సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఐఐటీ–హైదరాబాద్ సత్తాచాటింది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులకు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు లభించాయి. వివిధ కంపెనీల నుంచి మొత్తంగా 261 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్ ఆఫర్లను పొందగా, అం దులో 22 మంది అంత ర్జాతీయ కంపెనీల నుంచి భారీ ఆఫర్లను దక్కించు కున్నారు. పరిశోధన లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో పురోగతి సాధి స్తున్న ఐఐటీ హైదరాబాద్ ఈసారి ఆర్టిíఫీషియల్ ఇంటలీజెన్స్ కోర్సును బీటెక్‌లో ప్రవేశ పెట్టిన మొదటి ఐఐటీగా నిలి చింది. దీంతోపాటుగా ఎంటెక్‌లోనూ డేటా సైన్స్ మొదట ప్రవేశ పెట్టిన ఐఐటీగా ఘనతను సొంతం చేసుకుంది.
107 కంపెనీల ద్వారా ప్లేస్‌మెంట్లు
ఐఐటీ హైదరాబాద్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లను నిర్వహిం చేందుకు 252 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. అందులో ఇప్పటివరకు 107 కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లను నిర్వహించాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మెర్కారీ, టయోటా రీసెర్చ్ ఇన్‌స్టి ట్యూట్ అండ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్, వర్క్స్ అప్లికేషన్ అండ్ ఎస్‌ఎంఎస్ డేటా టెక్ వంటి సంస్థలు క్యాంపస్ ప్లేస్‌మెంట్లను చేపట్టాయి. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌లో 16 విభాగాల్లో దాదాపు 2,855 మంది విద్యార్థులు ఉండగా, ఇంజనీరింగ్, సైన్స్, లిబరల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ వంటి విభాగాల్లో 10 బీటెక్ ప్రోగ్రాంలు, 16 ఎంటెక్ ప్రోగ్రాంలు, మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లు, ఎంఏ ప్రోగ్రాం, పీహెచ్‌డీ వంటి ప్రోగ్రాం లను నిర్వ హిస్తోంది. వాటిల్లో పరిశోధనలకు పెద్దపీట వేస్తూ క్యాంపస్ ప్లేస్ మెంట్లను పెంచేం దుకు, ఇక్కడి విద్యా ర్థులకు ఉన్నత విద్యావ కాశాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంది. అందులో ఎక్కువ శాతం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, తైవాన్‌లో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఐ–టిక్, సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, ఫ్యాబ్లెస్ చిప్ డిజైన్ ఇంక్యుబేటర్ అనే మూడు టెక్నాలజీ ఇంక్యుబేటర్లను కూడా మన ఐఐటీ ఏర్పాటు చేసింది. గతేడాది ఈ సంస్థ విద్యార్థికి గూగుల్ సంస్థ రూ.1.2 కోట్ల ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఐఐటీ మేటి!
Published Mon, Aug 12 2019 3:10 AM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment