అవుట్ సోర్సింగ్‌పై ఆందోళన | Majority of businesses still reluctant to outsource: Thornton | Sakshi
Sakshi News home page

అవుట్ సోర్సింగ్‌పై ఆందోళన

Published Sat, May 10 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

అవుట్ సోర్సింగ్‌పై ఆందోళన

అవుట్ సోర్సింగ్‌పై ఆందోళన

  • ఆచి, తూచి వ్యవహరిస్తున్న అంతర్జాతీయ కంపెనీలు
  • గ్రాంట్థార్న్‌టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్ సర్వే
  •  న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ పట్ల ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని గ్రాంట్ థార్న్‌టన్ ఇంటర్నేషనల్ బిజినెస్ రిపోర్ట్(ఐబీఆర్) తాజా సర్వే వెల్లడించింది. తమ కార్యకలాపాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వాలన్న తక్షణ ప్రణాళికలు ఏమీ లేవని ప్రపంచవ్యాప్తంగా 60 శాతం కంపెనీలు భావిస్తున్నాయని ఈ సర్వే పేర్కొంది. ఫలితంగా దేశీయంగా ఉద్యోగాల కోత ఉండే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోందని వివరించింది.  45 దేశాల్లో మొత్తం 3,300 కంపెనీలపై ఈ సర్వేను నిర్వహించారు. అవుట్ సోర్సింగ్ వల్ల కీలకమైన విభాగంపై నియంత్రణ కోల్పోతామోనన్న ఆందోళన అంతర్జాతీయ కంపెనీల్లో పెరిగిపోతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement