న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో కాల్ డ్రాప్స్ సమస్య అధికంగానే ఉంది. ఈ విషయం ట్రాయ్ నిర్వహించిన డ్రైవ్ టెస్ట్‌లో బహిర్గతమైంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఒక టెలికం సంస్థ కాల్ డ్రాప్స్ రేటు 2% కన్నా ఎక్కువగా ఉండకూడదు. హైదరాబాద్ విషయానికి వస్తే.. 14 నెట్‌వ ర్క్స్‌ను పరీక్షిస్తే.. అందులో 11 వరకు కాల్ డ్రాప్స్ బెంచ్ మార్క్‌ను అందుకోవడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, సికింద్రాబాద్, గంధంగూడా ప్రాంతాల నుంచే 60% కాల్ డ్రాప్స్ ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లోని కాల్ డ్రాప్స్‌ను మినహాయిస్తే.. హైదరాబాద్‌లోని అన్ని టెల్కోలు కూడా కాల్ డ్రాప్స్ బెంచ్ మార్క్‌కు దగ్గరగా వస్తున్నాయని ట్రాయ్ తెలిపింది.