
సాక్షి, సంగారెడ్డి: ఐఐటీ హైదారాబాద్‌లో జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సోలార్ ఆటోను గురువారం సంస్థ ప్రాంగణంలో పరీక్షించారు. హెచ్‌ఎస్‌ఈవీ ఐఎన్‌సీ జపాన్ బృందం సభ్యులు షీమిడా, చీబా ఆధ్వర్యంలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఐఐటీ రసాయన శాస్త్ర విభాగం గ్రూపు పరిశీలకుడు డాక్టర్ కె.సురేంద్ర మార్త ఈ వివరాలు వెల్లడించారు. జపాన్ టెక్నాలజీతో ఐఐటీ కెమిస్ట్రీ గ్రూపు విద్యార్థులు సోలార్ ఆటో తయా రు చేశారన్నారు. ఈ ఆటోకు 4 గంటలు బ్యాటరీ చార్జింగ్ పెడితే గంటకు 40 కి.మీ. స్పీడ్‌తో 80 కి.మీ. ప్రయాణం చేయవచ్చ న్నారు. ఆటోను జపాన్‌లో తయారు చేస్తే రూ.లక్షా డెబ్బై వేల వరకు ఖర్చు అవుతుందని, భారత్‌లో అయితే రూ.లక్ష మాత్రమే అవుతుందన్నారు. తుది పరీక్షల అనంతరం ఆసక్తి ఉన్న కంపెనీలకు తయారీపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment