International companies
-
వర్క్‌స్పేస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్సోర్సింగ్ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్‌షోరింగ్‘ రిపోర్టు ప్రకారం భారత్‌లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఆఫ్‌షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్సోర్స్ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► 2023లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్ చ.అ., థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్‌ను లీజుకి తీసుకున్నాయి. ► భారత ఎకానమీకి ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి. ► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. ► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరనుంది. -
‘కర్ణాటక’ కుట్రపై అధికారుల అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌లోని పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను బెంగళూరుకు తరలించుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందన్న ప్రచారంపై రాష్ట్ర అధికారులు దృష్టి పెట్టి తెలిసింది. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరును తలదన్నేలా హైదరాబాద్ దూసుకెళ్తుండటం, ఐటీ రంగంలో అవకాశాలు సన్నగిల్లుతుండటం, పారిశ్రామికంగానూ దెబ్బతిన్న క్రమంలో కర్నాటక ప్రభుత్వం ఈ వ్యవహారానికి తెరలేపిందన్న ప్రచారంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల ఫాక్స్‌కాన్ సహా పలు ప్రముఖ కంపెనీలకు లేఖ రాసినట్టుగా ఆ రాష్ట్రంలోని పలు ఆంగ్ల, స్థానిక పత్రికల్లో కథనాలు రావడం, ఈ అంశాలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల సమయమే అదనుగా.. బెంగళూరులో మౌలిక వసతుల కల్పనలో పురోగతి లేకపోవడం, ట్రాఫిక్, సరైన మంచినీటి సౌకర్యం లేకపోవడం, రహదారులు అస్తవ్యస్తంగా మారడం, తీవ్ర కరెంటు సంక్షోభంపై బడా పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. బయోకాన్ చైర్మన్ కిరణ్ మజుందార్‌షా, ఖాతాబుక్ స్టార్టప్ సీఈవో రవీశ్ నరేశ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్ తదితరులు బెంగళూరు మౌలిక వసతులపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారని.. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని వసతులను ప్రశంసించారని అంటున్నాయి. ఈ క్రమంలోనే కర్నాటక ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కీన్స్ కంపెనీ సీఈవో రాజేశ్ శర్మ.. బెంగళూరులో ఏర్పాటు చేయతలపెట్టిన తమ కంపెనీని హైదరాబాద్‌ను మార్చాలని నిర్ణయించుకున్నారని పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్–బెంగళూరు వసతులను పోలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారని అంటున్నాయి. గతంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. గతంలోనూ కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్ నుంచి కంపెనీలను తమ వైపు తిప్పుకొనేలా ప్రయతి్నంచిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి 1న టీ–వర్క్స్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్లీ యూ.. త్వరలో తెలంగాణలో రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని, తద్వారా ఇక్కడ లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ మరునాడే ఫాక్స్‌కాన్ తెలంగాణలో కాకుండా బెంగళూరులో పెట్టుబడులు పెట్టబోతోందంటూ సోష ల్ మీడియాలో వైరల్ చేశారని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై.. ఫాక్స్‌కాన్‌తో సీఈవోతో మాట్లాడటంతో, తెలంగాణలోనే పెట్టుబడులు పెడుతున్నామంటూ మార్చి 6న ఫాక్స్‌కాన్ సీఈవో లేఖ రాశారని గుర్తు చేస్తున్నాయి. కోడై కూస్తున్న కన్నడ పత్రికలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు రాజకీయ పారీ్టలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయని.. దీన్ని సావకాశంగా తీసుకుని పరిశ్రమలను బెంగళూరుకు తరలించుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని కన్నడ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని అంటున్నారు. బెంగళూరు కోల్పోయిన ప్రభను తెచ్చేందుకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి ఎంబీ పాటిల్ ఇటీవల జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు లేఖలు రాశారని సదరు పత్రికలు పేర్కొంటున్నాయని చెప్తున్నారు. బెంగళూరుకు వస్తే అనేక ప్రోత్సాహకాలు ఇస్తామంటూ ఆశచూపుతున్నా రని.. తెరపై ఫాక్స్‌కాన్‌కు రాసిన లేఖ కనిపిస్తు న్నా, ఇలా మరెన్ని కంపెనీలకు లేఖలు రాశారన్నది తెలియాల్సి ఉందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఊహకందని రీతిలో పురోగతితో.. హైదరాబాద్ గత పదేళ్లలో ఐటీ, ఐటీఈఎస్తోపాటు పారిశ్రామికంగానూ ఊహించని రీతిలో పురోగతి సాధిస్తోందని.. టీఎస్ ఐపాస్‌తో పరిశ్రమల ఏర్పాటు సరళీకృతమై బడా కంపెనీలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. మౌలిక వసతుల కల్పన, 24 గంటల కరెంటు, పుష్కలమైన నీటి సరఫరా, రవాణా వ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వ ప్రగతిశీల చర్యలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు ఇక్కడ కొలువుదీరాయని అంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకున్నాయని.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో హైదరాబాద్ ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని వివరిస్తున్నారు. పదేళ్లలో ఐటీ ఎగుమతులు సుమారు రూ.53 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.2.41 లక్షల కోట్లకు.. ఐటీ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల నుంచి దాదాపు పది లక్షలకు చేరాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నాటక తాజా కుట్రలకు తెరతీసినట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొంటున్నారు. -
ఎయిర్‌పోర్టు మెట్రోకు యమ క్రేజ్.. పోటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. బిడ్డింగ్ గడువు సమీపిస్తుండడంతో పలు నిర్మాణసంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, మరో ఐదు రోజులే మిగిలి ఉన్నందువల్ల మరిన్ని సంస్థలు బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ముఖచిత్రం మారింది. వ్యాపార, వాణిజ్య రంగాలు, రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టాయి. దీంతో నగరంలో మెట్రో రైలును నిర్మాణ సంస్థలు లాభదాయకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ, రియల్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్‌ను దక్కించుకొనేందుకు గ్లోబల్‌స్థాయిలో పోటీ పెరిగింది. నిర్మాణ సంస్థలు ఈ కారిడార్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో ఇప్పటికే ఎల్అండ్టీ, ఆల్స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఐఆర్సీఓఎన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పీఏఎన్డీఆర్ఓఎల్ రహీ టెక్నాలజీస్ తదితర జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు పోటీలో ఉండగా, గడువు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండేళ్లలో పూర్తి... మరోవైపు ఈ మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 నాటికి పూర్తి చేసేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. తాము విధించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయాలని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోకి రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటి వరకు సర్వే, పెగ్‌మార్కింగ్, అలైన్మెంట్ తదితర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కాగా, 1.7 కిలోమీటర్ల వరకు భూగర్భమార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్ సమీపంలో ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 9 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో హెచ్ఎండీఏ, జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు 10 శాతం చొప్పున భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మొదట 11 రైళ్లతో ప్రారంభం.. రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మార్గంలో మొదట 11 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి మెట్రోకు 3 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 33 కోచ్‌లతో సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌మెట్రో 6 కోచ్‌లు, చైన్నె ఎయిర్పోర్ట్ మెట్రో 4 కోచ్‌లతో నడుస్తోంది. మొదట్లో రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుపుతారు. ఆ తరువాత రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిసింది. నగరం పడమటి వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ మెట్రో సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, సర్వీసుల సంఖ్య భారీగా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా 9 స్టేషన్లను ఖరారు చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో మరిన్ని స్టేషన్లకు కూడా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. -
పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా హైదరాబాద్ నగరాన్నే ఎంచుకుంటున్నాయని, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. మైక్రోసాప్ట్ మొదలు పలు సంస్థలు నగరంలో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రశాంతంగా కొనసాగిస్తున్నాయన్నారు. ఇంతటి అద్భుతమైన వాతావరణం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు కృషి అమోఘమని ఆయన ఉద్ఘాటించారు. బుధవారం ఐటీసీ కాకతీయలో జరిగిన అమెరికన్ ఇండియా ఫౌండేషన్(ఏఐఎఫ్) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యంత యువశక్తి ఉన్న దేశం భారత్ మాత్రమేనని, మన దేశంలో సగం జనాభా యువకులతోనే నిండి ఉందన్నారు. ఎలాంటి విజయాలనైనా సాధించే సత్తా భారత్‌కు ఉందన్నారు. ఇటీవల కోవిడ్–19 విపత్కర పరిస్థితుల్లో అత్యంత వేగంగా వ్యాక్సిన్ తయారు చేసింది భారతదేశమేనన్నారు. అందులోనూ హైదరాబాద్ పాత్ర మరువలేనిదని, ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయిన టీకాల్లో మూడోవంతు భారత్‌లోనే తయారయ్యాయని కేటీఆర్ ఉద్ఘాటించారు. విశ్వనగరంగా హైదరాబాద్... గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందిందని మంత్రి కేటీఆర్ వాఖ్యానించారు. అత్యాధునిక వసతులతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సంస్థలను ఆకర్షిస్తోందని వివరించారు. ఏఎఎఫ్ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభం ఎంతో సంతోషకరమన్న కేటీఆర్ ఏఎంఎఫ్ చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. -
యూపీఎల్‌లో నాలుగు దిగ్గజాల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్ దిగ్గజం యూపీఎల్‌లో నాలుగు అంతర్జాతీయ సంస్థలు మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. యూపీఎల్ ప్రకటన ప్రకారం ఇందుకోసం అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), బ్రూక్‌ఫీల్డ్, కేకేఆర్, టీపీజీ వేర్వేరుగా రూ. 4,040 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అగ్రి–టెక్ ప్లాట్‌ఫాం యూపీఎల్ ఎస్‌ఏఎస్‌లో ఏడీఐఏ, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ 9.09 శాతం వాటాల కోసం 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,580 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీనికోసం యూపీఎల్ ఎస్ఏఎస్ ఈక్విటీ వేల్యుయేషన్‌ను 2.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 17,380 కోట్లు)గా లెక్కకట్టారు. ఇక, 2.25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. రూ. 18,450 కోట్లు) వేల్యుయేషన్‌తో ’అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ – గ్లోబల్ సీడ్స్ ప్లాట్‌ఫాం’లో కేకేఆర్ రూ. 2,460 కోట్లు (300 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. మరోవైపు, గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్ ప్లాట్‌ఫాంగా వ్యవహరించే యూపీఎల్ కేమ్యాన్లో ఏడీఐఏ, టీపీజీ 22.2 శాతం కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. -
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం: మంత్రి సింగిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కంపెనీల లాబీయింగ్ కారణంగా వ్యవసాయ క్షేత్రాల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగిందని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. తద్వారా మనిషికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2017 నుంచి ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని చెప్పారు. గురువారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుడు గోరటి వెంకన్న అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2017–18 నుంచి 2019–20 వరకు రాష్ట్రంలో 29,200 ఎకరాల విస్తీర్ణం కలిగిన 584 క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2021–22 సంవత్సరానికి గాను జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 250 ఎకరాల చొప్పున 750 ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రతిపాదించామన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటివరకు బడ్జెట్లో రూ. 7,201.57 కోట్లు కేటాయించగా, రూ. 2,598.19 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై రైతాంగానికి అవగాహన, శిక్షణ కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. సవరించిన పేస్కేళ్ల అమలు: మంత్రి సబిత యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా ఆగినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జనవరి 2016 నుంచి రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి సవరించిన యూజీసీ వేతన స్కేళ్లను అమలు చేసేందుకు ప్రభుత్వం 2019లోనే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 3,350 మంది సిబ్బందికి పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా వారికి ఇచ్చేందుకు సర్కార్‌ను గ్రాంట్ అడిగినట్లు వివరించారు. అంతకుముందు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి 3,000 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2017లోనే 1,061 పోస్టుల భర్తీకి జీవో ఇచ్చినప్పటికీ అమలు కాలేదని వివరించారు. కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లను బదిలీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చి ఏడాదైనా అమలు కాలేదని, కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి 10 శాతం పన్నును ఆదాయపన్ను శాఖ వసూలు చేయడాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగు అకాడమీ స్కాంలో నిధుల రికవరీ చేయాలి: ఎంఎస్ ప్రభాకర్ తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్లను తస్కరించిన స్కాంలో నిందితులను అరెస్టు చేయడమే కాకుండా నిధులను రికవరీ చేయాలని సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్ కోరారు. అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. అందుకు మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ నిందితుల నుంచి నిధులను రికవరీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. గిరిజన తెగలకు... ఆదిలాబాద్‌లో గిరిజన తెగల్లో ఒకటైన మన్నెవర్లను కొలవర్లుగా మార్చారని, అయితే మన్నెవర్లుగా ఉన్నప్పుడు వారికి లభించిన లబ్ధి ఇప్పుడు అందడం లేదని సభ్యుడు పురాణం సతీష్ సభ దృష్టికి తెచ్చారు. 55 వేల మంది మన్నెవర్లు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సైనిక సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టి.జీవన్‌రెడ్డి కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, దసరా సెలవుల్లో బడులను సంస్కరించాలని ఆయన సూచించారు. -
రాష్ట్రాలకు భంగపాటు!
ఉన్న ఒకే ఒక్క ఆశ అడుగంటింది! భారత్‌లో వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న రెండు సంస్థలూ సకాలంలో అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందజేయలేని స్థితిని గమనించి, ఇక చేసేది లేక సొంతంగా ప్రపంచ మార్కెట్లో కొనుగోలు చేయాలని ఆత్రపడిన రాష్ట్రాలకు భంగపాటు ఎదురైంది. టీకాల విషయంలో మీతో మాట్లాడలేమని మొన్న మోడెర్నా సంస్థ పంజాబ్‌కు చెప్పగా...ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మోడెర్నా ఒక్కటే కాదు...ఫైజర్ సైతం మొండి చేయి చూపింది. తాము వ్యాక్సిన్ల గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం తప్ప రాష్ట్రాలతో కాదని ఆ సంస్థలు జవాబిచ్చాయి. ఈ రెండు రాష్ట్రాలే కాదు...ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, ఒదిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలు సైతం వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లు జారీ చేశాయి. ఇదంతా గత నెలాఖరులో జరిగింది. నెల తర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ‘కుదరదు పొమ్మ’ని జవాబొచ్చింది. మిగిలిన రాష్ట్రాలకు ఆ సంస్థలనుంచి భిన్నమైన ప్రత్యుత్తరం వస్తుందని ఆశించనవసరం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఇలా మన దేశంనుంచే ఎవరికి వారు పోటీ పడితే వ్యాక్సిన్ల ధర కాస్తా కొండెక్కి కూచుంటుందన్నది నిజమే. కానీ గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని సూచించింది కేంద్ర ప్రభుత్వమే. తీరా ఈ జవాబొచ్చిందంటే ఏమనుకోవాలి? ఏడాదిక్రితం కరోనా మహమ్మారి దేశంలో విస్తరించినప్పటినుంచి కేంద్రం వైఫల్యాల పర్యవసానంగా ఏర్పడుతున్న పరిణామాల పరంపరలో ఇది తాజా ఘట్టం. ఒకటి రెండు వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దో గొప్పో తగ్గుముఖం పడుతున్న సూచనలు కనబడటం కొంత ఆశాజనకంగా వున్న మాట వాస్తవమే అయినా దేశంలో మూడింట రెండు వంతుల జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికి మించివుందని పదిరోజులక్రితం నిపుణులు తెలిపారు. నిజానికి చాలా రాష్ట్రాల గ్రామసీమల్లో అరకొర వైద్య సదుపాయాలున్నాయి. వచ్చింది సాధారణ జ్వరమో, ఈ మహమ్మారి విరుచుకుపడిందో నిర్ధారణగా చెప్పడానికి అవసరమైన సిబ్బందిగానీ, ఆ పరీక్షలకు కావలసిన ఉపకరణాలుగానీ అక్కడ లేవు. కనుక వెల్లడవుతున్న సంఖ్యలకు మించి కరోనా రోగులు వుండొచ్చని కొందరంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ పౌరులు ఎంత కలవరపడతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిరుడు కరోనా పంజా విసిరినప్పటి పరిస్థితి వేరు. అప్పటికి అన్ని దేశాలూ నిస్సహాయ స్థితిలో వున్నాయి. దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యాక్సిన్ల మాట అటుంచి, కనీసం చికిత్సపై కూడా అయోమయం. ఇప్పుడు ఎంతో కొంత చికిత్స విధానాలు మెరుగుపడ్డాయి. పైగా వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. దాదాపు అన్ని దేశాలూ తమ తమ స్థోమత మేరకు పౌరులకు యుద్ధ ప్రాతిపదికన టీకాలిస్తున్నాయి. అత్యంత బీద దేశాల సంగతి మినహాయిస్తే అందరూ ఎంతో ముందు చూపుతో వ్యాక్సిన్ తయారీదార్లకు అడ్వాన్సులిచ్చారు. ఒక అంచనా ప్రకారం చూస్తే అలా అడ్వాన్సులిచ్చిన దేశాలకు ముందనుకున్నట్టు వ్యాక్సిన్ సరఫరా చేయడానికి దాదాపు అన్ని ఫార్మా సంస్థలకూ కనీసం ఆర్నెల్లు పడుతుంది. మోడెర్నా, ఫైజర్ల పరిస్థితి కూడా అదే అయివుంటుంది. మరి పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆ కారణాన్ని చెప్పకుండా తాము కేంద్రంతో మాత్రమే లావాదేవీలు చేస్తామనడం ఎందుకో అంతుపట్టదు. మన దేశంలో ఫెడరలిజం ఎంత సొగసుగా అమలవుతున్నదో వారికి కూడా అర్థమైనట్టుంది! గ్లోబల్ టెండర్లకు వెళ్లొచ్చని రాష్ట్రాలకు చెప్పిననాటికే విదేశాల్లో ఉత్పత్తవుతున్న ముఖ్యమైన వ్యాక్సిన్లకు అనుమతులిచ్చివుంటే...మా రాష్ట్రాలు మీతో లావాదేవీలు చేస్తాయని ఆ సంస్థలకు చెప్పివుంటే వేరుగా వుండేది. కానీ దేశీయ వ్యాక్సిన్లు కోవీషీల్డ్, కోవాగ్జిన్‌లకూ... గత నెలలో స్పుత్నిక్ (రష్యా) వ్యాక్సిన్‌కు ఇచ్చిన అనుమతులు తప్ప ఇతర టీకాలకు మనదేశంలో అనుమతులు లేవు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌లకు నిరుడు డిసెంబర్లోనే అమెరికా అనుమతులిచ్చింది. ఫైజర్‌ను బ్రిటన్ కూడా డిసెంబర్లోనే గుర్తించింది. మొత్తంగా దాదాపు 90 దేశాలు ఫైజర్‌కు, 41 దేశాలు జాన్సన్ అండ్ జాన్సన్‌కూ అనుమతులిచ్చివున్నాయి. కొన్ని దేశాలు స్పుత్నిక్ వైపు మొగ్గాయి. మరి మనకేమైంది? ప్రజారోగ్యం ప్రధానం కనుక ఆ వ్యాక్సిన్ల పనితీరుపై అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సివుందన్నది వాస్తవమే అయినా... అందుకు ఆర్నెల్ల సమయం అవసరమా? కోవాగ్జిన్ రూపకల్పనలో భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు కూడా పాలుపంచుకున్నాయి గనుక ఇతర సంస్థలకు కూడా దాన్ని ఉత్పత్తి చేసే అవకాశమివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించాక మరో రెండు మూడు సంస్థలకు కూడా అనుమతులిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కానీ దీన్నింకా విస్తరిస్తే తప్ప ఎక్కువమంది జనాభాకు టీకాలివ్వటం సాధ్యం కాదు. జాతీయంగా, అంతర్జాతీయంగా టీకాల లభ్యత విషయంలో ఇంత అలసత్వం ప్రదర్శిస్తూ పద్దెనిమిదేళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్లు ఇస్తామని ఈ నెల 1న ప్రకటించారు. దానికి ఆన్లైన్ నమోదు ఇప్పటికే సాగుతుండగా, సోమవారం నుంచి నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నమోదు మొదలైంది. కానీ అవసరమైనన్ని టీకాలేవి? కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్లో పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు ఇప్పుడెదురైన చేదు అనుభవంలాంటిది మరే రాష్ట్రానికీ కలగకుండా కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
ఇండియా జాయ్‌తో డిజిటల్ ఎంటర్టైన్మెంట్కు ఊతం
సాక్షి, హైదరాబాద్: యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, డిజిటల్ వినోదం రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రానికి ‘ఇండియా జాయ్–2019’వేడుక మరింత ఊతమిస్తుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. డిజిటల్ మీడియా, వినోదం రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు సంస్థలు పాల్గొనే ఈ వేడుక నిర్వహణకు సంబంధించి ఇండియా జాయ్ ప్రతినిధులు సోమవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వెయ్యికిపైగా అంతర్జాతీయ బృందాలు హాజరవుతున్నాయని తెలిపారు. డిజిటల్ వినోదానికి సంబంధించిన 9 అంశాలపై సదస్సులు జరుగుతా యన్నారు. భారత మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీలకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో గేమింగ్, వినోదం తదితర రంగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇమేజ్ టవర్స్’కు ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టర్నర్ ఇంటర్నేషనల్, వయాకామ్ 18, సోనీ పిక్చర్స్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్, షెమారూ వంటి ప్రముఖ సంస్థలు ఈ వేడుకలో పాల్గొంటాయి. కేటీఆర్‌ను కలసిన వారిలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇండియా జాయ్ ప్రతినిధి రాజీవ్ చిలక తదితరులు ఉన్నారు. -
ఐఐటీ మేటి!
సాక్షి, హైదరాబాద్ : క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఐఐటీ–హైదరాబాద్ సత్తాచాటింది. హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులకు ఈ సంవత్సరం అధిక సంఖ్యలో క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించాయి. వివిధ కంపెనీల నుంచి మొత్తంగా 261 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్ ఆఫర్లను పొందగా, అం దులో 22 మంది అంత ర్జాతీయ కంపెనీల నుంచి భారీ ఆఫర్లను దక్కించు కున్నారు. పరిశోధన లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ తనదైన శైలిలో పురోగతి సాధి స్తున్న ఐఐటీ హైదరాబాద్ ఈసారి ఆర్టిíఫీషియల్ ఇంటలీజెన్స్ కోర్సును బీటెక్‌లో ప్రవేశ పెట్టిన మొదటి ఐఐటీగా నిలి చింది. దీంతోపాటుగా ఎంటెక్‌లోనూ డేటా సైన్స్ మొదట ప్రవేశ పెట్టిన ఐఐటీగా ఘనతను సొంతం చేసుకుంది. 107 కంపెనీల ద్వారా ప్లేస్మెంట్లు ఐఐటీ హైదరాబాద్‌లో క్యాంపస్ ప్లేస్మెంట్లను నిర్వహిం చేందుకు 252 కంపెనీలు నమోదు చేసుకున్నాయి. అందులో ఇప్పటివరకు 107 కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లను నిర్వహించాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మెర్కారీ, టయోటా రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ అండ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్, వర్క్స్ అప్లికేషన్ అండ్ ఎస్ఎంఎస్ డేటా టెక్ వంటి సంస్థలు క్యాంపస్ ప్లేస్మెంట్లను చేపట్టాయి. ప్రస్తుతం ఐఐటీ హైదరాబాద్‌లో 16 విభాగాల్లో దాదాపు 2,855 మంది విద్యార్థులు ఉండగా, ఇంజనీరింగ్, సైన్స్, లిబరల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ వంటి విభాగాల్లో 10 బీటెక్ ప్రోగ్రాంలు, 16 ఎంటెక్ ప్రోగ్రాంలు, మూడు ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లు, ఎంఏ ప్రోగ్రాం, పీహెచ్డీ వంటి ప్రోగ్రాం లను నిర్వ హిస్తోంది. వాటిల్లో పరిశోధనలకు పెద్దపీట వేస్తూ క్యాంపస్ ప్లేస్ మెంట్లను పెంచేం దుకు, ఇక్కడి విద్యా ర్థులకు ఉన్నత విద్యావ కాశాలను కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంది. అందులో ఎక్కువ శాతం జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, తైవాన్‌లో ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే ఐ–టిక్, సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంటర్ ప్రెన్యూర్షిప్, ఫ్యాబ్లెస్ చిప్ డిజైన్ ఇంక్యుబేటర్ అనే మూడు టెక్నాలజీ ఇంక్యుబేటర్లను కూడా మన ఐఐటీ ఏర్పాటు చేసింది. గతేడాది ఈ సంస్థ విద్యార్థికి గూగుల్ సంస్థ రూ.1.2 కోట్ల ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
బుక్–మైషోలో వాటా కోసం దిగ్గజాల క్యూ
ముంబై: ఆన్లైన్ టికెటింగ్ సంస్థ బుక్–మైషోలో వాటా కొనుగోలు కోసం పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బుక్–మైషోలో 10–12 శాతం వాటా కొనుగోలు కోసం ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్, సింగపూర్ సావరిన్ వెల్త్‌ఫండ్ టెమసెక్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. వాటా కొనుగోళ్లకు సంబంధించిన చర్చలన్నీ తుది దశకు చేరాయని, మరికొన్ని వారాల్లో ఖరారవుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సంస్థల డీల్స్ ఖరారైతే, బుక్–మైషో విలువ వంద కోట్ల డాలర్లను (రూ.7,000 కోట్లు) దాటుతుందని అంచనా. గత ఏడాది జూలైలో బుక్‌మైషో సంస్థ టీపీజీ గ్రోత్ నుంచి 10 కోట్ల డాలర్లు సమీకరించింది. అప్పుడు ఈ కంపెనీ విలువను 80 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు. తాజా డీల్స్‌లో భాగంగా సైఫ్ పార్ట్నర్స్ తన మొత్తం 5.6 శాతం వాటాను విక్రయిస్తుందని, యాక్సెల్ ఇండియా తన వాటాలో కొంత భాగాన్ని అమ్మేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2016 వరకూ ఆన్లైన్ టికెటింగ్ సెగ్మెంట్లో బుక్–మైషో సంస్థదే గుత్తాధిపత్యం. ఆ తర్వాత పేటీఎమ్ రంగంలోకి రావడంతో బుక్–మైషో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. పేటీఎమ్‌లో కూడా భారీగా పెట్టుబడులుండటంతో బుక్–మైషో నుంచి వైదొలగాలని సైఫ్ పార్ట్నర్స్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. నెలకు 2 కోట్ల టికెట్లు... 1999లో బిగ్‌ట్రీ ఎంటర్టైన్మెంట్ పేరుతో బుక్–మైషో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆరంభంలో థియేటర్లలో సీట్ల మేనేజ్మెంట్ కార్యకలాపాలు చూసిన సంస్థ, ఆ తర్వాత ఆన్లైన్లో టికెట్లను అమ్మడం మొదలెట్టింది. ప్రస్తుతం నెలకు 2 కోట్ల వరకూ టికెట్లను అమ్ముతోంది. సినిమా టికెట్లనే కాకుండా సంగీత కచేరీలు, స్టాండ్–అప్ కామెడీ షోలు, స్పోర్ట్స్ ఈవెంట్లు తదితర కార్యక్రమాల టికెట్లను కూడా బుక్–మైషో విక్రయిస్తోంది. ఈ సంస్థ మొత్తం ఆదాయంలో ఈ సెగ్మెంట్ వాటా దాదాపు మూడోవంతు ఉంటుందని అంచనా. 2016–17 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.391 కోట్లకు పెరగ్గా, నికర నష్టాలు 17 శాతం పెరిగి రూ.162 కోట్లకు చేరాయి. -
ఇంటర్నేషనల్ 'బీర్లు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మద్యం వ్యాపారం లాభసాటిగా మారటంతో రాష్ట్రీయ మద్యం మార్కెట్లోకి ప్రవేశించటానికి ప్రపంచ దేశాల బీర్ల కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇక్కడ అంచనాలకు మించి బీర్ల వినియోగం ఉండ టం, ఈ ఏడాది బీర్ల బేసిక్ ధర పెంచటానికి ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో సొమ్ము చేసుకోవటానికి పలు అంతర్జాతీయ కంపెనీలు రంగంలోకి దిగాయి. మొత్తం 26 కార్పొరేటు కంపెనీలు 186 దేశీయ, విదేశీ బ్రాండ్లను సరఫరా చేసేందుకు టెండర్లు దాఖలు చేశాయి. ఇందులో ట్యూబర్గ్, క్యాల్సిబర్గ్, ఫోస్టర్, బడ్వైజర్, హన్‌కెన్ బ్రాండ్లు ఇప్పటికే రాష్ట్రీయ మార్కెట్లో వినియోగంలో ఉండగా.. స్కోల్, విక్టోరియా, ఆంగోర్, హినానో, గోల్డ్ స్టార్, పెరోని, రెడ్ స్ట్రైప్, టస్కర్ తదితర బ్రాండ్లు కొత్తగా రాబోతున్న జాబితాలో ఉన్నాయి. 120 కొత్త బ్రాండ్లకు టెండర్లు రాష్ట్రీయ మద్యం మార్కెట్లో బీర్లను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 186 రకాల బ్రాండ్లను సరఫరా చేయడానికి కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. వీటిలో 66 బ్రాండ్లు ఇప్పటికే వినియోగంలో ఉండగా.. కొత్తగా మరో 120 బ్రాండ్లకు టెండర్లు దాఖలయ్యాయి. సాధారణంగా ఏడాది కాలానికి బీర్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. గతేడాది చేసుకున్న ఒప్పందం మార్చి 31తో ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియ కసరత్తు చేపట్టింది. టెండర్లు ఖరారు చేయటంతోపాటు, బీర్ల బేసిక్ ధర నిర్ణయించటానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జెడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. కమిటీలో చార్టర్డ్ అకౌంటెంట్ బి.నర్సింహారావు, మాజీ ఐఏఎస్ అధికారి అరవిందరెడ్డి సభ్యులుగా ఉన్నారు. బేసిక్ ధర పెంపు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల డిస్టిలరీల యాజమాన్యం కోసం లిక్కర్ ధరను 5 నుంచి 15 శాతం వరకు పెంచింది. ఈ నేపథ్యంలోనే బ్రూవరీల యాజమాన్యం కోసం బీర్ల బేసిక్ ధర పెంచుతారనే ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్ల నుంచి బీర్ల ధరలు పెంచలేదని, కనీసం ఈ సారైనా ధర పెంచాలని, ప్రతి సీసా మీద కనీసం రూ.6 చొప్పున (బేసిక్ ధరపై 20 శాతం) అదనంగా చెల్లించాలని బ్రూవరీలు డిమాండ్ చేస్తున్నాయి. యాజమాన్యాలు డిమాండ్ చేసిన స్థాయిలో కాకపోయినా కనీసం 10 శాతం నుంచి 15 శాతం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఆ మేరకే జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీని వేసిందని అంతర్గతంగా ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. ఇక్కడే ఉత్పత్తి.. అంతర్జాతీయ బ్రాండ్లు అంటే విదేశాల్లోనే తయారు చేసిన మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి విక్రయించుకోవాలనే నిబంధన ఏమీ లేదు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం పేటెంట్ పొందిన బీరు తయారీ ఫార్ములాతో స్థానికంగా అందుబాటులో ఉన్న బ్రూవరీల్లో వారి బ్రాండ్ బీరును ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆరు బ్రూవరీలతో (బీర్ల తయారీ పరిశ్రమలు) పలు అంతర్జాతీయ కంపెనీలు ఒప్పందం చేసుకోని బీర్లను ఉత్పత్తి చేశాయి. ఈ సారి టెండర్లలో సోన్ డిస్టిలరీస్, బ్రూవరీస్ మధ్యప్రదేశ్, ఎస్ఎన్జే డిస్టిలరీలస్ నెల్లూరు, ఎస్పీఆర్ డిస్టిలరీస్ మైసూర్, ప్రివిలేజ్ ఇండస్ట్రీస్ పుణే, హరియాణా బ్రూవరీస్, సోన బ్రూవరేజెస్ ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. అలాగే రాష్ట్రీయ మార్కెట్లో పెద్ద వాటాదారుగా ఉన్న యూబీ (యునైటెడ్ బ్రూవరేజెస్) మైసూర్, ఔరంగాబాద్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి ఈసారి కొత్తగా టెండర్లు దాఖలు చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ బీర్ల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. సగటున నెలకు 37.5 లక్షల కేసుల బీర్లు తాగుతున్నారు. టీఎస్‌బీసీఎల్ నివేదికల ప్రకారం రాష్ట్రంలో రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల బీర్లు తాగుతున్నారు. గతేడాది రాష్ట్రంలో జరిగిన బీర్ల విక్రయాలతో పోలిస్తే 27 శాతం అధికంగా బీర్లను తాగేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో బీర్ల వినియోగం ఇక్కడితో పోలిస్తే సగం కూడా లేదు. ఈ రికార్డుల నేపథ్యంలో బీర్ల కంపెనీలు రాష్ట్రంపై ఆసక్తి చూపుతున్నట్లు టీఎస్‌బీసీఎల్ అధికారులు అంచనా వేస్తున్నారు. టెండర్లు ఎక్కువే వచ్చాయి: దేవీ ప్రసాద్, టీఎస్‌బీసీఎల్ చైర్మన్ బీర్లు సరఫరా చేసేందుకు ఈ ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగానే టెండర్లు వచ్చాయి. గతేడాది రాష్ట్రంలో 66 బ్రాండ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 120 బ్రాండ్లు అదనంగా వచ్చాయి. జస్టిస్ గోపాల్‌రెడ్డి కమిటీ.. కంపెనీలతో మాట్లాడి ధరలను నిర్ణయిస్తుంది. ఒక వేళ కమిటీ అడిగిన ధరలకు బీరు సరఫరా చేసేందుకు కంపెనీలు ముందుకు రాకపోతే.. ఇప్పుడు కొనసాగుతున్న ఒప్పందాన్నే మరో 6 నెలలపాటు పొడిగిస్తాం. -
రియల్టీకి టైమొచ్చింది!
దిగ్గజ కంపెనీల చూపుహైదరాబాద్ వైపు ♦ తొలి కేంద్రాల ఏర్పాటుతో రంగంలోకి కంపెనీలు ♦ 3-4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. 25 లక్షల ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు ♦ రానున్న రోజుల్లో స్థిరాస్తి వ్యాపారానికి పండగేనంటున్న నిపుణులు హైదరాబాద్.. మహా నగరం నుంచి విశ్వ నగరం వైపు శరవేగంగా అడుగులేస్తోంది. బెంగళూరు, ముంబై, చెన్నై, ఎన్‌సీఆర్‌లను కాదని అంతర్జాతీయ కంపెనీలు అమెరికా తర్వాత తమ తొలి కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయి. పారిశ్రామిక, ఐటీ పాలసీతో ప్రోత్సహిస్తున్న స్థానిక ప్రభుత్వం.. మెరుగైన మౌలిక వసతులు, మెట్రో, ఓఆర్ఆర్, ఎక్స్‌ప్రెస్ హైవేలతో సౌకర్యవంతమైన రవాణా సదుపాయాలు, అందుబాటులో స్థిరాస్తి ధరలూ.. ఇవీ విదేశీ కంపెనీల రాకకు కారణం. దీంతో రానున్న రోజుల్లో భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ పట్టాలెక్కుతుందని నిర్మాణ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. ⇒ ఐటీ రంగంలో హైదరాబాద్‌తో పోల్చుకుంటే బెంగళూరు, చెన్నై నగరాలు ముందుంటాయి. కానీ, ఇప్పుడా మెట్రోలు స్తబ్ధత స్థాయికి చేరుకున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. ఎక్కడి నుంచైనా సరే విమానాశ్రయానికి చేరుకోవాలంటే పద్మవ్యూహాన్ని చేధించాల్సిందే. కాలుష్యం విపరీతంగా పెరిగింది. భూగర్భ జలాలూ అడుగంటుతున్నాయి. దీంతో కూల్‌సిటీగా పేరుగాంచిన బెంగళూరు.. హాట్సిటీ మారుతోంది. చెన్నై విషయానికొస్తే.. వరదల ముప్పు. కొన్ని నెలల క్రితం వచ్చిన అనూహ్యమైన వరదలు కార్పొరేట్ సంస్థలను ఆలోచింపజేస్తున్నాయి. బ్యాక్ ఆఫీసు వంటి కీలకమైన ఆపరేషన్లకు చెన్నై సేఫ్ కాకపోవచ్చనే అనుమానమూ మొదలైందిప్పుడు. పెపైచ్చు రాజకీయ ఒత్తిళ్లు. దీంతో కొన్నేళ్ల పాటూ హైదరాబాద్ అంటే ఆలోచించిన కంపెనీలు.. ఇప్పుడు తమ తొలి కేంద్రాల ఏర్పాటుకు నగరాన్నే ఎంచుకుంటున్నాయి. ⇒ ప్రస్తుతం నగరంలో సుమారు 8 కోట్ల చ.అ. స్థలంలో 1,300లకు పైగా ఐటీ కంపెనీలు విస్తరించి ఉన్నాయి. వీటికి తోడుగా యాపిల్, సేల్ఫోర్స్, గూగుల్ వంటి కంపెనీలు 3-4 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 25 లక్షల మందికి, పరోక్షంగా వేలాది మంది ఉద్యోగ అవకాశాలొస్తాయని అంచనా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతుల విలువ.. ప్రస్తుతం రూ.75 వేల కోట్లకు చేరింది. జాతీయ వృద్ధి రేటు (12.3 శాతం) కంటే తెలంగాణ వృద్ధి రేటు (13.26 శాతం) ఎక్కువే. స్టార్టప్ కంపెనీల విషయానికొస్తే.. 1,000కి పైగా కంపెనీలు కొలువుదీరాయిక్కడ. సంస్థలకు అవసరమైన నిపుణులను తయారుచేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ⇒ 1 చ.అ. కమర్షియల్ స్థలం అమ్ముడయ్యిందంటే.. 200 చ.అ. రెసిడెన్షియల్ స్థలం అవసరముంటుందని స్థిరాస్తి నిపుణులు చెబుతుంటారు. ఈ లెక్కన చూస్తే రానున్న రోజుల్లో నగరంలో నివాస, వాణిజ్య అవసరాలకు ఢోకాలేదని చెప్పాలి. ఎందుకంటే సేల్స్‌ఫోర్స్ 2 లక్షల చ.అ., యాపిల్ 2.50 లక్షల చ.అ., గూగుల్ 20 లక్షల చ.అ., ఫ్లిప్‌కార్ట్ 2.20 లక్షల చ.అ., అమెజాన్ 2.80 లక్షల చ.అ., కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి మరి. ఇప్పటికే ఈ-కామర్స్, హెల్త్ కేర్ సంస్థలు నగరంలో సుమారు 3-4 మిలియన్ల స్థలం అద్దెకు తీసుకున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఔటర్ రింగ్ రోడ్డు, త్వరలోనే పట్టాలెక్కనున్న మెట్రో రైలు.. వంటివి భాగ్యనగరానికి అదనపు ఆభరణాలుగా నిలుస్తున్నాయి. ⇒ నగరానికొస్తున్న కంపెనీల్లో చాలా వరకూ పశ్చిమ జోన్ కేంద్రంగానే వస్తున్నాయి. దీంతో గచ్చిబౌలి నుంచి అప్పా జంక్షన్ వరకు రోడ్డుకిరువైపులా 2 కి.మీ. వరకూ స్థిరాస్తి వ్యాపారం బాగుంటుంది. మాదాపూర్, నార్సింగి, రాయదుర్గం, పుప్పాలగూడ, బండ్లగూడ, రాజేంద్రనగర్, ప్రాంతాల్లో భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లు వెలుస్తున్నాయి. మరో 10-15 ఏళ్ల వరకు ఇక్కడి స్థిరాస్తి వ్యాపారానికి ఢోకా లేదు. ఇతర జోన్లలో స్థిరాస్తి వ్యాపారం అంతగా వృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం.. విమానాశ్రయానికి దూరంగా ఉండటం, పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధిని నగరం నలువైపులా విస్తరింపజేయాలంటే గ్రోత్ కారిడార్ వెంట విస్తరణ, ఫార్మాసిటీ పనుల్లో పురోగతి, యాదాద్రి అభివృద్ధి వంటివి చేపట్టాలి. ⇒ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్‌లో కనీసం 30 శాతం తక్కువ ధరలతో ఇక్కడ నిర్మాణం పూర్తవుతుంది. సిమెంట్, లేబర్, ల్యాండ్ అన్నీ తక్కువగా ఉండటం వల్ల నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలకూ కొదవేలేదిక్కడ. ఆరు స్టేట్ వర్సిటీలు, రెండు ప్రై వేట్ వర్సిటీలు, రెండు డీమ్డ్ వర్సిటీలు, మూడు సెంట్రల్ వర్సిటీలకు హైదరాబాద్ కేంద్రం. టీహబ్ ఇంక్యుబేషన్ సెంటర్ వల్ల యంగ్ టాలెంట్ డెవలప్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చొరవ కంపెనీలను విరివిగా ఆకర్షిస్తుంది. ఐటీ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించడంతో పాటూ సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తుంది. ఐటీ మంత్రి స్వయంగా విదేశాలను సందర్శించి కంపెనీలతో భేటి అవుతున్నారు. ఇక్కడ ఉన్న అవకాశాలను, ప్రభుత్వ ప్రోత్సాహకాలనూ వివరిస్తున్నారు. ⇒ పెట్టుబడులు పెట్టేవారు, పరిశ్రమలు స్థాపించేవారూ కరెంట్‌తో పాటూ నీటి లభ్యత చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సమస్యను పరిష్కరించింది. శామీర్‌పేట, రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో రెండు భారీ రిజర్వాయర్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. గోదావరి, కృష్ణా జలాలను ఇక్కడికి తరలించి తాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. ఇప్పుడున్న జనాభాకు పదిరెట్లు పెరిగినా ఢోకా లేదని చెబుతుంది. ఈ తరహా చర్యలతో నగరానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశముంది. దీంతో స్థిరాస్తి మార్కెట్ బాగుంటుందిన నిపుణులు భావిస్తున్నారు. -
నగరానికి ‘బ్రిక్స్’ సొగసులు!
- అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాల కోసం సర్కార్ యోచన - ఎన్డీబీ బ్రిక్స్, ఏఐఐబీ నిధులకు ప్రభుత్వం కసరత్తు - ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన జీహెచ్ఎంసీ - తుది పరిశీలన అనంతరం సంబంధిత సంస్థలకు నివేదికలు - నివేదికను ఆమోదిస్తే రూ. 21,877 కోట్ల రుణం - ఎస్సార్డీపీ.. నాలాల ఆధునీకరణకు తొలి ప్రాధాన్యం - ఐదేళ్లలో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు - ఇవి పూర్తయితే 30 ఏళ్ల పాటు సౌకర్యవంతమైన జీవనం సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధుల వేటను ప్రారంభించింది. అంతర్జాతీయస్థాయి నగరాలకు దీటుగా హైదరాబాద్ రూపురేఖలను మార్చేందుకు ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థల నుంచి నిధులు తీసుకోవాలని భావిస్తోంది. విశ్వనగర పనుల్లో భాగంగా నగరంలో ‘ఫ్లైఓవర్ల’ వంటివి నిర్మించేందుకు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎస్సార్డీపీ)ను జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. ఈ పనుల కోసం కాంట్రాక్టర్లే తొలుత పెట్టుబడి పెట్టే ‘యాన్యుటీ’ విధానంలో టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడంతో ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలైన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్(ఎన్డీబీ బ్రిక్స్), ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ)ల నుంచి రుణం తీసుకోవాలని భావిస్తోంది. ఈ సంస్థల నుంచి రుణాలు పొందేందుకు అవసరమైన నివేదికల్ని జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించింది. తుది పరిశీలన అనంతరం ప్రభుత్వం సంబంధిత ఆర్థిక సంస్థలకు ఈ నివేదికలను పంపనుంది. ఎన్డీబీ బ్రిక్స్ నుంచి ఎక్కువ నిధులు పొందాలని సర్కారు భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్, జైకా తరహాలో ఎన్డీబీ బ్రిక్స్ ఆర్థిక సాయం అందజేయనుండంతో ఈ ప్రయత్నాలను ప్రారంభించింది. చైనాలోని షాంఘై కేంద్రంగా ఏర్పాటైన ఎన్డీబీ బ్రిక్స్ బ్యాంక్ వచ్చే ఏడాది నుంచి ఇలాంటి రుణాలు మంజూరు చేయనుంది. ఎన్డీబీ బ్రిక్స్, ఏఐఐబీలు ఈ నివేదికలను ఆమోదిస్తే రూ. 21,877 కోట్లు రుణంగా రాష్ట్రానికి అందుతాయి. ఎస్సార్డీపీ, నాలాల ఆధునీకరణలకు కావాల్సిన మొత్తం రూ. 31,254 కోట్లు అవసరమని అధికారుల అంచనా. ఇందులో ఎస్సార్డీపీ పనులకు రూ. 24,500 కోట్లు, నాలాల ఆధునీకరణ పనులకు రూ. 6,754 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఎన్డీబీ బ్రిక్స్, ఏఐఐబీల రుణం కాక.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ భరించనున్నాయి. ఐదేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎస్సార్డీపీ.. నాలాల ఆధునీకరణ.. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వివిధ అంశాలను అధ్యయనం చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, జంక్షన్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు, వీధి దీపాలు, మురికివాడలు, ఘనవ్యర్థాల నిర్వహణ, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ భూములు, వరద సహాయక కేంద్రాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, స్టేడియాలు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు, ప్రార్థనాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు తదితరాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటిల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నప్పటికీ తొలివిడతగా ఫై ్లఓవర్ల వంటి వాటితో కూడిన ఎస్సార్డీపీ ప్రాజెక్టును, వరద కాలువల ఆధునీకరణ పనుల్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల కోసం నిధుల అవసరాన్ని నివేదికలో పొందుపరిచారు. ఇవి పూర్తయితే రాబోయే 30 ఏళ్ల పాటు ప్రజలు సౌకర్యవంతంగా జీవించవచ్చని భావిస్తున్నారు. పథకం: స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎస్సార్డీపీ) మొత్తం వ్యయం: రూ. 24,500 కోట్లు కాలపరిమితి: 5 ఏళ్లు ఆర్థిక సంస్థల ద్వారా రుణం: రూ. 17,150 కోట్లు(70 %) ఎన్బీడీ బ్రిక్స్ రుణం: రూ. 8,575 కోట్లు ఏఐఐబీ రుణం: రూ. 8,575 కోట్లు జీహెచ్ఎంసీ: రూ. 3,675 కోట్లు (15%) రాష్ట్ర ప్రభుత్వం: రూ. 3,675 కోట్లు (15%) ఎస్సార్డీపీలోని పనులు... - 6 స్కైవేలు: 111 కి.మీ. - 11 మేజర్ కారిడార్లు: 166 కి.మీ. - 68 మేజర్ రోడ్ సెక్షన్లు/లింకులు: 348 కి.మీ. - 54 జంక్షన్ల వద్ద ఫై ్ల ఓవర్లు (గ్రేడ్ సెపరేటర్లు) - ఇతర రహదారులు: 1,400 కి.మీ. -ప్రాజెక్టు పూర్తయ్యాక దిగువ ఫలితాలుంటాయని అంచనా. - హైదరాబాద్ నివాసయోగ్య నగరంగానే కాక అందరూ ఇష్టపడే నగరంగా మారుతుంది (లివబుల్ అండ్ లవబుల్ సిటీ). - ప్రయాణవేగం 30 నుంచి 40 కేఎంపీహెచ్ దాకా పెరగడమే కాక వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. - స్కైవేలు, ఫ్లైఓవర్లు, కారిడార్ల ఏర్పాటుతో రాబోయే పదేళ్లలో 70 శాతం మేర సౌకర్యవంతమైన సాఫీ -ప్రయాణమే కాక 30 శాతం మేర సమయం, వాహన నిర్వహణ వ్యయం తగ్గుతుందని అంచనా. - పరిసరాలకు కొత్త అందాలిచ్చేలా స్కైవేల నిర్మాణం. రోడ్డు నెట్వర్క్ నిర్వహణ మెరుగవుతుంది. - 2011లో 70 లక్షలున్న గ్రేటర్ జనాభా 2041 నాటికి 1.40 కోట్లు(రెట్టింపు) కాగలదని అంచనాతో ఈ ప్రణాళికను రూపొందించారు. - ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో పాటు నగర ప్రయాణికులు 1.62 కోట్లకు చేరతారని అంచనా. - నగరంలో ప్రస్తుతం తిరుగుతున్న 26 లక్షల వాహనాలు 90 లక్షలకు చేరతాయని భావిస్తున్నారు. - ప్రజారవాణా వ్యవస్థను వినియోగించుకునే వారు 60 శాతానికి పెరుగుతారని అంచనా. పథకం: జీహెచ్ఎంసీలో వరద కాలువల ఆధునీకరణ మొత్తం వ్యయం: రూ. 6,754 కోట్లు కాలపరిమితి: 5 ఏళ్లు ఎన్డీబీ బ్రిక్స్ ద్వారా రుణం: రూ. 4,727.80 కోట్లు(70%) జీహెచ్ఎంసీ: రూ. 1,013.10 కోట్లు (15%) రాష్ట్ర ప్రభుత్వం: రూ. 1,013.10 కోట్లు (15%) వరద కాలువల ఆధునీకరణలో.. స్వల్పకాలిక పనులు: 26 కి.మీ. మధ్యకాలిక పనులు: 47 కి.మీ. దీర్ఘకాలిక పనులు: 260 కి.మీ. ఈ పనులు పూర్తయితే వాననీటి కష్టాలు తీరడమే కాక పలు విధాలుగా ప్రజలకు సదుపాయం కలుగుతుంది. ధన, ప్రాణనష్టం తప్పుతుంది. వరద ముంపు సమస్యలుండవు. అంతిమంగా వివిధ అంశాల్లో నగరానికి మేలు కలుగుతుంది. వీటికే ఎందుకు ప్రాధాన్యం? ట్రాఫిక్ సమస్య వల్ల ప్రయాణంలో జాప్యం జరగడమే కాక వాతావరణకాలుష్యం, ప్రజల నైపుణ్యాలు, ఇతరత్రా అంశాల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోందని భావించి ఎస్సార్డీపీకి ప్రథమ ప్రాధాన్యతనిచ్చారు. వర్షం కురిస్తే నీరు వెళ్లే దారి లేకపోవడానికి తగిన విధంగా వరద కాలువలు లేకపోవడాన్ని గుర్తించి రెండో అంశంగా నాలాల ఆధునీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. -
రైల్వే తొలి ఎఫ్‌డీఐ బిడ్లకు 3 దిగ్గజ కంపెనీలు
న్యూఢిల్లీ: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వేలో తొలి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) ఆఫర్‌కు మూడు అంతర్జాతీయ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. బీహార్‌లోని మాధేపురాలో ఆధునిక ఎలక్ట్రిక్ రైలు పెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీని రూ.1.300 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. సీమెన్స్, ఆల్స్టోమ్, బొంబార్డీయిర్.. ఈ మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమ తమ బిడ్లను దాఖలు చేశాయి. ఏడాదికి ఇక్కడ 80కు పైగా రైలుపెట్టెలు తయారవుతాయి. ఈ మూడు అంతర్జాతీయ కంపెనీలు వేసిన బిడ్లను టెండరింగ్ కమిటీ మదింపు చేసి సెప్టెంబర్ చివరికల్లా ఫలితం ప్రకటిస్తారు. -
ఫిబ్రవరిలో బయో ఆసియా సదస్సు
హైదరాబాద్: వచ్చే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో 12వ బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ ప్రకటించింది. లైఫ్ సైన్స్ విభాగంలో పరిశోధనలు, అభివృద్ధి ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దీనిలో పాలు పంచుకోనున్నాయి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఐసీటీ మాజీ డెరైక్టర్, శాస్త్రవేత్త కె.వి.రాఘవన్ చైర్మన్‌గా, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్‌చంద్ర, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ జయేశ్ రంజన్, పరిశ్రమల విభాగం కమిషనర్‌ను ఎక్స్అఫీషియో సభ్యులుగా కమిటీని నియమించింది. -
పవిత్ర కుటీరం
వైవిధ్యం: సికింద్రాబాద్ సర్దార్‌పటేల్ రోడ్డు.. ఈశ్వరీబాయి విగ్రహం నుంచి ప్యాట్నీ వైపు వెళ్తుంటే ఎడమవైపు ఓ పవిత్ర కుటీరం (అవర్ సాక్రెడ్ స్పేస్) కొలువై ఉంటుంది. బయటి రణగొణ ధ్వనుల నుంచి లోపలకు అడుగుపెట్టగానే.. మండువేసవిలో సాయంకాలం మల్లెల పరిమళం ముప్పిరిగొన్నట్టుంటుంది. పోగొట్టుకున్న బాల్యం తిరిగి చేతికందిన అనుభూతి. పచ్చటి చెట్ల మధ్య సుతిమెత్తని మట్టినేల పాదాలను ముద్దాడుతుంది. ఉరుకులు పరుగుల జీవితంలో నేలను విడిచి సాము చేస్తున్న జనాన్ని ఒక్కసారి కుదిపి మూలాల్లోకి తీసుకెళ్తుంది. సంగీతం, నాట్యం, చిత్రలేఖనంతో పాటు మెడిటేషన్, యోగా.. ఆసక్తి వుంటే చాలు ఐదేళ్ల పిల్లల నుంచి 85 ఏళ్ల పండు ముదుసలి వరకూ ఇక్కడ ఏవైనా నేర్చుకోవచ్చు. కల్మషం లేని మనసులతో పాటు కల్తీ లేని వస్తువులు కూడా దొరుకుతాయక్కడ. ‘ఏడు తరాల నుంచి మాది సికింద్రాబాద్. యూఎస్ వెళ్లి ఎన్విరాన్మెంట్లో మాస్టర్స్ చేశాను. 14 ఏళ్లు ఎన్విరాన్మెంటలిస్ట్గా శాన్ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ కంపెనీలతో కలిసి పనిచేశాను. అయితే నాకు డాన్స్ అంటే ప్రాణం. అలా ఒడిస్సీ నేర్చుకున్నాను. పెద్ద పెద్ద బ్రిడ్జిలు, కాలువలకు సంబంధించిన ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నప్పుడు కూడా నా సంతోషం కోసం డాన్స్ చేసే దాన్ని. నేను పొందిన జాయ్‌ని ఇతరులకు పంచడమనేది గొప్ప జాప్ అనుకుంటా. అందుకే... అక్కడ పనిచేసిన అనుభవం అవర్ సాక్రెడ్ స్పేస్ కంస్ట్రక్ట్ చేశాను. అక్కడి మిత్రులు చాలా మంది వచ్చి ఇక్కడ ఎన్నో మంచి వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. కళలు అంటే ఆసక్తి ఉన్న ఎవరికైనా ఆ స్థలం స్వాగతం పలుకుతుంది. ఆసక్తికి వయసు అడ్డు రాకూడదని నమ్మిన నయనతార ఈ సంస్థను 2013లో స్థాపించారు. ఒడిస్సీ నృత్యం చేస్తున్నప్పుడు కలిగిన సంతృప్తిని, కళల అభ్యాసం వల్ల కలిగే ప్రశాంతతని అందరికీ పంచాలనే ఈ స్పేస్ ఏర్పాటు చేశానంటారు. మెడిటేషన్, డాన్సింగ్, డ్రాయింగ్ ద్వారా మైండ్ స్టిల్నెస్కు చేరుకుంటుంది. అప్పుడు ప్రశాంతతను అనుభూతి చెందొచ్చు. దానినే సాక్రెడ్ అంటారు. అదే డివైన్ కూడా. అందుకే ఈ ప్లేస్‌కి ఆ పేరు పెట్టాను అంటారావిడ. ఆదివారం అంగడి ఈ ప్లేసులో ఏది అమ్మాలనే ఆలోచన నాకు ముందు లేదు. ఎన్విరాన్మెంటలిస్ట్ని కావటంతో పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ వల్ల కలిగే హాని నాకు తెలుసు. అయితే యూఎస్‌లో ఆర్గానిక్ ఫుడ్ దొరికేది. ఇక్కడికి వచ్చాక బాబు కోసం ఆర్గానిక్ ఫుడ్ కావాలని వెతికాను. ఎక్కడా దొరకలేదు. అప్పటినుంచే ఆర్గానిక్ పద్ధ్దతిలో కూరగాయలు పెంచుతున్నాను. అవి అందరికీ అందుబాటులోకి తేవాలనుకుని ఈ ఆదివారం అంగడి ఏర్పాటు చేశాం’ అంటూ స్పేస్ ప్రాధాన్యతను వివరించారామె. ఖర్చు భరించగలమా? బయట ఇతర గ్యాలరీలు, కల్చరల్ ప్లేస్‌లతో పోల్చుకుంటే ఇక్కడి రేట్స్ చాలా జెన్యూన్. మధ్య తరగతి నుంచి సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే ఫీజులతో ఇక్కడ అన్ని శిక్షణలు ఇస్తారు. కళ ఏదైనా కావచ్చు.. ఈ వయసులో వెళ్లి బయట నేర్చుకుంటే ఎవరేమనుకుంటారో అని ఫీలవ్వాల్సిన సంశయం లేదిక్కడ. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకూ నేర్చుకుంటారు. నేర్పిస్తారు కూడా. ఏమేం నేర్చుకోవచ్చు... 2000 ఏళ్ల పురాతన చైనీయుల థాయ్-చి విద్యను ఇక్కడ నేర్చుకోవచ్చు. ఒడిస్సీ, కథక్, కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆట్టం, జానపద నృత్యాలతోపాటు కర్ణాటక, హిందుస్తానీ సంగీతాలనూ అభ్యసించొచ్చు. మెడిటేషన్, యోగా, యోగా టీచర్ ట్రైనింగ్, కథలు వినిపించడం, తెలుగు భాషా గీతాలు, కథలు, నేర్చుకోవచ్చు. పెయింటింగ్, స్కల్క్చర్తో పాటు ఇకబానా, ఎన్విరాన్మెంట్ అవేర్నెస్, నాటకాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక ఆదివారం అంగడి(ఆర్గానిక్ బజారు) అయితే వెళ్లి చూడాల్సిందే. అంతేనా... 2500 ఏళ్ల క్రితం నాటి అంతరించిపోతున్న పటచిత్ర కళకు చేయూతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బుట్టల అల్లిక లాంటి ఎకో ఫ్రెండ్లీ ఉత్పాదనలకు ప్రోత్సాహం లభిస్తోంది. సంతోషాన్ని నలుగురికి పంచటంలో ఎంతో తృప్తి ఉందంటున్నారు నయనతార. నాన్ వాయిలెన్స్... నాన్ వయోలెన్స్ కమ్యూనికేషన్ మీద ఈ నెల 18న ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అవతలి మనిషి బాధ వినగలగడం ద్వారా శాంతి చేకూర్చగలం. అదే దీని లక్ష్యం. ఈ స్కిల్ నేర్చుకోవడం ద్వారా చాలా మందికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. -
తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక విధానం
* సింగిల్ విండో ద్వారా అనుమతులు * టీఎస్ఐసీసీ ఏర్పాటుకు చర్యలు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలని పరిశ్రమల శాఖ అధికారులను సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ విధానాన్ని రూపొందించాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. తెలంగాణ దృక్పథంతో పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందుకోసం త్వరలోనే సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా కేసీఆర్ ఆదేశించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో కేసీఆర్ శుక్రవారం సమీక్ష జరిపారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అన్ని అనుమతులు అందేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి 15-20 రోజుల్లోగా అన్ని అనుమతులు వచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక ఛేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలుష్యరహిత పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా పారిశ్రామికీకరణ జరగాలని అధికారులకు సూచించారు. అలాగే పరిశ్రమలకు విద్యుత్ లోటు లేకుండా చూడాలన్నారు. గతంలో భూములు తీసుకుని పరిశ్రమలను ఏర్పాటు చేయని సంస్థల నుంచి ఆ భూములను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి అందులోనే పరిశ్రమల ఏర్పాటు జరిగేలా చూడాలన్నారు. ఏపీఐఐసీలో తెలంగాణ డివిజన్‌ను టీఎస్ఐఐసీగాా మార్చాలని, వరంగల్‌లోని అజంజాహి భూములను టెక్స్టైల్ పార్కుగా మార్చాలని, దీన్ని తమిళనాడులోని తిరుపూర్ తరహాలో అభివృద్ధి చేయాలని కేసీఆర్ సూచించారు. -
అవుట్ సోర్సింగ్‌పై ఆందోళన
ఆచి, తూచి వ్యవహరిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు గ్రాంట్థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ సర్వే న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని గ్రాంట్ థార్న్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్(ఐబీఆర్) తాజా సర్వే వెల్లడించింది. తమ కార్యకలాపాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలన్న తక్షణ ప్రణాళికలు ఏమీ లేవని ప్రపంచవ్యాప్తంగా 60 శాతం కంపెనీలు భావిస్తున్నాయని ఈ సర్వే పేర్కొంది. ఫలితంగా దేశీయంగా ఉద్యోగాల కోత ఉండే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోందని వివరించింది. 45 దేశాల్లో మొత్తం 3,300 కంపెనీలపై ఈ సర్వేను నిర్వహించారు. అవుట్ సోర్సింగ్ వల్ల కీలకమైన విభాగంపై నియంత్రణ కోల్పోతామోనన్న ఆందోళన అంతర్జాతీయ కంపెనీల్లో పెరిగిపోతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.