క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ జోరు కొనసాగుతోంది. డిసెంబరు 1 నుంచి ప్రారంభమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ కంపెనీల నుంచి నియామక పత్రాలు అందుకున్నారు.
ఐఐటీ, హైదరాబాద్‌లో డిసెంబరు 1 నుంచి ఫేస్ 1 క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ప్రారంభమయ్యాయి. బిటెక్, ఎంటెక్‌లలో వివిధ విభాగాల నుంచి మొత్తం 668 మంది విద్యార్థులు ఈ రిక్రూట్‌మెంట్‌కి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు 225 మందికి నియామక పతత్రాలు అందాయి. ఇప్పటి వరు జరిగిన నియామకాల్లో ఓ విద్యార్థికి అత్యధికంగా రూ.65.45 లక్షల వార్షిక వేతనం ఖరారు అయ్యింది. త్వరలోనే రెండో ఫేస్ నియమకాలు కూడా చేపట్టబోతున్నారు.
కోవిడ్ ఎఫెక్ట్ మధ్య గతేడాది ఫేజ్ 1, ఫేజ్ 2లకు కలిపి మొత్తం 195 కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో పాల్గొనగా ఈ సారి ఒక్క ఫేజ్ 1లోనే 210 కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఐఐటీ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వల్ల చాలా కంపెనీలు క్యాంపస్ నియామకాలకు ఇక్కడికి వస్తున్నాయి. ఫేజ్ 1లో పాల్గొన్న సంస్థల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గోల్డ్‌మాన్ శాక్స్, జేపీ మోర్గాన్, అమెజాన్, యాక్సెంచర్, ఇండీడ్, ఆప్టమ్, ఫ్లిప్‌కార్ట్, జాగ్వర్‌లతో పాటు అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment