అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఓలా బైక్‌ల టెస్ట్ డ్రైవ్ ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్కత్తా నగరాలకే పరిమితమైంది. నవంబర్ 19 నుంచి ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, పుణే నగరాల్లో టెస్ట్ రైడ్‌ను ఓలా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను విస్తరించడం కోసం ఈ నెలాఖరులో మరిన్ని నగరాలకు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం టెస్ట్ రైడ్ లొకేషన్లను విస్తరించే ప్రణాళికలను ఓలా ప్రకటించింది. నవంబర్ 27 నుంచి మరిన్ని నగరాల్లో టెస్ట్ రైడ్లను అందుబాటులో ఉంచనుంది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ బైక్‌లను సూరత్, తిరువనంతపురం, కోజికోడ్, విశాఖపట్నం, విజయవాడ, కోయంబత్తూర్, వడోదర, భువనేశ్వర్, తిరుప్పూర్, జైపూర్ , నాగ్‌పూర్ నగరాల్లో టెస్ట్ రైడ్ అందుబాటులో రానుంది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్‌కే కాదండోయ్..ఈవీ ఇళ్లకూ భారీగా డిమాండ్ పెరిగింది..! వెయ్యి నగరాలకు పైగా..! ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై వస్తోన్న స్పందనపై ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను భవీష్ ట్విటర్లో షేర్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను మరింత విస్తరించేందుకుగాను దేశవ్యాప్తంగా డిసెంబర్ 15 నాటికి సుమారు 1000పైగా నగరాల్లో టెస్ట్ డ్రైవ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ట్విటర్లో పేర్కొన్నారు. Amazed and proud to see the strong response to our S1 test rides! Thousands of you have tried & loved it! We’re now expanding test rides to 1000+ cities across India by Dec 15. This is the largest direct to consumer outreach in Indian automotive history! #JoinTheRevolution pic.twitter.com/ErxXkflQzO — Bhavish Aggarwal (@bhash) November 20, 2021 ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లను ఆగస్టు 15న ఓలా ఎస్1, ఎస్ 1ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ.99,999, రూ.1,29,999కు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రీ లాంచ్ బుకింగ్ లను జూలైలో ₹499కు ప్రారంభించింది. అప్పుడు కేవలం 24 గంటల్లో లక్ష ఆర్డర్లను అందుకొని రికార్డులను క్రియోట్ చేసింది. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా? -
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ రైడ్‌కి మీరు సిద్ధమా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్‌తో వినియోగదారులను అకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా టెస్ట్ రైడ్ నిర్వహింస్తోంది. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా టూ వీలర్ సెగ్మెంట్లో పెట్రోలు బాధలు తప్పించే ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇందుకు తగ్గట్టే ఇ స్కూటర్ తయారీలో అనేక స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటీలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది దృష్టిని ఓలా ఈ స్కూటర్లు ఆకర్షించాయి. ఆగస్టులోనే ఆగస్టులో ఓలా సంస్థ ఓలా ఎస్ 1, ఓలా ఎస్ ప్రో మోడళ్లను ఆవిష్కరించింది. ఆ తర్వాత నెల తర్వాత బుకింగ్ ప్రారంభించింది. ఆన్లైన్లో బుక్ చేసుకుని విడతల వారీగా నగదు చెల్లించినవారికి ఈ స్కూటర్ణి హోం డెలివరీ చేస్తామని తెలిపింది. అయితే ఓలా అందిస్తున్న ఇ స్కూటర్ల ప్రారంభ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.32 లక్షల వరకు ఉంది. దీంతో ప్రారంభంలో ఆసక్తి చూపిన అనేక మంది ఆ తర్వాత వెనకడుగు వేశారు. మార్కెట్లోకి స్కూటర్ వచ్చిన తర్వాత బుకింగ్ చేద్దామనే ఆలోచణలో ఎక్కువ మంది ఉన్నారు. మౌత్‌టాక్ ఓలా స్కూటర్లు ప్రీ బుకింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించగా ఆ తర్వాత ఆ స్థాయిలో బుకింగ్స్ నమోదు కాలేదు. దీంతో వినియోగదారులకు మరింర చేరువగా స్కూటర్ని తీసుకెళ్లాలని ఓలా నిర్ణయించింది. దీని కోసం దేశవ్యాప్తంగా ఉచితంగా టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తోంది. టెస్ట్ ట్రైవ్ జరిగితే స్కూటర్ పనితీరు పట్ల పాజిటివ్ మౌత్‌టాక్ వస్తుందని.. తద్వారా రెండో విడత అమ్మకాలు జోరందుకుంటాయని సంస్థ అంచనా వేస్తోంది. Here’s a video! pic.twitter.com/AQsa4aES1b — Bhavish Aggarwal (@bhash) November 11, 2021 హైదరాబాద్‌లో ఇప్పటికే బెంగళూరు, కోలక్‌తా, అహ్మదాబాద్, నేషనల్ క్యాపిటర్ రీజియన్ (ఢిల్లీ)లో టెస్ట్ డ్రైవ్‌ను ప్రారంభించారు. కస్టమర్లకి బైకు ప్రత్యేకతలు, ఫీచర్లు వివరిస్తూ టెస్ట్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నవంబరు 19 తర్వాత ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో టెస్ట్ డ్రైవ్‌కి అవకాశం కల్పించనున్నారు. చదవండి: ఈవీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా అదుర్స్! -
మార్స్‌పై రోవర్ అడుగులు షురూ!
లాస్ఏంజెల్స్: మార్స్‌పై పరిశోధనల నిమిత్తం నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్‌డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కుజుడిపై పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసింది. ఇందుకు సుమారు 33 నిమిషాలు పట్టిందని నాసా వెల్లడించింది. రోవర్ పనితీరులో ఇది పెద్ద ముందడుగుగా అభివర్ణించింది. రోవర్‌లోని ప్రతి వ్యవస్థ పనితీరును చెక్ చేయడానికి ఈ టెస్ట్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపింది. ఇతర గ్రహాలపై రోవర్ల టెస్ట్‌డ్రైవ్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, పర్సెవరెన్స్ ఈ పనిని అద్భుతంగా నిర్వహించిందని, దీనివల్ల రాబోయే రెండేళ్ల పాటు రోవర్ పనితీరు బాగుంటుందని నమ్ముతున్నట్లు నాసా సైంటిస్టు అనైస్ జరిఫియన్ చెప్పారు. ఇకపై పరిశోధనల్లో భాగంగా రోవర్ 200 మీటర్ల దూరాలను కూడా కవర్ చేయాల్సిఉంటుందన్నారు. గతనెల 18న ఈరోవర్ మార్స్‌పై లాండ్ అయింది. కుజుడిపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, మనిషి లాండ్ అయ్యే అవకాశాలను పరిశీలించడం దీని విధులు. -
కొంపముంచిన ఓఎల్ఎక్స్ బేరం!
గోల్కొండ: బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చెప్పి బైక్‌తో ఉడాయించాడు గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేకర్ రెడ్డి కథనం ప్రకారం... రాజేంద్రనగర్ మండలం కిస్మత్ పూర్‌కు చెందిన పృథ్వీ యాదవ్ క్యాబ్ డ్రైవర్. ఇతను తన వద్ద ఉన్న పల్సర్ బైక్‌ను అమ్మడానికి ఓఎల్ఎక్స్లో పెట్టాడు. కాగా శనివారం ఉదయం ఆ బైక్ కొంటానని ఓ యువకుడు పృథ్వీ యాదవ్‌కు ఫోన్ చేశాడు. బైక్ తీసుకుని షేక్‌పేట్ నాలా అల్హమ్రా కాలనీ వద్ద గల డీ మార్ట్ షోరూం వద్దకు రమ్మని ఆ యువకుడు పృథ్వీ యాదవ్‌ను ఫోన్లో కోరారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో పృథ్వీ యాదవ్ అక్కడికి వెళ్లగా... పేపర్లు, ఇన్సూరెన్స్ అంటూ వివరాలు అడిగాడు. బైక్ తీసుకొని ట్రయల్ కొడతానని చెప్పి... మూడు ట్రయల్స్ వేశాడు. మళ్లీ ట్రయల్ వేస్తానని చెప్పి బైక్‌తో ఉడాయించాడు. పృథ్వీ యాదవ్ ఆ యువకుడికి ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (పెద్దపులి దత్తతకు రూ.5 లక్షల చెక్) -
ఐఐటీలో సోలార్ ఆటో టెస్టు డ్రైవ్
సాక్షి, సంగారెడ్డి: ఐఐటీ హైదారాబాద్‌లో జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సోలార్ ఆటోను గురువారం సంస్థ ప్రాంగణంలో పరీక్షించారు. హెచ్ఎస్ఈవీ ఐఎన్‌సీ జపాన్ బృందం సభ్యులు షీమిడా, చీబా ఆధ్వర్యంలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఐఐటీ రసాయన శాస్త్ర విభాగం గ్రూపు పరిశీలకుడు డాక్టర్ కె.సురేంద్ర మార్త ఈ వివరాలు వెల్లడించారు. జపాన్ టెక్నాలజీతో ఐఐటీ కెమిస్ట్రీ గ్రూపు విద్యార్థులు సోలార్ ఆటో తయా రు చేశారన్నారు. ఈ ఆటోకు 4 గంటలు బ్యాటరీ చార్జింగ్ పెడితే గంటకు 40 కి.మీ. స్పీడ్‌తో 80 కి.మీ. ప్రయాణం చేయవచ్చ న్నారు. ఆటోను జపాన్‌లో తయారు చేస్తే రూ.లక్షా డెబ్బై వేల వరకు ఖర్చు అవుతుందని, భారత్‌లో అయితే రూ.లక్ష మాత్రమే అవుతుందన్నారు. తుది పరీక్షల అనంతరం ఆసక్తి ఉన్న కంపెనీలకు తయారీపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
టెస్ట్ డ్రైవ్ చేస్తానని.. బైక్‌తో పరార్
ప్రొద్దుటూరు క్రైం : ‘బ్రదర్ మీ బైక్ చాలా బాగుంది.. ఎంతకు తీసుకున్నారు..? నేను ఇలాంటి బైక్ తీసుకోవాలనుకుంటున్నాను.. టెస్ట్ డ్రైవ్ చేస్తాను.. మీ బైక్ ఇస్తారా’.. అంటూ బైకు తీసుకుంటాడు.. అంతే.. బైక్‌తో వెళ్లిన అతను ఇక తిరిగిరాడు. ఇలా ప్రొద్దుటూరుతో పాటు కడపలో బైక్‌లను దొంగలించిన దుర్గం దివాకర్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం సీఐ రామలింగమయ్య అరెస్ట్ వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్న దివాకర్ 7వ తరగతి వరకు చదువుకున్నాడు. అతనికి తండ్రి లేడు. తల్లి ఉన్నా అతనికి దూరంగా ఉంటోంది. దీంతో అతను అవ్వా, తాత వద్ద ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన దివాకర్ చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డారు. నిద్రిస్తున్న సమయంలో వారి చేతిలో ఉన్న ఉంగరాలను చాక చక్యంగా దొంగిలించుకొని వెళ్లేవాడు. ప్రొద్దుటూరు, కడపలో అతనిపై చోరీ కేసులు ఉన్నాయి. తర్వాత బైక్‌లను దొంగిలించాలనే ఆలోచన అతనికి వచ్చింది. గ్రౌండ్లలో పార్కింగ్ చేసిన బైక్‌లే టార్గెట్ సాయంత్రం సమయాల్లో పాఠశాల, కళాశాల మైదానాలకు వెళ్లి అక్కడ పార్కింగ్ చేసిన బైక్‌లను దివాకర్ ఎంపిక చేసుకుంటాడు. బైక్ యజమానిని గుర్తించి అతని వద్దకు వెళ్తాడు. ‘అన్నా మీ బైక్ బాగుంది.. ఎంతకు కొన్నారు..? నేను ఇలాంటి బైక్‌ను కొనాలనుకుంటున్నాను.. బండి ఎలా ఉందో డ్రైవ్ చేసి ఇస్తాను ఇస్తారా’.. అని వారిని బతిమాలతాడు. తనపై వారికి నమ్మకం కుదిరేలా తన డొక్కు బైక్‌ను అక్కడే వదిలేసి వెళ్తాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీకి చెందిన ఎం ప్రసాద్ అనే వ్యక్తి తన హోండా షైన్‌ను గుర్తు తెలియని ఒక యువకుడు తీసుకెళ్లాడని ఈ నెల 28న వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్ఐ ఎంఏ ఖాన్ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు దివాకర్ రామేశ్వరంలోని శివాలయం వద్ద ఉన్నాడని సమాచారం రావడంతో ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి సోమవారం అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి హోండా షైన్, టీవీఎస్ అపాచీ, రాయల్ ఎన్ఫీల్డ్ను స్వా«ధీనం చేసుకున్నారు. ఈ నెల 24న కడపలోని ఐటీఐ సర్కిల్ వద్ద ఆపాచీ, 25న కమలాపురం మండలం, అప్పాయపల్లి వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను దొంగిలించినట్లు అతను పోలీసుల వద్ద అంగీకరించాడు. నిందితుడి అరెస్ట్, వాహనాల రికవరీలో మంచి ప్రతిభ కనబరచిన ఎస్ఐ ఎంఏ ఖాన్, కానిస్టేబుళ్లు మహేష్, సింహరాయుడును సీఐ రామలింగమయ్య అభినందించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. -
‘రాఫెల్’ను నడిపిన ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్
న్యూఢిల్లీ: భారత్ కోసం ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ తయారుచేసిన తొలి రాఫెల్ ఫైటర్ జెట్‌ను ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ రఘునాథ్ నంబియార్ నడిపారు. రాఫెల్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదు రోజుల క్రితం ఫ్రాన్స్‌కు చేరుకున్న నంబియార్ గురువారం రాఫెల్ జెట్ సమర్థత, పనితీరును పరీక్షించడంలో భాగంగా యుద్ధ విమానాన్ని నడిపారు. ఈ పర్యటనలో భాగంగా రాఫెల్ ఫైటర్ జెట్ల తయారీ పనుల్లో పురోగతిని సమీక్షించారు. భారత అవసరాలకు తగ్గట్లుగా రాఫెల్ జెట్‌లో మార్పులు సూచించేందుకు ఐఏఎఫ్ బృందం డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీతో కలసి పనిచేస్తోంది. భారత్‌కు రాఫెల్ ఫైటర్ జెట్ల సరఫరా 2019 నుంచి మొదలుకానుంది. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ ఫైటర్ జెట్లను(ఆయుధాలతో కలిపి) రూ.58,000 కోట్లకు కొంటోంది. -
నెట్లో చూశాకే షి‘కారు’
న్యూఢిల్లీ: లక్షల రూపాయల ఖరీదు చేసే కారు కొనుక్కోవడమనేది చాలా మందికి ఎమోషనల్ వ్యవహారం. ముందుగా రకరకాల కార్లు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకోవడం నుంచి తమకు అనువైనదాన్ని ఎంపిక చేసుకుని, కొనుక్కునే దాకా అనేక దశలుంటాయి. ఇది కుటుంబ సభ్యులందరికీ కూడా నచ్చాలి. ఇందుకోసం పలు దఫాలుగా వివిధ కార్లు టెస్ట్ డ్రైవ్ చేస్తారు. ఒకటి నచ్చకపోతే మరో కారును ప్రయత్నిస్తారు. ఇవన్నీ ముగిసిన తర్వాతే ఏ కారు కొనుక్కోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో అనేక దఫాలుగా వివిధ కార్ల షోరూమ్‌లన్నీ సందర్శిస్తుంటారు. అయితే, ఇదంతా క్రమంగా మారుతోంది. కార్ల కోసం షోరూమ్‌లకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మిగతా ఉత్పత్తుల్లాగే కార్ల కొనుగోలు కోసం కూడా ఇంటర్నెట్ మాధ్యమంపైనే ఆధారపడే వారి సంఖ్య పెరుగుతోంది. సౌకర్యంగా ఇంటి దగ్గరే కూర్చుని వివిధ రకాల కార్లు, మోడల్స్, వాటి ప్రత్యేకతల గురించి ఆన్లైన్లోనే క్షుణ్నంగా తెలుసుకుని నిర్ణయాలు తీసుకునే కొనుగోలుదారుల సంఖ్య పెరుగుతున్నట్లు దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ కల్సి చెప్పారు. దీంతో ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా షోరూమ్‌లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోందని ఆయన తెలియజేశారు. గతంలో కస్టమర్లు కార్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునేందుకు వివిధ కార్ల షోరూమ్‌లను మూడు, నాలుగు సార్లు సందర్శించేవారని, ప్రస్తుతం ఈ విజిట్స్ గణనీయంగా తగ్గాయని చెప్పారాయన. ‘‘షోరూమ్‌ను సందర్శించే వారి సంఖ్య తగ్గుతున్న మాట నిజం. కాకపోతే కచ్చితంగా కొనుగోలు చేసేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ముందుగానే అన్ని వివరాలూ క్షుణ్ణంగా తెలుసుకుని రావడమే దీనికి కారణం’’ అని ఆయన వివరించారు. షోరూమ్స్‌కి వచ్చేవారి సంఖ్య తగ్గుతున్నా.. మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతుండటం ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగేళ్లుగా కొనుగోలుదారుల తీరు క్రమంగా మారుతోందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సేల్స్ అండ్ మార్కెటింగ్ చీఫ్ వీజే రామ్ నక్రా చెప్పారు. 2017–2019 ఆర్థిక సంవత్సరాల మధ్యలో తమ వాహనాల గురించి వచ్చే ఎంక్వైరీలు మొత్తం మీద 20% పెరిగాయని.. కానీ షోరూమ్‌కి వచ్చి మరీ తెలుసుకునే వారి సంఖ్య దాదాపు అదే స్థాయిలో తగ్గిందని ఆయన వివరించారు. 2017 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎంక్వైరీ ల్లో వాక్–ఇన్స్ వాటా 35–40% ఉండగా.. ప్రస్తుతం ఇది 20–25% ఉంటోందని ఆయన తెలియజేశారు. భిన్నంగా మరికొన్ని సంస్థలు.. అయితే, మరికొన్ని కార్ల కంపెనీల్లో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మకాలతో పాటు షోరూమ్‌లను సందర్శించే కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దక్షిణ కొరియా కార్ల దిగ్గజం హ్యుందాయ్, దేశీ దిగ్గజం టాటా మోటార్స్ వంటివి ఈ జాబితాలో ఉంటున్నాయి. తమ డీలర్షిప్స్కి వచ్చే వారి సంఖ్య స్వల్ప పెరుగుదలతో అదే స్థాయిలో ఉంటోందని హ్యుందాయ్ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటిదాకా పోగొట్టుకున్న మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు కొంగొత్త మోడల్స్‌తో కసరత్తు చేస్తున్న టాటా మోటార్స్ షోరూమ్స్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. కొత్త తరం కొనుగోలుదారులు కొన్ని ప్రత్యేకమైన అంచనాలతో షోరూమ్‌లకు వస్తున్నారని టాటా మోటార్స్ వర్గాలు తెలిపాయి. వేగవంతమైన డెలివరీ, సమస్యల సత్వర పరిష్కారానికి తగిన వ్యవస్థ ఉందా లేదా అన్నది తెలుసునేందుకు, మరింత ఆకర్షణీయమైన డీల్ పొందేందుకు వారు ప్రత్యేకంగా షోరూమ్‌లకు వస్తున్నారని వివరించాయి. తగ్గుతున్న టెస్ట్ డ్రైవ్‌లు.. ముందుగానే ఆన్లైన్లో వివరాలన్నీ తెలుసుకోవడం వల్ల టెస్ట్ డ్రైవ్స్‌కి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గుతున్నట్లు నక్రా తెలిపారు. టెస్ట్ డ్రైవ్స్ కోసం గతంలో ఒక్కో కస్టమర్ సగటున 2.3 సార్లు షోరూమ్‌లకు వచ్చే వారని, ప్రస్తుతం ఇది 1.1కి తగ్గిందని ఆయన వివరించారు. 2017 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ అమ్మకాల్లో డిజిటల్ మాధ్యమం వాటా 10 శాతమే ఉండగా.. ఇప్పుడు 30 శాతం దాకా చేరిందని నక్రా తెలియజేశారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మెట్రో నగరాలు, ప్రథమ శ్రేణి పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ–కామర్స్, డిజిటల్ మాధ్యమం వినియోగం, ఆన్లైన్లోనే సెర్చ్ చేసి కొనుగోళ్లు జరపడం సిటీల్లోనే సర్వసాధారణంగా ఉంటోందని చెప్పారాయన. -
టెస్ట్ డ్రైవ్ అని చెప్పి.. ఆడి కారుతో..
బంజారాహిల్స్: టెస్ట్ డ్రైవ్ పేరుతో ఖరీదైన ఆడి కారుతో ఉడాయించిన యువ డాక్టర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్ అపోలో ఆస్పత్రి సమీపంలో ఉన్న ప్రీ ఓన్డ్ కార్స్ డీలర్ వద్దకు ఈ నెల 27న ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఓ యువకుడు వచ్చి తన పేరు గౌతంరెడ్డి అని అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. ఓ కారు కొనుగోలు చేయాలని అందుకోసం టెస్ట్ డ్రై వ్ చేయాలంటూ అడిగాడు. దీంతో డీలర్ కాగితపు నరేంద్రకుమార్ ఆ యువ డాక్టర్‌కు ఏపీ 28 డీఆర్ 0005 ఆడి క్యూ3 కారును టెస్ట్ డ్రైవ్ కోసం ఇస్తూ తమ వద్ద పని చేస్తున్న కాశిని పర్యవేక్షకుడిగా పంపించాడు. కారు నడుపుతూ గౌతంరెడ్డి అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకోగానే తన పక్కనే కూర్చున్న కాశిని ఒక్కసారి దిగాలని తానే సొంతంగా కొద్ది దూరం నడుపుతానంటూ చెప్పడంతో కాశి కారు దిగాడు. అంతలోనే గౌతంరెడ్డి కారుతోసహా ఉడాయించాడు. సాయంత్రమైనా తిరిగిరాకపోయేసరికి డీలర్ నరేంద్రకుమార్ అపోలో ఆస్పత్రిలో డాక్టర్ గౌతంరెడ్డి కోసం వాకబు చేయగా అలాంటివారు ఎవరూ లేరని తేలింది. తాము మోసపోయామని తెలుసుకొని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గౌతంరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 379కింద కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారు విలువ సుమారుగా రూ. 40 లక్షల వరకు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో కాల్ డ్రాప్స్ ఎక్కువే!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కాల్ డ్రాప్స్ సమస్య అధికంగానే ఉంది. ఈ విషయం ట్రాయ్ నిర్వహించిన డ్రైవ్ టెస్ట్‌లో బహిర్గతమైంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక టెలికం సంస్థ కాల్ డ్రాప్స్ రేటు 2% కన్నా ఎక్కువగా ఉండకూడదు. హైదరాబాద్ విషయానికి వస్తే.. 14 నెట్వ ర్క్స్ను పరీక్షిస్తే.. అందులో 11 వరకు కాల్ డ్రాప్స్ బెంచ్ మార్క్‌ను అందుకోవడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, సికింద్రాబాద్, గంధంగూడా ప్రాంతాల నుంచే 60% కాల్ డ్రాప్స్ ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లోని కాల్ డ్రాప్స్‌ను మినహాయిస్తే.. హైదరాబాద్‌లోని అన్ని టెల్కోలు కూడా కాల్ డ్రాప్స్ బెంచ్ మార్క్‌కు దగ్గరగా వస్తున్నాయని ట్రాయ్ తెలిపింది. -
హీరో సోదరికి గ్యాంగ్ స్టర్ ఝలక్..
ముంబయి: అసలే అతడు పాత నేరస్తుడు. పైగా గ్యాంగ్ స్టర్. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు చేసిన నేరాల కారణంగా ముంబయి, థానే వంటి నగరాల్లో అడుగుపెట్టొద్దని పోలీసులు గట్టిగా హెచ్చరించి అతడిని బహిష్కరించారు. అలాంటి వ్యక్తిని నమ్మి టెస్ట్ డ్రైవింగ్ కారు ఇస్తే చేతివాటం చూపించకుండా ఊరుకుంటాడా. సరిగ్గా ముంబయిలో అదే జరిగింది. గ్యాంగ్ స్టర్ అఫ్తాబ్ పటేల్ బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ కారును టెస్టు డ్రైవింగ్ కోసం తీసుకెళ్లి పరారయ్యాడు. ఈ ఘటన చోటుచేసుకుని వారం రోజులు గడిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే సాహిల్ ఖాన్ సోదరి షయిస్టా తమ మెర్సిడీస్ కారును ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అమ్మకానికి పెట్టదలుచుకున్నారు. అ క్రమంలోనే దాని వివరాలు ఫొటోలతో సహా ఆన్ లైన్ లో ఈ నెల 7న పెట్టింది. ఈ ప్రకటన చూసిన పటేల్.. సాహిల్ సోదరికి అక్టోబర్ 8న ఫోన్ చేశాడు. అదే రోజు అక్టోబర్ 8న కాందివ్లీ అనే గ్రామం వద్ద సాయంత్రం కలుసుకున్నాడు. తాను రూ.42 లక్షలు చెల్లించి కారును సొంతం చేసుకుంటానని, అంతకంటే ముందు టెస్ట్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. మరో రోజు ఉదయం 8 గంటలకు పజీరో జీపు(ఎంహెచ్-03-ఏఎం-5832) లో మరికొందరు స్నేహితులతో కలిసి వచ్చాడు. అనంతరం డీల్ కుదుర్చుకుని సాహిల్ కారు డ్రైవర్ అర్షాద్ అన్సారీ చేతిలో రూ.50 వేలు పెట్టాడు. టెస్టు డ్రైవింగ్‌కు వెళ్లొచ్చాడు. మిగితా డబ్బు చెల్లించాక కారు తీసుకెళ్తానని చెప్పాడు. అయితే, తన ఖాతాలో మిగితా డబ్బు చెల్లించాలని షయిస్టా చెప్పింది. అలాగే, అని మరో రోజు ఉదయం ఏకంగా ఆమె ఇంటికి ఓ స్నేహితుడితో కలిసి వెళ్లి మరోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం అడిగాడు. అలా రెండోసారి టెస్ట్ డ్రైవింగ్ కోసం కారును తీసుకెళ్లిన పటేల్ ఇక తిరిగి ముఖం చూపించలేదు. ఈ విషయం చివరికి షయిస్టా తన సోదరుడికి చెప్పడంతో అతడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడికోసం పోలీసులు గాలింపులు ప్రారంభించారు. -
హ్యుందాయ్ ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు
హ్యుందాయ్ మోటార్ ఇండియా ‘టెస్ట్ డ్రైవ్’ విజేతలకు బహుమతులు అందజేసింది. వివరాల్లోకి వెళితే... సంస్థ తెలుగు రాష్ట్రాల్లో టెస్ట్‌డ్రైవ్‌కు సంబంధించి ఒక లక్కీ డ్రా నిర్వహించింది. రీజినల్ మేనేజర్ డ్రా విజేతలను ప్రకటించారు. తల్వార్ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన ఏ రాజేష్ డ్రాలో మొదటి బహుమతి 32 అంగుళాల శామ్సంగ్ ఎల్ఈడీ టీవీని గెలుచుకున్నారు. లక్ష్మీ హ్యుందాయ్‌లో టెస్ట్‌డ్రైవ్ నిర్వహించిన షేక్ అహ్మద్ శామ్సంగ్ 7 ట్యాబ్లెట్ బహుమతిగా పొందారు. అన్ని మోడళ్లకు సంబంధించి ఈ టెస్ట్ డ్రైవ్‌లో పాల్గొన్న దాదాపు 1707 మంది కస్టమర్లకు పవర్ బ్యాంక్స్ తదితర బహుమతులు గెలుపొందారు. -
హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ దొరికాడు..
-
హార్లీ డేవిడ్సన్ బైక్ దొంగ దొరికాడు..
హైదరాబాద్ : ట్రయిల్ రన్ అంటూ ఖరీదైన ..హార్లీ డేవిడ్సన్ బైక్‌తో ఉడాయించిన దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు ఓఎన్జీసీలో సబ్ మెరైన్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. అతడిని ముంబై నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్సన్ షోరూంకు మంగళవారం ఆధునిక దుస్తుల్లో వచ్చిన ఓ యువకుడు ....టెస్ట్ డ్రైవ్ అంటూ ఆ బైక్‌తో పరారైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-23లో తన నివాసమని పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్న ఆ యువకుడు కొత్తగా వచ్చిన రూ.6 లక్షల విలువైన హార్లే డేవిడ్సన్ స్ట్రీట్-750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు. తనతోపాటు తెచ్చిన క్రెడిట్ కార్డులను చూపించాడు. ట్రయల్ వేస్తానని బైక్‌తో బయటకు వెళ్లిన తాహెర్ మూడు గంటలు గడిచినా తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన షోరూం నిర్వాహకులు అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో షోరూం మేనేజర్ షీలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నాలుగు బృందాలుగా ఏర్పడి బైక్ దొంగను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. -
ఫెరారీ నుంచి హైబ్రీడ్ సూపర్‌కారు
అబుదాబి: లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు ప్రసిద్ధి చెందిన ఫెరారీ సంస్థ తొలిసారి హైబ్రీడ్ సూపర్‌కారు ఎఫ్ఎక్స్ఎక్స్ కె కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అబుదాబిలోని యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం ఈ కారును ఆవిష్కరించనున్నారు. తమ వార్షిక రేసింగ్ ఈవెంట్ ఫెరారీ మోండియాలి చాలెంజ్ కార్యక్రమం సందర్భంగా ఈ కారును విడుదల చేస్తారు. ఇటలీకి చెందిన ఫెరారీ 21 ఏళ్ల తర్వాత తమ వార్షిక ఈవెంట్‌ను యూరోప్ ఆవల నిర్వహించడం ఇదే ప్రథమం. తమ కొత్త కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు ఎంపిక చేసిన అతి కొద్దిమందికి మాత్రమే ఫెరారీ కంపెనీ ఆహ్వానం పంపించింది. పరిమితంగానే తయారు చేయనున్న ఈ హైబ్రీడ్ సూపర్‌కారు ధర ఒక్కోటి 25 లక్షల యూరోలు (రూ. 19 కోట్లు) ఉంటుందని సమాచారం. -
డ్రైవర్ అక్కర్లేని గూగుల్ కారు
-
బైక్ నడిపి చూస్తానని ఎత్తుకెళ్లాడు!
హైదరాబాద్: టెస్ట్ డ్రైవ్ కోసమంటూ వచ్చిన ఓ దుండగుడు.. మెకానిక్‌పై కత్తితో దాడి చేసి బైక్‌తో పరారయ్యాడు. అత్తాపూర్‌లోని ద్వారకా హోండా షోరూమ్‌లో ఆసిఫ్‌నగర్‌కు చెందిన అఖ్తర్ (27) మెకానిక్. సోమవారం సాయంత్రం ఓ యువకుడు షోరూమ్‌కు వచ్చాడు. తాను సీబీఆర్ 250 సీసీ బైక్ కొనేందుకు వచ్చానని, చూపించమని అడిగాడు. అఖ్తర్ అతనికి బైక్‌ను చూపించగా... ఆ యువకుడు టెస్ట్‌డ్రైవ్ చేస్తానని కోరాడు. దీంతో షోరూమ్ అధికారుల అనుమతితో టెస్ట్‌డ్రైవ్‌కు దుండగుడు అఖ్తర్‌ను వెంటపెట్టుకొని వెళ్లాడు. పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 170 వద్దకు వెళ్లగానే.. బండిని ఆపి అఖ్తర్‌ను కిందకు దిగాలని కోరాడు. ఎందుకని ప్రశ్నించగా దిగమని గద్దించాడు. దిగగానే తల్వార్‌ను బయటకు తీసి అఖ్తర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి.. బైక్ తీసుకొని రాజేంద్రనగర్ వైపు పరారయ్యాడు. అఖ్తర్ కుడిచేతితో పాటు చాతిపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న షోరూమ్ నిర్వాహకులు బాధితుడిని హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోర్డ్‌కు జోష్ ఇచ్చిన ఎకోస్పోర్ట్