iit hyderabad
-
ఐఐటీ హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ టెక్నాలజీ రెడీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రైవర్ అవసరం లేకుండా వాటంతట అవే వాహనాలు నడిచే సాంకేతికతను ఐఐటీ హైదరాబాద్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ డ్రైవర్ లెస్ (అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం) టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టార్టప్ కంపెనీలు ముందుకు రావాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐఐటీ లోని ప్రత్యేక పరిశోధన విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)’ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ సాంకేతికతతో కూడిన డ్రైవర్ లెస్ వాహనాలను ఐఐటీహెచ్‌లో వినియోగిస్తున్నారు. ఈ వాహనాలు ప్రధాన గేటు నుంచి వర్సిటీ లోని అన్నిచోట్లకు విద్యార్థులు, అధ్యాపకులను చేరవేస్తున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా వంటి డ్రైవర్ లెస్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ పౌరులు కూడా వాటిని వినియోగిస్తున్నారు. అయితే అక్కడి రోడ్లు, ప్రత్యేక ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నిబంధనలు, ఇతర అంశాలకు మన దేశానికి బాగా తేడా ఉంటుంది. ఈ క్రమంలో మన దేశంలో రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, పాదచారులకు అనుగుణంగా ‘అటానమస్’ వాహనాల సాంకేతికతను టిహాన్ అభివృద్ధి చేసింది. ఇందుకోసం ఆధునిక రాడార్లు, త్రీడీ టెక్నాలజీ, అల్గారిథమ్‌లను వినియోగించింది. వర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, మెకానికల్, ఏరోస్పేస్, సివిల్, మేథమెటిక్స్, డిజైన్స్ వంటి వివిధ విభాగాల పరిశోధక విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నారు. -
జోసా కౌన్సెలింగ్‌లో జోష్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో ఈ ఏడాది భారీ మార్పు కన్పిస్తోంది. గత ఏడాది కన్నా ఈసారి కటాఫ్ బాగా పెరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం తొలిదశ సీట్లు కేటాయించింది. అయితే ఈసారి ఐఐటీల్లో 900 సీట్లు అదనంగా పెరిగాయి. దీంతో సీట్ల కేటాయింపు కటాఫ్ పెరిగింది. ముంబై ఐఐటీలో బాలికల విభాగంలో గత ఏడాది 305 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 421వ ర్యాంకు కూడా సీటు వచ్చింది. హైదరాబాద్ ఐఐటీలో బాలుర విభాగంలో 585 ర్యాంకుకు సీటు వస్తే, ఈసారి 649 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీ (నిట్)ల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగింది. వరంగల్ నిట్‌లో బాలుర విభాగంలో 1664 ర్యాంకుకు గత ఏడాది సీటొస్తే, ఈసారి 2698 ర్యాంకుకు సీటు వచ్చింది. బాలికల విభాగంలో పోయినసారి 3593 ర్యాంకుకు సీటొస్తే, ఈసారి 4625 ర్యాంకుకు కూడా సీటు వచ్చింది. ఇక ఏపీ నిట్‌లో బాలికల విభాగంలో గత ఏడాది 17873 కటాఫ్ ఉంటే, ఈసారి ఇది 23130కి పెరిగింది. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి ఐఐటీలు మినహా అన్ని జాతీయ కాలేజీల్లో ర్యాంకును బట్టి సీటు కేటాయిస్తారు. ఐఐటీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు ఇస్తారు. జోసా మొత్తం ఐడు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ముంబై ఐఐటీలోనే టాపర్లుజేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు పొందిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ముంబై ఐఐటీకే ప్రాధాన్యమిచ్చారు. టాపర్లంతా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వైపే మొగ్గు చూపారు. ఓపెన్ కేటగిరీలో ముంబై ఐఐటీలో తొలి ర్యాంకు మొదలుకుని 68వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. బాలికల విభాగంలోనూ 7వ ర్యాంకు సహా 421వ ర్యాంకు వరకూ సీట్లు పొందారు. తర్వాత స్థానంలో ఢిల్లీ ఐఐటీ ఉంది. ఇక్కడ 116లోపు ర్యాంకు వరకూ సీట్లు దక్కాయి. కాన్పూర్ ఐఐటీలోనూ పోటీ ఎక్కువగానే ఉంది. ఓపెన్ కేటగిరీలో 226 ర్యాంకుతో ప్రారంభమై 414 ర్యాంకుతో ముగిసింది. హైదరాబాద్ ఐఐటీలో సీఎస్సీ ఓపెన్ కేటగిరీలో 431వ ర్యాంకుతో మొదలై 649వ ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. చివరి కౌన్సెలింగ్ వరకు చూడాలి గత కొన్నేళ్ళతో పోలిస్తే ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. కటాఫ్ ఊహించని విధంగా పెరిగింది. సీట్లు పెరగడమే దీనికి కారణం. విద్యార్థులు చివరి కౌన్సెలింగ్ వరకూ వేచి చూస్తే తప్పకుండా మంచి అవకాశాలు రావచ్చు. రెండో దశ కౌన్సెలింగ్ నుంచి ఆప్షన్లు ఇచ్చే ముందు సీట్ల కేటాయింపుపై కొంత కసరత్తు చేయాలి. – ఎంఎన్ రావు (గణిత శాస్త్ర నిపుణులు) -
ఐఐటీ హైదరాబాద్ ఘనత..త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బ్రిడ్జ్ తయారీ..!
ఐఐటీ హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. యువ స్టార్టప్ సింప్లిఫోర్జ్ క్రియేషన్సతో కలిసి భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ బ్రిడ్జ్‌ను తయారుచేసింది. స్వదేశీ 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జ్ తయారు చేయడం విశేషం. ఈ త్రీడీ ప్రింటెడ్ బ్రిడ్జ్‌ని ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీన్ని కేవీఎల్ సుబ్రమణ్యం అతని రీసెర్చ్ గ్రూప్, డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ బృందం కలిసి పాదాచారుల బ్రిడ్జ్‌ని రూపొందించారు. లోడ్ పరీక్ష తర్వాత పూర్తి స్థాయి 7.50 మీటర్ల వంతెనను రూపొందించే యత్నం చేశారు. కాంక్రీట్ ఉపబలాన్ని తగ్గించి ఈ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. ఈ వంతెనలో మెటీరియల్ ప్రాసెసింగ్, డిజైన్ మెథడాలజీలలో అనేక పురోగతులు హైలెట్‌గా నిలిచాయి. నిజానికి ఈ త్రీడి కాంక్రీట్ ప్రింటింగ్ అనేది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు నిదర్శనం. పైగా తక్కువ బరువుతో వేగవంతమైన సమర్థవంతమైన వంతెనలు, నిర్మాణాలను అభివృద్ధి చేసే నిర్థిష్ట ఆప్టమైజ్ అప్లికేషన్ త్రీడీ టెక్నాలజీ. ఈ మేరకు ఈ ప్రోటోటైప్ వంతెనను అభివృద్ధి చేసిన కేఎల్ సుమ్రమణ్యం, అతని బృందాన్ని ఐఐటీ హైదరబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. వేగవంతమైన సమర్థవంతమైన నిర్మాణాలకు సాంకేతికతో కూడిన పరిష్కారాలు అత్యంత అవసరమని అన్నారు. సమర్థవంతమైన నిర్మాణం కోసం స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అనేది ఆత్మ నిర్బర్ కలను సాకారం చేసుకునే దిశగా డిజిటల్క్నాలజీని అభివృద్ధిపరిచే ఘనమైన ముందుడగు అని ప్రశంసించారు. ఇలాంటి ఆవిష్కరణలు ఆర్థిక పరంగా స్థానిక అభివృద్ధికి మాత్రమే గాక మౌలిక సదుపాయల రంగానికి మరిన్ని ప్రయోజనాలు అందించగలదని భావిస్తున్నానని అన్నారు.(చదవండి: ఆరోజు రాత్రి వరకు అబ్బాయి.. లేచిన వెంటనే అమ్మాయిగా మార్పు..!) -
హైదరాబాద్ సంస్థకు ఎస్కీన్ వెంచర్స్ రూ.80 కోట్లు హామీ
ఐఐటీ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్హెచ్ఈ) విస్తరణకు తనుశ్రీ ఫౌండేషన్, ఎస్కీన్ వెంచర్స్ వ్యవస్థాపకులు సుశాంత్‌కుమార్ 9.6 మిలియన్ డాలర్లు (రూ.80 కోట్లు) సమకూర్చనున్నట్లు హామీ ఇచ్చారు. హెల్త్‌కేర్ టెక్నాలజీలో భాగంగా సీఎఫ్హెచ్ఈ ఎన్నో ఆవిష్కరణలు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సుశాంత్ కుమార్ మాట్లాడుతూ ‘సీఎఫ్హెచ్ఈ ఆవిష్కరణలు చాలా మంది రోగులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేసేలా ఈ పెట్టుబడులు ఉపయోగపడుతాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ కేంద్రం చేస్తున్న సేవలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఔత్సాహిక ఆరోగ్య సంరక్షణ వ్యాపారవేత్తలను పెంపొందించడంలోనూ సీఎఫ్హెచ్ఈ సహకారం అందిస్తుంది. హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేస్తున్న వారికి కావాల్సిన ప్రోత్సాహం, వనరులు అందించడం గొప్ప విషయం’ అని అన్నారు. సీఎఫ్హెచ్ఈ హెడ్ ప్రొఫెసర్ రేణు జాన్ మాట్లాడుతూ ‘హెల్త్‌కేర్ టెక్నాలజీలో సమీప భవిష్యత్తులో చాలాపురోగతి రాబోతుంది. అందులో సుశాంత్‌కుమార్ భాగమవ్వడం ఆహ్వానించదగ్గ విషయం. ఆరోగ్య సంరక్షణ విభాగంలో చాలా కంపెనీలు కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. వాటికి సరైన వనరులు, ప్రోత్సాహం ఉంటే మరింత వృద్ధి సాధిస్తాయి’ అని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ‘సమాజంలో డయాగ్నస్టిక్స్ పరికారాల్లో సరైన ఆవిష్కరణలు లేక చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి ఐఐటీ హైదరాబాద్, సీఎఫ్హెచ్ఈ పనిచేస్తున్నాయి. అవసరాలకు తగిన వైద్య పరికరాల సరఫరా, శిక్షణ పొందిన వర్క్‌ఫోర్స్‌ను అందించడంలో ఈ కేంద్రం ముందుంది. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా దృక్పథంతో స్టార్ట్అప్లను ప్రోత్సహిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: మస్క్ భారత పర్యటనకు డేట్ ఫిక్స్.. ఏం జరగబోతుందంటే.. సీఎఫ్హెచ్ఈలోని కొన్ని ఆవిష్కరణలు.. ఆర్మబుల్ అనే న్యూరోరిహాబిలిటేషన్ డివైజ్‌ను కనుగొనేలా బీఏబుల్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌కు ప్రోత్సాహం అందించింది. నిమోకేర్రక్ష అనే నవజాత శిశువులను రక్షించడానికి ధరించగలిగే చిన్న పరికారాన్ని తయారుచేసేందుకు కావాల్సిన వనరులను అందించింది. దీన్ని నిమోకేర్వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ తయారుచేసింది. జీవికా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూడేళ్లలో 2.5 మిలియన్ మందికి ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ ప్లాట్‌ఫారమ్ ద్వారా టీకాలు అందించే ప్రయత్నం చేశారు. -
తెలంగాణకు మరిన్ని కేంద్ర సంస్థలు
సాక్షి, హైదరాబాద్: డిజిటైజేషన్, డిస్టెన్స్ లెర్నింగ్ మెథడాలజీ, ఆన్లైన్ అప్రోచ్, డిజిటల్ నెట్ వర్కింగ్ వంటి అంశాలకు సంబంధించి తెలంగాణలో కేంద్ర సంస్థలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న ట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. తెలంగాణలో ఇటీవలే రూ.వెయ్యి కోట్ల తో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రాచీన భారతం ఎన్నో ఆవిష్కరణలకు భూమికగా నిలిచిందని.. ఆధునిక భారతం విశ్వమిత్రగా వ్యవహరి స్తోందని పేర్కొన్నారు. ‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ నినాదంతో దేశయువత భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్‌గా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థల రెండో ఎడిషన్ ‘ఇన్వెంటివ్, ఆర్అండ్డీ ఇన్నోవేషన్ ఫెయిర్’ను ధర్మేంద్ర ప్రధా న్ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యా సంస్థలు కలిపి మొత్తం 53 విద్యా సంస్థల నుంచి 120 ఆవిష్కరణలను ప్రదర్శనకు పెట్టారు. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, క్లైమేట్ చేంజ్, ఈ–మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, డిఫెన్స్ అండ్ స్పేస్, ఇండస్ట్రీ 4.0 తదితర ఇతివృత్తాలతో వీటిని రూపొందించారు. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతాం ప్రజల రోజువారీ జీవితంలో ఉపయోగపడేలా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని ఐఐటీలకు ప్రధాని మోదీ సూచించినట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తు చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న కల సాకారంలో స్టార్టప్ కంపెనీలు వెన్నెముకగా నిలుస్తాయని.. ఇన్వెంటివ్–2024 వంటి సమావేశాలు రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడతాయని చెప్పారు. నూతన ఆవిష్కరణలు మరింత పెరిగేలా విద్యాసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ అంతా సహకారం అందించాలని కోరారు. దేశ జీడీపీలో కనీసం 25 శాతా నికి దోహదపడేలా భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యమని వివరించారు. ఆ దిశగానే ‘మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, పీఎల్ఐ స్కీమ్, ఎఫ్‌డీఐ లిబరలైజేషన్’వంటి విధానాలను కేంద్రం తీసుకొచి్చందన్నారు. డిజిటల్ పబ్లి క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డొమైన్లో 46 శాతం గ్లోబల్ డిజి టల్ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయని, మనదేశం ఇన్నోవేషన్‌కు ఇంక్యుబేటర్‌గా మారిందని చెప్పారు. 2014లో 350 స్టార్టప్ కంపెనీలు ఉంటే.. ఇప్పుడవి లక్షా 20వేలకు చేరాయన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు విద్యార్థుల ఆత్మహత్యలు సమాజానికి మంచిది కా దని కేంద్ర మంత్రి అన్నారు. ఐఐటీల్లో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయన్నారు. -
IIinvenTiv-2024: హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ ఇన్నోవేషన్ ఫెయిర్
ఐఐటీ-హైదరాబాద్‌లో కేంద్ర విద్యా శాఖ ప్రతిష్టాత్మక ఆర్&డీ ఇన్నోవేషన్ ఫెయిర్ ‘ఇన్వెంటివ్-2024’ రెండో ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ‘ఇన్వెంటివ్-2024’ ఇన్నోవేషన్ ఫెయిర్‌లో దేశంలోని 53 ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు రూపొందించిన 120 సంచలనాత్మక ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఆవిష్కరణలు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్లు, ట్రిపుల్‌ఐటీలు, ఐఐఎస్ఈ బెంగుళూరు వంటి దేశంలోని టాప్ 50 ఎన్ఐఆర్ ర్యాంక్ ఇంజనీరింగ్ సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. సైన్స్, టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో ఔత్సాహికులు, అద్భుతమైన ప్రతిభావంతుల సమ్మేళనానికి ఐఐటీ హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఇన్వెంటివ్-2024’ అత్యంత ప్రాధాన్యతను తీసుకొచ్చిందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో విద్య పాత్ర కీలకమైనదిగా తాను గుర్తించినట్లు ఆయన చెప్పారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తి, పలువురు ప్రముఖ విద్యాసంస్థల అధిపతులు, పరిశ్రమల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Pleased to inaugurate #IinvenTiv2024 at @IITHyderabad. Glad that in the second edition, we have enlarged the scope of this innovation showcase and have taken this event beyond IITs. With such extensive participation from HEIs and industry, #IinvenTiv is poised to become an… pic.twitter.com/N1Nvupr3yQ — Dharmendra Pradhan (@dpradhanbjp) January 19, 2024 -
వరద రాకముందే పసిగట్టొచ్చు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : భాగ్యనగరంలో ఏటా వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతుండటం, ఒక్కోసారి ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్స్ లేదా నాలాల్లో పడి పలువురు దుర్మరణం పాలవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొనేందుకు ఐఐటీ హైదరాబాద్ ముందుకొచ్చింది. ప్రజలపై వరద ప్రభావాన్ని వీలైనంత తగ్గించేందుకు, నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలను ముందుగానే కచ్చితత్వంతో అంచనా వేసేందుకు వీలుగా పట్టణ వరద సమాచార వ్యవస్థ (అర్బన్ ఫ్లడ్ ఇన్ఫ్ర్మేషన్ సిస్టం–యూఎఫ్ఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా నగరవాసులను ముందే అప్రమత్తం చేయడంతోపాటు వరద సన్నద్ధత చర్యల్లో వివిధ ప్రభుత్వ విభాగాలకు తోడ్పాటు అందించనుంది. ఐఐటీహెచ్ సివిల్ ఇంజనీరింగ్, క్లైమేట్ చేంజ్ విభాగానికి చెందిన అసోసియేట్ ఫ్రొఫెసర్ డాక్టర్ రేగొండ సతీష్‌కుమార్ నేతృత్వంలోని పరిశోధన బృందం ఈ దిశగా కసరత్తు ప్రారంభించింది. విశ్లేషించి.. అంచనా వేసి.. ఇందుకోసం జీహెచ్ఎంసీలోని విపత్తుల నిర్వహణ విభాగంతోపాటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం తదితర సంస్థలతో ఐఐటీ హైదరాబాద్ పరిశోధన బృందం సమన్వయం చేసుకోనుంది. ఆయా సంస్థలు అందించే వాతావరణ గణాంకాల ఆధారంగా నగరంలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం కురిసే అవకాశం ఉందో విశ్లేషించనుంది. లోతట్టు ప్రాంతాలు, వరద వ్యాప్తిని సిములేషన్ మోడలింగ్ టెక్నిక్‌ల సాయంతో కచ్చితత్వంతో అంచనా వేయనుంది. అలాగే స్నాప్ఫ్లడ్ టీఎం అనే సాఫ్ట్వేర్ ప్లాట్‌ఫాం ద్వారా నగరవాసుల నుంచి ఎప్పటికప్పుడు రియల్‌టైంలో వరద వివరాలను సేకరించాలని ఐఐటీ హైదరాబాద్ ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అదనంగా ఫ్లడ్ హాట్స్పాట్లను గుర్తించేందుకు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సంస్థల సహకారం సైతం తీసుకోనుంది. రెయిన్‌ఫాల్–రన్ఆఫ్ అనాలసిస్ మోడలింగ్ అండ్ ఫోర్కాస్టింగ్ టూల్స్ (రాఫ్ట్) పేరుతో ఈ పరిశోధన బృందం పనిచేయనుంది. నగరాలకు ఎంతో ఉపయోగం అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం అనేది ఒక్క హైదరాబాద్ నగరానికే కాకుండా దేశంలోని ఇతర వరద పీడిత నగరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి తెలిపారు. తాము చేపట్టే పరిశోధనలు నిత్యం సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతాయన్నారు. ప్రొఫెసర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలతో వచ్చే వరదల ప్రభావాన్ని తగ్గించేందుకు అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ఇవీ ప్రయోజనాలు.. ♦ అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా వరద ముంచెత్తే ప్రాంతాలను ముందే గుర్తించొచ్చు. తద్వారా ఆ ప్రాంతాలవైపు ప్రజలు వెళ్లకుండా అప్రమత్తం చేయొచ్చు. ♦ వరద నీరు ఎటువైపు పారుతోంది.. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర నిలిచి ఉంది... వరద హాట్స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొనేందుకు వీలు కలుగుతుంది. -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్ రాసి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని మమైత (20) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన మమైత జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు చెబుతున్నారు. ఒరియా భాషలో రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు విషయంలో ఒత్తిడికి గురి కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి... -
జాతీయ ర్యాంకుల్లో పడిపోయిన రాష్ట్ర యూనివర్సిటీలు.. కారణం అదేనా!
సాక్షి, హైదరాబాద్: అధ్యాపకుల కొరత రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మరోసారి రుజువైంది. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023) నివేదికలో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియాతోపాటు జేఎన్టీయూహెచ్ ర్యాంకులు కూడా తగ్గాయి. జాతీయ ఓవరాల్ ర్యాంకుల్లోనే కాదు.. పరిశోధన, యూనివర్సిటీ స్థాయి ప్రమాణాల్లోనూ విశ్వవిద్యాలయాలు వెనుకంజలో ఉన్నాయి. అన్నింటికన్నా ఐఐటీ–హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ దూసుకుపోవడం విశేషం. గత మూడేళ్ల విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ఐఆర్ఎఫ్ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఐఐటీ–హైదరాబాద్ దూకుడు.. ఓయూ వెనక్కు జాతీయస్థాయిలో వంద యూనివర్సిటీల్లో ఐఐటీ–హైదరాబాద్ గత ఏడాది మాదిరిగానే 14వ స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో 2019లో 144 మంది రూ.17 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. 2020–21లో 185 మంది రూ.16 లక్షలకుపైగా, 2021–22లో 237 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీతో ఉపాధి పొందారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోనూ విద్యార్థులు అత్యధికంగా రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉపాధి పొందారు. నిట్ వరంగల్‌లో అత్యధికంగా యూజీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ సంస్థ మంచి ప్రమాణాలు నెలకొల్పినట్టు నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ఈ సంస్థలో అధ్యాపకుల కొరత వల్ల రీసెర్చ్‌లో వెనుకబడింది. ఫలితంగా నిట్ వరంగల్ జాతీయర్యాంకు 2022లో 45 ఉండగా, ఈసారి 53కు చేరింది. ఉస్మానియా వర్సిటీ ఓవరాల్ ర్యాంకులో గత ఏడాది 46 ఉంటే, ఈసారి 64 దక్కింది. ఇక్కడా పరిశోధనల్లో నెలకొన్న మందకొడితనమే జాతీయ ర్యాంకుపై ప్రభావం చూపింది. ఈసారి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు ఓవరాల్ ర్యాంకులో గతంలో మాదిరిగానే 20వ ర్యాంకు వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 10 ర్యాంకుతో నిలకడగా ఉంది. హైదరాబాద్ ట్రిపుల్ఐటీ జాతీయస్థాయిలో 84వ ర్యాంకు పొందింది. చదవండి: విద్యాసంస్థల ర్యాంకింగ్స్ విడుదల.. టాప్ 10లో హైదరాబాద్‌కు దక్కని చోటు ఇంజనీరింగ్‌లో వెనుకబాటుతనం ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ సరికొత్త బోధన విధానాలతో 9లో ఉన్న ర్యాంకును 8కి తేగలిగింది. ఎక్కువ ఇంజనీరింగ్ అనుబంధ కాలేజీలున్న జేఎన్టీయూ–హెచ్ 76 నుంచి 98కి పడిపోయింది. నిట్ వరంగల్ 21వ ర్యాంకుతో నిలిచింది. ఈసారి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ జాతీయస్థాయి కాలేజీల విభాగంలో 98 ర్యాంకును సాధించింది. పరిశోధన విభాగంలో ట్రిపుల్ఐటీ హైదరా బాద్ ర్యాంకు 12 నుంచి 14కు చేరింది. అధ్యాపకుల కొరతే కారణం: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో వెనుకబడటానికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత. కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడం వల్ల పరిశోధనలో వెనుకబడిపోతున్నాం. అయినప్పటికీ బోధనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. -ప్రొ.డి.రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ ర్యాంకు సాధించని వ్యవసాయ వర్సిటీ దేశంలో టాప్–40 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చోటు దక్కలేదు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో వ్యవసాయ వర్సిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వర్సిటీ వర్గాలను ఆరా తీయగా, సమాధానం లభించలేదు. వర్సిటీ ప్రమాణాలు తగ్గుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అడ్రస్ లేని మెడికల్ కాలేజీలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో దేశంలో టాప్ 50లో చోటు దక్కని వైనం సాక్షి, హైదరాబాద్: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చేసిన దేశంలోని టాప్–50 మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క మెడికల్ కాలేజీ చోటు దక్కించుకోలేకపోయింది. రాష్ట్రం నుంచి నాలుగు కాలేజీలు... ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, కరీంనగర్‌లోని చలిమెడ ఆనందరావు మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి, అపోలో మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మిగిలిన కాలేజీలకు కనీసం దరఖాస్తు చేసుకునే స్థాయి కూడా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాప్–50 ర్యాంకింగ్స్‌లో ఢిల్లీ ఎయిమ్స్ మొదటి ర్యాంకు, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రెండో ర్యాంకు, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూడో ర్యాంకు, బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నాలుగో ర్యాంకు, పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐదో ర్యాంకు సాధించాయి. డెంటల్ ర్యాంకుల్లో మాత్రం తెలంగాణకు ఊరట కలిగింది. సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌కు 33 ర్యాంకు దక్కింది. 176 మెడికల్ కాలేజీలు, 155 డెంటల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. రాష్ట్రంలో వైద్య పరిశోధన దాదాపు ఎక్కడా లేదని, అలాగే, విద్యార్థులు–అధ్యాపకుల నిష్పత్తి కూడా దారుణంగా ఉందన్న విమర్శలున్నాయి. -
వరల్డ్ టాప్ వర్సిటీల్లోహెచ్సీయూ, ఐఐటీ–హైదరాబాద్
సాక్షి, న్యూఢిల్లీ: సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (సీడబ్ల్యూయూఆర్)–2023లో తెలంగాణ నుంచి రెండు యూనివర్సిటీలు చోటు సంపాదించుకున్నాయి. మొదటి 2 వేల యూనివర్సిటీల్లో దేశం నుంచి 64 యూనివర్సిటీలు టాప్ ర్యాంకుల్లో ఉండగా, తెలంగాణ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1,265వ ర్యాంకు, ఐఐటీ–హైదరాబాద్ 1,373వ ర్యాంకు సాధించాయి. గత ఏడాది ర్యాంకులతో పోలిస్తే హెచ్‌సీయూ 7 ర్యాంకులు కిందకు పడిపోగా, ఐఐటీ–హైదరాబాద్ మాత్రం 68 స్థానాలు పైకి ఎగబాకింది. దేశంలో ఐఐటీ–అహ్మదాబాద్ 419 ర్యాంకుతో టాప్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీ–మద్రాస్ ఉన్నాయి. ఇక వరల్డ్ టాప్ వర్సిటీల్లో హార్వర్డ్ యూనివర్సిటీ నంబర్‌వన్‌గా నిలిచింది. విద్య నాణ్యత, ఉపాధి, అధ్యాపకుల నాణ్యత, పరిశోధన పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించింది. పరిశోధనల్లో వెనకబాటుతో పాటు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కారణంగా దేశ యూనివర్సిటీలు వెనకబడ్డాయని సీడబ్ల్యూయూఆర్ నివేదిక వెల్లడించింది. దేశంలో నాల్గోస్థానం రాయదుర్గం: దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిలిచింది. ‘ది వీక్ హన్సా’పరిశోధన సర్వే–2023లో దేశంలోని టాప్ 85 మల్టీ డిసిప్లినరీ వర్సిటీల్లో రాష్ట్ర, సెంట్రల్, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో హెచ్‌సీయూ నాల్గోస్థానంలో నిలిచింది. 2022లో ఐదో స్థానంలో ఉండగా ఈ సంవత్సరం ఒక స్థానం పైకి ఎగబాకింది. దక్షిణాదిలోని టాప్ మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయాల్లో మొదటి స్థానంలో ఉంది. అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అధికార యంత్రాంగం, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో టాప్‌లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని వీసీ ప్రొఫెసర్ బీజేరావు తెలిపారు. -
టాటా టెక్నాలజీస్‌తో టిహాన్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ’టిహాన్’ ఐఐటీ హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇంజినీరింగ్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ వెల్లడించింది. సాఫ్ట్వేర్ ఆధారిత వాహనాలు (ఎస్‌డీవీ), అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) విభాగాల్లో కలిసి పని చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. ఆటోమోటివ్ కంపెనీలు సాఫ్డ్‌వేర్ ఆధారిత వాహనాలను రూపొందించే కొద్దీ వ్యయాలను తగ్గించుకునే దిశగా వినూత్న సొల్యూషన్స్ కోసం అన్వేషిస్తుంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తగు ప్లాట్‌ఫామ్‌లను రూపొందించడం, తమ ఇంజినీర్లకు కొత్త సాంకేతికతలపై టిహాన్లో శిక్షణ కల్పించడంపై ఎంవోయూ కింద ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు టాటా టెక్నాలజీస్ ఎండీ వారెన్ హారిస్ తెలిపారు. ఈ భాగస్వామ్య ఒప్పందంతో ఆటోమోటివ్ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలకు ఊతం లభించగలదని ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీ–హెచ్) డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. స్వయం చాలిత టెక్నాలజీలకు సంబంధించి ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన హబ్‌ను టిహాన్గా వ్యవహరిస్తున్నారు. -
మానవ వనరుల అభివృద్ధిలో భారత్ నం.1
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలకు ఇస్తున్న వ్యాక్సిన్లలో 65 శాతం ఇండియాలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లే ఉన్నాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. శుక్రవారం జరిగిన హైదరాబాద్ ఐఐటీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. మానవ వనరుల అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇండియాలో డిజిటల్ ఎకానమీ 34 శాతం ఉంటే అభివృద్ధి చెందిన అమెరికా, ప్రాన్స్ వంటి దేశాల్లో 8 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఫార్మా తదితర రంగాలను ప్రపంచ రాజకీయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయని కృష్ణ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ఎగుమతి చేసి, బదులుగా ఆయా దేశాల నుంచి విలువైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నాయని వివరించారు. వ్యవసాయరంగం అభివృద్ధితో పాటు నూతన ఆవిష్కరణలు దేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తాయన్నారు. ఇంగ్లిష్ పెద్దగా తెలియని చైనా నూతన ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు. వైరస్ల పట్ల అలసత్వం వద్దు వైరస్ల కారణంగా పుట్టుకొస్తున్న వ్యాధుల పట్ల అలసత్వం వద్దని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాధుల మూలాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఎక్కడికక్కడ సరైన వైద్యం చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మడగాస్కర్‌లో పుట్టిన చికున్‌గున్యా ఇండియాకు విస్తరించిందనీ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన జికా వైరస్ బ్రెజిల్ వంటి దేశాలకు విస్తరించిందని తెలిపారు. ఐఐటీహెచ్‌లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ పాలకవర్గం చైర్మన్ బీవీజీ మోహన్‌రెడ్డి, డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐఐటీలో ప్లేస్మెంట్ల జోరు!
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్‌లో ఈ ఏడాది ప్లేస్మెంట్ల తొలిదశ విజయవంతంగా ముగిసింది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించిన ఈ ప్లేస్మెంట్ల ప్రక్రియలో ఓ విద్యార్థికి ఏడాదికి ఏకంగా రూ.63.78 లక్షల జీతంతో ఆఫర్ రావడం విశేషం. మలి దశ ప్లేస్మెంట్లు వచ్చే నెలలో జరగనున్నాయి. తొలిదశ ప్లేస్మెంట్ల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 474 మంది విద్యార్థులకు 508 ఉద్యోగ ఆఫర్లు లభించినట్లు ఐఐటీ హైదరాబాద్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం ఆఫర్లలో 54 విదేశాలకు చెందినవి కావడం గమనార్హం. జపాన్ అక్సెంచర్, డెన్సో, ఫ్లిప్‌కార్ట్, మోర్గన్ స్టాన్లీ, ఎన్టీటీ, ఏటీ, ఒరాకిల్, స్పింక్లర్, సుజుకీ మోటార్ కార్పొరేషన్, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్, టీఎస్ఎంసీ, జొమాటోలతో సహా దాదాపు 144 కంపెనీలు ఈ ప్లేస్మెంట్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఏడువందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. విదేశీ కంపెనీలు 13 వరకూ రిజిస్టర్ చేసుకున్నాయి. కృత్రిమ మేధకు పెద్దపీట... ఐఐటీ హైదరాబాద్ నుంచి కృత్రిమమేధలో బీటెక్ పూర్తి చేసిన తొలి బ్యాచ్‌కు తాజా ప్లేస్మెంట్లలో పెద్దపీట దక్కింది. మొత్తం 82 శాతం విద్యార్థులకు ప్లేస్మెంట్లు లభించాయి. కోర్ ఇంజినీరింగ్, ఐటీ/సాఫ్ట్వేర్, ఫైనాన్స్ అండ్ కన్సల్టింగ్ రంగాల్లోనూ ప్లేస్మెంట్లలో ప్రాధాన్యత లభించింది. ప్యాకేజీల్లో రూ. 63.78 లక్షల వార్షిక వేతనం ఈ ఏడాది రికార్డు కాగా... సగటున రూ.19.49 లక్షల సగటు వేతనం లభించింది. డేటా సైన్సెస్ రంగంలో కృషి చేస్తున్న కంపెనీ బ్లెండ్.. ఎక్కువ ఆఫర్లు 360 విడుదల చేసిన కంపెనీగా నిలిచింది. -
హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సును హైదరాబాద్ ఐఐటీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు శ్రీ విశ్వేశ్వర యోగా పరిశోధన సంస్థ (ఎస్‌వీవైఆర్‌ఐ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశోధనలు చేసే రీసెర్చ్ స్కాలర్లకు ప్రతినెలా రూ.75 వేల పారితోషికంతో పాటు, విదేశాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో యోగా, ఆయుర్వేదం, సంగీతం, నృత్యం, భారతీయ భాషలు, కళలు, అర్కిటెక్చర్, శిల్పం వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రంపై హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ కీలక మైలురాయిని అధిగమిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఐఐటీలో హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సు ప్రవేశపెట్టామని హెరిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి మోహన్‌రాఘవన్ పేర్కొన్నారు. ఒప్పంద పత్రాలను ప్రదర్శిస్తున్న బీఎస్ మూర్తి, ఎస్‌వీవైఆర్‌ఐ సంస్థ ప్రతినిధులు -
మరో ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య.. వారంలో రెండో ఘటన
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్‌కు చెందిన మేఘా కపూర్ ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మూడు నెలల క్రితమే బీటెక్ పూర్తి చేసిన మేఘా కపూర్ అప్పటినుంచి సంగారెడ్డిలోని ఓ లాడ్జీలో రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా వారం వ్యవధిలో ఇది రెండో ఘటన. ఆగస్టు 31న ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన గదిలోని మంచం రాడ్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం పొందారు. ‘ఇంపార్టెంట్ టెక్ట్స్.. ప్లీజ్ సీ ల్యాప్‌టాప్.’ అని రాహుల్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. సంగారెడ్డిలోని ఐఐటీలో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు సుసైడ్ చేసుకున్నారు. క్యాంపస్‌లో వరుస ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు -
ఇంపార్టెంట్ టెక్ట్స్, ప్లీజ్ సీ ల్యాప్‌టాప్.. పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజులకే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ (స్మార్ట్ మొబిలిటీ) చదువుతున్న బింగుమల్ల రాహుల్ (25) ఆత్మహత్య చేసుకున్నా రు. ఐఐటీహెచ్‌లోని కౌటిల్య బ్లాక్ హాస్టల్లో ఉంటున్న రాహుల్.. తన గదిలోని మంచం రాడ్‌కు నైలాన్ తాడుతో ఉరివేసుకుని బలవన్మరణం పొందారు. ‘ఇంపార్టెంట్ టెక్ట్స్.. ప్లీజ్ సీ ల్యాప్‌టాప్..’అని రాహుల్ రాసిన సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది. ‘థీసిస్ పర్పస్‌లెస్’అని రాసి కొట్టేసిన మరో నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని సైబర్ నిపుణుల బృందానికి పంపారు. రాహుల్ కాల్ లిస్ట్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఓపెన్ అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి చెప్పారు. రాహుల్ స్వస్థలం కర్నూల్ జిల్లా నంద్యాల. అక్కడే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజులకే.. ఆగస్టు 27 (శనివారం)న పుట్టినరోజు జరుపుకు న్న రాహుల్ సోమవారం రాత్రి నుంచి తమకు కనిపించలేదని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. రాహుల్‌కు ఫోన్ చేసినా స్పందనలేకపోవడంతో అనుమానం వచ్చి విద్యార్థులు తలుపు సందులోంచి హాస్టల్ గదిలోకి చూడగా కాళ్లు వేలాడుతూ కనిపించాయి. లోపల గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా, మంచానికి ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వెంటనే ఘటనాస్థలాన్ని వీడియో తీసి రాహుల్ తండ్రి మధుసూదన్‌రావుకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చిన వెంటనే రాహుల్ మృతదేహానికి సంగారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉరి వేసుకోవడంతో కంఠానికి ఉన్న థైరాయిడ్ బోన్ ఫ్రాక్చర్ అయినట్లు పోస్టుమార్టంలో తేలినట్లు తెలిసింది. చేతికి గాయమై రక్తం కారినట్లు సమాచారం. పుట్టినరోజు జరుపుకున్న 48 గంటల్లోపే ఆత్మహత్య చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, 2008లో ఐఐటీహెచ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మానసిక ఒత్తిడి, తోటి విద్యార్థులకు పోటీగా నిలవాలనే తాపత్రయంతో ఒత్తిడికి గురికావడం వంటి కారణాలతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థు లు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతర్గత విచారణ చేశాం ‘రాహుల్ ఆత్మహత్యపై అంతర్గత విచారణ చేశాం. దీనికి విద్యాసంబంధ కారణాలేమీ ఉండకపోవచ్చని భావిస్తున్నాం. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు’అని ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి ‘సాక్షి’తో పేర్కొన్నారు. అనుమానంగా ఉంది: మధుసూదన్‌రావు, రాహుల్ తండ్రి తన కుమారుడి మృతి పట్ల రాహుల్ తండ్రి మధుసూదన్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా ఫ్యాన్‌కు ఉరివేసుకుంటారని, మంచానికి ఉరివేసుకోవడమేంటని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిర్వహించక ముందే తన కుమారుడి ముఖం చూడాలని ప్రాధేయపడినా వైద్యాధికారులు అంగీకరించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. పోస్టుమార్టం అనంతరం రాహుల్ మృతదేహాన్ని నంద్యాలకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2ఎక్స్ టెక్నాలజీ! ఎన్నెన్నో ప్రయోజనాలు
► కారులో వేగంగా వెళ్తున్నారు.. ఉన్నట్టుండి ఎదురుగానో, పక్కనుంచో ఓ బస్సు దూసుకొచ్చింది.. మీకు అప్పటికే ఆ బస్సు వస్తున్న విషయం తెలిసింది.. మీ కారు వేగం తగ్గించి భద్రంగా ఓ పక్కకు జరిగారు. ► మళ్లీ ప్రయాణం ప్రారంభించారు. సిగ్నల్, జీబ్రాక్రాసింగ్ వంటివి లేకున్నా ఓ చోట కొందరు రోడ్డు దాటుతున్నారు. కొంత దూరం నుంచే మీ కారు దీనిపై అలర్ట్ చేయడంతో వేగం తగ్గించారు. .. ఇదంతా ‘వీ2ఎక్స్ (వెహికల్ టు ఎవ్రీథింగ్) కమ్యూనికేషన్ టెక్నాలజీ మహిమ. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ ఐఐటీ, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సుజుకి మోటార్ కార్పొరేషన్, మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ కంపెనీలు సంయుక్తంగా ఈ టెక్నాలజీని రూపొందించాయి. బుధవారం సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీ ప్రాంగణంలో.. ఐదు వాహనాలను వీ2ఎక్స్ టెక్నాలజీతో నడుపుతూ టెక్ షో నిర్వహించారు. 2025 నాటికి ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని ప్రాజెక్టు ప్రతినిధులు ప్రకటించారు. రహదారి భద్రతకు ఎంతో ఉపయోగపడే వీ2ఎక్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని రహదారులపై పరీక్షిస్తే.. ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, సుజుకి, మారుతి సుజుకి సంస్థల ప్రతినిధులు, కేంద్ర టెలికం శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘వీ2 ఎక్స్’అంటే.. ‘వెహికిల్ టు ఎవ్రీథింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’..రోడ్డుపై వెళ్తున్న అన్నిరకాల వాహనాలు, పాదచారులతో అనుసంధానమవుతుంది. చుట్టూ ఉన్న వాహనాలు, వాటివేగం, సమీపంగా రావడం వంటివాటిని గమనిస్తూ..ప్రమాదాలు జరగకుండా డ్రైవ ర్ను అప్రమత్తం చేస్తుంది. ఐఐటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఈ టెక్నాలజీ పనితీరును ప్రాజెక్టు ఇన్చార్జి ప్రత్యూష వివరించారు. ప్రధానంగా ఆరు ప్రయోజనాలు ఉన్నట్టు తెలిపారు. ప్రయోజనాలివీ.. 1.అంబులెన్స్ హెచ్చరిక వ్యవస్థ: అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు కారుకు సమీపంలోకి వస్తున్నప్పుడు.. వాటికి దారి ఇచ్చేలా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. అంబులెన్స్ ఎన్ని నిమిషాల్లో తన వాహనాన్ని సమీపిస్తుంది, ఎక్కడ దారి ఇవ్వాలనేది కూడా సూచిస్తుంది. 2.పాదచారుల హెచ్చరిక వ్యవస్థ: పాదచారులు రోడ్లపై కారుకు అడ్డుగా వచ్చే అవకాశముంటే వెంటనే గుర్తించి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఢీకొట్టకుండా ముందుగా జాగ్రత్త పడేందుకు సహాయం చేస్తుంది. 3. బైక్ అలర్ట్ సిస్టమ్: రోడ్డు సందులు, మూల మలుపుల్లో అకస్మాత్తుగా వచ్చే ద్విచక్ర వాహనాలను కార్లు ఢీకొనడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీ2ఎక్స్ టెక్నాలజీని ద్విచక్ర వాహనాలకు కూడా అనుసంధానిస్తే.. బైక్ ఎంత దూరంలో ఉంది, ఏ దిశలో వస్తుందనే విషయాన్ని కారు డ్రైవర్‌కు చేరవేస్తుంది. 4. రోడ్ కండిషన్ అలర్ట్ సిస్టమ్: రోడ్డు సరిగ్గా లేనిచోట్ల డ్రైవర్‌ను హెచ్చరిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని అప్రమత్తం చేస్తుంది. 5. చాలా దూరం నుంచే పసిగట్టి: ఒక్కోసారి రాంగ్ రూట్లో వచ్చే వాహనాలు కారు దగ్గరికి వచ్చే వరకు గుర్తించలేం. అలాంటి వాహనాలను చాలా దూరం నుంచే పసిగట్టి డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. 6. కారు కంప్యూటర్‌గా: కారును డ్రైవింగ్‌కు ఉపయోగించనప్పుడు.. అందులోని మైక్రో ప్రాసెసర్‌ను కంప్యూటింగ్ కోసం వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి -
నిర్మాణాల ఆయుష్షు పెంచుతుంది!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: భవనాలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు మరింత కాలం దృఢంగా ఉండేందుకు తోడ్పడే ప్రత్యేక మెటీరియల్‌ను హైదరాబాద్ ఐఐటీ పరిశోధన విభాగం అభివృద్ధి చేసింది. పాత నిర్మాణాలను బలోపేతం చేయడం కోసం స్టీలు, కాంక్రీట్‌కు బదులుగా.. తాము రూపొందించిన ‘హైబ్రిడ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ (ఎఫ్ఆర్పీ)’ను వినియోగించవచ్చని ఐఐటీహెచ్ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ తెలిపారు. స్టీల్‌ప్లేట్లు, కాంక్రీట్ కంటే ఎఫ్ఆర్పీ దృఢత్వం, సామర్థ్యం ఎక్కువ అని ఐఐటీలోని క్యాస్ట్‌కాన్ ల్యాబ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలిందని చెప్పారు. ‘పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జిలు, ఇతర నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్న కొద్దీ దృఢత్వాన్ని కోల్పోతుంటాయి. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, పేలుళ్లు వంటివాటితో నిర్మాణాలు దెబ్బతింటాయి. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన రైల్వే, రోడ్డు వంతెనలు బలహీనమవుతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలంటే వ్యయప్రయాసలతో కూడిన విషయం. కానీ ఎఫ్ఆర్పీని వినియోగించి మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేయడంతో ఆ నిర్మాణాల దృఢత్వాన్ని పెంచవచ్చు. వాటి ఆయుష్షును కూడా మరో 20 ఏళ్లవరకు పొడిగించవచ్చు. ఎఫ్ఆర్పీని వినియోగించడం వల్ల ఆయా నిర్మాణాల పరిమాణంలో మార్పులు ఉండవు. బరువు కూడా తక్కువగా ఉంటుంది’’అని సూర్యప్రకాశ్ వెల్లడించారు. దేశ అభివృద్ధికి ఊతం ఎఫ్ఆర్పీని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ నేతృత్వంలోని పరిశోధన బృందాన్ని ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. ఈ పరిశోధన దేశంలో మౌలిక సదుపాయాలకు దీర్ఘాయువును ఇస్తుందన్నారు. మౌలిక సదుపాయాల పరిరక్షణ, వాటి జీవితకాలాన్ని పెంచడం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. -
ముంపు ముప్పు తప్పాలంటే మేల్కొనే తరుణమిదే
సాక్షి, హైదరాబాద్: ముందుంది ముంచే కాలం.. నైరుతీ రుతుపవనాల కాలం మొదలయ్యే జూన్ తొలివారం నుంచే మొదలు కానుంది. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం మరో 30 రోజుల్లో పొంచి ఉంది. ముంపు కష్టాలకు ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ మొదలైంది. తొలకరి పలకరింపుల అనంతరం వరుసగా కురిసే వర్షాలతో నగరం చిగురుటాకులా వణకడం ఏటా జరిగే తంతు. ఈ నేపథ్యంలో ఇప్పుడే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. శివార్లతో పోలిస్తే కోర్‌సిటీకే ముంపు ముప్పు ఎక్కువని ఐఐటీ హైదరాబాద్, వాతావరణ శాఖ తాజా అధ్యయనంలో తేలింది. గత కొన్నేళ్లుగా (2013–2019 సంవత్సరాలు) డేటాను అధ్యయనం చేసిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ఈ మధ్య కాలంలో ఏకంగా 29 సార్లు నగరాన్ని వరదలు ముంచెత్తినా.. అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగకపోవడం గ్రేటర్ పిటీ. కుండపోత లెక్కలివీ.. ► జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో 37 ఆటోమేటిక్ వర్షపాత లెక్కింపు కేంద్రాల్లో 118 రోజుల భారీ వర్షపాతం లెక్కలను పరిశీలించిన అనంతరం ప్రధాన నగరానికే ముంపు ముప్పు ఏటా తథ్యమని ఈ అధ్యయనం తేల్చింది. తరచూ వర్షం కురిసిన రోజులు, తీవ్రత, నమోదైన వర్షపాతం లెక్కలను పరిశీలించారు. ప్రధానంగా రుతుపవన వర్షాలు కురిసే జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కురిసినట్లు గుర్తించారు. ► కొన్ని గంటల వ్యవధిలోనే కోర్‌సిటీ పరిధిలో క్యుములో నింబస్ మేఘాలు కుమ్మేయడంతో కుండపోత వర్షాలు కురిశాయని విశ్లేషించారు. శివార్లలోనూ భారీ వర్షాలు కురిసినప్పటికీ తీవ్రత అంతగా లేదని తేల్చారు. ప్రధాన నగరంలో పట్టణీకరణ పెరగడం, వర్షపు నీరు వెళ్లే దారి లేకుండా విస్తరించిన కాంక్రీట్ రహదారులు, నాలాలపై ఆక్రమణలు, బహుళ అంతస్తుల భవనాల కారణంగా ముంపు సమస్య అధికంగా ఉందని నిగ్గు తేల్చింది. ► దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన వరదనీటి కాల్వలు కుంచించుకుపోవడమూ ఇందుకు కారణమని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ వివరాలను నగరంలోని వాతావరణ మార్పులు,భారీ వర్షాల తీరుతెన్నులపై భారత వాతావరణ శాఖ ప్రచురించిన అర్బన్ క్లైమేట్ జర్నల్‌లోనూ ప్రచురించినట్లు పరిశోధకులు తేల్చారు. ఇరవైతొమ్మిదిసార్లు.. వరదలు.. నగరంలో 2013 నుంచి 2019 మధ్యకాలంలో 29 సార్లు ప్రధాన నగరాన్ని వరదలు ముంచెత్తినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రధానంగా జూన్–సెప్టెంబరు మధ్యకాలంలోనే 15 సార్లు వరదలు సంభవించినట్లు తెలిపింది. మార్చి –మే మధ్యకాలంలో 8 మార్లు, అక్టోబరు–డిసెంబరు మధ్యకాలంలో 5 మార్లు వరదలు ముంచెత్తాయని పేర్కొంది. జనవరి–ఫిబ్రవరి మధ్యకాలంలో ఒకసారి వరదలు సంభవించాయని తెలిపింది. సెంటీమీటరు మేర కురిస్తేనే.. జీహెచ్ఎంసీ పరిధిలో ఏకధాటిగా ఒక సెంటీమీటరు వర్షం కురిస్తే చాలు నగరంలో వరదనీరు పోటెత్తుతోందని ఈ అధ్యయనం తేల్చింది. ఇక 24 గంటల్లో ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే నగరం అతలాకుతలమవుతుందని గుర్తించింది. ప్రధానంగా 90 శాతం వరదలు జూన్–అక్టోబరు మధ్యకాలంలోనే తలెత్తినట్లు తేల్చింది. 2013లో 31 రోజులు, 2016లో 25సార్లు నగరంలో వరదలు భారీగా సంభవించడంతో జనజీవనం అస్తవ్యస్తమైనట్లు అధ్యయనం తెలిపింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలతోనే అధిక నష్టం వాటిల్లినట్లు తేల్చింది. -
దేశంలోనే తొలిసారిగా 5జీ డేటా కాల్ అభివృద్ధి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: దేశంలో 5జీ సాంకేతి కత పరిశోధనలో కీలక ముందడుగు పడింది. తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 5జీ వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీని వైసిగ్ నెట్వ ర్క్స్ (డబ్ల్యూఐఎస్‌ఐజీ) అనే స్టార్టప్ కంపెనీతో కలసి ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా అభివృ ద్ధి చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన 5జీ ఒరాన్ (ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్) టెక్నాలజీ సాయంతో తొలి డేటా కాల్‌ను చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవా రం ఇక్కడ ప్రకటన విడుదల చేసింది. 3.3–3.5 జీహెచ్‌జెడ్ (గిగాహెర్ట్జ్) ఫ్రీక్వెన్సీ (పౌనఃపు న్యం) బ్యాండ్‌లో 100 ఎంహెచ్‌జెడ్ (మెగా హెర్ట్జ్) బ్యాండ్‌విడ్త్‌కు సపోర్ట్ చేసే మల్టిపుల్ ఇన్పుట్–మల్టిపుల్ అవుట్‌పుట్ (మిమో) సామర్థ్యంగల బేస్‌స్టేషన్‌ను ఉపయోగించి డేటా కాల్‌ను అభివృద్ధి చేసినట్లు ఐఐటీ వర్గాలు వెల్లడించాయి. లైసెన్సింగ్ ప్రాతిపదికన ఈ సాంకేతికతను భారతీయ వైర్లెస్ పరికరాల తయారీదారులకు అందుబాటులో ఉంచుతు న్నట్లు వైసిగ్ నెట్వర్క్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సాయిధీరాజ్ చెప్పారు. 5జీ స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో ఇదో కీలక ఘట్టమని ఐఐటీహెచ్ పరిశోధన–అభివృద్ధి విభాగం డీన్ ప్రొఫెసర్ కిరణ్ కుచి తెలిపారు. తమ పరిశోధన ద్వారా 5జీ, భావి సాంకేతికతల అభివృద్ధిలో భారత్‌ను మరింత ముందుకు తీసుకొచ్చినట్లు చెప్పారు. 5జీ రంగంలో తమ టెక్నాలజీ దేశాన్ని ఆత్మ నిర్భర్‌గా మార్చగలదని ఆశిస్తున్నట్లు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. -
ఐఐటీ హైదరాబాద్‌లో కోవిడ్ కలకలం.. 123 పాజిటివ్ కేసులు
సాక్షి, సంగారెడ్డి/ఆదిలాబాద్/ఖమ్మం: సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనాబారిన పడినవారిలో విద్యార్థులు, ప్రొఫెసర్లు, వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని హైదరాబాద్ ఐఐటీలో బుధవారం నాటికి 123 మందికి కరోనా సోకింది. వీరిలో 107 మంది విద్యార్థులు కాగా, ఏడుగురు ఫ్యాకల్టీలు, ఆరుగురు ఇతర ఉద్యోగులున్నారు. ఈ నెల తొలి వారం వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఐఐటీకి వచ్చారు. ఐదో తేదీన ఇద్దరు విద్యార్థులకు స్వల్ప లక్షణాలుండటంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో రెండుడోసుల వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉన్నవారినే క్యాంపస్‌లోకి అనుమతించారు. అయినా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో 2 వేలమంది విద్యార్థులు, 250 మంది ఫ్యాకల్టీలు, వారి కుటుంబీకులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రధాన శాఖలో 8 మంది ఉద్యోగులకు కోవిడ్ సోకింది. పోలీసుశాఖలో ఇద్దరు సీఐలకు కరోనా వచ్చింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు సహా 15 మంది సిబ్బం ది కరోనా బారినపడ్డారు. మంచిర్యాల పోలీసు స్టేషన్లో బుధవారం 97 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా, ట్రాఫిక్ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్ వచ్చింది. ఖమ్మం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం సీఐ సహా పదిమంది కరోనా బారిన పడ్డారు. -
ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు
క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. డిసెంబరు 1 నుంచి ప్రారంభమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల నుంచి నియామక పత్రాలు అందుకున్నారు. ఐఐటీ, హైదరాబాద్‌లో డిసెంబరు 1 నుంచి ఫేస్ 1 క్యాంపస్ రిక్రూట్మెంట్లు ప్రారంభమయ్యాయి. బిటెక్, ఎంటెక్‌లలో వివిధ విభాగాల నుంచి మొత్తం 668 మంది విద్యార్థులు ఈ రిక్రూట్మెంట్కి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు 225 మందికి నియామక పతత్రాలు అందాయి. ఇప్పటి వరు జరిగిన నియామకాల్లో ఓ విద్యార్థికి అత్యధికంగా రూ.65.45 లక్షల వార్షిక వేతనం ఖరారు అయ్యింది. త్వరలోనే రెండో ఫేస్ నియమకాలు కూడా చేపట్టబోతున్నారు. కోవిడ్ ఎఫెక్ట్ మధ్య గతేడాది ఫేజ్ 1, ఫేజ్ 2లకు కలిపి మొత్తం 195 కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లో పాల్గొనగా ఈ సారి ఒక్క ఫేజ్ 1లోనే 210 కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఐఐటీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వల్ల చాలా కంపెనీలు క్యాంపస్ నియామకాలకు ఇక్కడికి వస్తున్నాయి. ఫేజ్ 1లో పాల్గొన్న సంస్థల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గోల్డ్‌మాన్ శాక్స్, జేపీ మోర్గాన్, అమెజాన్, యాక్సెంచర్, ఇండీడ్, ఆప్టమ్, ఫ్లిప్‌కార్ట్, జాగ్వర్‌లతో పాటు అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. -
ఐఐటీ హైదరాబాద్..స్టార్టప్‌ల కోసం స్పెషల్ ఫండ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో ఘనత వచ్చి చేరింది. కేంద్రం అందించే స్టార్టప్ సీడ్ ఫండ్‌కి ఈ కాలేజీ ఎంపికైంది. దీంతో ఇక్కడ నూతన ఆవిష్కరణలకు మరింత ఊతం లభించనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సంస్థ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పేరుతో నూతన ఆవిష్కరణలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ సంస్థకు చెందిన అడ్వైజరీ కమిటీ ఐఐటీ, హైదరాబాద్‌కి స్టార్టప్ ఫండ్ కింద రూ. 5 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. గత పదమూడేళ్లుగా ఐఐటీ హైదరాబాద్ సాధించిన పురోగతి ఆధారంగా ఈ నిధులు మంజూరు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పీ, రొబోటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్యెమెంటెడ్ రియాలిటీ, బ్లాక్ చెయిన్ తదితర టెక్నాలజీ మీద అభివృద్ధి చేస్తున్న కాన్సెప్టులు, స్టార్టప్‌లకు సాయం అందివ్వనున్నారు. రాబోయే మూడేళ్లల కాలంలో కనీసం 10 నుంచి 15 వరకు స్టార్టప్‌లు ఐఐఐటీ హైదరాబాద్ నుంచి వస్తాయని అంచనా. -
24 లక్షల ప్యాకేజీ.. ఛీ ఇలాంటి పని చేశావ్!
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది కదా అని ఏది బడితే అది టైప్ చేయకండి. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నవారు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. మారు పేర్లు, నకిలీ ఖాతాలతో విద్వేషపు రాతలు రాసేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేసి తప్పించుకోవచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తాజాగా ఆకుబత్తిని రామ్‌నగేష్ అనే యువకుడు ఇలాంటి నేరంలోనే పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్ బెంగళూరు చెందిన ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్కశర్మతో పాటు తొమ్మిది నెలల కుమార్తె వామికానూ ఉద్దేశించి ట్విటర్లో అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణతో ముంబై పోలీసులు రామ్‌నగేష్‌ను అరెస్ట్ చేశారు. టీ–20 ప్రపంచ కప్ భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో అతడు వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఢిల్లీ ఉమెన్ కమిషన్ సైతం తీవ్రంగా పరిగణించింది. ఈ ట్వీట్‌పై కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ క్రైమ్ పశ్చిమ విభాగం పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ క్వార్టర్స్‌లో రామ్‌నగేష్ పట్టుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 506, 67(బీ) కింద అభియోగాలు మోపారు. మారు పేరుతో ట్విటర్ ఖాతా... రాంనగేశ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్తగా ట్విట్టర్ ఖాతా తెరిచాడు. అది పాకిస్థాన్‌కు చెందిన ఖాతాగా నమ్మించేందుకు మార్పు చేర్పులు చేశాడు. ‘గప్పిస్తాన్ రేడియో’పేరుతో ఉన్న ట్విటర్ హేండిల్ ద్వారా కోహ్లిని బెదిరిస్తూ అక్టోబర్ 24న వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం రామ్‌నగేశ్ పనే అని తేల్చారు. మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన ముంబై పోలీసులు దీనిపై సమాచారం ఇచ్చి రామ్‌నగేశ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు ఐఐటీ- హైదరాబాద్ రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేషన్ చేసిన రామ్‌నగేశ్ ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో జాబ్ చేశాడు. అమెరికా వెళ్లాలన్న ఉద్దేశంతో నెల క్రితమే ఉద్యోగం మానేశాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే తన కుమారుడు ఇలాంటి హేయమైన వ్యాఖ్యలు చేయడం పట్ల రామ్‌నగేశ్ తండ్రి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వాపోయారు. చదువులో టాపర్ అయిన రామ్‌నగేశ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. కావాలని చేయలేదు.. అయితే రామ్‌నగేశ్ ఇదంతా కావాలని చేయలేదని పొరపాటున జరిగిందని శ్రీనివాస్ స్నేహితుడు కృష్ణమూర్తి తెలిపారు. ‘భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్న బాధలో రాంనగేశ్ ఈ మెసేజ్ టైప్ చేశాడు. దీన్ని ట్వీట్ చేయాలని అతడు అనుకోలేదు. అదే సమయంలో ఫోన్ అతడి చేతిలో నుంచి జారిపడిపోయింది. జరిగిన నష్టాన్ని నివారించేందుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఆ మెసేజ్ వైరల్ అయింది. ఆ రోజు నుంచి రామ్‌నగేశ్ భయంగా రోజులు గడిపాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే వరకు కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియదు’అని కృష్ణమూర్తి వివరించారు. నకిలీ ఖాతాలతో ట్రోలింగ్ ఫేక్ ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియాలో తాము ఏం చేసినా ఎవరూ పట్టుకోలేరన్న భ్రమలు సరికాదని ముంబై సైబర్ క్రైమ్ విభాగం డీసీపీ డాక్టర్ రష్మి కరాండికర్ అన్నారు. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు అవసరమైన సాంకేతికత తమ దగ్గర ఉందని తెలిపారు. అనేక నకిలీ ఖాతాలతో రామ్‌నగేశ్ ట్రోలింగ్ చేసినట్టు గుర్తించామన్నారు. క్రిక్‌క్రేజీగర్ల్, రమన్‌హీస్ట్, పెళ్లకూతురుహియర్ ట్విటర్ హేండిల్స్ ద్వారా ట్రోలింగ్‌కు పాల్పడినట్టు తేల్చారు. -
రైతులకు వరం.. ఐఐటీ హైదరాబాద్ సరికొత్త ఆవిష్కరణ!
హైదరాబాద్ : వ్యవసాయదారులకు, రైతుకూలీలకు ఉపయోకరంగా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే సరికొత్త ఆవిష్కరణకు ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ బాటలు వేసింది. వేస్ట్ టూ వెల్త్ వ్యవసాయం చేసేప్పుడు ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలతో బయో బ్రిక్స్ (ఇటుకలు)ను ఐఐటీ, హైదరాబాద్ విద్యార్థులు రూపొందించారు. సాగు చేసేప్పుడు వచ్చే చెత్తను సేకరించి దాన్ని ప్రత్యేక పద్దతిలో మిక్స్ చేసి ఈ ఇటుకలను రూపొందించారు. ప్రస్తుతం ప్రోటోటైప్‌లో ఉన్న ఈ ఇటుకలను కమర్షియల్ పద్దతిలో భారీ ఎత్తున తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం అందివ్వడంతో పాటు ఆఫ్ సీజన్లో రైతు కూలీలకు కూడా మరో పనిని అందుబాటులోకి తెచ్చినట్టు అవుతుందని ఐఐటీ , హైదరాబాద్ అధ్యాపకులు అంటున్నారు. ప్రాజెక్ట్ బిల్డ్ ఐఐటీ హైదరాబాద్‌లో బోల్డ్ యూనిక్ ఐడియా లీడ్ డెవలప్మెంట్ (బిల్డ్) పేరుతో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా భవన నిర్మాణ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టులో భాగంగా 2019 నుంచి బయె బ్రిక్ పరిశోధనలు ప్రారంభించారు. ఇటీవల హైదరాబాద్ క్యాంపస్‌లోనే ఈ ఇటుకలను ఉపయోగించి సెక్యూరిటీ గార్డ్ గదిని నిర్మించారు. బయె ఇటుక ప్రత్యేకతలు - సాధారణ ఇటుకలతో పోల్చినప్పుడు బయో ఇటుకలు చాలా తక్కువ (ఎనిమిదో వంతు) బరువును కలిగి ఉన్నాయి. దీంతో ఇంటి పైకప్పు నిర్మాణానికి సైతం వీటిని వినియోగించవచ్చు. పీవీసీ షీట్లపై ఈ ఇటుకలను పేచ్చి కప్పును పూర్తి చేయవచ్చు. - బయె ఇటుకలు వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్‌గా పని చేస్తాయి. కాబట్టి భవనానికి అదనపు రక్షణ లభిస్తుంది. అంతేకాదు కొంత మేరకు సౌండ్ ప్రూఫ్‌గా కూడా పని చేస్తున్నాయి. - సాధారణ ఇటుకలతో పోల్చితే బయో ఇటుకలను కాల్చేందుకు కనీసం 6 సెంటిగ్రేడ్ వరకు తక్కువ ఉష్ణోగ్రత సరిపోతుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గిపోతుంది. - ఈ ఇటుకలను భారీ ఎత్తున తయారు చేస్తే ఒక్కో ఇటుక తయారీకి కేవలం రూ.2 నుంచి రూ. 3 ల వ్యయం అవుతుంది. దీంతో ఇటుకల రేటు తగ్గిపోతుంది. గ్రామీణ ప్రాంతాలకు ఉపయుక్తం బయో బ్రిక్ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే రూరల్ ఇండియాకు ఎంతగానో మేలు జరుగుతుందని ఐఐటీ హైదరాబాద్ అధ్యాపక బృందం అంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే వ్యర్థాలతో అతి తక్కువ ఖర్చుతోనే ఇటుకలు అందుబాటులోకి వస్తాయని, వీటి వల్ల ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుందంటున్నారు. వ్యయం తగ్గడంతో పాటు ఇంటి నాణ్యత కూడా బాగుంటుందని హామీ ఇస్తున్నారు. చదవండి : Hyderabad Metro: అమ్మకానికి హైదరాబాద్ మెట్రో! ఎల్ అండ్ టీ కీలక నిర్ణయం? -
ఐఐటీ–హైదరాబాద్‌లో భారీ టెలిస్కోప్
సాక్షి, సంగారెడ్డి: ఖగోళ కార్యకలాపాలపై పరిశోధనలకు శ్రీకారం చుట్టేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ కీలక ముందడుగు వేసింది. క్యాంపస్‌లో భారీ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌ఎస్‌టీ) స్థాపక డైరెక్టర్ డాక్టర్ బీఎన్ సురేశ్ సోమవారం టెలిస్కోప్‌ను ప్రారంభించారు. ఈ టెలిస్కోప్‌లో 165 మి.మీ. ఫోకల్ లెంగ్త్‌తో 355 మి.మీ (ఐఐటీ కాన్పూర్ తర్వాత రెండోది) ఆప్టికల్ వ్యాసం కలిగిన భారీ లెన్స్ ఉంటుందని సోమవారం ఐఐటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై చిన్న క్రేటర్లు, శని గ్రహ వలయాలు, ఉల్కాపాతం వంటి చిత్రాలను నమోదు చేసేందుకు వినియోగించొచ్చని పేర్కొంది. ఖగోళంపై అధ్యయనం చేసేందుకు విద్యార్థులకు ఈ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ మూర్తి పేర్కొన్నారు. స్టార్ గేజింగ్ శిక్షణ కార్యక్రమాలు, ఖగోళ చిత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవచ్చని చెప్పారు. కాగా, ఐఐటీ హైదరాబాద్ ఆ్రస్టానమీ క్లబ్ ద్వారా హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పాఠశాలలు, కాలేజీల విద్యార్థులు కూడా ప్రయోజనాలు పొందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ముయూఖ్‌పహారి పాల్గొన్నారు. -
ప్రపంచంలోకెల్లా అతిచిన్న మైక్రోస్కోప్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచంలోనే అతిచిన్న మైక్రోస్కోప్‌ను హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేసింది. ముస్కోప్గా నామకరణం చేసిన ఈ ఆవిష్కరణ ఆటోమెటిక్‌గా పనిచేస్తుందని, దీన్ని ఎక్కడికైనా సులువుగా తరలించవచ్చని ఐఐటీ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. దీని తయారీకి తక్కువ ఖర్చు అయిందని పేర్కొన్నాయి. వైద్య, పశుసంవర్ధకం, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్ ఎంతో ఉప యోగపడుతుందని పేర్కొన్నాయి. ఆఫ్–ది షెల్ఫ్ ఎలక్ట్రానిక్ చిప్‌లతో తయారు చేసిన ఈ పరికరం వ్యాధులను గుర్తించే పనిని విస్తృతం చేస్తుందని తెలిపాయి. దీన్ని డాక్టర్ శిశిర్‌కుమార్ ఆవిష్కరించారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఆయనను అభినందించారు. సాంకేతికత ప్రయోజనాలను సమాజానికి అందిం చేందుకు హైదరాబాద్ ఐఐటీ కృతనిశ్చయంతో పని చేస్తోందని చెప్పారు. డాక్టర్ శిశిర్ కుమార్ నేతృత్వంలో పరిశోధకులు ఏక్తా ప్రజతి, ఎంటెక్ విద్యార్థి సౌరవ్ కుమార్ ఈ మైక్రోస్కోప్‌ను అభివృద్ధి చేశారని తెలిపారు. -
ఎన్ని మొక్కలు నాటారబ్బా, గుర్తించేలా టూల్ డిజైన్
రాయదుర్గం: పట్టణాల్లో రోడ్డుకు ఇరు పక్కల ఉన్న చెట్లను లెక్కించేందుకు ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ పరిశోధకులు వినూత్నమైన పద్ధతిని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్ సాంకేతికత సాయంతో పనిచేసే కంప్యూటర్ విజన్ అసిస్టెడ్ పరికరాన్ని అభివృద్ధి పరిచారు. ఈ పరికరం ఆటోమేటిక్‌గా పట్టణాల్లో చెట్ల విస్తారం ఎంత ఉందో గుర్తిస్తుందని ట్రిపుల్ ఐటీ–హైదరాబాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు చెట్ల సంఖ్య ఎంత ఉందో నేరుగా లెక్కించడం ద్వారా కాని, కృత్రిమ ఉపగ్రహాల సాయంతో గానీ లెక్కించేవారు. ఈ సరికొత్త పరికరాన్ని ట్రిపుల్ ఐటీ– హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ సీవీ జవహర్ నేతృత్వంలో అర్పిత్ బహేతి అనే పరిశోధక విద్యార్థి రూపొందించారు. ఈ పరికరాన్ని బైక్‌కు బిగించి ఏదైనా రోడ్డు మీదుగా తీసుకెళ్తే చాలు ఆటోమేటిక్‌గా చెట్లను లెక్కించడమే కాకుండా ఆ రోడ్డుకు సంబంధించిన మ్యాప్‌ను కూడా సులువుగా అర్థం అయ్యేలా రంగులతో అందజేస్తుందని అర్పిత్ వివరించారు. చెట్ల కాండాలు లేదా మొదళ్ల ద్వారా చెట్ల సంఖ్యను లెక్కిస్తుందని తెలిపారు. ఈ పరికరాన్ని హైదరాబాద్‌తో పాటు సూరత్‌లో పరీక్షించగా, 83 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని చెప్పారు. -
ఐఐటీ హైదరాబాద్‌కు 591 ర్యాంకు
సాక్షి, న్యూఢిల్లీ: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో ఐఐటీ–హైదరాబాద్ 591వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్–200 స్థానాల్లో మన దేశానికి చెందిన మూడు జాతీయస్థాయి విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ–బాంబే 177వ ర్యాంకు, ఐఐటీ–ఢిల్లీ 185వ ర్యాంకు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) 186వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఐఐఎస్సీ బెంగళూరు పరిశోధన అంశంలో ప్రపంచంలో నంబర్1 స్థానాన్ని సాధించింది. ఈమేరకు ప్రధాని మోదీæ బెంగళూర్ ఐఐఎస్సీతో పాటు ఐఐటీ–బాంబే, ఐఐటీ–ఢిల్లీ సంస్థలను అభినందించారు. ఇక ఐఐటీ – మద్రాస్ 255వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 277వ ర్యాంకు, ఐఐటీ ఖరగ్‌పూర్ 280వ ర్యాంకు, ఐఐటీ–గువాహతి 395వ ర్యాంకు, ఐఐటీ రూర్కీ 400వ ర్యాంకు సాధించాయి. ఢిల్లీ యూనివర్శిటీ 501–510 మధ్య, జేఎన్‌యూ–ఢిల్లీ 561–570 మధ్య, ఐఐటీ–హైదరాబాద్ 591–600 మధ్య, సావిత్రీబాయ్ ఫూలే పుణె వర్సిటీ 591–600 మధ్య నిలిచాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 651–700 మధ్య నిలిచింది. ఐఐటీ–భువనేశ్వర్, ఓపీ జిందాల్ గ్లోబ్ యూనివర్సిటీ 701–750 మధ్య, పాండిచ్చేరి యూనివర్సిటీ 801–1000 మధ్య, బిట్స్ పిలానీ, ఉస్మానియా యూనివర్సిటీ, వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వెల్లూర్ సంస్థలు 1001–1200 మధ్య స్థానాల్లో నిలిచాయి. ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1200 పైన నిలిచింది. జాతీయస్థాయిలో చూస్తే ఐఐటీ–హైదరాబాద్‌కు 11వ స్థానం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 14వ స్థానం, ఉస్మానియా వర్సిటీకి 30వ స్థానం దక్కాయి. -
ఈ మందుతో అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్..!
సాక్షి, హైదరాబాద్: బ్లాక్ ఫంగస్‌కు చెక్ పెట్టే మందును ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బ్లాక్ ఫంగస్ మాత్రమే కాకుండా దాదాపు అన్ని రకాల ఫంగల్ (శిలీంధ్రం) ఇన్ఫెక్షన్ల చికిత్సలోనూ దీన్ని వాడొచ్చని, ఏదైనా ఫార్మా కంపెనీ ముందుకొస్తే ఈ మందు తయారీ సాంకేతికతను అందించేందుకు తాము సిద్ధమని ఐఐటీ హైదరాబాద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్లాక్ ఫంగస్‌కు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్–బి అనే ఇంజెక్షన్‌తో చికిత్స కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మందు ఖరీదైనది మాత్రమే కాకుండా.. పలు దుష్ప్రభావాలూ ఉన్నాయి. గతంలో ఇదే మందును కాలా అజార్ వ్యాధి చికిత్సలోనూ ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఇంజెక్షన్ రూపంలో అందిస్తున్న ఆంఫోటెరిసిన్–బిపై రెండేళ్ల నుంచే ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్, డాక్టర్ చంద్రశేఖర్ శర్మ, పీహెచ్డీ స్కాలర్లు మృణాళిని గాయ్ధనే, అనిందిత లాహాలు పరిశోధనలు చేస్తున్నారు. నానో టెక్నాలజీ సాయంతో... ఈ మందును నానోస్థాయి పోగులతో కలిపి ట్యాబ్లెట్ల రూపంలో తయారు చేయొచ్చని వీరంతా గుర్తించారు. ట్యాబ్లెట్ల రూపంలో ఆంఫోటెరిసిన్–బి తయారు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, అతితక్కువ మోతాదుల్లో ప్రభావవంతంగా మందు అందించవచ్చని, ఇంజెక్షన్ ద్వారా అందించేటప్పుడు మూత్రపిండాలపై ఎక్కువ భారం పడుతుండగా ట్యాబ్లెట్ల ద్వారా ఈ దుష్ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ సప్తర్షి మజుందార్ తెలిపారు. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు ఆంఫోటెరిసిన్– బి శరీరంలో చిన్నచిన్న గడ్డలు కట్టే అవకాశాలు ఉంటాయని, వీటిని శరీరం నుంచి తొలగించేందుకు మూత్రపిండాలు ఎక్కువ భారం మోయాల్సి వచ్చేదని ఆయన వివరించారు. జిలాటిన్ పదార్థంతో కలిపి తాము ఈ మందును తయారు చేశామని చెప్పారు. పెద్ద ఎత్తున ఉత్పత్తి అవసరం.. బ్లాక్‌ఫంగస్‌తో పాటు ఇతర శిలీంధ్ర సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ మాత్రలను పెద్ద ఎత్తున తయారు చేయడం అవసరమని అన్నారు. ఇంజెక్షన్ల మాదిరిగా ఈ ట్యాబ్లెట్లూ ఖరీదుగా మారకుండా ఉండేందుకు తాము ఈ టెక్నాలజీపై పేటెంట్ హక్కులేవీ పొందలేదని, కేవలం 60 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్‌తో ఆంఫోటెరిసిన్–బి మందు నెమ్మదిగా.. స్థిరంగా 8 గంటల పాటు శరీరానికి అందించవచ్చన్నారు. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.200 వరకూ ఉండొచ్చని చెప్పారు. ఏదైనా ఫార్మా కంపెనీ ట్యాబ్లెట్ల తయారీకి పూనుకుంటే వాటి క్లినికల్ ట్రయల్స్‌కు మార్గం సుగమం అవుతుందని అన్నారు. -
కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..?
సాక్షి, హైదరాబాద్: కేసులు, మరణాలు, ఆక్సిజన్ కొరత, ఆరోగ్య సమస్యల గురించి వార్తలు వినీవినీ విసిగిపోయాం. ఈ కోవిడ్ మహమ్మారి పీడ విరగడయ్యేది ఎప్పుడన్న ప్రశ్న అందరి మనసులను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు వేర్వేరుగానైనా ఏకాభిప్రాయంతో మే చివరికి కరోనా పీడ విరగడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతుండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఆ వివరాలేంటో చూసేద్దాం. దేశంలో రెండో దశ కరోనా కేసుల సంఖ్య మే నెల 14 నుంచి 18వ తేదీ మధ్య కాలంలో శిఖర స్థాయికి చేరుకుంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ అధ్యాపకులు రూపొందించిన మోడల్లో తెలిపారు. ‘ససెప్టబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్) అండ్ రిమూవ్డ్ అప్రోచ్ (సూత్ర)’మోడల్‌ను వీరు తయారు చేశారు. ఇప్పటికే భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షల కన్నా ఎక్కువై 4 రోజులు అవుతోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల వరకు ఉండగా, మే నెల మధ్య కాలానికి 38 నుంచి 48 లక్షలకు చేరుకోవచ్చని, అదే నెలాఖరుకు కేసుల సంఖ్య రోజుకు 4.4 లక్షలకు చేరుతాయని ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్‌లతో పాటు తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి 30 మధ్యకాలంలో కేసుల సంఖ్య పెరిగి శిఖర స్థాయికి చేరుకుంటాయని, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే ఆ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని వివరిస్తున్నారు. కాగా, అంచనా వేసేందుకు వినియోగించిన సమాచారం ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో తుది ఫలితాలపై కొంత అసందిగ్ధత ఉందని ఈ మోడలింగ్‌కు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మణినీంద్ర అగ్రవాల్ ట్విట్టర్‡ ద్వారా తెలిపారు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య కూడా మే నెల 4–8వ తేదీ మధ్య కాలంలో శిఖరస్థాయికి చేరుతాయని సూత్రా మోడల్ అంచనా వేసింది. కాగా, కొద్ది రోజుల కింద కరోనా ఏప్రిల్ 15 –20 మధ్యకాలంలో శిఖర స్థాయికి చేరుతుందని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా విడుదల చేసినా.. కానీ ఇది వాస్తవం కాలేదు. ఇతరులదీ అదేమాట.. ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్ శాస్త్రవేత్తల ‘సూత్రా’మోడల్ దేశీయంగా, విదేశాల్లో సిద్ధం చేసిన ఇతర మోడళ్ల ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం కరోనా పీడ విరగడయ్యేందుకు ఎక్కువ సమయం లేదన్న భరోసా కల్పిస్తోంది. హరియాణాలో అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ వేసిన అంచనా ప్రకారం కరోనా వైరస్ కేసులు ఏప్రిల్ 15–మే 15 మధ్యకాలంలో అత్యధిక స్థాయికి చేరనున్నాయి. మరోవైపు అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ అంచనా కూడా మే 15కు కేసులు శిఖరస్థాయికి ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని చెప్పడం విశేషం. భ్రమర్ ముఖర్జీ అంచనాల ప్రకారం మే నెల మధ్యకు దేశంలో కేసుల సంఖ్య రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. సియాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’(ఐహెచ్ఎంఈ) కూడా దాదాపు ఇదే అంచనా వేసింది. నమోదైన కేసుల ఆధారంగా భ్రమర్ ముఖర్జీ, ఐహెచ్‌ఎంఈలు అంచనాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే మే నెల మొదటి వారంలో కేసుల సంఖ్య రోజుకు 5 లక్షలకు చేరుకుంటుందని, రోజువారీ మరణాలు 3 వేల కంటే ఎక్కువ నమోదు కావొచ్చని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. మరణాలు పెరుగుతాయా? ఐహెచ్ఎంఈ లెక్కల ప్రకారం.. ఆగస్టు ఒకటి నాటికి భారత్‌లో కోవిడ్ కారణంగా సంభవించే మరణాల సంఖ్య కనిష్టంగా 9.59 లక్షలు గరిష్టంగా 10.45 లక్షలుగా ఉండొచ్చని అంచనా వేశారు. ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు ధరిస్తే మరణాల సంఖ్య 8.8 లక్షలకు పరిమితం చేయొచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేంద్రం విడుదల చేసిన సీరో సర్వే ప్రకారం అసలు కేసుల కంటే నమోదైన కేసుల దాదాపు 27 రెట్లు తక్కువ. ఈ తేడాల మేరకు లెక్కలు 10 నుంచి 20 రెట్లు తక్కువ చూపుతారని పరిగణించి అంచనా వేశామని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. చదవండి: (దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం) -
ఈ మందు వాడితే కరోనా నుంచి నెలరోజుల రక్షణ!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునే లక్ష్యంతో ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు వినూత్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ఉపయోగించిన క్షణాల్లోనే 99.99 శాతం సూక్ష్మజీవులను నాశనం చేయడంతో పాటు దాదాపు నెల రోజుల పాటు రక్షణ కల్పించే నానోస్థాయి కోటింగ్ ఇచ్చే ప్రత్యేక ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శుక్రవారం ఈ ప్రత్యేక ఉత్పత్తి శ్రేణి ‘డ్యురోకియా’ను ఆన్లైన్ పద్ధతిలో విడుదల చేశారు. బయో మెడికల్ ఇంజినీరింగ్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్, ఈఫోకేర్ ఇన్నొవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన డాక్టర్ జోత్సేందు గిరి అభివృద్ధి చేసిన డ్యురోకియా ఉత్పత్తుల కనీస ధర రూ.189 మాత్రమే కావడం విశేషం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, 1 ఎంజీ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారంలపై ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని డాక్టర్ జోత్సేందు తెలిపారు. దీర్ఘకాలం పాటు వైరస్ వంటి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించే డ్యూరోకియాను ఆపరేషన్ థియేటర్లతో పాటు ఐసీయూల్లోనూ ఉపయోగించవచ్చని, నానోటెక్నాలజీ సాయంతో ఇలాంటి ఉత్పత్తిని తయారు చేయడం ఇదే తొలిసారని వివరించారు. నానోస్థాయి కోటింగ్ కారణంగా కరోనా వైరస్ వంటివి దాదాపు నెల రోజుల పాటు ఆయా ఉపరితలాలపై ఉండలేవని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. డ్యూరోకియా ఉత్పత్తులను ఇప్పటికే దేశంలోని పలు ప్రభుత్వ పరిశోధనశాలల్లో విజయవంతంగా పరిక్షించామని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నెర్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ వ్యవస్థాపక డీన్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. చదవండి: ఇప్పుడు కూడా కార్పొరేట్ యాజమాన్యాల కక్కుర్తి..! -
స్మార్ట్ఫోన్ల స్క్రీన్లపై ఎక్కువ సేపు కరోనా!
సాక్షి, హైదరాబాద్: నోరు, ముక్కు ద్వారా బయటపడే తుంపర్లలో ఉండే కరోనా వైరస్ ఎంత కాలం మనగలదు? కొంచెం కష్టమైన ప్రశ్నే.. ఎందుకంటే ఉష్ణోగ్రత, వెలువడే వైరస్ సంఖ్య, గాల్లో తేమ శాతం వంటి అనేకానేక అంశాలపై వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది. కానీ.. మిగిలిన అన్ని ఉపరితలాలతో పోలిస్తే తుంపర్ల ద్వారా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై చేరిన వైరస్ మాత్రం ఎక్కువ కాలం మనగలుగుతుందని అంటున్నారు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు.. అలాగే ఒకసారి తుంపర్లలోని తడి ఆరిపోయిన తర్వాత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వీరు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణ గాజు ఉపరితలాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై తుంపర్లు ఆరిపోయేందుకు మూడింతల ఎక్కువ సమయం పడుతోందని ఈ అధ్యయనం తెలిపింది. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కోవిడ్ కారక కరోనా వైరస్ మనుగడను అర్థం చేసుకునేందుకు తాము అధ్యయనం నిర్వహించామని, తుమ్ము, దగ్గు ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుం డగా లాలాజలంలో నీటితో పాటు లవణాలు, ముసిన్ అనే ప్రొటీన్ తదితరాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. నీటి తుంపర్లు వేగంగానే ఆరినప్పటికీ ఇతర పదార్థాల కారణంగా లాలాజలం ఆరిపోయేందుకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. సాధారణంగా తుంపర్లు కొన్ని నిమిషాల్లోనే ఆరిపోతాయి కానీ.. గాల్లో తేమ శాతం ఎక్కువైతే గంట కంటే ఎక్కువ సమయం పడుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు శరవణన్ బాలుస్వామి, సాయక్ బెనర్జీ, కీర్తి చంద్ర సాహూలు వెల్లడించారు. ‘తుంపర బిందువులు ఏ ఉపరితలంపై పడ్డాయన్న అంశంపై కూడా ఆరిపోయే సమయం ఆధారపడి ఉంటుంది. ఒక నానో లీటర్ లాలాజల బిం దువు నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఆరిపోతుంది. గాల్లో తేమ శాతం, ఉష్ణోగ్రతలు తక్కువ గా ఉన్నప్పుడు తడిఆరేందుకు అత్యధిక సమయం పడుతున్నట్లు గుర్తించాం.. గాల్లో తేమశాతం తగ్గి పోతూ, ఉష్ణోగ్రతలు పెరిగితే తుంపర్ల తడి వేగంగా ఆరిపోతున్నట్లు తెలిసింది’ అని వివరించారు. -
రైతుల కోసం 'క్రాప్ దర్పణ్'!
హైదరాబాద్: పంటలకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చేందుకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రత్యేక యాప్ రూపొందించింది. పత్తి పంటకు సోకే వ్యాధుల నిర్ధారణలో రైతులకు సాయం చేసేందుకు 'క్రాప్ దర్పణ్' పేరిట యాప్ తయారు చేశారు. భారత్-జపాన్ జాయింట్ రీసెర్చ్ లేబొరేటరీ ప్రాజెక్టు కింద దీన్ని రూపొందించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐటీ హైదరాబాద్, బాంబే ఐఐటీ సహకారంతో ట్రిపుల్ ఐటీ ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.(చదవండి: కాళేశ్వరంలో పడవ ప్రయాణం) తొలుత పత్తి పంటపై మాత్రమే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. తదుపరి దశల్లో ఇతర పంటలపై కూడా దృష్టి పేట్టి యాప్‌ల రూపకల్పన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్ ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అరవింద గాడమశెట్టి, రేవంత్ పర్వతనేని, సాయిదీప్ చెన్నుపాటి, శ్రీనివాస్ అన్నపల్లి కలసి ఈ యాప్ రూపొందించారు. గతంలో కూడా వ్యవసాయ సలహా వ్యవస్థను, గ్రామ స్థాయిలో ఈ-సాగును ట్రిపుల్ ఐటీ అభివృద్ధి చేసింది. చీడపీడలపై రైతులకు అవగాహన పత్తి పంట పెరుగుదలను ప్రభావితం చేసే సమస్యలు, తెగుళ్లు, బ్యాక్టీరియా, శిలీంద్ర వ్యాధులు, పోషక లోపాలకు సంబందించిన అంశాలు ఈ యాప్‌లో పాందుపర్పారు. చీడపీడలపై రైతులపై మార్గనిర్దేశం చేయడమే కాకుండా అవగాహన కల్పిస్తుంది. https://www.cropdarpan.in/cropdarpan/ పోర్టల్‌లో లింకు ద్వారా ఈ యాప్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి పంటపై మాత్రమే తెలుగు, ఇంగ్లిష్ భాషలలో రూపొందించారు. త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. యాప్‌లోని ప్రశ్నలను ఎంపిక చేసుకుంటే వాటికి సమాధానాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. విత్తనాలు ఎప్పుడు వేయాలో, పోషకాలు ఎలా అందించాలో ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. -
ఐఐటీ హైదరాబాద్‌లో టైహాన్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. నగర శివారు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ–హైదరాబాద్)లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అడుగు పడింది. మానవ రహిత విమానాలు, రిమోట్ కంట్రోల్‌తో నడిచే వాహనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పరీక్షించేందుకు ఉద్దేశించిన ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నేవిగేషన్ సిస్టమ్స్(టైహాన్)’ ఏర్పాటుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం పునాది వేశారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేస్తున్న అతిపెద్ద ముందంజగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు. స్వతంత్ర నేవిగేషన్ వ్యవస్థకు సంబంధించిన పలు విభాగాలు ఈ ప్రాజెక్టులో కలసికట్టుగా పనిచేస్తాయన్నారు. మానవ రహి త విమానాల నిర్వహణలో ఎదురయ్యే వాస్తవ సమస్యలు, సవాళ్ల పరిష్కారానికి ఇది ఉపయోగపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. మానవ రహిత డ్రోన్లు, వాహనాలను ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు లేకుండా పరీక్షించేందుకు ఇదో మేలైన వ్యవస్థగా రూపొందుతుం దని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీవీఎస్ మూర్తి తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం ఐఐటీ–హెచ్‌కు రూ.135 కోట్లు మంజూరు చేశాయి. ప్రాజెక్టులో భాగం గా టైహాన్‌లో టెస్ట్ ట్రాక్‌లు, నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులను తలపించేవి ఏర్పాటవుతాయి. అత్యాధునిక సిమ్యులేషన్ టెక్నాలజీలు, రహదారి వ్యవస్థలు, వీ2ఎక్స్ కమ్యూనికేషన్, డ్రోన్లు ఎగిరేందుకు, దిగేందుకు అవసరమైన రన్వేలు, ల్యాండింగ్ ఏరియాలు ఏర్పాటుచేస్తా రు. ఇటు సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్/గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హ్యాంగర్లు కూడా ఈ ప్రాజెక్టులో ఉంటాయని ఐఐటీ–హెచ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
సీఓ2తో బ్యాటరీ..ఐఐటీ శాస్త్రవేత్తలకు ఫెలోషిప్
సాక్షి, హైదరాబాద్ : కాలుష్యకారక కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)తో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక స్వర్ణ జయంతి ఫెలోషిప్ లభించింది. లోహాలతోపాటు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి ఇంధనాన్ని నిల్వ చేసే ఈ బ్యాటరీ 2024లో భారత్ అంగారక ప్రయోగానికి, కాలుష్యరహిత ఇంధన ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. హైదరాబాద్ ఐఐటీలోని కెమికల్ ఇంజనీరింగ్ అండ్ క్రియేటివ్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ నానోమెటీరియల్స్ క్లుప్తంగా కార్బన్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ చంద్రశేఖరశర్మ కొంతకాలంగా కార్బన్ డయాక్సైడ్ బ్యాటరీ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ రకమైన బ్యాటరీ తయారీ సాధ్యమే అని ఇప్పటికే నిరూపించారు కూడా. ఈ ఆలోచనను నిజరూపంలోకి తెచ్చేందుకు స్వర్ణజయంతి ఫెలోషిప్ ఉపయోగపడనుంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన విభాగం, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డులు కూడా తమ వంతు సహకారం అందిస్తాయి. ఈ సరికొత్త బ్యాటరీ తయారీ పూర్తయితే వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్ను గణనీయంగా తగ్గించవచ్చు కూడా. అంగారకుడిపైనా అదే వాయువు... 2024లో అంగారకుడిపైకి ఒక అంతరిక్ష నౌకను పంపాలని ఇస్రో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అరుణగ్రహ వాతావరణంలో దాదాపు 95 శాతం కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఆ గ్రహంపై తిరిగే రోవర్లు, ల్యాండర్లను నడిపేందుకు ఈ వాయువుతో నడిచే బ్యాటరీలు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. బ్యాటరీల బరువు తగ్గడంతోపాటు అతితక్కువ ప్రాంతంలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు. తద్వారా ప్రయోగ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు చేసిన సీఓ2 బ్యాటరీ ప్రతిపాదనకు ప్రాముఖ్యత ఏర్పడింది. స్వర్ణ జయంతి ఫెలోషిప్ ఆసరాగా నమూనా సీఓ2 బ్యాటరీని తయారు చేసేందుకు ఐఐటీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. -
విత్తన నిల్వకు సరికొత్త పద్ధతి
సాక్షి, హైదరాబాద్: ఆకలి కేకలు, అన్నదాతలకు నష్టాలు తగ్గేదిశగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీహెచ్) శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. విత్తనాలను దీర్ఘకాలంపాటు సురక్షితంగా నిల్వ చేసేందుకు సరికొత్త పదార్థం కనుగొన్నారు. ప్లాస్టిక్‌కు వేపనూనె జతచేసి నానో స్థాయి ప్లాస్టిక్ పదార్థం రూపొం దించారు. ఈ నానో ప్టాస్టిక్ పోగులతో తయారైన సంచుల్లో ఉంచిన విత్తనాలు 75 రోజుల తరువాత కూడా తాజాగానే ఉంటాయని ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంచుల్లో విత్తనాలు ఇదే కాలవ్యవధికి 70 శాతం మాత్రమే తాజాగా మిగులుతుండగా, కొత్త రకం సంచుల్లో ఇది 90 శాతం వరకూ ఉండటం విశేషం. అధిక ఉష్ణోగ్రతలను అడ్డుకొనేలా.. నానో ప్లాస్టిక్ పదార్థం శక్తిమంతమైందే కాకుం డా.. అధిక ఉష్ణోగ్రతలు లోనికి చేరుకోకుండా అడ్డుకోగలదు. ఇక పురుగు, పుట్ర నివారణకు వేపనూనె ఎంత ఉపయోగకరం. వేపనూనెలోని నింబిన్, అజాడిరక్టిన్ వంటి ట్రిటెర్పినాయిడ్లు బూజును దరిచేరనివ్వవు. క్రిమికీటకాల ఎదుగుదలనూ అడ్డుకుంటాయి. వేపనూనె ద్వారా 200 రకాల కీటకాలను అడ్డుకోవచ్చు. ఈ లక్షణాలన్నింటినీ ఒకదగ్గరకు చేర్చడం ద్వారా విత్తన నిల్వల నష్టాన్ని తగ్గించేందుకు పరిశోధనలు చేసినట్లు ఐఐటీ హైదరాబాద్ కెమికల్ ఇంజనీరింగ్ శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ శర్మ తెలిపారు. నానోప్లాస్టిక్ పదార్థంతో తయారుచేసిన సంచుల్లో విత్తనాలను సాధారణ ఉష్ణోగ్రతల వద్దనే నిల్వ చేయొచ్చని వివరించారు. ధాన్యం వృథాను అరికట్టేలా సంప్రదాయ పద్ధతులు వాడినా, ఆధునిక విధానంలో భాగంగా రకరకాల రసాయనాలు ఉపయోగించినా ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 130 కోట్ల టన్నుల ధాన్యం పనికిరాకుండా పోతోందని అంచనా. ఇంత మొత్తం ధాన్యంలో కొంతైనా రక్షించుకోగలిగితే రైతులకు నష్టాలు తగ్గడమే కాకుండా చాలామంది ఆకలి కూడా తీరుతుంది. -
తిరగబడ్డ వలస కార్మికులు
సాక్షి, సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో భవన నిర్మాణ పనులకోసం వచ్చిన వలస కార్మికులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ సంస్థలు 3 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, తమను సొంత రాష్ట్రాలకు వెళ్లనివ్వడం లేదని, భోజనం కూడా సక్రమంగా పెట్టడం లేదని వారు ఆందోళన చేపట్టారు. బుధవారం నుంచి తిరిగి నిర్మాణ పనులకు రావాలని ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులు కార్మికుల వద్దకు వెళ్లి కోరడం వారి ఆందోళనకు ఆజ్యం పోసింది. కార్మికులు ఒక్కసారిగా కంపెనీ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహంతో తిరగబడటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంగారెడ్డి రూరల్ పోలీసులు కార్మికులు నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లడంతో కోపోద్రిక్తులైన కార్మికులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసు వాహ నం ధ్వంసమైంది. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న ఎస్ఐ శ్రీకాంత్ వెంటనే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఏడాదికాలంగా పనులు..: సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ సమీపంలోని ఐఐటీహెచ్ క్యాంపస్‌లో రెండోదశ భవన నిర్మాణం పనులు సంవత్సరకాలంగా జరుగుతున్నాయి. ఎల్అండ్టీ, షాపూర్జీ సంస్థలు ఈ పనులు చేస్తున్నాయి. ఇందుకోసం బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి 2,400 మంది కార్మికులను తీసుకొచ్చారు. వీరికి పనిని బట్టి రూ.10 నుంచి రూ.20 వేల వరకు జీతం ఇస్తున్నారు. ఈ కార్మికులకు చిమ్నాపూర్ సమీపంలోనే నివాసాలు ఏర్పాటు చేశారు. మార్చి 23 నుంచి లాక్డౌన్ అమలులో ఉన్నందున నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేశారు. అప్పటి నుంచి కార్మికులు పనులు లేకుండానే ఉంటున్నారు. కంది మండల పరిధిలో ఉన్న అక్షయపాత్ర సంస్థ ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం ఒక పూట వారికి భోజనం అందిస్తున్నారు. రాత్రి భోజనం వారే తయారు చేసుకుంటున్నారు. నెలరోజులకుపైగా చాలీచాలని తిండి తినడం, అలాగే మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి కొన్ని పనులకు సడలింపు ఇవ్వడంతో ఎల్అండ్టీ ప్రతినిధులు తిరిగి నిర్మాణం చేపట్టడానికి బుధవారం ఉదయం కార్మికుల ను పనులకు పిలిచారు. అసలే జీతాలు లేక చాలీచాలని తిండితింటూ ఆగ్రహంగా ఉన్న కార్మికులు ఎల్అండ్టీ ప్రతినిధులు పనులకు పిలవడంతో ఆం దోళనకు దిగారు. వెంటనే జీతాలు చెల్లించి తమను ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. 2,400 మంది కార్మికులు ఒకేసారి ఆందోళనకు దిగడంతో ఎల్అండ్టీ ప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులను చూడగానే ఆగ్రహంతో రెచ్చిపోయిన కార్మికులు రాళ్లు, కర్రల తో దాడులు చేశారు. రెండు గంటల పాటు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా రూరల్ ఏఎస్ఐ సంగమేశ్వర్‌తో పాటుగా ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో ఎస్ఐ శ్రీకాంత్, సీఐ శివకుమార్‌లు వెంటనే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఆయన 200 మంది సిబ్బందితో ఐఐటీకి చేరుకొని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం అక్కడకు వచ్చి కార్మికులతో మాట్లాడారు. 60 మందిపై కేసులు.. ఐఐటీ హైదరాబాద్ పరిసరాల్లో ఆందోళనకు దిగిన వలస కార్మికులను కట్టడి చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. హత్యాయత్నం, ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేయడం, ప్రభుత్వ అధికారిపై దాడి చేయడం, లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు ఆయా సెక్షన్ల కింద 60 మంది కార్మికులపై కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు. కలెక్టర్, ఎస్పీ చర్చలు.. పరిస్థితిని గమనించిన ఎస్పీ ఈ విషయాన్ని కలెక్టర్ హనుమంతరావుకు తెలియజేశారు. ఆయన సూచన మేరకు ఎల్అండ్టీ ప్రతినిధులు, కార్మికుల తరఫున ఆరుగురు ప్రతినిధులను కలెక్టరేట్‌కు తీసుకెళ్లి వారితో చర్చలు జరిపారు. తమకు వెంటనే జీతాలు చెల్లించి స్వస్థలాలకు పంపించా లని కార్మికులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా లాక్డౌన్ ఉన్నందున స్వస్థలాలకు వెంటనే పంపించడం సాధ్యం కాదని ఆయన వివరించారు. పెండింగ్ జీతాలు మాత్రం గురువారం సాయంత్రంలోగా చెల్లించే విధంగా ఎల్అండ్ టీ ప్రతినిధులను ఆదేశించారు. కంపెనీ ప్రతినిధులు జీతాల చెల్లింపునకు అంగీకరించడంతో కార్మికులు శాంతించారు. దీంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఐఐటీహెచ్‌లో కార్మికుల పరిస్థితి, వసతులను నిరంతరం పర్యవేక్షిస్తామని, అక్కడ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. -
పోర్టబుల్ వెంటిలేటర్
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి టౌన్: కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్క్‌లు, వెంటిలేటర్ల తయారీకి సం బంధించిన నమూనాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల తక్కువ ఖర్చుతో తయారయ్యే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను డిజైన్ చేసిన ఐఐటీ హైదరాబాద్.. తాజాగా అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్‌ను తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీఎఫ్హెచ్ఈ)కి చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వెంటిలేటర్‌ను రూపొందించింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్ చెబుతోంది. ‘జీవన్‌లైట్’గా పిలిచే ఈ వెంటిలేటర్.. ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పనిచేస్తుంది. దీంతో విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడొచ్చు. వైద్యులు, కుటుంబ సభ్యులకు రక్షణ కరోనా వైరస్‌కు శరవేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో ఈ జీవన్‌లైట్ ఎమర్జెన్సీ వెంటిలేటర్ వెద్యులు, రోగుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తుంది. ఇది లక్ష రూపాయలకే అందుబాటులోకి వస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఏరోబయోసిస్‌కు రోజుకు 50 నుంచి 70 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ రేణు జాన్ కోరారు. కాగా, రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు చేసి, వైద్యుడికి యాప్ ద్వారా సమాచారం అందజేసే ఫీచర్‌తో పాటు, ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా జత చేసి జీవన్‌లైట్‌ను రూపొందించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, డీఆర్డీవో, ఐసీఎంఆర్ తదితర సంస్థల ప్రామాణికాలకు అనుగుణంగా దీన్ని తయారుచేసినట్లు ఏరో బయోసిస్ వెల్లడించింది. ఏకబిగిన 5 గంటలపాటు హృద్రోగులు, టైప్–2 మధుమేహం ఉన్న వారు కరోనా వైరస్ బారిన పడితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి అత్యవసర సమయాల్లో ఈ జీవన్ లైట్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరోనా సోకిన వారికే కాకుండా ఇతర సందర్భాల్లో చిన్న పిల్లలు, వృద్ధులకు తలెత్తే శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ను వాడొచ్చు. జీవన్‌లైట్‌లో ఉండే లిథియం అయాన్ బ్యాటరీని సెల్‌ఫోన్ తరహాలో రీచార్జి చేసుకోవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే 5 గంటలపాటు ఏకబిగిన పనిచేస్తుందని దీన్ని డిజైన్ చేసిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ చెబుతోంది. ఈ పరికరానికి వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్ ఉండటంతో రిమోట్ మానిటరింగ్ విధానంలో రోగులను తాకకుండానే వాడే వీలుంది. -
ప్రైవేటు రవాణావైపే మొగ్గు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం రోజూవారీగా రాకపోకలు సాగించే వారిపై కరోనా ప్రమాద తీవ్రత తగ్గిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడానికి ముందు మార్చి మూడో వారంలో ప్రయాణికులు రాకపోకలు సాగించిన తీరుపై ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే సంయుక్త సర్వే నిర్వహించాయి. కరోనా లక్షణాలు బయటపడుతున్న సమయంలో ప్రయాణికులు తమ రాకపోకల్లో చేసుకున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఆన్లైన్ ప్రశ్నావళి ద్వారా దేశవ్యాప్తంగా 1,900 మందిని సర్వే చేసినట్లు ఐఐటీ విద్యార్థి బృందం ప్రకటించింది. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో కరోనాపై ఎక్కువ అవగాహన ఉన్నట్లు సర్వేలో తేలింది. నిరుపేదలకు కరోనాపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా సర్వే నొక్కి చెప్పింది.. సర్వేలో వెల్లడైన విషయాలు.. ► దేశంలో కరోనా లక్షణాలు బయట పడుతున్న సందర్భంలో మార్చి మూడో వారంలో రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే ప్రయాణికులు చాలా మంది ప్రజారవాణా వ్యవస్థకు బదులుగా ప్రైవేటు రవాణా వ్యవస్థ వైపు మొగ్గు చూపారు. ప్రథమ శ్రేణి పట్టణాల్లో 12 శాతం, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 9 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 7 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను వదిలేసి ప్రైవేటు రవాణా వ్యవస్థలో ప్రయాణించారు. ► లాక్డౌన్ ప్రకటనకు ముందు మార్చి మూడో వారంలో 48 శాతం మంది ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కాగా, 28 శాతం మంది మాత్రం ఎప్పటిలాగానే తమ విధులకు హాజరయ్యారు. మరో 24 శాతం మంది మాత్రం వారానికి రెండు, మూడు మార్లు మాత్రమే విధులకు వెళ్లి వచ్చారు. ► కరోనా భయంతో మార్చి మూడో వారంలో 18 శాతం మంది విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరో 20.2 శాతం రైలు ప్రయాణాలు, 11.6 శాతం మంది బస్సు ప్రయాణాలు రద్దు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణా వ్యవస్థ కంటే ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం అని 93 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటు లాక్‌డౌన్‌కు ముందు ఏ తరహా వాహనాల్లో రాకపోకలు ఎక్కువగా సాగాయి. ట్రాఫిక్ రద్దీపై ప్రభావం వంటి అంశాలపైనా వివరాలు సేకరించినట్లు సర్వే బృందం వెల్లడించింది. -
వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయం.. బ్యాగ్ వాల్వ్ మాస్క్
సాక్షి, హైదరాబాద్: అంబ్యు బ్యాగ్ పరికరం డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయొచ్చని ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ల బృందం కేంద్రానికి సూచించింది. అంబ్యు బ్యాగ్ డిజైన్‌ను కొద్దిగా మార్చేసి కొత్తగా తయారుచేసే ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ పరికరం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. బ్యాగ్ వాల్వ్ మాస్క్ పరికరానికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో పాటు మెకానికల్, ఏరోస్పేస్ విభాగం ప్రొఫెసర్ ఈశ్వరన్ ఇటీవల పలు ప్రతిపాదనలు చేశారు. వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ఈ మాస్కుల తయారీకి కార్యాచరణ సిద్ధం చేసేందుకు డీఆర్డీవో లేదా కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నిపుణులతో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయాన్ని ప్రొఫెసర్ బృందం గుర్తు చేసింది. తక్కువ ఖర్చుతోనే.. రోగులకు కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్ల కొరత, వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో తయారయ్యే వెంటిలేటర్ల నమూనాలపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు డిజైన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్ బృందం ప్రతిపాదిస్తున్న బ్యాగ్ వాల్వ్ మాస్క్‌లను విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ ఉపయోగించొచ్చు. కారులోని బ్యాటరీ వంటి వాటికి ఈ మాస్క్‌లను అనుసంధానం చేసి నడిపించొచ్చు. వెంటిలేటర్ తరహాలో భారీ మెషీన్ కాకపోవడంతో దీనికి ఒకచోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం చాలా సులువు. దీని తయారీకి కేవలం రూ.5 వేల లోపు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఐఐటీ హైదరాబాద్ బృందం అంచనా వేస్తోంది. త్రీడీ ప్రింటర్ల ద్వారా తయారు చేసే బ్యాగ్ వాల్వ్ మాస్క్‌ల నమూనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే త్రీడీ ప్రింటు సాంకేతికత ద్వారా పరిమిత సంఖ్యలోనే తయారుచేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, ఇవి నిరంతరాయంగా పనిచేయకపోవచ్చనే అనుమానాలనూ ఈ బృందం వ్యక్తం చేసింది. 40 లక్షల మందికి అవసరం మన దేశ జనాభాలో దాదాపు 6 శాతం మందికి అంటే.. 8 కోట్ల మందికి కరోనా వైరస్ సోకుతుందని అంచనా.. చికిత్సలో భాగంగా ఇందులో కనీసం 40 లక్షల మందికి వెంటిలేటర్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలో కేవలం 40 వేల వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండగా, వచ్చే 10 నెలల్లో మరో 60 వేల వెంటిలేటర్లు మాత్రమే తయారుచేసే సామర్థ్యం మన దేశీయ కంపెనీలకు ఉంది. ఇందుకు దాదాపు రూ.3,600 కోట్లు అవసరం కానున్నాయి. పైగా కంప్యూటర్ సాయంతో నడిచే అత్యాధునిక వెంటిలేటర్ ధర రూ.40 లక్షల మేర పలుకుతుండగా, సాధారణ రకం విదేశీ వెంటిలేటర్‌కు రూ.15 లక్షల వరకు పలుకుతుండగా, దేశీయ వెంటిలేటర్‌కు రూ.6 లక్షల వరకు ఉంది. ‘అంబు బ్యాగ్’అంటే.. అత్యవసర సమయాల్లో రోగులకు శ్వాస అందించే సంచిలాంటి పరికరాన్ని వైద్య పరిభాషలో అంబ్యు బ్యాగ్ అంటారు. దీన్ని విద్యుత్ అవసరం లేకుండా చేతి ద్వారానే పనిచేయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ‘బ్యాగ్ వాల్వ్ మాస్క్’ను తయారుచేయాలని ఐఐటీ హైదరాబాద్ సూచిస్తోంది. 60 వేల వెంటిలేటర్ల తయారీకి అయ్యే ఖర్చుతో దాదాపు 60 లక్షల బ్యాగ్ వాల్వ్ మాస్కులను త యారు చేయొచ్చని చెబుతోంది. -
కరోనా: ఐఐటీ హైదరాబాద్ ప్రత్యేక శానిటైజర్!
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభణ నేపథ్యంలో మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇంటా బయటా... ఆఫీసుల్లో ఇలా ఎక్కడ చూసినా వీటి వాడకం బాగా పెరిగిపోయింది. ఇక డిమాండ్ పెరిగితే ధరలు కూడా ‘పెరుగుతాయన్న’ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెడికల్ షాపు యజమానులు చెప్పినంత ధర పెట్టి వీటిని కొనలేని వారు వివిధ మాధ్యమాల సహాయంతో ఇంట్లోనే వీటిని తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఐఐటీకి చెందిన విద్యార్థులు ప్రత్యేక హ్యాండ్ శానిటైజర్‌ను తయారు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) ప్రమాణాలతో సరికొత్త శానిటైజర్‌ను తమ కాలేజీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. (హోటల్లో క్వారంటైన్‌కు రూ.3,100 అద్దె) రీసెర్చ్ స్కాలర్ శివకళ్యాణి ఆడెపు, అసోసియేట్ ప్రొఫెసర్ ముద్రికా ఖండేల్వాల్ సంయుక్తంగా దీనిని తయారు చేశారు. 70 శాతం ఐసోప్రొపనాల్తో పాటు గ్లిజరాల్, చిక్కదనం కోసం పాలిప్రొపైలీన్ గ్లైకాల్.. మైక్రోబాక్టీరియాను అంతమొందించేందుకు లెమన్‌గ్రాస్ ఆయిల్.. ఐపీఏ ద్రావణం ఉపయోగించి ఈ శానిటైజర్‌ను రూపొందించినట్లు వారు పేర్కొన్నారు. ఇక ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్ వాడిన 30 సెకన్లలోనే చెడు బాక్టీరియా, ఫంగీ నుంచి విముక్తి లభిస్తుందని.. ఏకకణ జీవుల మీద 70 శాతం ఆల్కహాల్ పోసినట్లయితే... అవి పూర్తిగా నాశనమవుతాయని తెలిపారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వెల్లడించారు.(తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు) -
దేశ భవితకు ఆవిష్కరణలు అవసరం
సాక్షి, సంగారెడ్డి: సామాజిక అవసరాలకు అనుగుణంగా ఐఐటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీహెచ్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏ వ్యక్తికైనా దేశం, ప్రజలే ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెలగాలని సూచించారు. ఫస్ట్ నేషన్.. నెక్ట్స్ ఫ్యామిలీయని, అదేవిధంగా జాతి మొదటి దని, స్వార్థం చివరిది అనే భావన ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడే దేశం కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష ఏర్పడుతుందన్నారు. ఐ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగి స్తోందన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలని, ఇందుకు ని రంతరం యోగా సాధన చేయాలన్నారు. టిబెట్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: ఐఐటీల్లో చదివి బయటకు వచ్చిన విద్యార్థులు ఉద్యోగాల కోసం యాచించవద్దని, వారే పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని బండారు దత్తాత్రేయ సూచించారు. 2030 నాటికి భారతదేశంలో 65 శాతం యువత ఉంటోందని తెలిపారు. ఇది ప్ర పంచ దేశాలన్నింటిలోకి మన దేశం చేసుకున్న అదృష్టమన్నా రు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల ఉద్యోగాల కల్పన ఉంటే.. వీటిలో 1.5 కోట్ల ఉద్యోగాలు భారత్‌లోనే లభిస్తాయని చెప్పారు. తాను మొదటగా సామాజిక సేవా కార్యకర్తనని.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడినని చెప్పారు. పలువురు విద్యార్థులు సీఏఏ, ఎన్పీఆర్, రాజకీయాలపై ప్రశ్నలు అడగగా.. తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందు వల్ల అవి మాట్లాడటం తగదని తిరస్కరించారు. సమావేశంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కేన్సర్ చికిత్సలో కాంబినేషన్ థెరపీ
సాక్షి, సంగారెడ్డి: కేన్సర్ మహమ్మారిని నిర్మూలించేందుకు ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్లు చేసిన పరిశోధనల్లో ముందడుగు పడింది. కేన్సర్ చికిత్స కోసం సమర్థవంతమైన కాంబినేషన్ థెరపీని అభివృద్ధి చేశారు. కేన్సర్‌కు ఎలాంటి మందులు లేకపోవడంతో చికిత్స ద్వారానే నిర్మూలించేందుకు తాము మెరుగైన చికి త్స కోణంలో పరిశోధనలు జరిపిన ట్లు ఐఐటీ హైదరాబాద్ బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు. యాంటీ కేన్సర్ ఏజెంట్‌ను ఉపయోగించి ఫొటోథర్మల్ థెరపీ (పీటీటీ), కీమోథెరపీ సినర్జెటిక్ కలయికను గుర్తించినట్లు వివరించారు. పరిశోధన వివరాలతో మంగళవారం ఐఐటీ హెచ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కాంబినేషన్ థెరపీపై ఐఐటీ బాంబే, కోల్‌కతా బోస్ విశ్వవిద్యాలయం సహకారంతో పరిశోధనలు నిర్వహించినట్లు డాక్టర్ అరవింద్‌కుమార్ రెంగన్ పేర్కొన్నారు. హోస్ట్ కణాలను నాశనం చేస్తారిలా.. ఫొటోథర్మల్ థెరపీలో కాంతిని వేడిగా మార్చే పదార్థం కణతి (గడ్డ) ఉన్న ప్రాంతానికే నేరుగా వెళ్తుందని.. తద్వారా హోస్ట్ కేన్సర్ కణాలను తొలగించడం, నాశనం చేయడం చాలా సులువవుతుందని అరవింద్‌కుమార్ రెంగన్ తెలిపారు. ఐఆర్ 780 ఇన్ఫ్రారెడ్ కాంతిని గ్రహించడంతో పాటు కణతి వద్ద ఉండే కేన్సర్ కణాలను చంపేస్తుందని పేర్కొన్నారు. ఐఆర్ 780 హోస్ట్ కేన్సర్ కణాలను నశింపజేసే ఆక్సిజన్ జాతులను ఉత్పత్తి చేస్తుందని పరిశోధన ద్వారా తెలుసుకున్నామన్నారు. -
ఒక్క స్లాట్‌లోనే 53 మందికి ప్లేస్‌మెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్‌లో మొదటి విడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులు సత్తా చాటుతున్నారు. మొదటిరోజు ఒక్క స్లాట్‌లోనే 53 మంది విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ లభించాయి. 2019–20 విద్యా సంవత్సరానికి గానూ ఐఐటీ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు తొలి విడతలో మొదటి స్లాట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు అవి పూర్తయ్యాయి. ఆ తర్వాత చేపట్టిన మరో రెండు స్లాట్లలో ప్లేస్‌మెంట్స్ సెలెక్షన్ ఆదివారం రాత్రి 12 గంటల వరకు కొనసాగాయి. పాల్గొన్న 15 కంపెనీలు: తొలి స్లాట్‌లో మొత్తం 15 కంపెనీలు పాల్గొనగా అందులో టీఎస్ఎంసీ, ఎస్ఎంఎస్, డేటాటెక్ అండ్ ఎన్టీటీ–ఏటీ సంస్థ లు ఆరుగురు విద్యార్థులకు విదేశాల్లో ప్లేస్‌మెంట్స్ ఇచ్చాయి. బుక్‌మైషో, స్ప్రింక్లర్, జాగ్వార్, బజాజ్ ఆటో, బెన్‌వై మెల్లన్, డామినో డాటా ల్యాబ్స్, కాగోపోర్ట్ వంటి కంపెనీలు ప్లేస్‌మెంట్స్‌లో తొలి సారి పాల్గొనడం విశేషం. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మ్యాన్ సాక్స్, సేల్స్‌ఫోర్స్, ఇంటెల్, క్వాల్కామ్, ఒరాకిల్ వంటి సంస్థలు ఐఐటీహెచ్‌కు వచ్చాయి. అందులో అత్యధికంగా మైక్రోసాఫ్ట్ 17 మందికి ఆఫర్లను ఇచ్చిందని, వారిలో ఐదుగురు అమ్మాయిలున్నట్లు ఐఐటీ ప్లేస్‌మెంట్స్ ఇన్చార్జి ప్రదీప్ తెలిపారు. ఇక గోల్డ్ మ్యాన్ సాక్స్ ముగ్గురు విద్యార్థులకు ఆఫర్ ఇవ్వగా అందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న 477 మంది విద్యార్థులు గతేడాది తొలిరోజు 3 స్లాట్లలో చేపట్టిన ప్లేస్‌మెంట్స్‌లో 56 మందికే ఉద్యోగాలు లభించగా, ఈసారి తొలిరోజు ఫస్ట్ స్లాట్‌లోనే 53 మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. తొలివిడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఈనెల 12 వరకు కొనసాగనుండగా, రెండో విడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చే జనవరి నుంచి ఏప్రిల్ మధ్య నిర్వహించనుంది. ఈ ఏడాది మొదటి విడత క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం 477 మంది రిజిస్టర్ చేసుకోగా, 224 కంపెనీలు విద్యార్థులకు అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చాయి. అదే గతేడాది మొదటి విడతలో విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పించేందుకు మొత్తంగా 150 కంపెనీలే వచ్చాయి. -
ఐఐటీలో సోలార్ ఆటో టెస్టు డ్రైవ్
సాక్షి, సంగారెడ్డి: ఐఐటీ హైదారాబాద్‌లో జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సోలార్ ఆటోను గురువారం సంస్థ ప్రాంగణంలో పరీక్షించారు. హెచ్ఎస్ఈవీ ఐఎన్‌సీ జపాన్ బృందం సభ్యులు షీమిడా, చీబా ఆధ్వర్యంలో టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ఐఐటీ రసాయన శాస్త్ర విభాగం గ్రూపు పరిశీలకుడు డాక్టర్ కె.సురేంద్ర మార్త ఈ వివరాలు వెల్లడించారు. జపాన్ టెక్నాలజీతో ఐఐటీ కెమిస్ట్రీ గ్రూపు విద్యార్థులు సోలార్ ఆటో తయా రు చేశారన్నారు. ఈ ఆటోకు 4 గంటలు బ్యాటరీ చార్జింగ్ పెడితే గంటకు 40 కి.మీ. స్పీడ్‌తో 80 కి.మీ. ప్రయాణం చేయవచ్చ న్నారు. ఆటోను జపాన్‌లో తయారు చేస్తే రూ.లక్షా డెబ్బై వేల వరకు ఖర్చు అవుతుందని, భారత్‌లో అయితే రూ.లక్ష మాత్రమే అవుతుందన్నారు. తుది పరీక్షల అనంతరం ఆసక్తి ఉన్న కంపెనీలకు తయారీపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, సంగారెడ్డి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్హెచ్ఈ) 2019 – 20 ఏడాదికి ఫెలోషిప్‌ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈమేరకు ఐఐటీ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్ ప్రొఫెసర్ రేణుజాన్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీ చివరి గడువు అని పేర్కొన్నారు. వచ్చే జనవరి నుంచి సీఎఫ్హెచ్ఈలో ఫెలోషిప్ కోర్సు ప్రారంభమవు తుందన్నారు. ఫెలోషిప్‌కు ఎంపికై న వారికి తొలి ఏడాది శిక్షణలో నెల కు రూ.50 వేలు ఇస్తామన్నారు. -
వ్యవసాయ వ్యర్థాలతో బయో బ్రిక్స్
సాక్షి, సంగారెడ్డి: వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధకులు బయో ఇటుకలు తయారు చేశారు. ఇవి పర్యావరణహితంగా, తక్కువ ఖర్చులో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఐఐటీ హైదరాబాద్ డిజైన్ డిపార్ట్మెంట్ పీహెచ్డీ స్కాలర్ ఆర్.ప్రియాబ్రతా రౌత్రే, కేఐఐటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ భువనేశ్వర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్.అవిక్‌రాయ్ బృందం బయో ఇటుకల తయారీపై పరిశోధనలు చేసింది. ఐఐటీ డిజైన్ విభాగం హెడ్ ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ, అ్రస్టేలియా స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ బోరిస్ ఐసెన్‌బార్ట్ మార్గ నిర్దేశకంలో ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ సదస్సులో నెదర్లాండ్‌లోని టీయూ డేల్ప్ వద్ద (ఐసీఈడీ–1019) ప్రదర్శించారు. వ్యవసాయ వ్యర్థాల నుంచి బయో ఇటుకలను అభివృద్ధి చేసే ప్రయోగం గత కొంతకాలంగా జరుగుతోందని ఆర్.ప్రియాబ్రతా రౌత్రే చెప్పారు. మట్టితో తయారుచేసే ఇటుకలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుందని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బయో ఇటుకల తయారీకి 1990లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. భారత్‌లో ఏటా 500 మిలియన్ టన్నులకు పైగా వ్యవసాయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని ప్రియాబ్రతా తెలిపారు. ఈ వ్యర్థాల్లో కొంత పశుగ్రాసంగా వాడుతున్నారని, దాదాపు 84 నుంచి 141 మిలియన్ టన్ను లు బుడిద అవుతోందని, దీంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని వివరించారు. ప్రొఫెసర్ అవిక్‌రాయ్ మాట్లాడుతూ.. బయో ఇటుకలు మట్టి ఇటుకల కన్నా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని చెప్పారు. కాలిన మట్టి ఇటుకల్లా ఇవి బలంగా ఉండకపోయినా బరువు మోసే నిర్మాణాలకు ఉపయోగించలేమని తెలిపారు. చెక్క లేదా లోహ నిర్మాణాల్లో వాడితే తక్కువ ఖర్చుతో గృహాలు నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు. భవనాల్లో తేమను నిరోధిస్తాయని చెప్పారు. మరింత మెరుగైన వాటిని తయారు చేసేందుకు ఇంకా పరిశోధనలు చేస్తామని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ఇటీవల నిర్వహించిన గ్రామీణ ఇన్నొవేటర్స్ స్టార్ట్ ఆఫ్ కాన్క్లేవ్లో స్థిరమైన హౌజింగ్ కోసం ఈ బయో బ్రిక్ ప్రత్యేక గుర్తింపు ట్రోఫీని అందుకుందని చెప్పారు. ‘వరి వ్యర్థాలు, గోధుమ వ్యర్థాలు (గడ్డి తదితరాలు), చెరుకు పిప్పి, కాటన్ ప్లాంట్ వంటి పొడి వ్యర్థాలను ఉపయోగించి తయారు చేస్తాం. చెరుకు భాగస్సే (పిప్పి), సున్నం ఆధారిత ముద్ద తయారు చేయడం ఇటుక తయారీలో తొలి ప్రక్రియ. ఈ మిశ్రమాన్ని అచ్చులో పోసి, ఒకట్రెండు రోజులు ఆరబెట్టి, ఆ తర్వాత ఇటుకలను 15 నుంచి 20 రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత వీటిని వినియోగించడానికి నెల రోజులు పడుతుంది.’ – ప్రియాబ్రతా రౌత్రే -
ఐఐటీ మేటి!
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఐఐటీ–హైదరాబాద్ సత్తాచాటింది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులకు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించాయి. వివిధ కంపెనీల నుంచి మొత్తంగా 261 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్ ఆఫర్లను పొందగా, అం దులో 22 మంది అంత ర్జాతీయ కంపెనీల నుంచి భారీ ఆఫర్లను దక్కించు కున్నారు. పరిశోధన లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో పురోగతి సాధి స్తున్న ఐఐటీ హైదరాబాద్ ఈసారి ఆర్టిíఫీషియల్ ఇంటలీజెన్స్ కోర్సును బీటెక్‌లో ప్రవేశ పెట్టిన మొదటి ఐఐటీగా నిలి చింది. దీంతోపాటుగా ఎంటెక్‌లోనూ డేటా సైన్స్ మొదట ప్రవేశ పెట్టిన ఐఐటీగా ఘనతను సొంతం చేసుకుంది. 107 కంపెనీల ద్వారా ప్లేస్మెంట్లు ఐఐటీ హైదరాబాద్‌లో క్యాంపస్ ప్లేస్మెంట్లను నిర్వహిం చేందుకు 252 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. అందులో ఇప్పటివరకు 107 కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లను నిర్వహించాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మెర్కారీ, టయోటా రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ అండ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్, వర్క్స్ అప్లికేషన్ అండ్ ఎస్ఎంఎస్ డేటా టెక్ వంటి సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లను చేపట్టాయి. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌లో 16 విభాగాల్లో దాదాపు 2,855 మంది విద్యార్థులు ఉండగా, ఇంజనీరింగ్, సైన్స్, లిబరల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ వంటి విభాగాల్లో 10 బీటెక్ ప్రోగ్రాంలు, 16 ఎంటెక్ ప్రోగ్రాంలు, మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లు, ఎంఏ ప్రోగ్రాం, పీహెచ్డీ వంటి ప్రోగ్రాం లను నిర్వ హిస్తోంది. వాటిల్లో పరిశోధనలకు పెద్దపీట వేస్తూ క్యాంపస్ ప్లేస్ మెంట్లను పెంచేం దుకు, ఇక్కడి విద్యా ర్థులకు ఉన్నత విద్యావ కాశాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంది. అందులో ఎక్కువ శాతం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, తైవాన్‌లో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఐ–టిక్, సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఫ్యాబ్లెస్ చిప్ డిజైన్ ఇంక్యుబేటర్ అనే మూడు టెక్నాలజీ ఇంక్యుబేటర్లను కూడా మన ఐఐటీ ఏర్పాటు చేసింది. గతేడాది ఈ సంస్థ విద్యార్థికి గూగుల్ సంస్థ రూ.1.2 కోట్ల ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నేడు ఐఐటీ హైదరాబాద్ 8వ స్నాతకోత్సవం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాకు తలమానికంగా ఉన్న హైదరాబాద్ ఐఐటీ దేశంలోనే ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులను తయారుచేస్తోంది. సుమారుగా 11ఏళ్ల ప్రస్థానంలో 250 మంది విద్యార్థులను పీహెచ్‌డీలో గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దింది. ఈ ఐఐటీ ప్రాంగణం 8వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్నాతకోత్సవం జరగనుంది. ఇందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించి ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని 2008లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన ఈ ఐఐటీని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్.వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జిల్లాకు కేటాయించారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐఐటీలో ప్రారంభంలో కేవలం మూడు ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రారంభ సంవత్సరంలో బీటెక్ సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండేవి. వీటిలో 40 మంది విద్యార్థులకు ఒక కోర్సు చొప్పున 120 మంది విద్యార్థులకే ప్రవేశం ఉండేది. ఇంతితై.. వటుడింతై హైదరాబాద్ ఐఐటీ ప్రస్తుతం దేశంలోనే 8వ ర్యాంకులో ఉందంటే.. కేవలం దశాబ్ధ కాలంలోనే ఎంత ఎత్తుకు ఎదిగిందో ఊహించవచ్చు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. నాడు 120 మంది విద్యార్థులు.. మూడు ఇంజనీరింగ్ కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రస్తుతం 10 కోర్సులు (డిపార్ట్మెంట్స్)తో 2,900 మంది విద్యార్థులున్నారు. సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ కోర్సులతో పాటు గా ప్రస్తుతం సివిల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులలో విద్యాబోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి బీటెక్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఎం టెక్‌లో క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు లు) అనే కోర్సులను ప్రవేశపెడుతున్నారు. టీచింగ్‌తో పాటు రీసెర్చ్‌కు ప్రాధాన్యం హైదరాబాద్ ఐఐటీలో కేవలం విద్యాబోధనకే కాకుండా రీసెర్స్ (పరిశోధన), ఇన్నోవేషన్స్ (కొత్త విషయాలను కనుక్కోవడం)కు ప్రాధాన్యత నిస్తున్నారు. కేవలం 120 మంది విద్యార్థులు.. 3 కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరంలో 2,900 మంది విద్యార్థులు.. 900 మంది పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారంటే అనతికాలంలోనే ఎంత ఉన్నతస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. టీచింగ్‌తో పాటు రీసెర్చ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మరో మూడేళ్లలో 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు.. ప్రస్తుతం 2,900 మంది ఉన్న ఈ ఐఐటీలో రానున్న మూడేళ్ల కాలంలో మొత్తం 5 నుంచి 6 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. రెండో దశ భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా రూ.90 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణాలను జపనీస్ సంస్థ ‘జైకా‘ చేపట్టింది. ఎల్అండ్టీ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తవుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో కలిపి 5 నుంచి 6 వేల మంది విద్యార్థులకు ఈ ప్రాంగణం విద్యతో పాటుగా ఆశ్రమం (అకామిడేషన్) కల్పించనుంది. ఒకేసారి సుమారుగా 800 మంది కూర్చోవడానికి గాను ఆడిటోరియం నిర్మిస్తున్నారు. మధ్యాహ్నం కార్యక్రమం.. హైదరాబాద్ ఐఐటీ 8వ స్నాతకోత్సవం శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ముఖ్య అతిథిగా రానున్నారు. పాస్అవుట్ విద్యార్థులతో పాటుగా ప్రతీ విద్యార్థి వెంట ఇద్దరిని అనుమతిస్తున్నారు. సుమారుగా 2వేల మంది ఈ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా అతిథులుగా హైదరాబాద్ ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్.మోహన్‌రెడ్డి, అఫిసియేటింగ్ (ఇంచార్జి) డైరెక్టర్ సీహెచ్.సుబ్రమణ్యన్ హాజరుకానున్నారు. మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ ఐఐటీ నుంచి 560 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ శిక్షణ పూర్తిచేసుకొని పాస్అవుట్ అవుతున్నారు. వీరిలో 68 మంది పీహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు వేదిక దేశంలోని ఏ ఐఐటీకి కూడా తీసిపోని విధంగా హైదరాబాద్ ఐఐటీని కొత్త ఆవిష్కరణలకు వేదిక చేశాం. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా ఈ ఐఐటీలో ప్రవేశం పొందుతున్నారు. టీచింగ్‌తో పాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలోని 23 ఐఐటీలలో ప్రస్తుతం 8వ ర్యాంకులో ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఐఐటీని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. మరో ప్రత్యేకత ఏమిటంటే..ఈ ఇన్స్టిట్యూట్లో విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు గల విద్యార్థులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యాకల్టీకి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. – సీహెచ్. సుబ్రహ్మణ్యన్, ఇన్చార్జి డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ -
రోడ్ల ఉపరితల నిర్మాణంలో నవశకం
సాక్షి, హైదరాబాద్: రోడ్ల ఉపరితల నిర్మాణ డిజైన్లలో అనుసరించాల్సిన నూతన పద్ధతులతోపాటు ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాన్ని ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం రూపొందించింది. సాంప్రదాయక రోడ్డు నిర్మాణ పద్ధతులతో వీటిని సరిపోల్చిన పరిశోధకులు నూతన విధానం ఆచరణ సాధ్యమని వెల్లడించారు. వీరి పరిశోధన ఫలితాలను ‘జర్నల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్’అనే అంతర్జాతీయ జర్నల్ ప్రచురించింది. 2022 నాటికి దేశంలో 65 వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులను నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ (హెచ్) పరిశోధక బృందం రూపొందించిన నూతన నమూనా రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్ నెట్వర్క్ గల రెండో దేశంగా భారత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గణాంకాల పరంగా ప్రస్తుతం భారత్‌లో ప్రతీ వేయి మంది పౌరులకు సగటున 4.37 కిలోమీటర్ల పొడవైన రహదారులున్నాయి. వీటిలో జాతీయ, గ్రామీణ, అంతర్గత రహదారుల పేరిట అనేక రకాలైన రోడ్డు మార్గాలు ఉన్నాయి. 2 దశాబ్దాలుగా భారత్‌లో రహదారుల నిర్మాణం ఊపందుకోగా 2016 నుంచి 62.5 శాతం రహదారులకు సాంకేతిక పద్ధతిలో ఉపరితలం నిర్మించారు. ఉపరితల డిజైన్ కీలకం.. రోడ్ల నిర్మాణంలో ఉపరితల డిజైన్ అత్యంత సంక్లిష్లమైన ప్రక్రియ కాగా.. ట్రాఫిక్ రద్దీ, స్థానికంగా సహజంగా లభించే నిర్మాణ సామగ్రిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ రూపొందించాల్సి ఉంటుంది. సుఖమయమైన ప్రయాణానికి వీలుగా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఉపరితల నిర్మాణ డిజైన్‌ను ఇంజనీర్లు రూపొందిస్తారు. జారుడు స్వభావం లేకుండా, రాత్రివేళల్లో వాహనాల లైట్ల వెలుతురు పరావర్తనం చెందకుండా, శబ్ద కాలుష్యం తక్కువగా ఉండేలా రోడ్ల ఉపరితల నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ కాలం మన్నేలా నాణ్యత కలిగిన రోడ్డు ఉపరితల నిర్మాణంతోపాటు, ఉపరితల నాణ్యతను కచ్చితంగా అంచనా వేసే విధానాలను రూపొందించడంపై ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు ముందడుగు వేశారు. పొరలతో కూడిన ఉపరితలం.. అనుసరణీయం నేలపై వివిధ రకాల నిర్మాణ సామగ్రితో నిర్మించే పొరలపై రహదారి ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శిరీష్ సారిడే నేతృత్వంలోని పరిశోధక బృందం గుర్తించింది. సంక్లిష్టమైన పొరలతో నిర్మించే రోడ్డు ఉపరితలం నాణ్యతను నేల స్వభావం, నిర్మాణ సామగ్రి, స్థానిక పర్యావరణ, వాతావరణ పరిస్థితులు, వాహన రద్దీ తదితర అంశాలు ప్రభావితం చేస్తాయని తేల్చారు. వీటన్నింటినీ అధిగమించి రోడ్డు ఉపరితలం వాహన భారాన్ని తట్టుకునేలా డిజైన్ చేయాల్సి ఉంటుంది. నాలుగు రకాల పొరలతో కూడిన రహదారి నిర్మాణంపై ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేల్చారు. సాధారణంగా రోడ్లను సబ్గ్రేడ్, గ్రాన్యులార్ సబ్ బేస్, బేస్, బిటుమినస్ అనే 4 రకాలైన పొరలతో నిర్మిస్తారు. వీటిలో బిటుమినస్ లేయర్ మందం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే బేస్ లేయర్‌పైనే ఉపరితల నాణ్యత ఆధారపడి ఉంటుందని పరిశోధక బృందం గుర్తించింది. మరమ్మతులు కూడా సులభం అత్యంత దృఢమైన కాంక్రీట్‌తో నిర్మించే రహదారులు వాహన భారాన్ని నేరుగా మోయగలిగినా.. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. పొరలతో కూడిన రహదారుల నిర్మాణంలో స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిని వినియోగించే వీలుండటంతోపాటు, దశలవారీగా పనులు చేసే వీలుంటుంది. మరమ్మతులు చేయడం కూడా సులభమని పరిశోధకులు తేల్చారు. తాము రూపొందించిన నూతన రోడ్డు డిజైన్‌ను ‘రిలయబిలిటీ బేస్డ్ డిజైన్ ఆప్టిమైజేషన్ (ఆర్‌బీడీవో)’గా వ్యవహరిస్తున్న పరిశోధక బృందం.. తమ పరిశోధన ఫలితాలను రహదారుల ఉపరితల డిజైన్లకు మార్గదర్శిగా భావించే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అఫీషియల్స్ (ఆష్తో) ప్రమాణాలతో పోల్చి చూశారు. ఆష్తో ప్రమాణాలతో పోలిస్తే తాము రూపొందించిన నూతన విధానం 10 నుంచి 40 శాతం మేర మెరుగ్గా ఉందని పరిశోధక బృందం సభ్యులు డాక్టర్ మునావర్ బాషా, పీఆర్టీ ప్రణవ్ వెల్లడించారు. -
ఇంజనీరింగ్‌లో న్యూ జనరేషన్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో సరికొత్తగా ఇంజనీరింగ్ కోర్సులు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రస్థాయి విద్యాసంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. ప్రధానం గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో విద్యాసంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఏఐతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఐఐటీ హైదరాబాద్ బాటలో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఐఐటీ హైదరాబాద్ దేశంలోనే మొదటిసారిగా 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు సైతం అదే బాట పట్టనున్నాయి. ఏఐతోపాటు మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా సబ్జెక్టులతో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ చర్యలు చేపట్టింది. ఈ కోర్సును 2019–20 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలకు అనుగుణంగా సెమిస్టర్లవారీగా సిలబస్‌ను రూపొందించింది. వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఆమోదిస్తే కోర్సును అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రస్థాయి కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ కానుంది. ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు 2.5 శాతమే.. ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నది కేవలం 20 శాతంలోపేనని నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, వైర్లెస్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలుగల వారికి మల్టీ నేషనల్ కంపెనీల్లో భారీ డిమాండ్ ఉండగా కేవలం 2.5 శాతం మాత్రమే ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు దేశంలోనూ ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కాస్త మెరుగై 37 శాతానికి చేరుకున్నా తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే 63 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే 2019–20 విద్యాసంవత్సరం నుంచి 600–700 గంటలు ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యాసంస్థలు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఏఐ, బిగ్ డేటాకు భారీ డిమాండ్... ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు... రానున్న రోజుల్లో అంచనాలకు మించి విస్తరించనుందని జర్మనీకి చెందిన స్టాటిస్టా అనే గణాంక సేకరణ ఆన్లైన్ సంస్థ అంచనా వేసింది. 2016లో 3.2 బలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ మార్కెట్ రెవెన్యూ... 2025 నాటికి 89.85 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, శామ్సంగ్ వంటి ప్రముఖ సంస్థలు ఏఐ, ఏఐ సంబంధిత రంగాల్లో పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ మార్కెట్లో 2011లో 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్న బిగ్ డేటా మార్కెట్ ప్రస్తుతం 49 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు స్టాటిస్టా అంచనా వేసింది. అది 2027 నాటికి వంద శాతం వృద్ధితో 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. -
ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను
సంగారెడ్డి రూరల్: ‘మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను.. ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని లెటర్ రాసి మిత్రుడికి మెయిల్ చేసిన ఐఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుందని రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజన్ కుటుంబం హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో నివాసం ఉంటోంది. రాజన్ కుమారుడు అనిరుధ్య (21) కంది ఐఐటీ హైదరాబాద్‌లోని డీ బ్లాక్‌లో గల హాస్టల్లో ఉంటూ బీటెక్ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ కోర్సు ఫైనలియర్ చదువుతున్నాడు. కాగా, అనిరుధ్య.. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని లెటర్ రాసి గురువారం రాత్రి 12 గంటల సమయంలో మిత్రుడు కనిష్క్‌రెడ్డికి మెయిల్ చేశాడు. అనంతరం హాస్టల్ ఏడో అంతస్తు పైకి చేరుకుని భవ నంపై నుంచి కిందికి దూకేశాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావ డంతో అనిరుధ్యకు ఐఐటీలోని ఆస్పత్రిలో ప్రథమచికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉండగా... మృతుడి తండ్రి రాజన్ మాట్లాడుతూ ఈ మధ్యే తన కుమారుడు సెలవుపై ఇంటికి వచ్చి వెళ్లాడని, ఇంతలోనే ఏం జరిగిందో అంతుబట్టడంలేదన్నారు. ప్రమాదానికి ముందు అనిరుధ్య టెర్రస్‌పైకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు ఎస్ఐ తెలిపారు. ఐఐటీ క్యాంపస్ సెక్యూరిటీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
భవనం పైనుంచి పడి ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి మృతి
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని కంది పట్టణంలో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. కందిలోని ఐఐటీ-హైదరాబాద్ భవనం పైనుంచి పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడు అనిరుధ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నామని, ఘటనపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఐఐటీహెచ్‌లో అనిరుధ్య మెకానికల్ అండ్ ఏరోస్పేస్ కోర్సు చేస్తున్నాడు. -
క్రేజీ కోర్సు ప్రారంభించిన ఐఐటీ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీలు సాంకేతిక విద్యలో దూసుకువస్తున్న నేపథ్యంలో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో 2019-2020 విద్యా సంవత్సరం నుంచి కృత్రిమ మేథ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ)లో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఐఐటీ హైదరాబాద్ ప్రారంభించనుంది. ఏఐలో పూర్తిస్ధాయి బీటెక్ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తున్న తొలి భారత విద్యా సంస్థ ఐఐటీ- హైదరాబాద్ కావడం గమనార్హం. ఇక అమెరికాకు చెందిన కర్నెగీ మెలన్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) తర్వాత ఈ తరహా కోర్సును అందిస్తున్న మూడవ విద్యా సంస్థగా కూడా ఐఐటీ హైదరాబాద్ నిలవనుంది. ఇక బీటెక్ ఏఐలో 20 మంది విద్యార్ధులను తీసుకుంటారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో మూల సిద్ధాంతం, ప్రాథమిక అంశాలు, ప్రాక్టికల్స్‌పై అత్యున్నత శిక్షణ అందిస్తారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా విద్యార్ధులను దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల్లో రాటుదేలేలా తీర్చిదిద్దుతారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏఐ శిక్షణ, పరిశోధనకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయడమే ముఖ్యోద్దేశంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నామని, ఏఐలో బీటెక్, ఎంటెక్ సహా పలు ప్రోగ్రామ్‌లను అందుబాటులో ఉంటాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ యూబీ దేశాయ్ వెల్లడించారు. విద్యాపరమైన అంశాలతో పాటు పరిశోధన, అభివృద్ధికీ మెరుగైన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆపన్నహస్తం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్న కేరళవాసులకు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఓవైపు సాంకేతికంగా సహకారం అందిస్తూ, మరోవైపు బాధి తులకు అవసరమైన దుస్తులు, ఇతర వస్తు సామగ్రిని సమకూర్చే పనిలో నిద్రాహారాలు లేకుండా పని చేస్తున్నారు. సుమారు 30 మంది విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ విభాగంతోపాటు, కేరళకు చెందిన విద్యార్థులు పాలుపంచుకుం టున్నారు. చెన్నై, ముంబై, బెంగళూరుల్లోని తమ మిత్ర బృందాలను భాగస్వాములను చేస్తున్నారు. 30 వేల మంది ఫోన్ నంబర్లు వరద బాధితుల సమాచారాన్ని తెలుసుకునేందుకు కేరళ ఐటీ విభాగం ‘కేరళ రెస్క్యూ డాట్‌కామ్’పేరిట ఓ వెబ్సైట్ ఏర్పాటు చేసింది. వేలాది మంది వరద బాధితులు తమను ఆదుకోవాలంటూ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ వెబ్సైట్ నుంచి ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన కొందరు కేరళ విద్యార్థులు సుమారు 30 వేల మంది వరద బాధితుల ఫోన్ నంబర్లు సేకరించారు. ఈ నంబర్లను గ్రూపులుగా విభజించి ఐఐటీ హైదరాబాద్‌తోపాటు, ముంబై, బెంగళూరు, చెన్నైలోని తమ మిత్ర బృందాలకు పంపించారు. క్లాస్ రూమ్‌ను కాల్ సెంటర్‌గా మార్చుకున్నారు. ఒక్కో సభ్యుడు కనీసం 50 నుంచి వంద మంది బాధితులతో మాట్లాడి వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే బాధ్యతను తీసుకున్నారు. బాధితులతో నేరుగా సంభాషణ బాధితులతో ఫోన్లో సంభాషిస్తున్న విద్యార్థులు.. వారి వివరాలను సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు, రెస్క్యూ బృందాలతో సమన్వయం చేస్తున్నారు. గత గురువారం ఒక్కరోజే తాము ఏడు వేల మంది బాధితులతో సంభాషించినట్లు ఐఐటీహెచ్ విద్యార్థిని అనఘ ‘సాక్షి’కి వెల్లడించారు. సెల్ ఫోన్ నెట్వర్క్ కొన్నిచోట్ల దెబ్బతినడంతో బాధితులను అందరినీ చేరుకోలేకపోయినట్లు విద్యార్థి బృందం తెలిపింది. గత గురువారం నుంచి ఆదివారం వరకు మొత్తంగా సుమారు 30 వేల మందిని సంప్రదించగలిగామని చెప్పారు. విరాళాలు, సామగ్రి సేకరణ ఓ వైపు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరేలా చూస్తూనే, మరోవైపు బాధితులకు ధన, వస్తు రూపంలో సాయం అందించడంపైనా విద్యార్థులు దృష్టి సారించారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని 12 హాస్టళ్లతోపాటు సిబ్బంది నుంచి ఇప్పటి వరకు 2.50 లక్షలకు పైగా రూపాయాలను విరాళాలు సేకరించి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. అంతేకాకుండా విద్యార్థులు, సిబ్బంది నుంచి రూ.4 లక్షలకు పైగా విలువ చేసే దుస్తులు, ఔషధాలు, సెల్‌ఫోన్ చార్జర్లు, టార్చ్లైట్లు, బ్లాంకెట్లు, చెప్పులు తదితర సామగ్రిని సేకరించారు. ఈ వస్తువుల నాణ్యతను సరిచూసిన తర్వాతే ప్యాక్ చేస్తుండటం విశేషం. కొచ్చిలో పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ వస్తువులను వరద బాధితులకు అందేలా ఏర్పాటు చేసినట్లు కణ్ణన్ అనే విద్యార్థి తెలిపారు. నిరంతరాయంగా సంప్రదించాం.. కేరళ వరదలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టింగులతో అప్రమత్తమయ్యాం. వెంటనే బృందాలుగా ఏర్పడ్డాం. కేరళ ప్రభుత్వ వెబ్‌సైట్‌కు కుప్పలు తెప్పలుగా వస్తున్న అభ్యర్థనలను స్వీకరించి, ఫోన్ల ద్వారా బాధితులను నిరంతరాయంగా సంప్రదిస్తూ వచ్చాం. గత నాలుగు రోజుల్లో కనీసం 30 వేల మంది బాధితులను మా బృందం ఫోన్ ద్వారా సంప్రదించి, వారి వివరాలను కంట్రోల్ రూమ్, రెస్క్యూ బృందాలకు అందిస్తూ వచ్చింది. ఎవరెవరు, ఎక్కడెక్కడ చిక్కుకున్నారో చెబుతూ, బాధితులు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేంత వరకు ఫాలో అప్ చేస్తూ వచ్చాం. – అనురాగ్ అశోకన్, ఐఐటీహెచ్ ఉద్యోగి మా శ్రమకు ఫలితం దక్కింది పతనందిట్ట, తిరువల్లూరు తదితర ప్రాంతాల్లో వరద బీభత్సం ఎక్కువగా ఉంది. పథనంథిట్ట జిల్లాలోని మా సొంతూరు కోజెన్చెర్రిలో ఇళ్లు, వ్యాపార సముదాయాలు నీట మునిగాయి. మా మందుల దుకాణం కూడా మునిగిపోయింది. అక్కడి ఆస్పత్రిలోని రోగులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలంటూ అభ్యర్థనలు అందాయి. మా బృందం సాయంతో వారిని రక్షించాం. వేలాది మందిని ఫోన్లో సంప్రదించి వరదల నుంచి బయట పడేలా చూశాం. ప్రాంతాలకు అతీతంగా ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు మాకు సహకరిస్తున్నారు. మా శ్రమకు ఫలితం దక్కింది. – దివిజ, రీసెర్చ్ అసోసియేట్, ఐఐటీహెచ్ -
ఐఐటీహెచ్ ప్రొఫెసర్లకు న్యాసి అవార్డు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఐఐటీ హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు ప్రతిష్టాత్మక జాతీయ సైన్స్ అకాడమీ (న్యాసి) యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు–2018కి ఎంపికయ్యారు. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మీ బధూలికకు, బయోమెడికల్, మాలిక్యులర్ బయాలజీ, బయో టెక్నాలజీ కేటగిరీలో బయో మెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరవింద్ కుమార్‌లకు ఈ అవార్డు దక్కింది. ఫెక్సిబుల్ నానో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో కెమికల్స్‌పై పరిశోధన చేస్తున్న సుష్మీ బధూలిక ఆరోగ్య రంగంలో తక్కువ ఖర్చుతో కూడిన బహుళ ప్రయోజనాలు కలిగిన నానో సెన్సార్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. శక్తి నిలువకు సంబంధించి పర్యావరణ హిత ఎలక్ట్రానిక్స్, పేపర్ ఎలక్ట్రానిక్స్, సూపర్ కెపాసిటర్ల రూపకల్పనలో పరిశోధనలు చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ప్లాస్మోనిక్ నానో స్పేస్ లేబొరేటరీ (పీన్యాస్ ల్యాబ్) అధిపతిగా పనిచేస్తున్న అరవింద్ కుమార్, కేన్సర్ నానో టెక్నాలజీ రంగంపై పరిశోధనలు చేస్తున్నారు. కేన్సర్ చికిత్సలో కీలకమైన నానో మెడిసిన్స్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన పనిచేస్తున్నారు. గతంలో వీరిద్దరు పలు అవార్డులు అందుకున్నారు. అవార్డు దక్కడం హర్షణీయం.. ఐఐటీ హైదరాబాద్‌లో చేరినప్పటి నుంచి నానో ఎలక్ట్రానిక్స్ రంగంలో పనిచేస్తున్నా. ఇక్కడ శ్రమించే తత్వం ఉన్న విద్యార్థులకు అనువైన వాతావరణం ఉంది. నేను చేస్తున్న పరిశోధనలకు దేశవ్యాప్తంగా ప్రముఖ పరిశోధన సంస్థల నుంచి గుర్తింపు లభించడం సంతోషంగా ఉంది. పరిశోధన రంగంలో మహిళలకు అంతగా గుర్తింపు లేని వాతావరణంలో అవార్డు దక్క డం హర్షణీయం.’ – డాక్టర్ సుష్మీ బధూలిక ఆనందంగా ఉంది ప్రఖ్యాత జాతీయ సైన్స్ అకాడమీ నుంచి అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ఐఐటీ హైదరాబాద్ పరిశోధన శాలలో నాతో పాటు శ్రమిస్తున్న విద్యార్థులకు ఈ ఘనత దక్కుతుంది. – డాక్టర్ అరవింద్ కుమార్ -
స్నాతకోత్సాహం
-
విద్యాసంస్థలు సాంకేతికతకు ఊతమివ్వాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు కేవలం బోధించే వ్యాపార సంస్థలుగా, డిగ్రీలు అం దించే పరిశ్రమలుగా మిగిలిపోకూడదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్బోధించారు. నూతన ఆవిష్కరణలతోపాటు నిత్య జీవితం లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతికతకు ఊతమిచ్చేలా విద్యాసంస్థలు పనిచేయాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరా బాద్ ప్రాంగణంలో ఆదివారం జరిగిన 7వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నీటిపారుదల, మార్కెటింగ్ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రపతి కోవింద్ ప్రసంగిస్తూ అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో హైదరాబాద్‌లోనూ శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలకు వాణిజ్య ఆవిష్కరణ రంగాల్లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌కు అనువైన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న హైదరాబాద్ పరిసరాల్లో ఐఐటీని ఏర్పాటు చేయడాన్ని కోవింద్ స్వాగతించారు. వైద్య రంగంలో నోబెల్ అందుకున్న సర్ రోనాల్డ్ రాస్ 19వ శతాబ్దంలోనే మలేరియా వ్యాధికారక దోమపై హైదరాబాద్‌లోనే పరిశోధనలు జరిపిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్రానంతరం పబ్లిక్, ప్రైవేటు రం గాల్లో పారిశ్రామిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్ తర్వాతి కాలంలో పరిశోధన కేంద్రంగా కూడా అభివృద్ధి చెందిందన్నారు. బయోటెక్నాలజీ, అణు ఇంధనం, రక్షణ, ఖగోళ పరిశోధన వంటి 19 రంగాలకు సంబంధించి హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతికత, పరిశోధనశాలలు ఉన్నాయన్నారు. ఈ రం గాలన్నింటినీ అనుసంధానించేలా ఐఐటీ హైదరాబాద్ కృషి చేయాలన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా... ఆరు దశాబ్దాల క్రితం దేశం సృష్టించిన భారీ పారిశ్రామిక పునాదులకే ఆశయాలను పరిమితం చేసుకోవద్దని, 21వ శతాబ్దపు దిశను మార్చే నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఐఐటీ హైదరాబాద్ సన్నద్ధం కావాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. పరిశోధనలతోపాటు వాణిజ్యపరమైన ఆలోచనలకు ప్రోత్సాహమిచ్చే వాతావరణం ఐఐటీ హైదరాబాద్‌లో ఉండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యావంతులైన యువత కోసం దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఏకకాలంలో ఏడో స్నాతకోత్సవంతోపాటు పదో వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఐఐటీ హైదరాబాద్‌లో 2,500 మంది విద్యార్థులు ఉండటం, ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు మహిళ కావడం అభినందనీయమన్నారు. అత్యుత్తమమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలతోపాటు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థుల్లో 30 శాతం మంది పీహెచ్డీ అభ్యసించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఆకర్షణగా ‘జకార్డ్’.. రాష్ట్రపతితో పాటు అతిథులు, బోధనా సిబ్బంది, విద్యార్థులంతా భూదాన్ పోచంపల్లి చేనేత కార్మికులు ఇక్కత్ డిజైన్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ‘జకార్డ్ చేనేత’వస్త్రాలను ధరించారు. అంతకుముందు రాష్ట్రపతి దంపతులకు మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఐఐటీ డైరెక్టర్ దేశాయ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఐఐటీ హైదరాబాద్ పాలక మండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ యూబీ దేశాయ్ ప్రసంగించారు. 566 మందికి పట్టాలు... స్నాతకోత్సవం సందర్భంగా బీటెక్, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులు పూర్తి చేసిన 566 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. వారి లో 131 మంది మహిళలున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు ఇబ్రహీం దలాల్ (బీటెక్), పర్మీష్ కౌర్(ఎమ్మెస్సీ), గ్రీష్మ పీఎం (ఎంటెక్), కె.స్నేహారెడ్డి (బీటెక్)లకు రాష్ట్రపతి గోల్డ్‌మెడళ్లు అందజేశారు. రావి మొక్క నాటిన ప్రథమ పౌరుడు సాక్షి, హైదరాబాద్: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రావి మొక్క నాటారు. ఆయన సతీమణి సవిత కోవింద్ రుద్రక్షాంబ మొక్కను, గవర్నర్ నరసింహన్ పారిజా తం మొక్కను నాటారు. అనంతరం హరితహారం పై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను రాష్ట్రపతి దంపతులు తిలకించారు. రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు గవర్నర్ నరసింహన్ దంపతులు బేగంపేట విమానాశ్రయంలో ఆదివారం ఘనంగా వీడ్కో లు పలికారు. ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం, మండలిచైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జపాన్ చదువు.. భలే సులువు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉన్నత, సాంకేతిక చదువుల కోసం ఇంగ్లండ్, జర్మనీ వంటి యూరోప్ దేశాలతో అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలపై ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థులు తమ దేశంవైపు కూడా దృష్టి పెట్టాలని జపాన్ యూనివర్సిటీలు కోరుతున్నాయి. జపాన్ ఆర్థిక సహకార సంస్థ జైకా భాగస్వామ్యంతో మంగళవారం ఐఐటీ హైదరాబాద్ ‘అకడమిక్ ఫెయిర్ 2017’ను ఐఐటీ హైదరాబాద్ కంది ప్రాంగణంలో నిర్వహించింది. జపాన్‌కు చెందిన హక్కాయిడో, నాగసాకి, నీగాట, ఒకయామా, సుమికాన్, షిజుకోవా, వాసెద, టోక్యో యూనివర్సిటీలు స్టాళ్లు ఏర్పాటు చేసి.. తమ యూనివర్సిటీల్లో అధ్యయన, పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పించాయి. జపాన్‌కు చెందిన ఇతర యూనివర్సిటీలు కూడా తాము బోధిస్తున్న కోర్సుల వివరాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన 74 మంది విద్యార్థులు జైకా ఆర్థిక సాయం (స్కాలర్షిప్)తో అక్కడి యూనివర్సిటీల్లో మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులు అభ్యసిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. జపాన్‌లో పార్ట్‌టైం జాబ్‌లు చేసే అవకాశం ఇవ్వకుండా.. వసతి, ఆహారం, బోధనకయ్యే ఖర్చు తదితరాలన్నింటినీ భరిస్తామని జైకా హామీ ఇస్తోంది. చదువులో ప్రతిభ చూపిన వారికి స్థానికంగా ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అన్ని వసతులు అందుబాటులో.. భారత్, జపాన్ మైత్రీ బంధం గత పదేళ్లలో పటిష్టమవుతూ వస్తోంది. ఇరుదేశాల సంబంధాలు మెరుగవడంలో ఐఐటీ హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే 74 మంది ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు జపాన్ యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బోధనతో పాటు వసతి సౌకర్యాలు, రవాణ, భద్రత విషయాల్లో జపాన్ ఎంతో మెరుగ్గా ఉంది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు అనేక మంది జపాన్ బహుళ జాతి కంపెనీల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. భవిష్యత్తులో జపాన్‌లో చదివే విద్యార్థులు సంఖ్య మరింత పెరుగుతుంది. – ప్రొఫెసర్ యూబీ దేశాయి, డైరెక్టర్, ఐఐటీ హైదరాబాద్ -
ఐఐటీల స్పెషల్ డ్రైవ్స్
న్యూఢిల్లీ : ఉద్యోగ ఆఫర్ పొందని విద్యార్థుల సంఖ్యను తగ్గించుకోవడానికి, ఉద్యోగవకాశాలను పెంపొందించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ టెక్నాలజీ(ఐఐటీలు) కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. ప్రీ ప్లేస్‌మెంట్‌గా వచ్చే ఇంటర్న్‌షిప్ ఆఫర్లను ఇంజనీరింగ్ విద్యార్థులు స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఫైనల్ ప్లేస్మెంట్ల ఒత్తిడిని ఐఐటీలు తగ్గించుకోవాలనుకుంటున్నాయని దీనికి సంబంధించిన ఓ అధికారి చెప్పారు. ఖరగ్‌పూర్, చెన్నై, కాన్పూర్, గౌహతి, రూర్కే, వారణాసి, హైదరాబాద్ ఐఐటీలు ఈ విధంగా ఓవర్‌డ్రైవ్ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఎంప్లాయర్స్ నుంచి వచ్చే ఇంటర్న్‌షిప్‌లకు ఓకే చెప్పేలా విద్యార్థులను ఐఐటీలు సన్నద్ధం చేస్తున్నాయి. ఇంటర్న్‌షిప్, విద్యార్థులో విశ్వాసాన్ని మరింతగా నింపుతుందని ఐఐటీ రూర్కే ప్రొఫెసర్, ప్లేస్‌మెంట్స్ ఇన్ఛార్జ్ ఎన్పీ పాధే తెలిపారు. ఇంటర్న్‌షిప్ పొందిన 90 శాతం మంది ఐఐటీ విద్యార్థులు కంపెనీల్లోనే ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్నారని ఐఐటీ హైదరాబాద్ ప్లేస్మెంట్ ఇన్ఛార్జ్, ట్రైనింగ్ సెల్ ఫ్యాకల్టీ మెంబర్ బీ వెంకటేశం చెప్పారు. చాలా ఐఐటీలు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లపై ఎక్కువగా దృష్టిసారిస్తున్నట్టు వెల్లడించారు. తమ విద్యార్థులకు ఆఫర్ చేసే ఇంటర్న్‌షిప్‌లపై ఇన్స్టిట్యూట్లు సీరియస్‌గా తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జాబ్ ఆఫర్లపై సరైన నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ ఇంటర్న్‌షిప్ ఎక్కువగా దోహదం చేయనుందని, ఇటు కంపెనీలకు, అటు స్టూడెంట్లకు ఇది ఓ పునాది మార్గంగా ఉపయోగపడనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతేడాది 5-15 శాతం విద్యార్థులు జాబ్ ఆఫర్లను పొందలేకపోతున్నారని, ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ అనేది ఐఐటీలకు సహజమైన అడుగని ఐఐటీ ఖరగ్ పూర్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ దేవాసిస్ దేవ్ చెప్పారు. దీంతో పైనల్ ప్లేస్ మెంట్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. 300 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లను ఈ ఏడాది ఐఐటీ ఖరగ్‌పూర్ పొందిందని, గతేడాదితో పోలిస్తే ఇది డబుల్ అయిందని పేర్కొన్నారు. కొన్ని వారాల్లోనే ఐఐటీల్లో ప్రీప్లేస్‌మెంట్ ఆఫర్లు ప్రారంభంకాబోతున్నాయి. -
హిప్.. హిప్ హుర్రే
సంగారెడ్డి డివిజన్: సంగారెడ్డి మండలం కందిలోని ‘ఐఐటీ హైదరాబాద్’ కొత్త క్యాంప్ ఆడిటోరియంలో. సందడి నెలకొంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువ ఐఐటీయన్లు పట్టాలు చేతపట్టుకుని గాల్లోకి టోపీలు విసిరి ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో తృతీయ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐఐటీ డెరైక్టర్ యు.బి.దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హిందూజా గ్రూపు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్.శేషసాయి, ఐఐటీహెచ్ పాలకవర్గం అధ్యక్షులు బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి హాజరయ్యారు. బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసుకున్న 266 మంది విద్యార్థులు, స్కాలర్స్‌కు ఐఐటీ డెరైక్టర్ దేశాయ్ పట్టాలు అందజేశారు. శేషసాయి బీటెక్, ఎంటెక్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఐదుగురు విద్యార్థులు బంగారు, పదిహేను మంది విద్యార్థులకు రజత పతకాలను అందజేశారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు సహ చరులు, తల్లిదండ్రులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. పట్టాలు అందుకున్న విద్యార్థులు టోపీలు ఎగురవేసి హిప్..హిప్ హుర్రే అంటూ హుషారుగా సంబరాలు చేసుకున్నారు. ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తమ బిడ్డలను తల్లిదండ్రులు అభినందించి హత్తుకున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ పూర్తి చేసుకున్న మూడవ బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. అలాగే మొదటి సారిగా ఎంఫిల్ పూర్తి చేసుకున్న స్కాలర్స్ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. తృతీయ స్నాతకోత్సవ వేడుకల్లో మొత్తం 266 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. వీరిలో 116 మంది బీటెక్, 106 మంది ఎంటెక్, 34 మంది ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు లిబరల్ ఆర్ట్స్‌లో ఎంఫిల్ పూర్తి చేసిన స్కాలర్స్ ఐదుగురు, పీహెచ్డీ పూర్తి చేసిన ఐదుగురు స్కాలర్స్ పట్టాలు అందుకున్నారు. వీరందరినీ ఐఐటీహెచ్ పాలకవర్గ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, హిందూజా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ శేషసాయి అభినందించారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన సత్యనారాయణ సింగ్, నారాయణఖేడ్‌కు చెందిన సుమన్ జాదవ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన వసుంధరలు పట్టాలు అందుకున్న వారిలో ఉన్నారు. బంగారు, రజతపతకాల విజేతలు వీరే... ఐఐటీ ప్రామాణిక శ్రేణుల్లో ఉత్తమ ఫలితాలను కనబర్చిన ఎస్.సుదర్శన్ ప్రెసిడెంట్ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకోగా అర్చిత్, ప్రియాంకవర్మ, అశ్విన్ అస్సామ్, అమేయ్ ధనుంజయ్‌లు బంగారు పతకాలు పొందారు. బీటెక్‌లో ఉత్తమ ప్రతిభను కనబర్చినందుకు ఎస్.సుదర్శన్, ప్రియాంకవర్మలు రజతపతకాలను సైతం కైవసం చేసుకున్నారు. 15 మంది విద్యార్థులు రజతపతకాలు పొందారు. ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ పొందిన బెంగుళూరుకు చెందిన ఎస్.సుదర్శన్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ మెడల్ పొందటం ఎంతోఆనందంగా ఉందన్నారు. పట్టుదలగా చదివి తాను ఉత్తమ గ్రేడ్ సాధించినట్లు చెప్పారు. అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విధ్యాభ్యాసం చేయటం తన లక్ష్యంగా తెలిపారు. పరిశోధకునిగా తాను ఎదగాలనుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ బోధనాసిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.