![TRAI Tightens Rules Against Spam Calls, Messages And Fine Details](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/trai-new-rules.jpg.webp?itok=n6XgCo7j)
మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో విసుగెత్తిపోతున్నారు. దీనికి చరమగీతం పాడటానికి, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (TCCCPR) నియమాల ప్రకారం.. టెల్కోలు స్పామ్ కాల్‌లపై ఫిర్యాదులను స్వీకరించాలి. ఫిర్యాదులను స్వీకరించిన తరువాత టెలిమార్కెటర్లపై వేగంగా (ఐదు రోజుల్లోపు) చర్య తీసుకోవాలి. ఈ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైతే టెలికాం ఆపరేటర్లు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
నియమాలను అమలు చేయడంలో విఫలమైతే.. మొదటిసారి రూ. 2 లక్షల జరిమానా, రెండోసారి మళ్ళీ పునరావృతమైతే.. రూ. 5 లక్షలు, ఆపై ఉల్లంఘనలకు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది. కొత్త నియమాలు 30 నుంచి 60 రోజుల్లో రెండు దశల్లో అమలు చేయాలని ఆదేశించింది.
మొబైల్ యూజర్లు స్పామ్ కాల్స్ లేదా ఫేక్ మెసేజ్‌లను నిజమని నమ్మితే.. ఆర్థికంగా నష్టం చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా వ్యక్తిగత సమాచారం కూడా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కాల్స్, మెసేజ్‌ల పట్ల మొబైల్ యూజర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడానికి యాప్
భారతదేశంలో కమ్యూనికేషన్ నిబంధనలను పర్యవేక్షించే 'ట్రాయ్' వినియోగదారులకు విసుగు తెప్పించే కాల్స్, మెసేజస్ వంటి వాటిని నిరోధించుకోవడానికి లేదా పరిష్కరించడాని 'డు నాట్ డిస్టర్బ్' (DND) యాప్ డెవెలప్ చేసింది. దీనిని ఉపయోగించి స్పామ్ కాల్స్, మెసేజస్ నుంచి యూజర్లు బయటపడవచ్చు.
'డు నాట్ డిస్టర్బ్' యాప్ ఎలా ఉపయోగించాలి
➤గూగుల్ ప్లే స్టోర్‌లో TRAI DND 3.0(Do Not Disturb) యాప్ సర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
➤డౌన్‌లోడ్ పూర్తయిన తరువాత యాప్ ఓపెన్ చేసి.. OTP వెరిఫికేషన్ పూర్తి చేసి సైన్ ఇన్ చేసుకోవాలి.
➤సైన్ ఇన్ పూర్తి చేసుకున్న తరువాత అవాంఛిత కాల్స్, టెక్స్ట్‌లను బ్లాక్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ 'డు నాట్ డిస్టర్బ్' జాబితాకు యాడ్ అవుతుంది.
➤యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత కూడా మీకు స్పామ్ కాల్స్ వస్తున్నట్లతే.. తప్పకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ వారికి కంప్లైన్ట్ చేయాలి.
ఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment